TV reporter
-
సాక్షి టీవీ రిపోర్టర్‌పై టీడీపీ కార్యకర్తల దాడి
విశాఖపట్నం: ఆర్.కె.బీచ్‌లో మంగళవారం రాత్రి జరిగిన చంద్రబాబునాయుడు సభ కవరేజీకి వెళ్లిన ఆరిలోవ జోన్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్ సురేష్‌పై టీడీపీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడి చేశారు. సుమారు 30 మంది వరకు దుర్భాషలాడుతూ సురేష్ సెల్‌ఫోన్ లాక్కొని.. పిడిగుద్దులు గుద్దుతూ బయటకు నెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు వారించినా వినకుండా పెట్రేగిపోయారు. ఈ దాడిపై మూడో పట్టణ పోలీస్‌స్టేషన్ సీఐ కోరాడ రామారావుకు జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. టీడీపీ గుండాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
టీవీ రిపోర్టర్‌నంటూ మహిళపై లైంగికదాడి.. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి..
పెందుర్తి(విశాఖపట్నం): తనపై లైంగిక దాడికి పాల్పడడంతోపాటు బీరువాలో ఉన్న నగదు, నగలు పట్టుకుని ఓ వ్యక్తి పరారైనట్లు ఓ మహిళ పెందుర్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలివి.. భాస్కర్ల లక్ష్మి సుజాతనగర్ సీ- 2 జోన్లో నివసిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ టీవీ చానల్ రిపోర్టర్ కుమార్‌ని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు. చదవండి: ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని.. లక్ష్మి గతంలో చేసిన వ్యభిచార వృత్తి, ఇతరత్రా వ్యవహారాలపై బ్లాక్మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి టీవీ చానళ్లకు ఇస్తానని బెదిరించాడు. అంతేకాకుండా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై దాడికి పాల్పడి బీరువా అల్మరాలో ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రూ.5 వేల నగదు అపహరించుకుపోయాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. -
ఓ టీవీ రిపోర్టర్ ను వెంటపడి మరీ కొట్టిన ఐఏఎస్ అధికారి: యూపీ
-
ఐఏఎస్ ఆఫీసర్ దౌర్జన్యం.. రిపోర్టర్ వెంటపడి మరీ దాడి
UP Block Panchayat Chief Elections స్థానిక సంస్థల ఎన్నికలు దాడుల పర్వంగా మారిపోయాయి. ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్‌లో వరుస దాడుల ఘటనలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతున్నాయి. ఎలక్షన్ విధుల్లో ఉన్న ఓ పోలీస్ అధికారి తనను బీజేపీ కార్యకర్తలు కొట్టాడనే ఫిర్యాదు చేయగా.. మరో ఘటనలో ఐఏఎస్ అధికారి ఓ టీవీ రిపోర్ట్‌ను వెంటపడి మరీ బాదాడు. ఆ ఘటనా వీడియో సర్క్యూలేట్ అవుతోంది. లక్నో: మియాగంజ్‌లో శనివారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఉన్నావ్ ఛీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్(సీడీవో) అయిన దివ్యాన్షు పటేల్.. ఓ టీవీ రిప్టోరన్‌ను వెంటపడి మరీ కొట్టాడు. సెల్‌ఫోన్‌తో షూట్ చేస్తుండగా తన అధికార జులుం ప్రదర్శించాడు. దివ్యాన్షు వెంట ఉన్న బీజేపీ కార్యకర్తలు కూడా అతనిపై తలా ఓ చెయ్యి వేశారు. ఇది గమనించిన పోలీసులు ఆ నేతలను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఓటింగ్‌లో పాల్గొనకుండా లోకల్ కౌన్సిల్ సభ్యులను కొందరిని కిడ్నాప్ చేశారని, ఆ వ్యవహారంలో దివ్యాన్షు ప్రమేయం ఉందని, ఆ ఘటనను వీడియో తీసినందుకే తనపై దివ్యాన్షు దాడి చేశాడని బాధితుడు కృష్ణ తివారీ ఆరోపిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఘటనపై స్పందించేందుకు దివ్యాన్షు నిరాకరించగా.. ఈ వ్యవహారంపై ఉన్నావ్ కలెక్టర్ స్పందించారు. జర్నలిస్ట్‌తో మాట్లాడానని, అతని నుంచి ఫిర్యాదును స్వీకరించానని, పారదర్శకంగా దర్యాప్తు జరిపిస్తానని ఉన్నావ్ జిల్లా మెజిస్రే్టట్ రవీంద్ర కుమార్ హామీ ఇచ్చారు. కాగా, యూపీ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు చాలానే జరిగినట్లు ప్రతిపక్షాల నుంచి ఫిర్యాదులు అందుతుండగా, మిత్రపక్షాలతో కలిసి 635 పంచాయితీ చీఫ్ స్థానాలు గెల్చుకున్న బీజేపీ ఈ విజయాన్ని ‘చరిత్రాత్మక విజయం’గా అభివర్ణించుకుంటోంది. भाजपा के MLA और ज़िलाध्यक्ष बम लेकर पुलिस वालों पर हमला कर रहे हैं ! ये है भाजपा के गुंडो का असली चेहरा ! #यूपी_में_गुंडाराज #नहीं_चाहिए_भाजपा pic.twitter.com/l4yg5Gcc0Z — Anshuman Singh. (@AnshumanSP) July 10, 2021 -
రిపోర్టర్ లైవ్ చేస్తుండగా.. గన్‌తో బెదిరించి దోపిడి
క్విటో: రిపోర్టర్ లైవ్ ఇస్తుండగా, ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీ చేసిన ఘటన ఈక్వెడార్‌లో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం..ఈనెల 12న ఈక్వెడార్‌లోని ఓ ఫుట్‌బాల్ స్టేడియం వద్ద మ్యాచ్‌కు సంబంధించి డైరెక్టివి స్పోర్ట్స్ చానల్‌కు చెందిన జర్నలిస్ట్ డియెగో ఆర్డినోలా లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. అదే సమయంలో అక్కడికి వచ్చిన దుండగుడు రిపోర్టర్‌తో పాటు సిబ్బందిని తుపాకీతో బెదిరించి వారి వద్ద ఉన్న ఫోన్లు,డబ్బు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దీంతో భయపడిపోయిన సిబ్బంది ఒకరు తన వద్ద ఉన్న వస్తువులను ఇచ్చేయడంతో, అవి తీసుకొని దుండగుడు, అతని స్నేహితుని బైక్‌పై పరారయ్యాడు. అయితే ఇదంతా పట్టపగలే అది కూడా లైవ్‌లో జరగడం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ డియోగో తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పలువురు నెటిజన్లు జర్నలిస్ట్‌తో సహా సిబ్బందికి తమ మద్దతును తెలుపుతున్నారు. ఇక దుండగుడు ముఖం గుర్తుపట్టకుండా ఉండేందుకు మాస్క్, తలపై టోపీని ధరించాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి : (నగ్నంగా ఏనుగెక్కిన మోడల్!) (Shweta Memes: ఎందుకింతలా ట్రెండవుతోంది!) Ni siquiera podemos trabajar tranquilos, esto ocurrió a las 13:00 de hoy en las afueras del Estadio Monumental. La @PoliciaEcuador se comprometió a dar con estos delincuentes. #Inseguridad pic.twitter.com/OE2KybP0Od — Diego Ordinola (@Diegordinola) February 12, 2021 -
చెన్నై: యువ జర్నలిస్టు దారుణ హత్య
-
టీవీ రిపోర్టర్ దారుణ హత్య
చెన్నై: అక్రమాలను ప్రశ్నించినందుకు ఓ యువ జర్నలిస్టును కొందరు దుండగులు దారుణంగా హతమార్చారు. తమిళనాడులోని కాంచీపురం జిల్లాలోని కుండ్రత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వ పోరంబోకు భూమిని అక్రమంగా అమ్ముతున్న కొందరికి వ్యతిరేకంగా మోజెస్ (26) కొంతకాలంగా వార్తలు రాస్తుండటమే ఈ హత్యకు కారణంగా తెలిసింది. ప్రభుత్వ భూమిని అమ్మి సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు గతంలో పలుమార్లు మోజెస్‌ను బెదిరించారు. తమ దారికి అడ్డు రావొద్దన్ని హెచ్చరించారు. ఈక్రమంలోనే ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మోజెస్‌ను ఇంటి నుంచి రప్పించిన దుండగులు అతన్ని కత్తులతో నరికి చంపేశారు. అతని శరీరంపై 18 కత్తి పోట్లు ఉన్నాయని వైద్యులు తెలిపారు. జర్నలిస్టు హత్య కేసులో ఇప్పటివరకు నలుగురిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు వెల్లడించారు. మోజెస్ స్థానికంగా ఓ తమిళ టీవీలో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతని తండ్రి కూడా జర్నలిస్టు కావడం విశేషం. -
ఏమో సార్.. చూడలేదు!
ఇదేమీ హాస్యంగా స్వీకరించవలసిన సంగతి కాదు. దేవుడు ఒకరికి ఒకరు అర్థం కాకుండా టీవీ రిపోర్టర్ లను, సామాన్యులను ఒకే చోట పుట్టించి ఈ లోకాన్ని అర్ధవంతం చేసేందుకు ఎందుకు ప్రయత్నిస్తాడో తాత్వికంగా తర్కించవలసిన బిహార్ ఎన్నికల ‘బైట్’! ఆ రాష్ట్రంలో అక్టోబర్ 8, నవంబర్ 3 తేదీలలో పోలింగ్ జరిగింది. ఈ రోజు చివరిదైన మూడో విడత పోలింగ్ జరుగుతోంది. నాయకులు కూల్‌గా ఉన్నారు. ఓటర్లను కూల్‌గా ఉంచుతున్నారు. మీడియా వాళ్లే.. తమ కర్తవ్యాన్ని నిర్వహణలో భాగంగా శీతలం నుంచి ఉష్ణాన్ని పుట్టించే పనిలో ఉన్నారు. మొన్న ఒకనాడు ’బిహార్ తక్’ అనే ఒక లోకల్ టీవీ ఛానెల్ రిపోర్టర్ ముఖానికి మాస్క్ వేసుకుని గన్ మైక్ పట్టుకుని ఓటర్ల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఓ పెద్దాయన దగ్గర వెళ్లి ఆయన ముఖం మీద మైక్ పెట్టాడు. ‘పెద్దాయనా పెద్దాయనా.. క్యా ఆప్ కే గావ్ మే వికాస్ పహుంచా హై’ అని అడిగాడు. ‘అభివృద్ధి మీ ఊరిదాకా వచ్చిందా?’ అని. వికాస్ అంటే అభివృద్ధి. పెద్దాయన కళ్లద్దాలలోంచి రిపోర్టర్ ప్రశ్నను విన్నాడు. ‘అభివృద్ధా! ఏమో సర్. అప్పుడు నేనిక్కడ లేను. జ్వరమొచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్లా..‘ అని చెప్పాడు. ఈ వీడియో ఇప్పుడు దేశమంతటా వైరల్ అవుతోంది. వికాస్ ఎక్కడున్నాడో తెలిసిందా? వికాస్ గురించి ఏమైనా తెలిసిందా? ఎవరు వికాస్? ఎవరి వికాస్ అని మీమ్స్ వస్తున్నాయి. పెద్దాయన అమాయకంగా చెప్పినా ఉన్న విషయమే చెప్పాడని కొందరు ట్వీట్లతో చప్పట్లు, ఈలలు కొట్టారు. దేవుడు ఒకరికొకరు అర్ధంకాకుండా రిపోర్టర్ లను, ఓటర్లను పుట్టిస్తాడని మన అజ్ఞానాంధకారం కొద్దీ అనుకున్నా ఎన్నికల టైమ్ లో అందరికీ అన్నీ అర్థం చేయిస్తాడు గావును! -
వర్క్ ఫ్రం హోం చేయడం చాలా కష్టం
-
లైవ్‌లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్
-
లైవ్‌లో రచ్చరచ్చ చేసిన రిపోర్టర్
అందరికీ వార్తలను చేరవేసే ఓ జర్నలిస్టు అత్యుత్సాహంతో తప్పులో కాలేసింది. కానీ దానివల్ల ఆమెకు మాత్రమే నష్టం జరిగింది. లాటరీ గెలుచుకున్నానంటూ లైవ్‌లోనే నానా హడావుడి చేసి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతింది. ఇంతకీ ఏం జరిగిందంటే... క్రిస్మస్ పండగ సందర్భంగా లాటరీ నిర్వాహకులు లక్కీడ్రా తీస్తున్నారు. ఈ కార్యక్రమాన్నంతటినీ స్పానిష్ టీవీ రిపోర్టర్ నటాలియా ఈక్యుడెరో లైవ్‌లో వివరిస్తూ వచ్చింది. అయితే లాటరీ గెల్చుకున్నవారిలో ఆమె పేరు కూడా ఉండటంతో ఎగిరి గంతేసింది. తాను రేపటి నుంచి ఉద్యోగానికి రావడం లేదోచ్ అంటూ లైవ్‌లోనే రచ్చరచ్చ చేసింది. ఈ జాక్పాట్లో సుమారు నాలుగు మిలియన్ల డబ్బు అందుతుందనుకుని గాల్లో మేడలు కట్టేసింది. కానీ, తర్వాత అసలు విషయం తెలిశాక ఆమె ఆనందమంతా ఒక్క క్షణంలో ఆవిరైపోయింది. కేవలం రూ.3 లక్షలు మాత్రమే గెల్చుకుందని తెలియడంతో ఆమె ఉత్సాహమంతా నీరుగారిపోయింది. దీంతో తన తప్పు తెలుసుకున్న రిపోర్టర్ ట్విటర్లో క్షమాపణలు తెలిపింది. ‘అతిగా ఆశ పడితే ఫలితం ఇలాగే ఉంటుంది’ అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
టీవీ రిపోర్టర్‌ను వెంటాడిన పంది..
లైవ్ టీవీ రిపోర్టింగ్ చేసే జర్నలిస్ట్‌లకు కొన్నిసార్లు అనుహ్య పరిణామాలు ఎదుర్కొవాల్సి వస్తుంది. తాజాగా గ్రీక్‌కు చెందిన ఓ రిపోర్టర్‌కు వింత అనుభవం ఎదురైంది. ఇటీవల ఏఎన్‌టీ1 టీవీకి చెందిన మాంటికోస్ అనే రిపోర్టర్ కైనెటా నగరంలో వరద నష్టంపై రిపోర్ట్ చేస్తున్నాడు. అయితే అతను రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో ఓ పంది అతని వద్దకు వచ్చింది. అయితే దాని నుంచి తప్పించుకుని రిపోర్ట్ చేద్దామని చూసిన అది అతన్ని వెంబడించింది. ఆ సమయంలో స్టూడియోలో ఉన్న జర్నలిస్టులతో మాంటికోస్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఓ పంది మమ్మల్ని ఉదయం నుంచి వెంబడిస్తుంది. పంది నన్ను కోరకాడానికి ప్రయత్నిస్తుంది.. అందుకే ఇక్కడ నిల్చోలేకపోతున్నాను. నన్ను క్షమించండి’ అని పేర్కొన్నాడు. ఇది అంతా చూస్తున్న స్టూడియోలోని జర్నలిస్టులు తమ నవ్వును ఆపుకోలేకపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా, గతంలో లైవ్ రిపోర్టింగ్ చేస్తున్న మహిళా రిపోర్టలతో కొందరు వ్యక్తులు అసభ్యకరంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. Greek journo pestered by a pig while reporting on the recent floods in #Kinetta #Greece #tv #bloopers #ant1tv #Ant1news pic.twitter.com/vsLBdlWCMB — Kostas Kallergis (@KallergisK) November 26, 2019 -
లైవ్‌లో రిపోర్టర్‌కి ముద్దుపెట్టాడు తర్వాత..
వాషింగ్టన్ : లైవ్ రిపోర్ట్ చేస్తున్న ఓ పాత్రికేయురాలికి ముద్దుపెట్టి వేధింపులకు గురి చేశాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బౌర్బన్ అండ్ బియాండ్ మ్యూజిక్ పెస్టివల్ సందర్భంగా వెవ్3 న్యూస్ ఛానెల్‌కు చెందిన పాత్రికేయురాలు సారా రివెస్ట్ కెంటుకీలో లైవ్ రిపోర్ట్ అందిస్తున్నారు. సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశంపై రోడ్డుపై నిలబడి లైవ్ రిపోర్ట్ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సారా చూట్టూ అనుమానస్పదంగా తిరిగాడు. అయినప్పటికీ సారా అతన్ని పట్టించుకోకుండా డెస్క్‌లో ఉన్న యాంకర్‌కు వార్తను వివరిస్తున్నారు. ఇంతలో ఆ ఆగంతకుడు ఒక్కసారిగా సారా దగ్గరకు వచ్చి బుగ్గపై ముద్దుపెట్టి పరారయ్యాడు. దీంతో సారా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ వార్తను వివరించడం ఆపేయలేదు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆగంతకునిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైవ్‌లో ముద్దుపెట్టిన వ్యక్తిని ఎరిక్ గుడ్మ్యాన్గా గుర్తించి అరెస్ట్ చేశారు. కాగా, తను చేసిన తప్పు పట్ల ఎరిక్ గుడ్‌మ్యాన్ క్షమాపణలు కోరారు. ఈమేరకు సారాకు ఓ లేఖ రాశాడు. తాను ముద్దు పెట్టడం తప్పని, తనను క్షమించాలని కోరారు. ఈ లేఖను సారా.. వెవ్3 న్యూస్ ఛానెల్లో చదివి వినిపించారు. అతనిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటానని, కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ముద్దు పెట్టిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. -
గుండెపోటుతో సాక్షి టీవీ రిపోర్టర్ మృతి
చెన్నూర్: చెన్నూర్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్, చెన్నూర్ పట్టణంలోని జగన్నాథాలయం వీధికి చెందిన కోరకోప్పుల శ్రీనివాస్‌గౌడ్(37) శనివారం తెల్లవారుజా మున గుండెపోటుతో మృతిచెందారు. శ్రీనివాస్ మృతి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అనిల్‌కుమార్, చెన్నూర్, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్, భీమారం మండలాల వివిధ దినపత్రికల, టీవీ రిపోర్టర్లు, మిత్ర బృందం, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య సుమలత, కుమారుడు బన్నీ(2) ఉన్నారు. -
సీఎం పర్యటనలో టీవీ కెమెరామెన్‌కు గుండె పోటు
బొబ్బిలి: సీఎం పర్యటనలో భాగంగా పట్టణంలో హెలీపాడ్ నుంచి వస్తున్న విలేకర్ల బృందంలోని ఓ టీవీ కెమెరామెన్ సూర్యప్రకాష్‌కు శుక్రవారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విలేకర్లు కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్‌ను ఇవ్వమని కోరగా సీఎం కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్ ఇవ్వకూడదని, బాడంగి లేదా బొబ్బిలి ఆసుపత్రులకు ఫోను చేస్తే అంబులెన్స్ వస్తుందని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉత్పన్నమయింది. అయితే అక్కడి నుంచి డీసీహెచ్ఎస్ ఉషశ్రీ చర్యలు తీసుకోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగలిగారు. బొబ్బిలి ఆసుపత్రిలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బొబ్బిలి ఆసుపత్రిలో ఫిజిషియన్ లేకపోవడంతో పాటు జనరేటర్ సదుపాయం కూడా లేదు. దీంతో కెమెరామెన్‌ను కాపాడుకునేందుకు పలు అవస్థలు పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని సహచర మీడియా ప్రతినిధులు తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో రెండు, సభ దగ్గర కొన్ని అంబులెన్స్‌లు ఉన్నా గుండెపోటు వచ్చిన వారికి మాత్రం అంబులెన్స్‌లు ఇవ్వని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. -
గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
ఒకరు బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే మరొకరు సాఫ్ట్వేర్ జాబ్ చేస్తారు. వీళ్లతో పాటు ఓ కాలేజ్ స్టూడెంట్, టీవీ రిపోర్టర్, హౌస్‌వైఫ్... ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. ఓ అనూహ్య ఘటన ఈ ఐదుగురి జీవితాలను తారుమారు చేస్తుంది. ఆ ఘటన ఏంటి? అనే చిన్న లైన్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ ‘100 డిగ్రీ సెల్సియస్’. ఇప్పుడీ సినిమా తమిళంలో రీమేక్ కానుంది. ఇందులో ఓ పాత్రకు శ్రీయను తీసుకోవాలని దర్శకుడు మిత్రన్ జవహర్ ప్రయత్నిస్తున్నారు. ఆమెకు కథ వినిపించారు. కథ నచ్చిందని చెప్పిన శ్రీయ, ఇంకా సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం శ్రీయ చేతిలో ఉన్న సినిమాల చిత్రీకరణలు త్వరలోనే పూర్తవుతాయి. అందువల్ల, ఈ సినిమాకు సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొత్తం ఐదుగురు నాయికలు ఉంటారు. రాయ్ లక్ష్మి, నికిషా పటేల్‌లను ఎంపిక చేశారు. శ్రీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మిగతా ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాలి. మరి.. శియను ఏ పాత్రకు ఎంపిక చేశారనేది దర్శకుడు బయటపెట్టలేదు. -
'సన్నీ ఎవర్నీ కొట్టలేదు'
హోలీ కార్యక్రమం కోసం వెళ్లిన మాజీ పోర్న్ స్టార్ సన్నీలియోన్ అక్కడ ఓ జర్నలిస్టును చెంపదెబ్బ కొట్టిందని వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని ఆమె భర్త డేనియల్ వెబర్ అంటున్నాడు. నేటి మధ్యాహ్నం తన భార్యపై వచ్చిన కథనాలపై తీవ్రంగా మండిపడ్డాడు. గతంలో మీరు పోర్న్ స్టార్.. ఇప్పుడు మీరు హీరోయిన్ అయిపోయారు కదా, మరి రాత్రి కార్యక్రమాలకు ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారని అడగడంతో పట్టలేని కోపం వచ్చిన సన్నీ వెంటనే టీవీ రిపోర్టర్ ను చెంపమీద కొట్టిందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. టీవీ రిపోర్టర్ కు తన భార్య సరైన సమాధానం ఇచ్చిందని, కానీ అతడిని కొట్టిందని అనడంలో నిజం లేదని కొట్టిపారేశాడు వెబర్. ఆ జర్నలిస్టుపై మేం ఫిర్యాదు కూడా చేయలేదని చెప్పాడు. 'సన్నీలియోన్‌తో హోలీ' అనే ఈ కార్యక్రమ నిర్వాహకులలో కాలేజీ విద్యార్థులు ఉన్నారని వారి కెరీర్ కు ఆటంకం కలుగుతుందని భావించి వెనక్కి తగ్గామని సన్నీ లియోన్ భర్త వివరించాడు. ఈవెంట్ కు వెళ్లి, కార్యక్రమం ముగించుకుని వచ్చేశాం.. అక్కడ అంతకు మించి ఏం జరగలేదన్నాడు. ఇన్ని విషయాలు చెప్పుకొచ్చిన వెబర్ అసలు ఆ సమయంలో అక్కడ జర్నలిస్టులే లేరని చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు. -
సెన్సార్ కష్టాలు
ఒక యథార్థ సంఘటన ఇతివృత్తంతో చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎదురయ్యే సమస్య లేమిటన్నదిపోర్కళత్తిల్ ఒరుపూ చిత్ర నిర్మాతలకు అర్థమై ఉంటుంది. తమిళులను ఊచకోత కోసిన శ్రీలంకలో ఒక తమిళ ఆడపడుచును ఘోరాతి ఘోరంగా హింసించి హతమార్చిన సంఘటనకు సినిమా రూపం ఇస్తే ఆ చిత్రంపై సెన్సార్ సభ్యులు మండిపడుతున్న విషయం నిర్మాతను ఆవేదనకు గురిచేస్తోంది. వివరాలో ్లకెళితే.. శ్రీలంకలో జరిగిన యుద్ధంలో ఎల్టీటీఈ తరపు సమాచారాన్ని అందించే ఒక టీవీ విలేకరి ఇసైప్రియ. ఈమెను శ్రీలంక సైనికులు హత్య చేసిన ఇతి వృతంతో తెరకెక్కిన తమిళ చిత్రం పోర్కళత్తిల్ ఒరు పూ. ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు. దీంతో చిత్ర విడుదల ప్రశ్నార్థకంగా మారింది. గురునాథ్సల్సాని నిర్మించిన చిత్రం పోర్కళత్తిల్ ఒరు పూ. నాగినీడు, ప్రియ, సుభాష్ చంద్రబోస్, కృపావిశ్వనాథన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కే గణేశన్ దర్శకుడు. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకణ గురించి దర్శకుడు వివరిస్తూ.. చిత్రం చూసిన సెన్సార్ బృందం సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిచ్చామన్నారు. అయినా సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో చిత్రాన్ని విడుదల చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.