భారతదేశంలో మాత్రమే కాదు ప్రపంచంలోని చాలా దేశాల్లో 'రతన్ టాటా' (Ratan Tata) గురించి తెలుసు. దీనికి ప్రధాన కారణం ఈయన గొప్ప పారిశ్రామిక వేత్త అని మాత్రమే కాదు.. దాత్రుత్వంలో కలియుగ కర్ణుడగా కీర్తించబడటం కూడా. టాటా మోటార్స్ కంపెనీ ఇప్పుడు భారతదేశంలో తిరుగులేని సంస్థగా అవతరించినప్పటికీ దీని ఫౌండర్ మాత్రం JRD టాటా.
జెఆర్‌డి టాటా ప్రారంభించిన ఈ కంపెనీలో మొదటి మహిళా ఇంజనీర్ ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ 'సుధామూర్తి' (Sudha Murty) అని చాలా మందికి తెలియకపోవచ్చు. నిజానికి సుధామూర్తి టాటా కంపెనీలో ఇంజనీర్ కావడం వెనుక పెద్ద కథే ఉంది. అప్పట్లో టాటా సంస్థను టెల్కో అని పిలిచేవారు. ఇప్పుడు టాటా కంపెనీలో సగం మంది మహిళలు పనిచేయడానికి ప్రధాన కారకురాలు కూడా ఈమే కావడం గమనార్హం.
1974లో బెంగళూరులో టాటా ఇన్‌స్టిట్యూట్‌లో సుధామూర్తి ఎమ్.టెక్ చేస్తున్న సమయంలో తమ క్లాసులో అందరూ అబ్బాయిలే ఉండేవారని, అంతకు ముందు బీఈ చేసినప్పుడు కూడా క్లాసులో తానొక్కటే అమ్మాయని వెల్లడించింది. ఒకరోజు కాలేజీ నోటీస్ బోర్డులో ఉన్న ప్రకటనలో పుణెలోని టెల్కో కంపెనీలో పనిచేసేందుకు ఉత్సాహవంతులైన యువకులు కావాలని ఉండటం చూసింది. అయితే అందులోనే యువతులు అప్లై చేసుకోకూడదని అందులో వెల్లడించారు.
(ఇదీ చదవండి: ఆ ఖరీదైన కార్లన్నీ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గ్యారేజీలోనే! అవేంటంటే..)
ఇది చూడగానే ఆమెకు పట్టరాని కోపం వచ్చి హాస్టల్‌కి వెళ్లి జేఆర్‌డీ టాటాకు లేఖ రాసి అందులో మహిళలు సంస్థలో అవకాశం ఇవ్వకపోతే భారతదేశం ఎప్పటికీ అభివృద్ధి చెందదని.. సమాజంలో 50 శాతం పురుషులు ఉంటే మిగిలిన 50 శాతం మంది స్త్రీలు ఉన్నారు. ఉద్యోగావకాశాలను కేవలం పురుషులను మాత్రమే ఎంపిక చేస్తే సమాజం ఎలా ముందుకు పోతుందని ప్రశ్నించినట్లు చెప్పింది.
(ఇదీ చదవండి: ప్రపంచంలో ఇదే బెస్ట్ ఎయిర్ లైన్! భారత్ ఎక్కడుందంటే?)
లేఖను అనుసరించి జెఆర్‌డీ టాటా సుధామూర్తిని ఇంటర్వ్యూకి పిలిచారు, ఆ తరువాత అందులో పనిచేసారు. అయితే సుధా మూర్తి సోషల్ మీడియావైలో చేసిన ఒక పోస్ట్ ప్రకారం, సుమారు 40-50 సంవత్సరాల తరువాత టాటా మోటార్స్‌గా పిలవబడే పూణే టెల్కోను సందర్శించినట్లు.. అక్కడ 300 మందికి పైగా మహిళలు పనిచేస్తున్నారని, అది చూడగానే తనకు ఏడుపు వచ్చిందని చెప్పుకొచ్చింది. ఇదంతా సుధామూర్తి రతన్ టాటా తాతకు చేసిన ఆ ఒక్క అభ్యర్థన ప్రతి ఫలమే.
Comments
Please login to add a commentAdd a comment