
భారతదేశపు అతిపెద్ద ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ కంపెనీ అయిన హిందుస్థాన్ యూనిలీవర్ లిమిటెడ్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సంజీవ్ మెహతా గురించి ఈ రోజు అందరికి తెలుసు. అయితే అతను ఎక్కడ పుట్టాడు, ఎలా అంత గొప్ప స్థాయికి ఎదిగాడు, వార్షిక ఆదాయం ఎంత అనే మరిన్ని వివరాలు తెలిసి ఉండవు. అలాంటి వారికోసం ఈ ప్రత్యేక కథనం..
ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో జన్మించిన సంజీవ్ మెహతా ముంబై, నాగ్‌పూర్‌లలో చదువుకున్నాడు. అయితే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి చార్టర్డ్ అకౌంటెంట్ కోర్సు పూర్తి చేసి, ఆ తరువాత అడ్వాన్స్‌డ్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రామ్ కోసం చేయడానికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్ వెళ్లాడు. ఆయన భార్య మోనా కూడా చార్టర్డ్ అకౌంటెంట్ కావడం గమనార్హం.
2013లో సంజీవ్ మెహతా హిందుస్థాన్ యూనిలీవర్ యొక్క CEO & MDగా నియమితుడయ్యాడు. ఆ తరువాత 2018లో ఛైర్మన్‌గా పదవి చేపట్టాడు. ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్‌లోని వ్యాపారాలను కలుపుతూ క్లస్టర్ ప్రెసిడెంట్‌గా దక్షిణాసియాలో యూనిలీవర్ వ్యాపారానికి కూడా నాయకత్వం వహిస్తున్నాడు.
(ఇదీ చదవండి: Mahindra Scorpio-N: సన్‌రూఫ్ లీక్‌పై రచ్చ లేపి.. ఇప్పుడు హ్యాపీ అంటున్నాడు)
2021-22 మధ్య కాలంలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడిగా, ఎయిర్ ఇండియా బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్ కూడా పనిచేశారు. HULకి విజయవంతంగా నాయకత్వం వహించడంతో సక్సెస్ సాధించిన మెహతా అధికారంలో ఉన్న తొమ్మిదేళ్ల కాలంలో మార్కెట్ క్యాపిటలైజేషన్ 17 బిలియన్ డాలర్ల నుంచి 75 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఆయన వార్షికాదాయం 2021లో రూ. 15 కోట్ల నుంచి 2022 నాటికి రూ. 22 కోట్లకు చేరింది.
Comments
Please login to add a commentAdd a comment