Chennor
-
ఐటీ దాడులు దడ పుట్టించాయా?.. విజయానికి బాటలు వేశాయా?
ఎన్నికల సమయాన ఐటీ, ఈడీ దాడులు మామూలే. ఇటువంటివన్నీ రాజకీయ ప్రేరేపిత దాడులే అన్నది ప్రతిపక్షాల మాట. ఈ దాడులన్నీ ప్రతిపక్షాల నేతలపైనే జరుగుతున్నాయని వారి వాదన. మరి చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామిపై జరిగిన ఐటీ దాడి ఆయనకు దడ పుట్టించిందా? లేదంటే దాడి రివర్సైందా? అభ్యర్థికి దడ పుట్టించాల్సిన ఐటీ దాడులు ఆయన విజయానికి బాటలు వేశాయా? కేంద్ర సంస్థల దాడులు వివేక్ మీద సానుభూతి పెంచాయా? ప్రజల్లో పలుచన చేశాయా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరులో కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి పోటీ చేస్తున్నారు. ఎన్నికల బరిలో ఉన్న ఆయన ఇంటిపై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. వివేక్‌కు హైదారాబాద్ లోని ఇల్లు, మంచిర్యాలలో ఆయన ఇంటిపై ఐటి అధికారులు సోదాలు నిర్వహించారు. మంగళవారం నాడు తెల్లవారుఝాము నుంచి రోజంతా ఐటీ అధికారుల సోదాలు జరిగాయి. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టడానికి వివేక్ అనుచరులు నగదు పంచుతున్నారని... ఆయన ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయనే అనుమానంతో పదిహేను మంది అధికారులు సోదాల్లో పాల్గొన్నారు. వివేక్ వెంకటస్వామికి వివిధ కంపెనీల నుండి నగదు వచ్చిందన్న సమాచారంతో వచ్చిన అధికారులు ఆ లావాదేవీలపై సోదాలు జరిపారు. ఐటీ దాడుల వెనుక కుట్ర ఉందని కాంగ్రెస్ నాయకుడు వివేక్ వెంకటస్వామి ఆరోపిస్తున్నారు. తాను చెన్నూర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు ప్రజల్లో రోజు రోజుకూ ఆదరణ పెరుగుతుండటంతో తట్టుకోలేక ఈ దాడులు జరిగాయని ఆయన అంటున్నారు. తనపై బీఆర్ఎస్ తరపున బరిలో ఉన్న బాల్క సుమన్ కుట్రతోనే కేంద్ర సంస్థలతో దాడులు చేయించారని వివేక్ ఆరోపించారు. తనను ప్రజల్లో పలుచన చేయాలనే కుట్రతోనే, తనను ఇబ్బంది పెట్టడానికే ఇదంతా చేస్తున్నారని అన్నారు. మేము తప్పుడు మార్గాలలో ధనాన్ని తరలించలేదన్నారు. సుమన్ తప్పుడు ఫిర్యాదుతోనే ఇదంతా జరిగిందన్నారు. ఈ దాడుల వెనుక బిజెపి బిఅర్ఎస్ పార్టీల హస్తం ఉందన్నారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతిపై కేంద్రానికి ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని..ఐటీ దాడులతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని మరోసారి రుజువు చేసుకున్నారని కామెంట్ చేశారు వివేక్. ఆదాయప్ను ఆధికారులు దాడులు నిర్వహిస్తున్న ఇంటి దగ్గర..చెన్నూరులోనూ కాంగ్రెస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గులాబీ పార్టీ అభ్యర్థి బాల్క సుమన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఐటీ దాడులు వివేక్ వెంకటస్వామిపై ప్రజల్లో సానుభూతి పెంచిందనే చర్చ చెన్నూరు నియోజకవర్గంలో సాగుతోంది. ప్రజల్లో వివేక్‌పై ఏర్పడ్డ సానుభూతి, పెరిగిన ఆదరణ ఆయనకు ఓట్ల వర్షాన్ని పెంచుతుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఇక ఆయన విజయానికి ఢోకా లేదని భావిస్తున్నారు. అయితే వివేక్ ఇంటిపై ఐటీ దాడులు జరగడంలో సుమన్ హస్తం ఉందంటూ జరుగుతున్న ప్రచారాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిచింది. తమ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నవారికి ప్రజలే బుద్ధి చెబుతారని అంటున్నారు. ఎన్నికల్లో ఎవరి వ్యూహాలు వారికుంటాయి. కొన్నిసార్లు కొన్ని వ్యూహాలు బెడిసికొడుతుంటాయి. కొన్ని విజయవంతమవుతాయి. మరి కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి వివేక్ ఇంటిపై జరిగిన ఐటీ దాడుల్లో అసలు నిజాలు ఎలా ఉన్నా... వీటి వల్ల కాంగ్రెస్ అభ్యర్థికి మేలు జరుగుతుందా? ఇబ్బంది కలుగుతుందా అనేది ఫలితాల రోజే తెలుస్తుంది. -
Asia Cup 2022: ఇండియా, పాక్ క్రికెటర్లకు వైద్య సహాయకుడిగా చెన్నూర్ వాసి!
Asia Cup 2022- చెన్నూర్/మంచిర్యాల జిల్లా: యూఏఈ వేదికగా ఆసియా కప్-2022 టోర్నీ ఆరంభమైన విషయం తెలిసిందే. దుబాయ్, షార్జాలలో మ్యాచ్‌లు నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఇక ఈ టోర్నీలో పాల్గొనేందుకు వెళ్లిన ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ జట్లకు.. వైద్య సహాయకుడిగా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు మంచిర్యాల జిల్లా చెన్నూర్వాసి గాజ దుర్గయ్య. కాగా దుర్గయ్య చెన్నూర్‌లో 15 ఏళ్ల పాటు.. 108 వాహనంలో ఈఎంటీగా పనిచేశాడు. ఉన్నత చదువులు చదివి దుబాయ్‌లోని ఓ ప్రైవేట్ కంపెనీలో మెడికల్ ఎమర్జెన్సీ అసిస్టెంట్‌గా పనిచేసే అవకాశం దక్కించుకున్నాడు. ఈ కంపెనీ ఆసియా కప్‌లో పాల్గొనే క్రికెట్ జట్లకు వైద్య సహాయం అందించే కాంట్రాక్టును దక్కించుకుంది. ఈ క్రమంలో తమ ఉద్యోగులను ఆయా జట్ల ప్రాక్టీసు సెషన్‌కు పంపించింది. ఆ బృందంలో దుర్గయ్య కూడా ఉన్నాడు. పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజంతో ఇక ఆదివారం ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఇందుకోసం ఉదయం రెండు జట్ల క్రికెటర్లు ప్రాక్టీసు చేశారు. వీరికి దుర్గయ్య వైద్య సహాయకుడిగా సేవలు అందించాడు. ఈ సందర్భంగా ఇండియా, పాకిస్తాన్ క్రికెటర్లతో పాటు అఫ్గనిస్తాన్ క్రికెటర్లతో కూడా కోచ్‌తో కొంతసేపు గడిపాడు. ఈ నేపథ్యంలో విధుల్లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ దిగ్గజాలకు వైద్య సహాయం అందించడం ఎంతో సంతోషంగా ఉందని దుర్గయ్య ఫోన్ ద్వారా సాక్షికి తెలిపారు. ఇక దుబాయ్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా... పాకిస్తాన్ మీద ఐదు వికెట్ల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. చదవండి: Asia Cup 2022: జడ్డూ నీకు నాతో మాట్లాడటం ఇష్టమేనా? మంజ్రేకర్ ప్రశ్నకు ఆల్‌రౌండర్ ఆన్సర్ ఇదే! Rohit Sharma: తీవ్ర ఉత్కంఠ.. ఓవర్‌కు 10 పరుగులు కావాలి.. అయినా అతడు భయపడలేదు -
కెమెరాకు చిక్కింది.. ఆ తర్వాత జాడ లేకుండా పోయింది!
ఏటూరునాగారం/చెన్నూరు: మంచిర్యాల జిల్లా చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి కవ్వాల్ – 4(కె–4) పెద్దపులి ములుగు జిల్లా ఏటూరునాగారం అభయారణ్యంలోకి ప్రవేశించిందనే సమాచారంతో ఉద్యోగులు అన్వేషణలో నిమగ్నమయ్యారు. ఈ మేరకు చెన్నూరు, ఏటూరునాగారం వన్యప్రాణి సిబ్బంది సంయుక్తంగా పులిజాడల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. రెండు నెలల క్రితం చెన్నూరు అటవీ ప్రాంతం నుంచి బుద్దారం అడవుల్లోకి వెళ్లే క్రమంలో కెమెరాకు చివరిసారిగా చిక్కిన పులి ఆ తర్వాత జాడ లేకుండా పోయింది. దీంతో మహారాష్ట్ర, జయశంకర్ భూపాలపల్లి, ములుగు అటవీ ప్రాంతాల్లోకి పులి వెళ్లి ఉంటుందనే అంచనాతో ఉద్యోగులు విస్తృతంగా తనిఖీ చేస్తున్నారు. ఏటూరునాగారం అభయారణ్యంలోకి కవ్వాల్ –4 (కె–4) పెద్దపులి వచ్చిన జాడల కోసం ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో పులి ఇక్కడే ఆవాసం ఏర్పాటు చేసుకుని ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఐలాపురం అడవుల్లో ఆనవాళ్లు ఏటూరునాగారం రేంజ్ పరిధిలోని ఐలాపురం అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులను అటవీశాఖ అధికారులు ఈనెల 8న గుర్తించారు. దీంతో పెద్దపులి కదలికలను తెలుసుకునేందుకు కెమెరాలను కూడా ఏర్పాటు చేయించారు. ఏటూరునాగారం డీఎఫ్‌వో ప్రదీప్శెట్టిని వివరణ కోరగా ఆ పాదముద్ర ఇప్పటివరకు ఏ పులిది అనే విషయం నిర్ధారించలేదన్నారు. అలాగే, ఈ ఏడాది జనవరి 29న కూడా కన్నాయిగూడెం మండలంలోని భూపతిపూర్ అటవీ ప్రాంతంలో పెద్దపులి అడుగులు కనిపించడంతో అక్కడి సిబ్బంది అప్రమత్తమయ్యారు. గతంలో ఈ ప్రాంతంలో ఎక్కువ సంఖ్యలో పెద్దపులులు ఉండేవని అటవీశాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం కెమెరాలను ఈ ప్రాంతంలో అమర్చి పరిశీలిస్తున్నారు. అనుమానాలు అనేకం.. నడుముకు ఉచ్చు బిగిసి నాలుగేళ్లపాటు ఎటూ కదలని కె–4 పులి రెండు నెలల క్రితం ఇతర ప్రాంతానికి ఎలా వెళ్లింది..? ఒకవేళ కె–4 మంచిర్యాల ఫారెస్ట్ డివిజన్లోని ఇతర ప్రాంతానికి వెళ్తే సీసీ కెమెరాలకు ఎందుకు చిక్కలేదు..? ఈ ప్రాంతంలో దాని పాదముద్రలు ఎందుకు లభ్యం కాలేదు..? అనే అనుమానాలు కలుగుతున్నాయి. చదవండి: ఆరేళ్లుగా కుమార్తె అస్థికలు భద్రపరిచి.. జాడలేని తల్లి.. పాపం పులి కూనలు.. -
గుండెపోటుతో సాక్షి టీవీ రిపోర్టర్ మృతి
చెన్నూర్: చెన్నూర్ ‘సాక్షి’ టీవీ రిపోర్టర్, చెన్నూర్ పట్టణంలోని జగన్నాథాలయం వీధికి చెందిన కోరకోప్పుల శ్రీనివాస్‌గౌడ్(37) శనివారం తెల్లవారుజా మున గుండెపోటుతో మృతిచెందారు. శ్రీనివాస్ మృతి విషయాన్ని తెలుసుకున్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సాక్షి టీవీ ప్రతినిధి అనిల్‌కుమార్, చెన్నూర్, కోటపల్లి, మంచిర్యాల, జైపూర్, భీమారం మండలాల వివిధ దినపత్రికల, టీవీ రిపోర్టర్లు, మిత్ర బృందం, వివిధ పార్టీల నాయకులు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానూభూతిని తెలియజేశారు. శ్రీనివాస్‌గౌడ్‌కు భార్య సుమలత, కుమారుడు బన్నీ(2) ఉన్నారు. -
యువతి దారుణ హత్య
– తలపై గట్టిగా కొట్టి చంపి.. దహనం చేసిన నిందితులు –కడప నగర శివార్లలోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఘటన –డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం పరిశీలన చెన్నూరు : కడప నగర శివార్లలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని యువతి(21)ని తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. చెన్నూరు పోలీస్టేషన్ పరిధిలోని కమలాపురం రోడ్డులో మదీనా ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్లో గురువారం దహనం చేసిన యువతి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఉదయం వాకింగ్‌కు వెళ్లగా మృతదేహం ఉన్నట్లు గమననించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు వినోద్‌కుమార్, రాజేశ్వర్‌రెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యచేసి..పెట్రోల్‌పోసి దహనం.. హంతకులు ముందుగా యువతిని ఓ చోట తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. ఓ వాహనంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మృతదేహంపై పెట్రోల్ పోసి ఎవ్వరూ గుర్తు పట్టని విధంగా ముఖంపైనే బాగా కాల్చారు. యువతికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. సంఘటన స్థలంలోనే మద్యం సేవించి దహనం చేశారనడానికి, రెండు బీరు బాటిల్లు, వాటర్ ప్యాకెట్లు, పెట్రోల్ తెచ్చిన బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. దుండగులు ఉపయోగించిన అనుమానిత వస్తువులను సేకరించారు. రిమ్స్ నుంచి వైద్యులను పిలిపించి శవపరీక్ష అక్కడే చేయించారు. మృతదేహం 19 నుంచి 24 ఏళ్లలోపు యువతిదని, తలపై బలంగా కొట్టి చంపి, ఇక్కడ కాల్చారని పోలీసులు భావిస్తున్నారు. దహనమైన మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సదాశివయ్య తెలిపారు. -
యువతి దారుణ హత్య
– తలపై గట్టిగా కొట్టి చంపి.. దహనం చేసిన నిందితులు –కడప నగర శివార్లలోని అగ్రిగోల్డ్ వెంచర్లో ఘటన –డాగ్‌స్క్వాడ్, క్లూస్‌టీం పరిశీలన చెన్నూరు : కడప నగర శివార్లలో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని యువతి(21)ని తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. చెన్నూరు పోలీస్టేషన్ పరిధిలోని కమలాపురం రోడ్డులో మదీనా ఇంజనీరింగ్ కళాశాల ఎదురుగా ఉన్న అగ్రిగోల్డ్ వెంచర్లో గురువారం దహనం చేసిన యువతి మృతదేహం లభ్యమైంది. స్థానికులు ఉదయం వాకింగ్‌కు వెళ్లగా మృతదేహం ఉన్నట్లు గమననించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అర్బన్ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు వినోద్‌కుమార్, రాజేశ్వర్‌రెడ్డి, సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొన్నారు. డాగ్‌స్క్వాడ్, క్లూస్ టీంలను పిలిపించి క్షుణ్ణంగా పరిశీలించారు. బుధవారం రాత్రే ఈ సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. హత్యచేసి..పెట్రోల్‌పోసి దహనం.. హంతకులు ముందుగా యువతిని ఓ చోట తలపై బలమైన రాడ్డుతో కొట్టి చంపారు. ఓ వాహనంలో నిర్మానుష్యంగా ఉన్న ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు. మృతదేహంపై పెట్రోల్ పోసి ఎవ్వరూ గుర్తు పట్టని విధంగా ముఖంపైనే బాగా కాల్చారు. యువతికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేకుండా చేశారు. సంఘటన స్థలంలోనే మద్యం సేవించి దహనం చేశారనడానికి, రెండు బీరు బాటిల్లు, వాటర్ ప్యాకెట్లు, పెట్రోల్ తెచ్చిన బాటిళ్లు లభ్యమయ్యాయి. ఘటనా స్థలం వద్దకు క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌లను పిలిపించి పోలీసులు ఆరా తీశారు. దుండగులు ఉపయోగించిన అనుమానిత వస్తువులను సేకరించారు. రిమ్స్ నుంచి వైద్యులను పిలిపించి శవపరీక్ష అక్కడే చేయించారు. మృతదేహం 19 నుంచి 24 ఏళ్లలోపు యువతిదని, తలపై బలంగా కొట్టి చంపి, ఇక్కడ కాల్చారని పోలీసులు భావిస్తున్నారు. దహనమైన మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించారు. ఈ విషయంపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని హంతకులను త్వరలోనే పట్టుకుంటామని సీఐ సదాశివయ్య తెలిపారు.