ప్రిక్వార్టర్లో స్పెయిన్ | Spain cruise to last-16 with Turkey win | Sakshi
Sakshi News home page

ప్రిక్వార్టర్లో స్పెయిన్

Published Sat, Jun 18 2016 6:44 PM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM

Spain cruise to last-16 with Turkey win

నైస్(ఫ్రాన్స్):యూరో కప్లో  డిఫెండింగ్ చాంపియన్ స్పెయిన్ ప్రిక్వార్టర్లోకి ప్రవేశించింది.  గ్రూప్-డిలో జరిగిన మ్యాచ్లో స్పెయిన్ 3-0 తేడాతో టర్కీని ఓడించి ప్రిక్వార్టర్స్కు చేరింది. స్పెయిన్ ఆటగాళ్లలో అల్వారో రెండు గోల్స్ తో, నిలోటి ఒక గోల్ నమోదు చేసి జట్టు సంపూర్ణ విజయంలో సహకరించారు. హ్యాట్రిక్ టైటిల్ పై ఆశపెట్టుకున్న స్పెయిన్ అంచనాలకు తగ్గట్టు రాణించి ప్రిక్వార్టర్స్ చేరింది.

మంగళవారం క్రొయేషియాతో జరిగే స్పెయిన్ తన ఆఖరి లీగ్ మ్యాచ్ను డ్రా చేసుకున్నా గ్రూప్-టాపర్ గా నిలుస్తుంది. మరోవైపు టర్కీ తన చివరి లీగ్ మ్యాచ్ లో చెక్ రికపబ్లిక్ పై గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement