బొబ్బిలి: సీఎం పర్యటనలో భాగంగా పట్టణంలో హెలీపాడ్ నుంచి వస్తున్న విలేకర్ల బృందంలోని ఓ టీవీ కెమెరామెన్ సూర్యప్రకాష్‌కు శుక్రవారం ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. దీంతో విలేకర్లు కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్‌ను ఇవ్వమని కోరగా సీఎం కాన్వాయ్‌లో ఉన్న అంబులెన్స్ ఇవ్వకూడదని, బాడంగి లేదా బొబ్బిలి ఆసుపత్రులకు ఫోను చేస్తే అంబులెన్స్ వస్తుందని అధికారులు ఉచిత సలహా ఇచ్చారు. దీంతో అక్కడ పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి ఉత్పన్నమయింది. అయితే అక్కడి నుంచి డీసీహెచ్‌ఎస్ ఉషశ్రీ చర్యలు తీసుకోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించగలిగారు.
బొబ్బిలి ఆసుపత్రిలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇబ్బందులు పడ్డారు. బొబ్బిలి ఆసుపత్రిలో ఫిజిషియన్ లేకపోవడంతో పాటు జనరేటర్ సదుపాయం కూడా లేదు. దీంతో కెమెరామెన్‌ను కాపాడుకునేందుకు పలు అవస్థలు పడాల్సి వచ్చింది. అక్కడి నుంచి విజయనగరంలోని తిరుమల ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని సహచర మీడియా ప్రతినిధులు తెలిపారు. సీఎం కాన్వాయ్‌లో రెండు, సభ దగ్గర కొన్ని అంబులెన్స్‌లు ఉన్నా గుండెపోటు వచ్చిన వారికి మాత్రం అంబులెన్స్‌లు ఇవ్వని తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి.
Comments
Please login to add a commentAdd a comment