![Ambani hai ya bhikari anant ambani was mocked at school - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/15/anant-ambani.jpg.webp?itok=JyjXrIAf)
ఈ రోజు యావత్ భారతదేశంలో మాత్రమే కాకుండా ప్రపంచ కుబేరుల జాబితాలో ఒకరైన ముఖేష్ అంబానీ గురించి అతని కుటుంబం గురించి దాదాపు అందరికి తెలుసు. ఎన్నెన్నో వ్యాపారాలు చేస్తూ కోట్లకు కోట్లు గడిస్తూ దేశంలో అత్యంత సంపన్నులుగా విరాజిల్లుతున్న. అయితే ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చదువుకునే రోజుల్లో తాను చదివిన స్కూల్‌లో తోటి స్నేహితులు ఎగతాళి చేసేవారని తెలిసింది. ఇంతకీ అనంత్ అంబానీని ఎందుకు ఎగతాళి చేసేవారు, ఏ కారణంతో ఎగతాళి చేసేవారని మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతూ.. ఖరీదైన అన్యదేశ్య కార్లు, ఇతర ఖరీదైన వస్తువులు ఉపయోగించే అనంత్ అంబానీ చిన్నప్పుడు పాకెట్ మనీగా కేవలం రూ. 5 మాత్రమే తీసుకెళ్లేవాడని తెలిసింది. ఇతడు అయితే ముఖేష్ అంబానీకి చెందిన ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్‌లో చదువుకునేటప్పుడు క్యాంటీన్‌లో ఖర్చు చేయడానికి ఐదు రూపాయలు తీసుకెళ్తే తోటి విద్యార్థులంతా 'తూ అంబానీ హై యా భికారీ' అని ఎగతాళి చేసేవారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. కొడుకు చెప్పిన మాటలకు నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇద్దరూ ఉలిక్కి పడ్డారు.
(ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!)
భారతదేశంలో అత్యంత సంపన్న కుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఇషా అంబానీ, ఆకాష్ అంబానీ, అనంత్ అంబానీ వినయ ప్రవర్తన, మంచి సంప్రదాయాలను నేర్చుకున్నారు. అనంత్ అంబానీ బ్రౌన్ యూనివర్శిటీలో చదువు పూర్తి చేసి ప్రస్తుతం అనేక రిలయన్స్ వెంచర్‌లకు డైరెక్టర్‌గా ఉన్నారు. ఇతడు త్వరలోనే రాధిక మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నాడు. ఇతని నికర ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు అని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment