ఒక మిలియన్ యూరోలు సంపాదించడానికి భారత్‌లోని సగటు జీతగాడికి ఎంత సమయం పడుతుంది? ఇంతకీ మిలియన్ యూరోలు అంటే ఎంతో చెప్పలేదు కదూ.. రూ. 9.09 కోట్లు.. ఈ లెక్కన భారతీయులకు 158 ఏళ్లు పడుతుందట! 30 ఏళ్లు సర్వీసు వేసుకున్నా.. ఐదు జీవితకాలాలు అన్నమాట. మన పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. అక్కడైతే.. ఏకంగా 664 ఏళ్లు పడుతుందట.
ప్రపంచంలో అత్యంత తక్కువగా స్విట్జర్లాండ్ వాసులకు ఇందు కోసం కేవలం 15 ఏళ్లే పడుతోంది. మన దేశవాసుల సగటు జీతం రూ.48 వేలు కాగా.. స్విట్జర్లాండ్‌లో అది రూ.5 లక్షలు. ఆయా దేశాల్లోని ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. మరి ఓసారి ఇందులో టాప్–5.. లీస్ట్ 5 జాబితాన్ని చూసేద్దామా..
చదవండి: 18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..!
Comments
Please login to add a commentAdd a comment