Garam Masala
-
గరం మసాలా!
సాక్షి, హైదరాబాద్: సగటుజీవి నెలవారీ ఆదాయం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండగా.. నిత్యావసరాల ధరలు మాత్రం నింగినంటుతున్నాయి. వంటింట్లోకెళదామంటే కాసింత ధైర్యం కూడగట్టుకోవాల్సిన పరిస్థితి. కుటుంబాన్ని నెట్టుకురావాలంటే బడ్జెట్ ఏ మూలకూ సరిపోవడంలేదు. ఈ రోజు ఉన్న రేటు రేపు ఉండడం లేదు. కిరాణా షాపులో వారం క్రితం కొన్న సామగ్రి రేటు మరో వారానికి మారిపోతోంది. ధరలు పెరగడమే తప్ప తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. పెరిగిన ధరలతో ఒక్కో కుటుంబంపై నెలకు రూ.1000 నుంచి రూ.1500 వరకు అదనపు భారం పడుతోంది. దీంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఘాటెక్కి.. హీటెక్కి.. కొన్ని నెలలుగా గరం మసాలా ఘాటెక్కింది. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి ఇతర మసాలాల దినుసుల దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్ని మసాలాల ధరలు విపరితంగా పెరిగాయని హోల్‌సెల్ వ్యాపారులు అంటున్నారు. దీంతో యాలకుల ధర కేజీ రూ. 2,600కు చేరింది. మిరియాలు రూ. 800, లవంగాలు రూ.900, జీలకర్ర రూ.220కు చేరాయి. వామ్మో.. వెల్లుల్లి.. ♦ నగరంలో వెల్లుల్లి ధరలు విపరీతంగా పెరిగాయి. నగర మార్కెట్లకు సరఫరా తగ్గడంతో ప్రస్తుతం కిలో వెల్లుల్లి రూ.480కి చేరుకుంది. హోల్‌సేల్ మార్కెట్‌కు వెల్లుల్లిని రవాణా చేసే ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది, సుమారు 15 వాహనాలు మాత్రమే వస్తున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. సాధారణంగా మార్కెట్‌కు 24 నుంచి 30 వాహనాలు వస్తాయని హోల్‌సేల్ వ్యాపారులు తెలిపారు. పర్యవసానంగా దాదాపు 40 శాతం వెల్లుల్లి సరఫరా తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రాథమిక కారణమని మార్కెట్ అధికారులు చెబుతున్నారు. ♦ గతేడాది మే నెల తొలినాళ్లలో కిలో వెల్లుల్లి ధర రూ.30 నుంచి రూ.60 వరకు పలికింది. పోయిన నెల వరకు కూడా కేజీ రూ. 160 ఉందని వర్షాకాలంలో దిగుబడి తగ్గడంతో ధరలు పెరిగినట్లు సమాచారం. అక్టోబర్, నవంబర్లలో కురిసిన అ కాల వర్షాలతో పంటలు దెబ్బతిన్నాయి. ము ఖ్యంగా వెల్లుల్లి అధికంగా పండించే రాజస్థాన్‌లో వెల్లుల్లి ధర పెరిగింది. ఈ ప్రభావం దేశ వ్యాప్తంగా పడిందని తెలుస్తోంది. రానున్న రోజుల్లో వెల్లుల్లి ధర మరింత పెరిగే అవకాశం ఉంది. రైస్.. రైజ్.. గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రేటర్లో బియ్యం ధరలు రికార్డు స్థాయిలో పలుకుతున్నాయి. నాణ్యమైన సన్న బియ్యం కిలోకు రూ. 65 నుంచి రూ. 70కి పైగానే చెల్లించాల్సి వస్తోంది. డిమాండ్ కంటే ఎక్కువ బియ్యం మార్కెట్‌కు వచ్చినా ధరలు మాత్రం తగ్గడం లేదు. కూర‘గాయాలే’.. నగరంలో అన్ని కూరగాయలు (టమాటాలు మినహా) కిలోకు రూ.80– 120 వరకు రిటైల్ మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. ఆశించిన స్థాయిలో దిగుబడులు లేకపోవడంతో రాజధాని అవసరాలకు సరిపడా కాయగూరలు, ఆకు కూరలు రావడంలేదు. దీంతో కూరగాయల ధరలకు రెక్కలొచ్చాయి. ప్రధానంగా బోయిన్పల్లి, గుడిమల్కాపూర్, ఎల్బీ నగర్, మాదన్నపేట, సికింద్రాబాద్ మోండా మార్కెట్లకు కూరగాయల సరఫరా 60 శాతానికి పడిపోయింది. కొన్ని రకాల కూరగాయలు మండీల జాబితా నుంచి కనుమరుగయ్యాయంటే పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. -
ఎవరెస్ట్ బ్రాండ్ సాంబార్ మసాలా అమ్మొద్దు: అమెరికా అధికారులు
గుజరాత్లో ఎవరెస్ట్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి ఉత్పత్తవుతున్న సాంబార్ మసాలా, గరమ్ మసాలాను అమెరికాలో విక్రయించొద్దని అక్కడి ప్రభుత్వం తేల్చిచెప్పింది. సల్మొనెల్లా టెస్టులో ఇవి పాజిటివ్‌గా తేలినట్టు వెల్లడించింది. సాల్మొనెల్లా అనేది.. చిన్నపిల్లలు లేదా వృద్ధులలో బలహీనమైన రోగనిరోధక వ్యవస్థతో ఉన్న ఇతరులలో తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఒక్కోసారి ఇది కొన్నిసార్లు ప్రాణాంతకమైన ఇన్ఫెక్షన్లను కూడా కలిగిస్తుంది. సాల్మొనెల్లా సోకిన ఆరోగ్యవంతమైన వ్యక్తులు కూడా తరచుగా జ్వరం, అతిసారం (రక్తంతో కూడినది కావచ్చు), వికారం, వాంతులు , కడుపు నొప్పి వంటి వాటితో అనారోగ్యం బారిన పడుతుంటారు. అరుదైన పరిస్థితులలో, సాల్మొనెల్లాతో ఇన్ఫెక్షన్ జీవి రక్తప్రవాహంలోకి ప్రవేశించి, ధమనుల అంటువ్యాధులు (అనగా, సోకిన అనూరిజమ్స్), ఎండోకార్డిటిస్, ఆర్థరైటిస్ వంటి తీవ్రమైన అనారోగ్యానికి దారి తీస్తుంది. చదవండి: Viral Video: 600 ఏళ్ల నాటి నృత్యం..రెప్పవాల్చడం మర్చిపోవాల్సిందే! -
ఘాటెక్కిన గరం మసాలా!
సాక్షి సిటీబ్యూరో: ఇటీవల కాలంలో నగరంలో ఏ శుభకార్యం జరిగినా మాంసాహార వంటలే ఉంటున్నాయి. ఫంక్షన్లతో పాటు హోటల్లలో రకరకాల వెజ్, నాన్‌వెజ్ వంటకాలు తయారు చేస్తుంటారు. దేశంలో ఎక్కడ లేనన్ని వివిధ రకాల వంటకాలు హైదరాబాద్ నగరంలో తయారు అవుతాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్లో హైదరాబాదీ వంటకాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. నగరంలో తయారయ్యే వంటల రుచులను ఆస్వాదించడానికి దేశ, విదేశాల నుంచి వస్తారంటే అతిశయోక్తి కాదు. వెజ్, నాజ్‌వెజ్ వంటకాలు రుచికరంగా తయారీ ప్రక్రియలో గరం మసాలా పాత్ర కీలకం. గరం మసాలా లేనిదే నాన్‌వెజ్ వంటకం తయారు కాదు. బిర్యానీ నుంచి మటన్, చికెన్‌తో పాటు పలు రకాల వెజ్ వంటకాల్లో గరం మసాలా వేయడం తప్పనిసరి. గత కొన్ని నెలలుగా గరం మసాలా ధరలు ఘాటెక్కాయి. కేరళలో వరదల ప్రభావంతో ఇలాచీతో పాటు విదేశాల నుంచి దిగుమతులు ఇతర మసాలా దిగుమతులు తగ్గడంతో ధరలు విపరీతంగా పెరిగాయి. గత మూడు నెలల్లో దాదాపు అన్నింటి ధరలు విపరీతంగా పెరిగాయని బేగంబజార్‌లోని కశ్మీరీ హౌస్ హోల్‌సెల్ వ్యాపారి పన్నాలాల్ చెబుతున్నారు. విదేశాల నుంచి దిగుతులు.. గరం మసాలాగా వినియోగించే ఇలాచీ, లవంగం, దాల్చిన చెక్క, షాజీరాల్లో ఇలాచీ తప్ప మిగతావన్నీ విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. కేరళ, కర్ణాటకల నుంచి నగర మార్కెట్‌కు ఇలాచీ దిగుమతి అవుతోంది. లవంగం సౌతాఫ్రికా జాంబియా నుంచి, దాల్చిన చెక్క వియత్నాం నుంచి, షాజీరా అఫ్గానిస్థాన్ నుంచి నగర మార్కెట్లకు దిగుమతి అవుతున్నాయి. గరం మసాలాగా వినియోగించే ఇలాచీ తప్ప మిగతా మూడు మసాలాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. దేశంలోనే అతి పెద్ద గరం మసాలా మార్కెట్‌తో పాటు, అత్యధికంగా వినియోగించే నగరం కూడా హైదరాబాదే. జీలకర్ర, ధనియాలు.. జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వుల వినియోగం కూడా ఇతర ప్రాంతాలతో పోలిస్తే నగరంలో ఎక్కువని బేగంబజార్ మార్కెట్ హోల్‌సేల్ వ్యాపారులు చెబుతున్నారు. జీలకర్ర, ధనియాలు, మెంతులు, నువ్వులు, జైఫల్, జాపత్రితో పాటు ఇతర మసాలాలు గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటకలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి నగర మార్కెట్‌కు దిగుమతి అవుతున్నాయి. గరం మసాలా ధరలు ఇలా.. గతంలో ఇలాచీ ఫస్ట్ క్వాలిటీ ధరలు కేజీ రూ. 2800– 3000 నుంచి ఉండగా.. ప్రస్తుతం కేజీ రూ.4 వేల వరకు పలుకుతోంది. లవంగం కేజీ ధర గతంలో రూ. 500– 600 ఉండగా ప్రస్తుతం రూ. 800– 1000 వరకు ఉంది. షాజీరా గతంలో రూ. 400 ఉండగా ప్రస్తుతం రూ. 600 ఉంది. దాల్చిన చెక్క ధరలు కూడా గతం కంటే పెరిగి కేజీ రూ. 300 నుంచి రూ. 500కు చేరాయి. జైఫల్ కేజీ ధర గతంలో రూ. 800 ఉండగా రూ. 1100 అయింది. జాపత్రి ధర రూ. 1500నుంచి రూ. 2400కు చేరింది. -
మసాలా.. గరమ్ గరమ్!
► 250కిపైగా రకాలతో కంపెనీల పోటీ ► వ్యవస్థీకృత రంగంలో 3,500 బ్రాండ్లు ► మార్కెట్ వార్షిక విలువ రూ.1,60,000 కోట్లు ► ప్రపంచ దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, సాజీర, ఆవాలు, మెంతులు... సాధారణంగా అయితే ప్రతి ఇంట్లో పోపు డబ్బాలో ఉండేవి ఇవే. భోజన ప్రియులైతే ఈ జాబితా ఇంకాస్త పెద్దగా ఉంటుంది. అంతే!! ఇలా అనుకుంటే మీరు పోపులో కాలేసినట్లే. ఎందుకంటే దేశంలో దాదాపు 250కిపైగా మసాలా పొడులు, మిశ్రమాలు అందుబాటులో ఉన్నాయి మరి. అంతేకాదు!! వీటి మార్కెట్ విలువ ఎంతో తెలుసా? అక్షరాలా ఏడాదికి లక్షా అరవైవేల కోట్ల రూపాయలు!! అదీ కథ. ఒక ప్రాంతంలో ఉండే వంటకాలు మరో ప్రాంతానికి వెళ్లే సరికి మారిపోతున్నాయి. ప్రాంతాలనుబట్టి ఆహారపుటలవాట్లు మారుతుండడంతో మార్కెట్లో కొత్తకొత్త మసాలా పొడులు కొలువుదీరుతున్నాయి. వినియోగదార్ల ఆదాయాల పెరుగుదల, కొత్త వంటకాలను ఆస్వాదించాలన్న తపన వెరశి కంపెనీలకు కొత్త సవాల్ విసురుతున్నాయి. అందుకే మసాలా మార్కెట్ రూ.1,60,000 కోట్లు దాటేసింది. ఇక హోమ్ మేడ్ పొడులు, మిశ్రమాలు వీటికి అదనం. టాప్‌లో చికెన్ మసాలా.. మసాలా మిశ్రమాల్లో టాప్‌లో నిలుస్తున్నది చికెన్ మసాలానే. ఆ తర్వాతి స్థానాల్లో సాంబార్ పొడి, గరమ్ మసాలా, మటన్ మసాలా, రసమ్ పొడి వంటివి ఉన్నాయని ఎంటీఆర్ ఫుడ్స్ సీఈవో సంజయ్ శర్మ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధితో చెప్పారు. మొత్తం విపణిలో వెజ్ రకాల వాటా 63 శాతమని చెప్పారాయన. పరిశ్రమలో మిశ్రమాల వాటా 20 శాతంగా ఉంది. ఈ రంగంలో 250పైగా రకాల ముడి పదార్థాలను వాడుతున్నారు. వీటిలో 10 శాతం దాకా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నవి కావటం గమనార్హం. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే 1,000 రకాలకు పైగా వంటకాలను ఆస్వాదిస్తున్నారట. ఈ లెక్కన దేశవ్యాప్తంగా 50 వేలకుపైగానే వంటకాలు ఉంటాయని సమాచారం. ఈ స్థాయిలో టాప్ వంటకాలకు తగ్గట్టుగా మసాలా మిశ్రమాలను కంపెనీలు తయారు చేస్తున్నాయి. ప్రాంతాలకే బ్రాండ్ల పరిమితం.. మసాలా పరిశ్రమలో నిలదొక్కుకోవడం అంత సులువేం కాదు. వేలాది బ్రాండ్లు ఒకవైపు పోటీపడుతున్నాయి. మరోవైపు ప్రాంతాన్ని బట్టి కస్టమర్ల అభిరుచులు వేరుగా ఉంటున్నాయి. తెలంగాణ, రాయలసీమలో సాంబార్ ఘాటుగా తింటారు. అదే కర్నాటక వాసులు కారం తక్కువగా తింటారని సూర్య బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తున్న హైదరాబాద్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎండీ రవీంద్ర మోదీ చెప్పారు. ‘మరో ప్రాంతానికి విస్తరించాలంటే అక్కడి మార్కెట్‌కు తగ్గ ఉత్పత్తులు తయారు చేయాలి. పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేయగలిగితేనే అక్కడ అడుగుపెట్టగలం. ఇది వ్యయంతో కూడుకున్నది. ఒక బ్రాండ్ వాడేవారు మరో బ్రాండ్‌కు మళ్లాలంటే సులువు కాదు. అందుకే చాలా బ్రాండ్లు ఒక ప్రాంతానికే పరిమితం అవుతున్నాయి’ అని అన్నారు. పరిశోధిస్తేనే విజయం... మిశ్రమాల విషయంలో ఒక్కో ఉత్పత్తిని తీసుకొచ్చేందుకు ఎంతో పరిశోధన చేయాలి. కస్టమర్ల అభిరుచిని తెలుసుకోవాలి. ఉత్పాదన అభివృద్ధిలో భాగంగా వందలాది మంది వినియోగదార్లకు రుచి చూపించాలి. పరీక్ష పాస్ అయితేనే ఉత్పాదన బయటకు వస్తుంది. ఒక్కో వెరైటీకి 7 నెలల వరకూ సమయం పడుతుందని సంజయ్ శర్మ తెలిపారు. పోటీలో నిలదొక్కుకోవాలంటే ఇలాంటి పరిశోధన తప్పదని రవీంద్ర మోదీ చెప్పారు. ప్రాంతాలకు అనుగుణంగా రుచులను అందించాల్సిందేనన్నారు. ఇందుకు దినుసుల నాణ్యతలో రాజీ పడకూడదని, ఒక ఉత్పాదన రుచి ఎప్పుడూ ఒకేలా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు. మార్కెట్లో వేల బ్రాండ్లు.. భారత్‌లో మసాలా పొడులు, మిశ్రమాల వ్యాపారంలో వ్యవస్థీకృత రంగంలో దాదాపు 3,500 బ్రాండ్లు పోటీపడుతున్నాయి. అవ్యవస్థీకృత రంగంలో అంటే స్థానికంగా చిన్నా చితకా బ్రాండ్లæ సంఖ్య దీనికి అయిదు రెట్లు ఉంటుంది. 250కి పైగా రకాల రుచుల్లో ఇవి లభిస్తున్నాయి. 8 శాతం వార్షిక వృద్ధి నమోదు చేస్తున్న రూ.1,60,000 కోట్ల విపణిలో బ్రాండెడ్ కంపెనీల వాటా రూ.27,000 కోట్లుంది. బ్రాండెడ్ కంపెనీల వ్యాపారంలో సగం వరకూ ఎగుమతుల ద్వారా వస్తున్నదే. ప్రపంచంలోని పలు దేశాలకు ఇక్కడి నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ స్థాయిలో రుచులను తయారు చేస్తున్న దేశం ప్రపంచంలో ఎక్కడా లేదని కంపెనీలు చెబుతున్నాయి. -
శ్రేయా గరం మసాలా.. ఒబామా ఫ్యామిలీ ఫిదా
వాషింగ్టన్: శ్రేయా పటేల్.. తొమ్మిదేళ్ల ఈ ఇండియన్ అమెరికన్ చిన్నారి చేతి వంటకు ఒబామా ఫ్యామిలీ మొత్తం ఫిదా అయింది. అంతేకాదు.. తమతో డిన్నర్ చేయాల్సిందిగా అమెరికా ప్రధమ మహిళ నుంచి ఆహ్వానం అందుకుంది. ఇంతకీ ఒబామా, మిచెల్లీలను లొట్టలేసేలా చేయించిన ఆ వంటకం ఏదంటే.. పక్కా ఇండియన్ గరం మసాలా బర్గర్! అమెరికాలో స్కూళ్లకు వెళుతోన్న 8 నుంచి 12 ఏళ్ల చిన్నారుల్లో ఎంతమందికి గరిటె తిప్పడం వచ్చు? పదార్థాల తయారీలో అమ్మలకు సహాయం చేసేవాళ్లు ఎంతమంది? అనే వివరాలు సేకరించి వాళ్లలో కొద్దిమందితో ప్రతిఏటా 'కిడ్స్ స్టేట్ డిన్నర్' అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఆ దేశంలో ఆనవాయితీ. ఈ ఏడాది పోటీల్లోనూ 55 మంది చిన్నారులు పాల్గొన్నారు. ప్రతివారు వంటకాన్ని తమ స్వహస్తాలతో తయారుచేయాల్సి ఉంటుంది. అవసరమైతే పెద్దల సాయం కూడా తీసుకోవచ్చు. అలా తన బామ్మ సహాయంతో శ్రేయా చేసిన గరం మసాలా బర్గర్‌ను ఒబామా, ఆయన భార్య రుచి చూశారు. అంతే.. ఆ అదిరిపోయే రుచికి ఫిదా అయిపోయి శ్రేయాను పొగడ్తలతో ముంచెత్తారు. వారి ఆహ్వానం మేరకు శ్రేయా జులై 10న వైట్‌హౌస్‌కు వెళ్లి డిన్నర్ చేసొచ్చింది. కూరలు తరగడం, పాత్రలు తోమడం, వంట పనుల్లో అమ్మకు సహాయం చేయడం తనకు ఇష్టమైన పనులని, ఆ ఆసక్తితోనే గరం మసాలా బర్గర్ చేయడం నేర్చుకున్నానని చెప్పింది చిన్నారి శ్రేయ. అయితే పెద్దయ్యాక మాత్రం తన తండ్రిలానే ఫార్మసిస్టు కావాలని ఉందని చెప్పింది.