ఆ కుర్రాడికి చిన్నప్పటి నుంచే ఎన్నో కలలు. మరెన్నో ఆశలు. అయితే అతని ఆర్ధిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉండటంతో అవేవీ నెరవేరే అవకాశమే లేదు. అయితే పరిస్థితులను అతను ఎలా మార్చుకున్నాడో తెలిస్తే ఎవరైనా సరే ఒకపట్టాన నమ్మలేరు.
ఈ కథ 22 ఏళ్ల యువకుడిది. అతను తన విధిరాతను తానే సమూలంగా మార్చుకున్నాడు. చిన్నవయసులోనే కోట్లకు పడగలెత్తాడు. విద్యార్థిగా చదువు పూర్తయ్యే వయసు వచ్చేనాటికల్లా రిటైర్ అయ్యాడు. అమెరికాకు చెందిన హెడెన్ వాల్ష్ స్కూలు చదువును మధ్యలోనే విడిచిపెట్టాడు. ఈ కామర్స్‌లో తన ప్రతిభ చూపాలని నిర్ణయించుకున్నాడు. ఇప్పుడు ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా కోట్లాది రూపాయలు ఆర్జిస్తున్నాడు.
డెయిలీ మెయిల్ నివేదిక ప్రకారం హెడెన్ తన జీవితానుభవాలను టిక్‌టాక్, యూట్యూబ్‌లో షేర్ చేస్తుంటాడు. తాను ఎంత చిన్నవయసులో వ్యాపారం మొదలుపెట్టిందీ, దాని నుంచి ఎలా ఆదాయం సంపాదించినదనే వివరాలు తెలియజేస్తుంటాడు. హెడెన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు 14 వేలకు మించిన ఫాలోవర్స్ ఉన్నారు. యూట్యూబ్ విషయానికొస్తే 3 లక్షలకు మించిన చందాదారులు ఉన్నారు. హెడెన్‌ను ఇంత చిన్నవయసులోనే ఎందుకు స్కూలు చదువు వదిలేసి, సంపాదన ప్రారంభించారని ప్రశ్నించినప్పుడు ఆయన తనకు ఎదురైన ఒక అనుభవాన్ని, అది తన జీవితాన్ని ఎలా మార్చివేసిందో తెలియజేశారు.
బాల్యంలో ఎదురైన అనుభవం నుంచి..
హెడెన్ తన అనుభవాన్ని వివరిస్తూ..‘నాకు బాగా గుర్తుంది.. నాకు 10-11 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఏది కొనుక్కుందామన్నా నా దగ్గర డబ్బు ఉండేది కాదు. మా అమ్మానాన్న కూడా వాటిని కొనిచ్చేవారు కాదు. అప్పుడే నాకు నా సొంత సంపాదన అవసరమని అనిపించింది. నేను 17 ఏళ్ల వయసులోనే వ్యాపారం ప్రారంభించాను. సంపాదించడం కూడా మొదలుపెట్టాను. ఈ- కామర్స్ రంగంలో సత్తా చాటాను. ఇప్పటికీ అదే పనిచేస్తున్నాను. ఈ పని చేయడం అంటే నాకు ఎంతో సరదా. అయితే నేను టెక్నికల్‌గా రిటైర్ అయ్యాను. రియల్ ఎస్టేట్ నుంచి అందిన సొమ్ములోని కొంత మొత్తాన్ని వేరుగా ఉంచాను. దీని నుంచి వచ్చే ఆదాయంతో నా ఖర్చులు నెరవేరుతుంటాయి’ అని అన్నారు.
17 ఏళ్ల వయసులో వ్యాపారంలోకి..
సుమారు 17 ఏళ్ల వయసురాగానే హెడెన్ ‘ఈ కామ్ సీజన్’ను స్థాపించారు. దీనిలో ఆన్‌లైన్ కోర్సు నిర్వహిస్తుంటాడు. ఫీజు 575 డాలర్లు. హెడెన్‌కు 18 ఏళ్లు వచ్చేసరికి సొంతంగా లంబోర్గినీ(కారు) సమకూర్చుకున్నాడు. 19 ఏళ్ల నాటికి కోటీశ్వరునిగా మారాడు. 2022 నాటికి అతని ఆదాయం 15 మిలియన్ డాలర్లు. దీనిలో 3 మిలియన్ డాలర్లు లాభం ఉంది. తన ఈ- కామర్స్ ప్లాట్‌ఫారం ద్వారా హెడెన్ లెక్కలేనంతగా సంపాదిస్తున్నాడు. 22 ఏళ్ల వయసులో అతను రియల్ ఎస్టేట్ పోర్టుఫోలియా తీర్చిదిద్దాడు.
కోటీశ్వరునిగా మారాలంటే..
మనిషికి అత్యంత అవసరమైన రెండు అంశాల గురించి హెడెన్ తెలియజేశారు. కోటీశ్వరులుగా మారాలనుకుంటున్నవారు.. మీకు వచ్చే సంపాదనలోని 20 శాతం మొత్తాన్ని మాత్రమే ఖర్చు చేయండి. అప్పుడే మీరు అత్యధిక మొత్తంలో సేవింగ్స్ చేసేందుకు, పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుంది. ఇక రెండవది.. జీవితంలోని అన్ని వ్యాపకాల కన్నా సంపాదించడానికే అధిక ప్రాముఖ్యతనివ్వాలని సూచించారు.
ఇది కూడా చదవండి: స్కూల్ పిల్లల బ్యాగుల్లో డైపర్లు.. వయసేమో 11..షాకైన టీచర్లు!
Comments
Please login to add a commentAdd a comment