ప్రియా ప్రకాశ్‌ ఒక్క పోస్ట్‌ సంపాదనెంతో తెలుసా? | Is Priya Prakash Varrier is Earning Per Social Media Post? | Sakshi

Mar 9 2018 10:39 AM | Updated on Oct 22 2018 6:23 PM

Is Priya Prakash Varrier is Earning Per Social Media Post? - Sakshi

ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

ఒక్క సీన్‌తో కుర్రకారును ఫ్లాట్ చేసిన కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్‌ సోషల్ మీడియా వేదికగా ఎంత సంపాదిస్తుందో తెలిస్తే షాక్‌ అవుతారు. ఓవర్ నైట్‌ స్టార్‌గా మారిన ఈ మళయాల భామ.. ఒక్క పోస్టుకు ఏకంగా రూ.8 లక్షలు ఆర్జిస్తోంది. ఇక సోషల్‌మీడియాలో ఆమెను అనుసరించేవారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతోంది.  ఇంటర్నెట్‌లో నిత్యం బాలీవుడ్‌ భామలు సన్నీలియోన్‌ ,దీపికా పదుకునే అంటూ ఫన్నీ కలలుకనే నెటిజన్లు.. ఇప్పుడు  ప్రియా ప్రకాశ్‌ జపం చేస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాచ్‌ చేసుకోవాలని భావించిన ఈ అమ్మడు ఒక్క పోస్టుకు 8 లక్షలు డిమాండ్‌ చేస్తోందని ఓ జాతీయ చానెల్‌ పేర్కొంది. 

ఇక ప్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో 24 గంటల వ్యవధిలోనే 6 లక్షల 6 వేల మంది ఫాలోవర్స్‌తో రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో అమెరికన్‌ టీవీ స్టార్, మోడల్‌ కైలీ జెన్నర్‌ (8 లక్షల 6 వేలు), ఫుట్‌బాల్‌ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (6 లక్షల 50 వేలు) తర్వాత ప్రియానే కావడం విశేషం. ఇక ఫొటో-వీడియో షేరింగ్‌ యాప్‌లో ప్రియాను అనుసరించే వారి సంఖ్య ఏకంగా యాబై లక్షలకు చేరింది.

ఒరు ఆధార్‌ లవ్‌ చిత్రంలోని ‘మాణిక్య మలరయ పూవీ’ పాట ఎంతో పాపులర్‌ అయిందో తెలిసిన విషయమే. ఈ పాటకు సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ఫిదా అయ్యారు. మార్చి5నే విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని కారణాలతో వాయిదా పడింది. ఇద్దరి స్కూల్‌ విద్యార్థుల మధ్య నడిచే ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్ర టీజర్‌ ఇప్పటికే విశేష స్పందన రాబట్టుకుంది. ఈ మూవీని తెలుగులోనూ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement