పెట్టుబడులతో రండి..
హైదరాబాద్: ముంబైలో ఒకరోజు పర్యటనలో ఉన్న మున్సిపల్, పంచాయితీరాజ్ , ఐటి శాఖమంత్రి కే తారక రామారావు బిజీబిజీగా గడిపారు. తెలంగాణలో పెట్టుబడులను ఆహ్వనిస్తూ మహీంద్రా గ్రూప్ అధిపతులతోపాటు, సుజ్లాన్ కంపెనీ ఉన్నతాధికార బృందంతో చర్చలు నిర్వహించారు. సుజ్లాన్ సీఎండీ తులసి తంతితో సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా కోరారు. దీంతో త్వరలోనే తెలంగాణలో 3000 మెగావాట్ల సోలార్ , విండ్, హైబ్రీడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే బృహత్తర ప్రణాళికను సుజ్లాన్ సంస్ధ ప్రకటించింది. ఇందుకోసం మెత్తం 1200 కోట్ల రూపాయాల పెట్టుబడిగా పెట్టనున్నట్లు సంస్ధ తెలిపింది. ప్రభుత్వం తరపున పూర్తిస్దాయి మద్దతు సుజ్లాన్ కు ఉంటుని మంత్రి తెలిపారు.
ఆ తర్వతా కోటక్ గ్రూప్ యండి, ఉపాద్యక్షుడైన ఉదయ్ కోటక్ తో సమావేమయ్యారు. తెలంగాణకి మరిన్ని ఉద్యోగాలు, పెట్టుబడులు పెట్టేందుకు కోటక్ గ్రూప్ హమీ ఇచ్చింది. మహింద్ర గ్రూప్ సీఎండీ ఆనంద్ మహీంద్రాతోనూ మంత్రి సమావేశం అయ్యారు. తెలంగాణలో గ్రూప్ పెట్టుబడులు, విస్తరణపైన వీరు చర్చించారు.
వీసీ సర్కిల్ పార్ట్‌నర్స్ సమ్మిట్‌లో కేటీఆర్ ప్రసంగం
బుధవారం ఉదయం ముంబైలో జరిగిన వీసీ సర్కిల్ పార్ట్‌నర్స్ సమ్మిట్‌లో మంత్రి కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. భారతదేశంతోపాటు కొత్త రాష్ర్టం తెలంగాణలో వివిధరంగాల్లో ఉన్న పెట్టుబడి అవకాశాలను , ప్రభుత్వ ప్రణాళికలను వివరించారు. దేశంలోని రెండువేలకి పైగా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, పంఢింగ్ సంస్ధల ప్రతినిధులు ఈ సదస్సుకు హజరయ్యారు. కేటీఆర్ ప్రసంగంలోని కీలక అంశాలు...
-
ప్రపంచంలో అత్యదిక లాభాలు అందించ గలిగే దేశాల్లో భారత దేశం ఒకటి. అందుకే ప్రపంచ ప్రసిధ్ద వెంచర్ క్యాపిటలిస్టులు భారతదేశంలో విసృతంగా పెట్టుబడులు పెడుతున్నారు.
-
నిర్ణయాత్మక ముఖ్యమంత్రి నాయకత్వంలో తెలంగాణ ముందుకెళుతున్నది. అందుకే గత రెండు సంవత్సరాల్లో తెలంగాలోకి అనేక పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో గత కొన్ని నెలలుగా పెరుగుతున్న రియాల్టీ , హోటళ్ళ ధరలే ఇందుకు కారణం. నగరంలో వ్యాపారాభివృద్దితోపాటు, పరిశోధనల కోసం అనేక నూతన వసతులు ఏర్పాడ్డాయి. టిహబ్ ని పరిశీలిస్తే ఈ విషయం అందరికీ అర్థం అవుతుందన్నారు.
- త్వరలోనే టీ ఫండ్ ని ఏర్పాటు చేయబోతున్నాం. పాశ్చాత్య దేశాల్లో విజయాలు సాధించిన పలు సంస్ధలు, వ్యక్తులు ఇందులో పెట్టుబడి పెట్టెందుకు ఆస్తకి చూపిస్తున్నారు. ఇది సూమారు 125 కోట్ల ఏర్పాటు కాబోతున్నది. ఇలాంటి ఫండ్ దేశంలోనే మెదటిది. ఈ పంఢ్ ద్వారా హెల్త్ టెక్, ఐవోటీ, అగ్రిటెక్, Thematic B2B రంగాల్లో పరిశోధనలకి ఊతం ఇవ్వనున్నాం
- తెలంగాణలోని వరంగల్, కరీంనగర్ వంటి పట్టణాలకు పరిశ్రమలు విస్తరించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాం.
- పెట్టుబడిదారులకి అత్యంత పారదర్శకమైన, ప్రభావవంతమైన పారిశ్రామిక విధానాన్ని తెలంగాణ పారిశ్రామిక విధానం ద్వారా అందిస్తున్నాం.
ఈ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌తోపాటు పరిశ్రమ శాఖ, ఐటీ శాఖ కార్యదర్శులు అరవింద్ కూమార్, జయేష్ రంజన్ పాల్గొన్నారు.