euro
-
రూ. 9 కోట్ల సంపాదనకు సగటు భారతీయుడికి ఎన్నేళ్లు పడుతుందంటే..
ఒక మిలియన్ యూరోలు సంపాదించడానికి భారత్‌లోని సగటు జీతగాడికి ఎంత సమయం పడుతుంది? ఇంతకీ మిలియన్ యూరోలు అంటే ఎంతో చెప్పలేదు కదూ.. రూ. 9.09 కోట్లు.. ఈ లెక్కన భారతీయులకు 158 ఏళ్లు పడుతుందట! 30 ఏళ్లు సర్వీసు వేసుకున్నా.. ఐదు జీవితకాలాలు అన్నమాట. మన పరిస్థితి ఇలా ఉంటే.. పాకిస్తాన్ పరిస్థితి మరీ ఘోరం.. అక్కడైతే.. ఏకంగా 664 ఏళ్లు పడుతుందట. ప్రపంచంలో అత్యంత తక్కువగా స్విట్జర్లాండ్ వాసులకు ఇందు కోసం కేవలం 15 ఏళ్లే పడుతోంది. మన దేశవాసుల సగటు జీతం రూ.48 వేలు కాగా.. స్విట్జర్లాండ్‌లో అది రూ.5 లక్షలు. ఆయా దేశాల్లోని ఉద్యోగుల కనిష్ట వేతనం, గరిష్ట వేతనాన్ని పరిగణనలోకి తీసుకుని.. ఈ సగటు వేతనాన్ని నిర్ధారించారు. మరి ఓసారి ఇందులో టాప్–5.. లీస్ట్ 5 జాబితాన్ని చూసేద్దామా.. చదవండి: 18 ఏళ్లుగా జీన్స్ ప్యాంట్లను ఉతకని మహిళ.. ఒక్క మరక కూడా లేదట..! -
ప్రధాని రాజీనామా దెబ్బ: 20ఏళ్ల కనిష్టానికి యూరో
రోమ్ : ఇటలీలో నెలకొన్న రాజ్యాంగ సంక్షోభం దేశ కరెన్సీపై భారీగా పడింది. ఇటలీ రాజ్యాంగ సవరణలపై రెఫరండం వైఫల్యం నేపథ్యంలో యూరో భారీగా పతనమైంది. దాదాపు20 సం.రాల కనిష్టానికి చేరింది. ఇటలీ ప్రధాన మంత్రి మాటియో రెంజి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించిన అనంతరం ఈ పతనం నమోదైంది. ప్రధాని మాటియో రెంజీ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇటలీ పార్లమెంట్ ఓటు వేసింది. దీంతో ప్రధాని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో రాజకీయ సంక్షోభం తలెత్తింది. డాలరుతో మారకంలో యూరో 20 ఏళ్ల కనిష్టం 1.05ను తాకింది. ఇప్పటికే యూరోజోన్ నుంచి వైదొలగేందుకు బ్రిటన్ నిర్ణయించుకున్న(బ్రెగ్జిట్) సంగతి తెలిసిందే. ఈ పరిణామాలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూరోజోన్ ముక్కలయ్యే పరిస్థితులు నెలకొంటున్నట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు. అటు న్యూ జిలాండ్ ప్రధాని జాన్ కీ అనూహ్య రాజీనామా ప్రభావం అక్కడి మార్కెట్లపై పడింది. డాలర్ మాకరపు విలువలో న్యూజిలాండ్ కరెన్సీ 0.8 శాతం క్షీణించింది. సూచీలు దాదాపు 0.6 శాతం తక్కువ నష్టపోయాయి. రాజకీయాలనుంచి తప్పుకోడానికి ఇది సరైన సమయమని జాన్ వ్యాఖ్యానించారు. కాగా డెమోక్రటిక్ పార్టీ ప్రధాని మాటెవో రెంజీ తలపెట్టిన రిఫరెండానికి ప్రజలు వ్యతిరేకించారు. లక్షలమంది కార్మికులు, ప్రజలు రెఫరండానికి వ్యతిరేకంగా గతంలో ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ సంస్కరణలను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, రోమ్‌లో అమెరికా రాయబారి బహిరంగంగానే సమర్ధించారు. ఒకవేళ సంస్కరణలకు 'నో' చెబితే పెట్టుబడులను నిలిపివేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే. -
కల నెరవేరేనా...
పోర్చుగల్... తమ చరిత్రలో ఎప్పుడూ ఒక్క మేజర్ టైటిల్ కూడా గెలవని జట్టు. స్టార్ ఆటగాడు రొనాల్డో సూపర్ ప్రదర్శనతో ఈసారి ఫైనల్‌కు వచ్చింది. ఇప్పుడు గెలవకపోతే మళ్లీ గెలవలేమనే కసితో బరిలోకి దిగుతోంది. ఫ్రాన్స్... ఈసారి యూరో గెలిస్తే మూడుసార్లు గెలిచిన జట్టుగా జర్మనీ, స్పెయిన్‌ల సరసన నిలుస్తుంది. సొంతగడ్డపై అభిమానులను నిరాశపరచకూడదనే పట్టుదలతో ఆడబోతోంది. మరి ఎవరి కల నెరవేరుతుంది..? యూరో ఫైనల్ నేడు ⇒ తొలి టైటిల్‌పై పోర్చుగల్ గురి ⇒ రికార్డు కోసం ఫ్రాన్స్ ఆరాటం ⇒ రొనాల్డో, గ్రిజ్మన్లపైనే దృష్టి రాత్రి 12.30 గంటల నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం పారిస్: యూరోపియన్ చాంపియన్‌షిప్ ఫైనల్‌కు రంగం సిద్ధమైంది. ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా అభిమానులను అలరించిన ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు నేడు (ఆదివారం) జరిగే ఫైనల్ పోరులో తలపడనున్నాయి. ఈ టోర్నీలో కొత్త స్టార్‌గా అవతరించిన ఆంటోనీ గ్రిజ్మన్ (ఫ్రాన్స్)తో పాటు క్రిస్టియానో రొనాల్డో (పోర్చుగల్)ల సత్తాకు ఈ మ్యాచ్ అసలైన పరీక్ష కానుంది. సొంత ప్రేక్షకుల మద్దతుతో తమ జట్టును మరోసారి చాంపియన్‌గా నిలపాలని గ్రిజ్మన్ భావిస్తున్నాడు. మరోవైపు పోర్చుగల్‌కు మేజర్ టైటిల్ లేని లోటును తీర్చాలనే కసితో రొనాల్డో ఉన్నాడు. 2004లో స్వదేశంలోనే జరిగిన యూరో కప్ ఫైనల్లో గ్రీస్ చేతిలో 0-1తో పోర్చుగల్ ఓడిపోయింది. అప్పుడు 19 ఏళ్ల రొనాల్డో జట్టు ఓటమికి కన్నీళ్లపర్యంతమయ్యాడు. ఇక ఫ్రాన్స్ జట్టు 1984, 2000లో యూరో కప్‌లో విజేతగా నిలిచింది. అయితే ఈ రెండు సార్లు సెమీస్‌లో పోర్చుగల్‌ను ఓడించే తుది పోరుకు చేరింది. ఇది ఈ జట్టుకు మూడో ఫైనల్. చివరిసారి ఈ రెండు జట్లు 2006 ప్రపంచకప్ సెమీస్‌లో తలపడగా జిదానే ఏకైక గోల్‌తో ఫ్రాన్స్ గెలిచింది. 1975లో జరిగిన ఓ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో ఫ్రాన్స్‌పై నెగ్గిన పోర్చుగల్ ఆ తర్వాత త లపడిన 10 సార్లు పరాజయమే ఎదుర్కొంది. పటిష్టంగా ఫ్రాన్స్: ప్రత్యర్థితో పోలిస్తే ఫ్రాన్స్ స్టార్ ఆటగాళ్లతో పైచేయిలో ఉంది. గోల్డెన్ బూట్ రేసులో ఆరు గోల్స్‌తో అందరికన్నా ముందున్న గ్రిజ్మన్ మరోసారి కీలకం కానున్నాడు. అతడితో పాటు ఫార్వర్డ్ గిరౌడ్, మిడ్‌ఫీల్డర్లు పయెట్, పోగ్బా ప్రత్యర్థి ఆటగాళ్లను వణికిస్తున్నారు. పోరాటమే ధ్యేయంగా..: రొనాల్డో ఇప్పటిదాకా ఫ్రాన్స్ జట్టుపై విజయం రుచి చూడలేదు. సెమీస్‌లో వేల్స్‌పై అత్యద్భుత ఆటను చూపెట్టి ఫామ్‌లో ఉన్న అతడిపైనే జట్టు ఆశలున్నాయి. నాని తనకు సహకారం అందిస్తే ఫ్రాన్స్‌కు ఇబ్బందులు తప్పవు. -
వేల్స్ కొత్త చరిత్ర
లిల్లీ: యూరో కప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో సంచలనం నమోదైంది. శుక్రవారం రాత్రి జరిగిన క్వార్టర్ ఫైనల్లో రెండో ర్యాంకర్ బెల్జియం ఇంటిముఖం పట్టింది. అమీతుమీ తేల్చుకోవాల్సిన పోరులో పసికూన వేల్స్ 3-1 తేడాతో బెల్జియంను బోల్తా కొట్టించి సెమీస్ కు చేరింది. తద్వారా ఓ ప్రధాన టోర్నీలో తొలిసారి సెమీస్ కు చేరి కొత్త చరిత్ర సృష్టించింది. ఆట 13వ నిమిషంలో బెల్జియంకు రాద్జా తొలి గోల్ ను అందించి జట్టును ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు.ఈడెన్ హజార్డ్ నుంచి పాస్ ను అందుకున్న రాద్జా గోల్ గా మలచాడు. కాగా, ఆట 30వ నిమిషంలో వేల్స్ ఆటగాడు ఆష్లే విలియమ్స్ హెడర్ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు.ఇక ఆ తర్వాత రెచ్చిపోయిన వేల్స్..పటిష్టమైన బెల్జియం ఎటాక్ ను నిలువరించడమే కాకుండా, మరో రెండు గోల్స్ నమోదు చేసి అద్భుతమైన విక్టరీ సాధించింది. ఆట 55వ నిమిషంలో హాల్ రాబ్సన్ కాను, 85వ నిమిషంలో శ్యామ్ వేక్స్ తలో గోల్ చేయడంతో వేల్స్ ఘనమైన విజయం సాధించింది. ఇదిలా ఉండగా, 1958 ప్రపంచకప్ తర్వాత ఓ మేజర్ టోర్నీలో వేల్స్ బరిలోకి దిగడం కూడా ఇదే తొలిసారి. -
ప్రిక్వార్టర్లో స్పెయిన్
నైస్(ఫ్రాన్స్):యూరో కప్‌లో డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ ప్రిక్వార్టర్‌లోకి ప్రవేశించింది. గ్రూప్-డిలో జరిగిన మ్యాచ్‌లో స్పెయిన్ 3-0 తేడాతో టర్కీని ఓడించి ప్రిక్వార్టర్స్‌కు చేరింది. స్పెయిన్ ఆటగాళ్లలో అల్వారో రెండు గోల్స్ తో, నిలోటి ఒక గోల్ నమోదు చేసి జట్టు సంపూర్ణ విజయంలో సహకరించారు. హ్యాట్రిక్ టైటిల్ పై ఆశపెట్టుకున్న స్పెయిన్ అంచనాలకు తగ్గట్టు రాణించి ప్రిక్వార్టర్స్ చేరింది. మంగళవారం క్రొయేషియాతో జరిగే స్పెయిన్ తన ఆఖరి లీగ్ మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా గ్రూప్-టాపర్ గా నిలుస్తుంది. మరోవైపు టర్కీ తన చివరి లీగ్ మ్యాచ్ లో చెక్ రికపబ్లిక్ పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
అభిమానులు తన్నుకున్నారు!
మర్సెల్లీ: అసలు ఫుట్ బాల్ అంటేనే ప్రజా భిమానం ఎక్కువ. అందులోనూ యూరో కప్ అంటే మరింత క్రేజ్. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఒక మ్యాచ్ సందర్భంగా అభిమానులు కొట్టుకోవడమే ఇప్పుడు ప్రశ్నార్థకరంగా మారింది. ఫ్రాన్స్ వేదికగా జరుగుతున్న యూరో చాంపియన్‌షిప్ ఫుట్ బాల్ టోర్నమెంట్ లో విచక్షణ మరచిపోయిన అభిమానులు కొట్లాటకు దిగారు. ఆదివారం ఇంగ్లండ్-రష్యాల మ్యాచ్‌లో భాగంగా ఇరు దేశాల అభిమానులు బాహాబాహీ యుద్ధానికి తెరలేపారు. తమ దేశం గొప్పదని ఒకరంటే, కాదు తమ దేశం గ్రేట్ అంటూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఓల్డ్ ట్రాఫోర్డ్ జిల్లాలో అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘటన రణరంగాన్ని తలపించింది. రక్తాలు కారేలా తన్నుకోవడంతో యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచేలా చేసింది. ఫుట్ బాల్ మ్యాచ్ ఆరంభానికి ఒక రోజు ముందు చోటు చేసుకున్న ఈ ఘటన మ్యాచ్ ముగిశాక కూడా మరింత వేడిని పుట్టించడం గమనార్హం. ఓ రెస్టారెంట్ టెర్రాస్ పై ఇద్దరు అభిమానుల మధ్య మొదలైన మాటల యుద్ధం కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఒకర్ని నొకరు దూషించుకుంటూ కొట్లాటకు దిగడంతో ఒక వ్యక్తి పై నుంచి కిందికి పడిపోయాడు. ఈ ఘటనతో ఉద్రిక్తులైన ఇరు దేశాల అభిమానులు మర్సెల్లీ స్టేడియానికి బయట రెండు గ్రూపులుగా విడిపోయి కొట్లాటకు దిగారు. దీంతో ఒక్కసారిగా కంగుతిన్న పోలీసులు టియర్ గ్యాస్, వాటర్ కేన్స్ ప్రయోగించి వారిని చెల్లాచెదురు చేశారు. ఆ తరువాత మ్యాచ్ జరుగుతున్న సమయంలో , మ్యాచ్ ముగిశాక కూడా మరోసారి ఘర్షణకు దిగారు. దీనిపై ఫ్రెంచ్ అంతర్గత వ్యవహారాల మంత్రి బెర్నాడ్ కాజేనెవ్యూ విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్లు స్పష్టం చేశారు. ఒక బ్రిటన్ వాసి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఫుట్ బాల్ మ్యాచ్‌లో అభిమానుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణను యూరోపియన్ సాకర్ గవర్నింగ్ బాడీ తీవ్రంగా ఖండించింది. ఫుట్ బాల్ అనేది కొట్లాటకు వేదిక కాదన్న సత్యాన్ని ఆయా దేశాల ప్రజలు గ్రహిస్తే మంచిదని పేర్కొంది. ఇదిలా ఉంచితే ఈ మ్యాచ్ 1-1తో డ్రా ముగియడం విశేషం. -
ఎవరూ రాకపోతే.. డబ్బంతా ఆ పిల్లాడికే!
వియన్నా: ఆస్ట్రియాలోని డాన్యూబ్ నదిలో అకస్మాత్తుగా డబ్బుల కట్టలు తేలుతూ కనిపించాయి. అంత డబ్బు కనిపిస్తే ఎవరికైనా కళ్లు చెదురుతాయి కదా... ఒడ్డున నిలబడి చూస్తున్న పిల్లాడికి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ డబ్బును సొంతం చేసుకోవాలనుకున్నాడు.. కానీ ఈత రాదు. అందుకే పోలీసులకు సమాచారాన్ని చేరవేశాడు. పోలీసులు వచ్చేలోపు ప్రాణం ఆగలేదు.. వాళ్లు వచ్చేలోపు ఎంతోకొంత దక్కించుకోవాలని ప్రయత్నించాడు. మెల్లిగా నదిలోకి వెళ్లి కొంత డబ్బు తీసుకున్నాడు. అయితే నది ఒడ్డున తచ్చాడుతున్న పిల్లాడిని చూసిన కొందరు పెద్దలు.. అతడు ఆత్మహత్య చేసుకుంటున్నాడోమేనని కంగారుపడ్డారు. అంతా అక్కడ గుమిగూడారు. ఇంతలో పోలీసులకు రానే వచ్చి.. పెద్దఎత్తున 500, 100 యూరో కరెన్సీ నోట్ల కట్టలను స్వాధీనం చేసుకున్నారు. ఈ డబ్బుకట్టలు నదిలో ఎలా కొట్టుకొచ్చాయో అక్కడివారికి అంతుపట్టలేదు. డబ్బును చూసిన పిల్లడు మాత్రం తనకు వాటా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. మరోవైపు ఇవి నకిలీ నోట్లు కావచ్చని పోలీసులు అనుమానించినా... నకిలీవి కావని తేల్చారు. ఇంత డబ్బు ఎవరు నదిలో పడేశారు.. ఎక్కడినుంచి వచ్చిందనేది ఆరా తీస్తున్నామని పోలీసులు తెలిపారు. తాము స్వాధీనం చేసుకున్న సొమ్ము విలువ లక్ష యూరోలు (73 లక్షల రూపాయలు) అని అన్నారు. సాధారణంగా ఆస్ట్రియాలో ఎవరికైనా డబ్బు దొరికితే అందులో ఆ డబ్బు ఆచూకీ చెప్పినవారికి 15 - 10 శాతాం వాటా ఇస్తారు. అంతేనా, ఆ డబ్బు అసలు యజమాని వివరాలు ఏడాదిలోపు తెలియక పోతే...ఆ పూర్తి మొత్తాన్ని డబ్బు ఆచూకీ తెలిపిన వారికి అప్పగిస్తారట. -
నేడు తేలనున్న గ్రీస్ భవితవ్యం
-
‘యూరో’ను జయించిన ‘హీరో’
కనీస కార్యాచరణ ప్రాతిపదికన ప్రారంభమైన వేదికలు ఈ రోజు లాటిన్ అమెరికాలో, గ్రీస్‌లో ఒక నూతన పంథాను ఆవిష్కరించాయి. ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా భారతదేశంలో కూడా ఒక విశాల ప్రజా ఐక్య సంఘటనకు అవకాశం ఉన్నది. దీనికి ఒక ప్రయత్నం జరగాలి. అప్పుడే పేదలను మరింత అగాధంలోకి నెడుతున్న కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థకు ముగింపు పలకడం సాధ్యమవుతుంది. ‘‘నులివెచ్చని కాంతితో మెరుస్తున్న సూర్యోదయంతో నేను ఆరోజు నిద్ర లేచాను. గ్రీస్‌లో నూతన ప్రభుత్వం ఏర్పడటానికి పోలింగ్ జరుగుతున్న రోజు అది. మొట్టమొదటిసారిగా గ్రీస్ కార్మికవర్గం తన స్వీయ ప్రయోజనాల కోసం ఓటు వేసిన మధురమైన అనుభూతిని నేను మరచిపోలేను. దీనితో గ్రీస్‌లో నిజమైన సోషలిస్టు ప్రభుత్వం ఆవిర్భవించింది’’ అంటూ గ్రీస్ ఓటరు తన బ్లాగ్‌లో ఆనందంతో వెల్లడించిన క్షణాలవి. యూరప్ ఖండంలో ప్రాచీన సంస్కృతీ చిహ్నమై, రాజనీతి రంగానికే అక్షరాలు దిద్దించిన గ్రీస్‌లో జనవరి 25వ తేదీన జరిగిన ఎన్నికలు చరిత్రను సృష్టించాయి. గ్రీస్ రాజకీయపటంలో అతి చిన్న పార్టీగా ఆవిర్భవించి, అనతి కాలంలోనే విస్తరించిన ‘సిరిజ’ (వామపక్ష విప్లవ సంఘటన) పార్టీ అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నది. ఇది సాధారణ విజయం కాదు. ఆ పార్టీ కూడా సాధారణమైనది కాదు. ఇప్పటి వరకు యూరప్‌లో, గ్రీస్‌లో కొనసాగుతోన్న వ్యవస్థలను సవాల్ చేసి నూతన లక్ష్యంతో, సోషలిస్టు ఆశయంతో ఎన్నికల్లో విజయకేతనాన్ని ఎగురవేసి చరిత్రను సృష్టించింది. దాదాపు 36.3 శాతం ఓట్లతో 149 స్థానాలను గెలుచుకున్నది. ఈ ఎన్నికల్లో 21 పార్టీలు, 4 కూట ములు, ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నమోదు చేసుకోగా, అక్కడి సుప్రీంకోర్టు 18 పార్టీలకు, నాలుగు కూటములకు అవకాశం కల్పించింది. గత ప్రభుత్వం లో అధికారం పంచుకున్న సోషల్ డెమోక్రటిక్ పాసొక్, న్యూడెమాక్రసీ కూట మి బాగా దెబ్బతిన్నాయి. సిరిజ పార్టీకి నాయకత్వం వహిస్తున్న అలెక్సిస్ సిప్రాస్ జనవరి 26న ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రీస్‌లో గత కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక సంక్షోభం కొనసాగుతున్నది. 2013 నాటి లెక్కల ప్రకారం 65 శాతం మంది యువకులు నిరుద్యోగులే. ఎని మిది లక్షల మందికి నిరుద్యోగభృతి అందడం లేదు. ఆరోగ్య సౌకర్యాలు కూడా లేవు. నాలుగు లక్షల కుటుంబాల్లో ఒకరికి కూడా ఉపాధి లేదు. 2012 ఫిబ్రవరి అంచనాల ప్రకారం, ఇరవై వేల కుటుంబాలు నిరాశ్రయమయి నాయి. చరిత్రాత్మక ఏథెన్స్ నగరంలో 20 శాతం దుకాణాలను మూసివేశారు. కొనుగోలు శక్తి తగ్గి దుకాణదారులు దివాలా తీశారు. విదేశీ పెట్టుబడులు వెల్లువెత్తడంతో అప్పుల భారం పెరిగిపోయింది. ముఖ్యంగా జర్మనీ నుంచి దిగుమతి అయ్యే రక్షణ ఆయుధాలు, పరికరాల కొనుగోలుతో రక్షణ బడ్జెట్ పెరిగిపోయింది. సొంత కాళ్ల మీద నిలబడి అభివృద్ధిని సాధించుకోవడానికి ప్రయత్నం చేయడం మానివేసి, అప్పులు తీర్చడానికి మరిన్ని అప్పులు చేసే దుస్థితికి దిగజారింది. దీనితో ప్రభుత్వాలు పన్నుల భారాన్ని తీవ్రతరం చేశాయి. ఈ చర్యలేవీ గ్రీస్‌ను అప్పుల ఊబి నుంచి బయటపడవేయలేక పోయాయి. 2000 సంవత్సరం మొదట్లో గ్రీస్ ఆర్థిక వ్యవస్థ శక్తిమంతంగా ఉండేది. అప్పుడు ఎంతటి లోటు బడ్జెట్‌నైనా పూడ్చుకొనే శక్తి ఉండేది. కానీ నౌకా నిర్మాణ పరిశ్రమ, పర్యాటక రంగం అనుకున్నంత పురోగతి సాధించలేక పోయాయి. 1990 తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ప్రపంచీకరణ ప్రభా వంతో గ్రీస్ మరింతగా ఆర్థిక సంక్షోభంలోకి వెళ్లింది. యూరో కరెన్సీ వ్యవస్థ వల్ల గ్రీస్ వివక్షకు గురైన ట్టు ఆర్థికవేత్తలు పేర్కొన్నారు. ప్రభుత్వం పెడుతున్న ఖర్చులో ప్రజలకు చేరేది అతి స్వల్పంగా మారిపోయింది. దీనికంతటికీ పెట్టు బడిదారీ విధానాలతో నడుస్తున్న పాలన కారణమని ప్రజలు గుర్తించారు. దానితో పెట్టుబడిదారీ విధానాలను, ప్రపంచీకరణను, ప్రజావ్యతిరేక రాజ కీయాలకు అడ్డుకట్టవేసేందుకు తీవ్రవాద వామపక్ష భావాలతో కూడిన సంస్థలు, పార్టీలు ఏకతాటిపైకి రావాలని నిర్ణయించాయి. అందులో భాగం గానే 2004 ఎన్నికలకు ముందు ‘సిరిజ’ అనే వేదికను ఏర్పాటు చేసుకు న్నాయి. దీనికి మూడేళ్ల ముందే ‘స్పేస్’ అనే ఐక్య సంస్థ ఆవిర్భవించింది. స్పేస్ తర్వాత ‘సిరిజ’గా రూపుదాల్చింది. వామపక్షాల ఐక్యకార్యాచరణ, ఐక్యత కోసం ఒక చర్చావేదికగా ఇది ఆరంభమైంది. దీనిలో వివిధ సిద్ధాం తాలు, అభిప్రాయాలు కలిగిన సంస్థలు, సంఘాలు, పార్టీలు భాగస్వాముల య్యాయి. 2004 ఎన్నికలకు ముందు జనవరి 4న సాస్పిమన్, రిన్యూయింగ్ కమ్యూనిస్టు, ఎకోలాజికల్ లెఫ్ట్ (ఏకేఓఏ), ఇంటర్నేషనల్ వర్కర్స్ లెఫ్ట్, ది మూమెంట్ ఫర్ ది యునెటైడ్ ఇన్ యాక్షన్ లెఫ్ట్, యాక్టివ్ సిటిజన్స్, ఇతర వామపక్ష భావాలు కలిగిన వ్యక్తులు, సంస్థలు ఇందులో ఉన్నాయి. ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఎలెక్సిస్ సిప్రాస్ 2004 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏథెన్స్ నగరంలో మున్సిపల్ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2007 సెప్టెంబర్ 16న జరిగిన ఎన్నికల్లో ‘సిరిజ’ పార్టీ అందరినీ ఆశ్చర్యపరిచింది. కౌన్సిలర్‌గా ఉన్నకాలంలోనే ఎలెక్సిస్ సిప్రాస్ 2008 ఫిబ్రవరిలో ‘సిరిజ’ అధ్యక్షుడయ్యారు. 2009 ఎన్నికల్లో 4.6 శాతం ఓట్లు పొంది 13 మంది ఎంపీలను ఈ పార్టీ గెలుచుకున్నది. 2012లో జరిగిన ఎన్నికల్లో 16 శాతం ఓట్లను సాధించి రెండవ పెద్ద పార్టీగా స్థానం సంపాదించింది. ఇక్కడే సిరిజ తన రాజకీయ చైతన్యాన్ని ప్రదర్శించింది. పార్లమెంటులో ఐక్య సంఘటన ప్రభుత్వంలో చేరడానికి నిరాకరించింది. ఉదారవాద ఆర్థిక విధానాలను, ప్రజలపై ఇబ్బడి ముబ్బడిగా పన్నులు విధించే విధానాలను అంగీకరించేది లేదని స్పష్టం చేసింది. మొత్తంగా యూరోకు బానిసగా ఉంటూ దేశ ప్రజల ప్రయోజ నాలను తాకట్టుపెడుతున్న పార్టీలతో జతకట్టలేమని సిప్రాస్ కరాఖండిగా చెప్పారు. దానితో సిరిజ ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నెలకొల్పడమే కాక, ఉదార ఆర్థిక విధానాలను వ్యతిరేకిస్తూ ఎన్నో ఉద్యమాలను నిర్వహించింది. ఒకవైపు ప్రపంచీకరణకు ప్రత్యామ్నాయంగా నిలకడగలిగిన ఆర్థిక విధానాలను ప్రచా రం చేయడం, కలసివచ్చే శక్తులన్నింటినీ ఐక్యం చేయడం వల్ల ఈ విజయం సాధ్యమైందని పరిశీలకులు భావిస్తున్నారు. సిరిజ అధికారం చేపట్టిన తర్వాత ఎలెక్సిస్ సిప్రాస్ తమ విధానాలను ప్రకటించారు. ఇవి ప్రజల్లో ఆశను రేకెత్తించాయి. ఇతర దేశాలతో, యూరో పార్లమెంట్‌తో కుదుర్చుకున్న అసమాన ఒప్పందాలను తమ ప్రభుత్వం గౌరవించదని తేల్చి చెప్పారు. సాధారణ రుణాలన్నింటినీ రద్దు చేస్తే, నిలకడ కలిగిన అభివృద్ధిని సాధించగలుగుతామని సిప్రాస్ పేర్కొన్నారు. గ్రీస్ ఇక ముందు ఎటువంటి అప్పులను అంగీకరించదని ఆర్థికమంత్రి యూనిస్ వరోఫకీస్ కూడా తేల్చి చెప్పారు. గ్రీస్ కార్మికవర్గ ప్రజల విజయం అక్కడి ప్రజలకే కాదు ప్రపంచ ఐక్య ఉద్యమాలకు ఒక ఆశాకిరణంలా అగుపిస్తోంది. కేవలం మార్క్సిస్టు సిద్ధాం తాన్ని అమూలాగ్రం అంగీకరించిన వాళ్లే వామపక్ష శక్తులనే భావనను విడిచి పెడితే తప్ప ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం దొరకదు. లాటిన్ అమెరికా మార్క్సిస్టు మేధావి మార్తా హర్నేకర్ మాటల్లో చెప్పాలంటే, కమ్యూనిస్టు మార్క్సిస్టు పార్టీలలో ఉన్నవాళ్లు మాత్రమే వామ పక్షశక్తులు కాదనీ, బయట సామాజిక ఉద్యమాలతో ప్రపంచీకరణను వ్యతిరేకిస్తున్న శక్తులు కూడా వామపక్ష శక్తులేనని ఆమె తేల్చి చెప్పారు. పార్టీ కేడర్లు రాజకీయ వామపక్ష శక్తులైతే, సామాజిక ఉద్యమాలలో పార్టీ బయట ఉన్న వాళ్లు సామాజిక వామపక్ష శక్తులని ఆమె స్పష్టం చేశారు. అందుకే ప్రపంచీకరణ, ఉదారవాద ఆర్థిక విధానాలను ప్రతిఘటించడానికి విశాల ప్రజా ఐక్య సంఘటన అవసరం ఉంది. కనీస కార్యాచరణ ప్రాతిపదికన ప్రారంభమైన వేదికలు ఈ రోజు లాటిన్ అమెరికాలో, గ్రీస్‌లో ఒక నూతన పంథాను ఆవిష్కరించాయి. ప్రజాస్వామ్యం, సమానత్వం, సామాజిక న్యాయం ప్రాతిపదికగా భారతదేశంలో కూడా ఒక విశాల ప్రజా ఐక్య సంఘ టనకు అవకాశం ఉన్నది. దీనికి ఒక ప్రయత్నం జరగాలి. అప్పుడే పేదలను మరింత అగాధంలోకి నెడుతున్న కార్పొరేట్ ఆర్థిక వ్యవస్థకు ముగింపు పలకడం సాధ్యం అవుతుంది. అదేవిధంగా మధ్యతరగతి వర్గానికి ఇబ్బంది కలిగించే ఆస్తి పన్నులను రద్దు చేస్తామని, అవినీతిని అంతమొందించే టాస్క్ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. ప్రపంచీకరణ ఊబిలో కొట్టు కుంటూ, ప్రజాధనాన్ని పెట్టుబడిదారులు, మార్కెట్ శక్తులకు ధారపోస్తున్న యూరప్ గడ్డ మీద గ్రీస్ ఒక ఆశాకిరణంలా ప్రకాశిస్తోంది. లాటిన్ అమెరికాలో ఇప్పటికే పదికిపైగా దేశాల్లో వామపక్ష ఐక్య సంఘ టన ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చాయి. అదే కార్యాచరణను అనుసరించి సఫలీకృతం అయిన గ్రీస్ మరోసారి విశాల ప్రజా ఐక్య సంఘటన విధానాన్ని విజయమార్గంగా రుజువు చేసింది. చివరగా ఒక విషయం ప్రస్తావించాలి. గ్రీస్‌లో విజయం సాధించిన సిరిజ పార్టీ అంతర్జాతీయంగా ఎన్నో సమావేశాల్లో పాల్గొని తమ ఐక్య సంఘ టన విధానాలను వివరించింది. సెంటర్ ఫర్ దళిత స్టడీస్, తెలంగాణ విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో 2014 మార్చి 7 నుంచి 10 వరకు హైదరా బాద్‌లో జరిగిన ‘సోషలిజం ప్రజాస్వామ్యం’ అనే అంతర్జాతీయ సదస్సుకు సిరిజ ప్రతినిధి యానిస్ అలంపైన్ హాజరయ్యారు. ఆ నాలుగు రోజుల్లో ప్రపంచీకరణ దుష్పరిణామాలు, వాటి ప్రత్యామ్నాయాలపై జరిగిన చర్చలో యానిస్ అలంపైన్ తమ దేశ అనుభవాలను వివరించారు. ఆ సదస్సులో పాల్గొనే భారతదేశ ప్రతినిధులకు, ఇతర దేశాల నాయకులకు గ్రీస్ విప్లవ వామపక్ష శక్తుల విజయం ఒక గొప్ప స్ఫూర్తి కావాలి. అదే స్ఫూర్తితో ప్రపం చాన్ని కబళిస్తున్న పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా విశాల ఐక్య ఉద్యమ నిర్మాణానికి మరింత సంఘటితంగా పని చేయాలి. కొత్త కోణం: మల్లెపల్లి లక్ష్మయ్య (వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు, మొబైల్ నం: 9705566213) -
నిమ్స్‌కు సుస్తీ
న్యూరో, యూరో విభాగంలో పేషెంట్ల పడిగాపులు సీటీసర్జరీ, స్పైన్ విభాగాల్లో పని చేయని యంత్రాలు మృత్యువాత పడుతున్న క్షతగాత్రులు, హృద్రోగులు సాక్షి, సిటీబ్యూరో : మహబూబ్‌నగర్‌కు చెందిన ఎ.వెంకటయ్య ప్రమాదవశాత్తూ నిద్రలో మంచంపై నుంచి కింద పడిపోవడంతో వెన్నుపూస దెబ్బతి ంది. చికిత్స కోసం రెండు రోజుల క్రితం నిమ్స్‌కు తీసుకొచ్చారు. ఆస్పత్రిలో సియరమ్ పరికరం పనిచేయడం లేదని, శస్త్రచికిత్స చేయడం కుదరదని వైద్యులు స్పష్టం చేయడంతో మరో ఆస్పత్రికి తరలించాల్సి వచ్చింది. గుండె సంబంధిత సమస్యతో బాధపడుతున్న గుంటూరుకు చెందిన శౌరిని చికిత్స కోసం నిమ్స్‌కు తీసుకొచ్చారు. సీటీ సర్జరీ(కార్డియో థొరాసిక్) విభాగంలో ఛాతీపై కోత కోసే ఓ చిన్న యంత్రం పాడైపోవడంతో సకాలంలో చికిత్స అందక ఆయన ఇటీవల నిమ్స్ ముందే మృతి చెందారు. చిన్నచిన్న వైద్య పరికరాలు పని చేయడం లేదనే సాకుతో ఆపదలో అత్యవసర విభాగానికి చేరుకుంటున్న క్షతగాత్రులకు, హృద్రోగులకు చికిత్సకు నిరాకరిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కోమాలో స్పైన్ విభాగం సుమారు వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఆస్పత్రి అవుట్ పేషంట్ విభాగానికి ప్రతి రోజూ 1500 మంది రోగులు వస్తుంటారు. వీరి లో రోజుకు సగటున 100-150 మంది అడ్మిట్ అవుతుంటారు. మిగతా విభాగాలతో పోలిస్తే, ఆర్థో, న్యూరో సర్జరీ, యూరాలజీ, గుండె జబ్బుల విభాగాలకు రోగుల తాకిడి ఎక్కువ. దెబ్బతిన్న వెన్నుపూస జాయింట్లను సరిచేయాలంటే సియరమ్ అనే వైద ్య పరికరం అవసరం. ఆస్పత్రిలోని ఈ పరికరం నెల రోజుల క్రితం పాడైపోయింది. రిపేరు చేయించే అవకాశం ఉన్నా సంబంధిత విభాగం వైద్యులు పట్టించుకోవడం లేదు. శస్త్రచికిత్స చేసేందుకు అవసరమైన వైద్యపరికరం తమ వద్ద లేదని చెబుతూ రోగులను చేర్చుకోకుండా తిప్పి పంపుతున్నారు. యూరో, న్యూరో సేవల్లో తీవ్ర జాప్యం ఇక తలకు బలమైన గాయాలై ఆస్పత్రికి చేరుకున్న క్షతగాత్రులు, పక్షవాతంతో బాధపడుతున ్న రోగులకు ఆస్పత్రిలో అడ్మిషన్ కూ డా దొరకడం లేదు. న్యూరో సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆరోగ్యశ్రీ రోగులను ప్రైవేటు ఆస్పత్రులు నిరాకరిస్తుండటం తో వీరంతా నిమ్స్‌కు పరుగులు తీస్తున్నారు. ప్రస్తుతం న్యూరో సర్జరీ విభాగంలో సర్జరీ చేయించుకోవాలంటే నెల రోజులు ఆగాల్సి వస్తోంది. హృద్రోగులకు సర్జరీ చేసే సీటీ విభాగంలో ఛాతీపై కోత కోసే మిషన్ పనిచేయక పోవడంతో శస్త్రచికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. సకాలంలో సర్జరీ చేయక పోవడంతో హృద్రోగంతో బాధపడుతున్న వారు ఆస్పత్రిలోనే మృత్యువాత పడుతున్నారు. ఇక యూరాలజీ విభాగాలో రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యుల్లేక పోవడంతో చికిత్సల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. దీనికి తోడు ఇక్కడ రోగులకు పడకలు కూడా దొరకడం లేదు. -
చాలా కరెన్సీలతోనూ ‘బ్రేక్’ డ్యాన్సే!
న్యూఢిల్లీ: రూపాయి విలువ ఒక్క డాలరుతో మాత్రమే పాతాళానికి జారుకుంటూ రికార్డులు బ్రేక్ చేస్తోందంటే పొరపాటే. ప్రపంచంలోని ఇతర ప్రధాన కరెన్సీలన్నింటితో కూడా రూపాయి తుక్కుతుక్కు అవుతోంది. బ్రిటిష్ పౌండ్, యూరో, స్విస్ ఫ్రాంక్‌లతో పోలిస్తే అత్యంత ఘోరంగా కుప్పకూలింది. పౌండ్తో దేశీ కరెన్సీ 100 స్థాయిని ఇప్పటికే అధిగమించగా.. బుధవారం 106 దిగువకు పడిపోయి కొత్త ఆల్‌టైమ్ కనిష్టానికి జారిపోయింది. యూరోతో 92, స్విస్ ఫ్రాంక్‌తో 75, కెనడా డాలర్‌తో 65, ఆస్ట్రేలియన్ డాలర్‌తో 60 కిందికి క్షీణించాయి. ఇంకా చాలా దేశాలన్నింటి కరెన్సీలు కూడా రూపాయిని ‘బ్రేక్’ డ్యాన్స్ ఆడిస్తున్నాయి. కువైట్ దినార్‌తో 240, బహ్రయిన్ దినార్‌తో 180, ఒమాన్ రియాల్‌తో 175 దిగువకు రూపాయి విలువ పడిపోయింది. విదేశీ పెట్టుబడుల తిరోగమనం, ఆర్థిక వ్యవస్థ తీవ్ర మందగమనం రూపాయిని దెబ్బకొడుతూవస్తున్నాయి. వీటితో బలపడిందండోయ్... రూపాయి విలువ ఇతర దేశాల కరెన్సీలతో కుప్పకూలుతుంటే.. కొన్ని దేశాలతో పోలిస్తే మాత్రం బలపడింది. అయితే, ఇవన్నీ అనామక దేశాలే! రూపాయి పుంజుకున్న జాబితాలో పనామా, టాంగో, సురినాం, తజికిస్థాన్, సాల్మన్ ఐలాండ్స్, సాల్వడార్, హైతి, కిర్గిస్థాన్, లైబీరియా, సిరియా, కాంగో, సోమాలియా, సియర్రా లియోన్ వంటివి ఉన్నాయి. ప్రపంచంలో 8 దేశాల కరెన్సీలతో పోలిస్తే రూపాయి విలువ 100 కిందకి పడిపోయింది. యూరో, జోర్డాన్ దినార్లతో 90 కిందికి జారింది. ఇక 50 దేశాల కరెన్సీలతో రూపాయి విలువ 50 దిగువకు క్షీణించడం గమనార్హం. రూపాయితో పోలిస్తే అధిక మారకం విలువ గల దేశాలు ప్రపంచంలో 100కు పైగానే ఉన్నాయి.