
ప్రతీకాత్మక చిత్రం
పెందుర్తి(విశాఖపట్నం): తనపై లైంగిక దాడికి పాల్పడడంతోపాటు బీరువాలో ఉన్న నగదు, నగలు పట్టుకుని ఓ వ్యక్తి పరారైనట్లు ఓ మహిళ పెందుర్తి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాలివి.. భాస్కర్ల లక్ష్మి సుజాతనగర్ సీ- 2 జోన్‌లో నివసిస్తోంది. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో ఓ టీవీ చానల్ రిపోర్టర్ కుమార్‌ని అని చెప్పుకుంటూ ఓ వ్యక్తి ఆమె ఇంటికి వచ్చాడు.
చదవండి: ప్రియురాలి పెళ్లి చెడగొట్టాలని..
లక్ష్మి గతంలో చేసిన వ్యభిచార వృత్తి, ఇతరత్రా వ్యవహారాలపై బ్లాక్‌మెయిల్ చేశాడు. డబ్బులు డిమాండ్ చేశాడు. అనంతరం లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆ దృశ్యాలను రికార్డింగ్ చేసి టీవీ చానళ్లకు ఇస్తానని బెదిరించాడు. అంతేకాకుండా డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించాడు. అనంతరం ఆమెపై దాడికి పాల్పడి బీరువా అల్మరాలో ఉన్న రెండు బంగారు ఉంగరాలు, రూ.5 వేల నగదు అపహరించుకుపోయాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment