ఒకరు బ్యాంకులో ఉద్యోగం చేస్తుంటే మరొకరు సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తారు. వీళ్లతో పాటు ఓ కాలేజ్ స్టూడెంట్, టీవీ రిపోర్టర్, హౌస్‌వైఫ్... ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. ఓ అనూహ్య ఘటన ఈ ఐదుగురి జీవితాలను తారుమారు చేస్తుంది. ఆ ఘటన ఏంటి? అనే చిన్న లైన్‌తో తెరకెక్కిన మలయాళ థ్రిల్లర్ ‘100 డిగ్రీ సెల్సియస్’. ఇప్పుడీ సినిమా తమిళంలో రీమేక్ కానుంది. ఇందులో ఓ పాత్రకు శ్రీయను తీసుకోవాలని దర్శకుడు మిత్రన్ జవహర్ ప్రయత్నిస్తున్నారు. ఆమెకు కథ వినిపించారు.
కథ నచ్చిందని చెప్పిన శ్రీయ, ఇంకా సినిమాకు సంతకం చేయలేదు. ప్రస్తుతం శ్రీయ చేతిలో ఉన్న సినిమాల చిత్రీకరణలు త్వరలోనే పూర్తవుతాయి. అందువల్ల, ఈ సినిమాకు సంతకం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో మొత్తం ఐదుగురు నాయికలు ఉంటారు. రాయ్ లక్ష్మి, నికిషా పటేల్‌లను ఎంపిక చేశారు. శ్రీయ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తే మిగతా ఇద్దరు హీరోయిన్లను ఎంపిక చేయాలి. మరి.. శియను ఏ పాత్రకు ఎంపిక చేశారనేది దర్శకుడు బయటపెట్టలేదు.
గ్రీన్ సిగ్నల్ ఇస్తారా?
Published Sun, Dec 11 2016 11:17 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
Advertisement
Advertisement