Millionaire Bryan Johnson: డైట్‌లో గరం మసాలా, స్టీల్‌ డబ్బాల్లో..! | US Millionaire Bryan Johnson Adds Garam Masala To Diet | Sakshi
Sakshi News home page

టెక్‌ మిలియనీర్‌ బ్రయాన్ జాన్సన్ డైట్‌లో గరం మసాలా, స్టీల్‌ డబ్బాల్లో..

Published Thu, Feb 20 2025 11:27 AM | Last Updated on Thu, Feb 20 2025 11:45 AM

US Millionaire Bryan Johnson Adds Garam Masala To Diet

ఏజ్-రివర్సల్ ఔత్సాహికుడు టెక్‌ మిలియనీర్‌ బ్రయాన్ జాన్సన్ తన యాంటీ ఏజింగ్ ప్రయోగాలతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు. ఆ తర్వాత తనపై చేసుకుంటున్న ప్రయోగాలు ఫలితాల గురించి కూడా నెటిజన్లతో ఎప్పటికప్పుడు షేర్‌ చేసుకుంటుంటారు. వాటిలో కొన్ని విజయవంతమవ్వగా మరికొన్ని విఫలమయ్యాయి. 

అయితే బ్రయాన్‌ తన డైట్‌లో భారత ఆహార పదార్థాల గొప్పతనం వాటి ప్రయోజనాల గురించి గతంలో షేర్‌ చేసుకున్నారు. తాజాగా భారతీయులు కూరలకు సువాసనతో కూడిన ఘమఘమలు అందించేందుకు ఉపయోగించే గరం మసాలాని కూడా తన డైట్‌లో చేర్చుకున్నట్లు సోషల్‌ మీడియాలో పోస్ట్‌లో తెలిపారు. 

తరుచుగా మన ముంబైలో గాలి నాణ్యత బాగాలేదని ప్రజల ఆరోగ్యం తీవ్ర ప్రమాదంలో ఉందంటూ విచారం వ్యక్తం చేసే బ్రయాన్‌ మన భారతీయ వంటకాల గొప్పదనాన్ని మాత్రం మెచ్చుకుంటూనే ఉంటారు. వాటిలో ఎన్నో గొప్ప ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు కూడా. కానీ ఈసారి బ్రయాన్‌ మన భారతీయులు ప్రయాణాల్లో ఉపయోగించే టిఫిన్‌ డబ్బాల్లోనే ఆహారం నిల్వ చేయడం విశేషం. 

అలాగే భారతీయులు ఉపయోగించే గరం మసాలను కాల్చిన యాపిల్‌, క్యారెట్‌లతో కూడిన బటర నట్‌ స్క్వాష్‌ సూప్‌లో ఉపయోగించినట్లు వెల్లడించారు. ఇక ఆ రెసిపీ తయారీ విధానాన్నికూడా సవివరంగా వెల్లడించారు. అలాగే తన సూపర్‌ఫుడ్‌ స్మూతీ బ్లాక్‌బీన్‌ అండ్‌ మష్రూమ్‌ బౌల్‌ విత్‌ చిక్‌పీ రైస్‌లో ఏమి జోడించి తింటారో కూడా తెలిపారు. వీటితోపాటు మెటల్‌ కంటైనర్లలో(స్టీల్‌ డబ్బాల్లో) నిల్వ చేసిన తన ఫుడ్‌ ఫోటోలను కూడా షేర్‌ చేశారు. 

అవి చూడగానే భారతీయుల మాదిరిగా స్టీడబ్బాలు, టిఫిన్‌ బాక్స్‌లను ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఆయన అందరికి ఆరోగ్యంపై స్ప్రుహ కలుగుతోందని, అందువల్లే ఫాస్ట్‌ఫుడ్‌ నుంచి ఆరోగ్యకరమైన భారతీయ ఆహార విధానాల వైపు దృష్టిపెడుతున్నారంటూ పెట్టిన పోస్టు నెటిజన్లందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. 

ఏదీ ఏమైన వృద్ధాప్యాన్ని తరిమికొట్టే ప్రయోగాలకు పేరుగాంచిన బ్రయాన్‌ జాన్సన్‌ సైతం మన భారతీయులు ఆహార సంస్కృతిని గౌరవించడం, వాటి ప్రయోజనాల గురించి ఆయన నోట వినడం చూస్తుంటే మన పెద్దలు ఆనాడే ఆరోగ్యం పట్ల ఎంత జాగుకరతతో వ్యవహరించారో అనిపిస్తోంది కదూ. ఇప్పటిది కాదు ఆరోగ్య స్ప్రుహ ఆనాడే మన పూర్వీకులు దానిపై దృష్టిపెట్లి మనకు ఔషధ గుణాలు కలిగిన వాటిని పరిచయం చేసి ఉపయోగించేలా చేశారు కదూ..!.  

 

(చదవండి: ఆ టీచర్‌ సాహసం మాములుగా లేదుగా..! గిరిజన పిల్లల కోసం..)
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement