ఇషా అంబానీ సరికొత్త రికార్డ్!.. జాబితాలో ఆకాష్ కూడా.. | Isha and Akash Ambani Young Entrepreneurs in Huruns Under 35 List | Sakshi
Sakshi News home page

ఇషా అంబానీ సరికొత్త రికార్డ్!.. జాబితాలో ఆకాష్ కూడా..

Published Fri, Sep 27 2024 3:57 PM | Last Updated on Fri, Sep 27 2024 4:18 PM

Isha and Akash Ambani Young Entrepreneurs in Huruns Under 35 List

హురున్ ఇండియా అండర్ 35 జాబితా విడుదల చేసింది. ఇందులో దేశంలోని అత్యంత విజయవంతమైన యువ పారిశ్రామికవేత్తలను వెల్లడించింది. ఈ లిస్టులో అంబానీ పిల్లలు ఇషా, ఆకాష్ ఉన్నారు. ఈ జాబితాలో మొత్తం 150 మంది 35 ఏళ్లలోపు వయసున్న పారిశ్రామిక వేత్తలు ఉన్నారు.

ఓ వైపు ఆసియాలోని అత్యంత ధనవంతుల జాబితాలో ముకేశ్ అంబానీ ఒకరుగా ఉన్నారు. ఇప్పుడు అంబానీ కుమార్తె ఇషా 2024 హురున్ ఇండియా అండర్ 35 జాబితాలో అతి పిన్న వయస్కురాలైన మహిళా పారిశ్రామికవేత్తగా నిలిచారు. ఈ జాబితాలో అంబానీ కుమారుడు ఆకాష్ కూడా ఉన్నారు.

ముకేశ్ అంబానీ గారాల తనయ ఇషా అంబానీ 'రిలయన్స్ రిటైల్' మేనేజింగ్ డైరెక్టర్. ముంబైలో పుట్టి పెరిగిన ఇషా ముంబైలోని ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్లో తన ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. ఆ తరువాత యునైటెడ్ స్టేట్స్‌లోని యేల్ విశ్వవిద్యాలయం నుంచి సైకాలజీ, కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందింది.

ఇదీ చదవండి: ఇద్దరితో మొదలై.. విశ్వమంతా తానై - టెక్‌ చరిత్రలో గూగుల్‌ శకం.. అనన్య సామాన్యం

హురున్ ఇండియా అండర్-35 జాబితాలో ఇతరులు
2024 హురున్ ఇండియా అండర్-35 జాబితాలో అనెరి పటేల్, అనీషా తివారీ, అంజలి మర్చంట్‌తో సహా మరో ఏడుగురు మహిళా వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు. వీరి వయసు 33, 34 మధ్య ఉంది. వీరందరూ కుటుంబ వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. ఈ జాబితాలో షేర్‌చాట్ కో ఫౌండర్ అంకుష్ సచ్‌దేవా అత్యంత పిన్న వయస్కుడిగా నిలిచారు. మామా ఎర్త్ సీఈఓ 35 సంవత్సరాల వయస్సు గల గజల్ అలగ్ కూడా ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement