ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు వారి నికర ఆదాయాలను, నష్టాలను, ప్రతి ఆర్థిక సంవత్సరం ఆయా త్రైమాసికాల్లో ప్రకటిస్తాయి. క్యూ1, క్యూ 2, క్యూ 3, క్యూ 4 ఫలితాల పేరిట కంపెనీలు ఆయా ఆర్థిక సంవత్సరంలో ఏంతమేర లాభనష్టాలను ప్రదర్శించాయనే విషయాన్ని బహిరంగంగానే విడుదల చేస్తాయి.
కంపెనీల సంపాదన డేటా ఖచ్చితంగా రహస్యం కానప్పటికీ, దాదాపు అన్ని కంపెనీలు తమ విక్రయాలు , ఆదాయ గణాంకాలను కనీసం ప్రతి త్రైమాసికంలో, నెలవారీగా ప్రకటిస్తారు. కాగా ఆయా కంపెనీలు 3 నెలలకొకసారి మాత్రమే ఆదాయ గణంకాలను రిలీజ్ చేస్తాయి. కానీ ఏ ఒక్క కంపెనీ కూడా సెకనుకు లేదా నిమిషానికి లేదా గంటకు వచ్చే సంపాదన గురించి మాత్రం చెప్పవు. ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ కంపెనీలు గణనీయంగానే ఆర్జిస్తున్నాయి. ప్రపంచంలోని రెండో అతి పెద్ద ఆటోమొబైల్ దిగ్గజం టయోటా ఒక సెకనుకు ఎంతమేర ఆర్జిస్తుందనే విషయాన్ని తెలుసుకుందాం...!
చదవండి: నెలకు లక్షల్లో జీతాలు.. నెలాఖరుకు జేబులు ఖాళీ!
టెస్లా కంటే..టయోటానే నంబర్ వన్..!
టయోటా ఒక సెకనుకు సంపాదన విషయంలో తొలిస్థానంలో నిలుస్తోంది. జపాన్ ఆటోమేకర్ టయోటా ప్రతి సెకనుకు సుమారు 8,731 డాలర్లు(రూ. 6,48,490) మేర ఆర్జిస్తుంది. టయోటా నిమిషానికి 523,889 డాలర్లను , గంటకు 31.4 మిలియన్ డాలర్లను, ఏడాదిగాను 275 బిలియన్ డాలర్లను ఆర్జిస్తోంది. ప్రపంచంలో అతి పెద్ద కార్ల బ్రాండ్‌గా నిలుస్తోన్న ఫోక్స్‌వ్యాగన్ కంటే టయోటా ఎక్కువగా సంపాదిస్తోంది. ఫోక్స్‌వ్యాగన్ ప్రతి సెకనుకు 8,073 డాలర్లను సంపాదిస్తుంది.
మూడో స్ధానంలో మెర్సిడిజ్ బెంజ్ నిలుస్తోంది. మెర్సిడెజ్ బెంజ్ కంపెనీ ఒక సెకనుకు 5,589 డాలర్లను వెనకేసుకుంటుంది. తరువాతి స్థానాల్లో హోండా, మిత్సుబిషి , ఫోర్డ్, జనరల్ మోటార్స్, బీఎమ్‌డబ్ల్యూ, స్టెల్లాంటిస్ సంస్థలు నిలుస్తున్నాయి. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే...ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమేకర్‌లలో ఒకటిగా సుజుకీ ఉన్నప్పటికీ టాప్ టెన్‌లో స్థానంలో లేదు. దాంతోపాటుగా ఈవీ రంగంలో తరచుగా హెడ్‌లైన్ మేకర్‌గా నిలిచే టెస్లా కూడా టాప్ టెన్ లిస్ట్‌లో లేదు. నివేదిక ప్రకారం.. టాప్ టెన్ ఆటోమొబైల్ బ్రాండ్‌లలో భారతీయ వాహన తయారీదారులు ఎవరూ లేరు.
చదవండి: Demand For Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలపై క్రేజ్ మరి ఇంతగా ఉందా...!
Comments
Please login to add a commentAdd a comment