ప్రధాని రాజీనామా దెబ్బ: 20ఏళ్ల కనిష్టానికి యూరో | Euro Hits Near 20-yr Low After Italian PM Renzi Loses Reform Referendum | Sakshi
Sakshi News home page

ప్రధాని రాజీనామా దెబ్బ: 20ఏళ్ల కనిష్టానికి యూరో

Published Mon, Dec 5 2016 9:29 AM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM

ప్రధాని రాజీనామా దెబ్బ: 20ఏళ్ల కనిష్టానికి యూరో

ప్రధాని రాజీనామా దెబ్బ: 20ఏళ్ల కనిష్టానికి యూరో

రోమ్‌ : ఇటలీలో  నెలకొన్న రాజ్యాంగ సంక్షోభం దేశ కరెన్సీపై భారీగా పడింది.  ఇటలీ రాజ్యాంగ సవరణలపై  రెఫరండం వైఫల్యం నేపథ్యంలో  యూరో భారీగా పతనమైంది. దాదాపు20 సం.రాల కనిష్టానికి చేరింది. ఇటలీ ప్రధాన మంత్రి మాటియో రెంజి  రాజీనామా  చేయనున్నట్టు ప్రకటించిన అనంతరం  ఈ పతనం నమోదైంది.

ప్రధాని మాటియో రెంజీ ప్రతిపాదించిన రాజ్యాంగ సంస్కరణలకు వ్యతిరేకంగా ఇటలీ పార్లమెంట్‌ ఓటు వేసింది. దీంతో  ప్రధాని రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించడంతో  రాజకీయ సంక్షోభం తలెత్తింది.   డాలరుతో మారకంలో యూరో 20 ఏళ్ల కనిష్టం 1.05ను తాకింది. ఇప్పటికే యూరోజోన్‌ నుంచి వైదొలగేందుకు బ్రిటన్‌ నిర్ణయించుకున్న(బ్రెగ్జిట్‌) సంగతి తెలిసిందే.  ఈ పరిణామాలపై మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. యూరోజోన్‌ ముక్కలయ్యే పరిస్థితులు నెలకొంటున్నట్లు ఆర్థికవేత్తలు వ్యాఖ్యానిస్తున్నారు.  
అటు న్యూ జిలాండ్  ప్రధాని జాన్ కీ  అనూహ్య రాజీనామా ప్రభావం  అక్కడి మార్కెట్లపై పడింది. డాలర్ మాకరపు విలువలో    న్యూజిలాండ్ కరెన్సీ  0.8 శాతం క్షీణించింది. సూచీలు దాదాపు 0.6 శాతం తక్కువ నష్టపోయాయి.  రాజకీయాలనుంచి తప్పుకోడానికి ఇది సరైన సమయమని  జాన్ వ్యాఖ్యానించారు.
  కాగా  డెమోక్రటిక్‌ పార్టీ ప్రధాని మాటెవో రెంజీ తలపెట్టిన రిఫరెండానికి ప్రజలు వ్యతిరేకించారు. లక్షలమంది కార్మికులు, ప్రజలు  రెఫరండానికి వ్యతిరేకంగా గతంలో ఆందోళన చేపట్టారు. మరోవైపు ఈ సంస్కరణలను  అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా, రోమ్‌లో అమెరికా రాయబారి బహిరంగంగానే సమర్ధించారు. ఒకవేళ సంస్కరణలకు 'నో' చెబితే పెట్టుబడులను నిలిపివేస్తామని బెదిరించిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement