శ్రీనివాస్‌గౌడ్ (ఫైల్)
చెన్నూర్: చెన్నూర్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్, చెన్నూర్ పట్టణంలోని జగన్నాథాలయం వీధికి చెందిన కోరకోప్పుల శ్రీనివాస్‌గౌడ్(37) శనివారం తెల్లవారుజా మున గుండెపోటుతో మృతిచెందారు. శ్రీనివాస్ మృతి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అనిల్‌కుమార్, చెన్నూర్, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్, భీమారం మండలాల వివిధ దినపత్రికల, టీవీ రిపోర్టర్లు, మిత్ర బృందం, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య సుమలత, కుమారుడు బన్నీ(2) ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment