లైవ్‌లో రిపోర్టర్‌కి ముద్దుపెట్టాడు తర్వాత.. | US Man Kissed TV Reporter Live On Air | Sakshi
Sakshi News home page

వైరల్‌ : లైవ్‌లో రిపోర్టర్‌కి ముద్దుపెట్టాడు

Sep 28 2019 4:41 PM | Updated on Sep 28 2019 4:46 PM

US Man Kissed TV Reporter Live On Air - Sakshi

వాషింగ్టన్‌ : లైవ్‌ రిపోర్ట్‌ చేస్తున్న ఓ పాత్రికేయురాలికి ముద్దుపెట్టి వేధింపులకు గురి చేశాడో వ్యక్తి. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకుంది. బౌర్బన్‌ అండ్‌ బియాండ్‌ మ్యూజిక్‌ పెస్టివల్‌ సందర్భంగా వెవ్‌3 న్యూస్‌ ఛానెల్‌కు చెందిన పాత్రికేయురాలు సారా రివెస్ట్‌ కెంటుకీలో లైవ్‌ రిపోర్ట్‌ అందిస్తున్నారు. సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి అనే అంశంపై రోడ్డుపై నిలబడి లైవ్‌ రిపోర్ట్‌ ఇస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి సారా చూట్టూ అనుమానస్పదంగా తిరిగాడు. అయినప్పటికీ సారా అతన్ని పట్టించుకోకుండా డెస్క్‌లో ఉన్న యాంకర్‌కు వార్తను వివరిస్తున్నారు. ఇంతలో ఆ ఆగంతకుడు ఒక్కసారిగా సారా దగ్గరకు వచ్చి బుగ్గపై ముద్దుపెట్టి పరారయ్యాడు.

దీంతో సారా ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అయినప్పటికీ వార్తను వివరించడం ఆపేయలేదు. అనంతరం స్థానిక పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆగంతకునిపై లైంగిక వేధింపుల కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లైవ్‌లో ముద్దుపెట్టిన వ్యక్తిని ఎరిక్‌ గుడ్‌మ్యాన్‌గా గుర్తించి అరెస్ట్‌ చేశారు. కాగా, తను చేసిన తప్పు పట్ల ఎరిక్‌ గుడ్‌మ్యాన్‌ క్షమాపణలు కోరారు. ఈమేరకు సారాకు ఓ లేఖ రాశాడు. తాను ముద్దు పెట్టడం తప్పని, తనను క్షమించాలని కోరారు. ఈ లేఖను సారా.. వెవ్‌3 న్యూస్‌ ఛానెల్‌లో చదివి వినిపించారు. అతనిపై పెట్టిన కేసును వెనక్కి తీసుకుంటానని, కానీ చేసిన తప్పుకు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ముద్దు పెట్టిన వీడియో సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement