అందరికీ వార్తలను చేరవేసే ఓ జర్నలిస్టు అత్యుత్సాహంతో తప్పులో కాలేసింది. కానీ దానివల్ల ఆమెకు మాత్రమే నష్టం జరిగింది. లాటరీ గెలుచుకున్నానంటూ లైవ్‌లోనే నానా హడావుడి చేసి తన ఉద్యోగానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించింది. కానీ తర్వాత అసలు విషయం తెలిసి ఖంగుతింది. ఇంతకీ ఏం జరిగిందంటే... క్రిస్‌మస్ పండగ సందర్భంగా లాటరీ నిర్వాహకులు లక్కీడ్రా తీస్తున్నారు. ఈ కార్యక్రమాన్నంతటినీ స్పానిష్ టీవీ రిపోర్టర్ నటాలియా ఈక్యుడెరో లైవ్‌లో వివరిస్తూ వచ్చింది. అయితే లాటరీ గెల్చుకున్నవారిలో ఆమె పేరు కూడా ఉండటంతో ఎగిరి గంతేసింది.