టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది.. | Pig Chases Greek TV Reporter In Live | Sakshi
Sakshi News home page

టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది..

Published Thu, Nov 28 2019 6:26 PM | Last Updated on Thu, Nov 28 2019 6:26 PM

Pig Chases Greek TV Reporter In Live - Sakshi

లైవ్‌ టీవీ రిపోర్టింగ్‌ చేసే జర్నలిస్ట్‌లకు కొన్నిసార్లు అనుహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా గ్రీక్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఏఎన్‌టీ1 టీవీకి చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్‌ కైనెటా నగరంలో వరద నష్టంపై రిపోర్ట్‌ చేస్తున్నాడు. అయితే అతను రిపోర్టింగ్‌ చేస్తున్న సమయంలో ఓ పంది అతని వద్దకు వచ్చింది. అయితే దాని నుంచి తప్పించుకుని రిపోర్ట్‌ చేద్దామని చూసిన అది అతన్ని వెంబడించింది. 

ఆ సమయంలో స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్‌ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కోరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఇది అంతా చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో లైవ్‌ రిపోర్టింగ్‌ చేస్తున్న మహిళా రిపోర్టలతో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement