సెన్సార్ కష్టాలు
ఒక యథార్థ సంఘటన ఇతివృత్తంతో చిత్రాన్ని తెరకెక్కిస్తే ఎదురయ్యే సమస్య లేమిటన్నదిపోర్కళత్తిల్ ఒరుపూ చిత్ర నిర్మాతలకు అర్థమై ఉంటుంది. తమిళులను ఊచకోత కోసిన శ్రీలంకలో ఒక తమిళ ఆడపడుచును ఘోరాతి ఘోరంగా హింసించి హతమార్చిన సంఘటనకు సినిమా రూపం ఇస్తే ఆ చిత్రంపై సెన్సార్ సభ్యులు మండిపడుతున్న విషయం నిర్మాతను ఆవేదనకు గురిచేస్తోంది. వివరాలో ్లకెళితే.. శ్రీలంకలో జరిగిన యుద్ధంలో ఎల్‌టీటీఈ తరపు సమాచారాన్ని అందించే ఒక టీవీ విలేకరి ఇసైప్రియ. ఈమెను శ్రీలంక సైనికులు హత్య చేసిన ఇతి వృతంతో తెరకెక్కిన తమిళ చిత్రం పోర్కళత్తిల్ ఒరు పూ. ఈ చిత్రం చూసిన సెన్సార్ సభ్యులు సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారు.
దీంతో చిత్ర విడుదల ప్రశ్నార్థకంగా మారింది. గురునాథ్‌సల్సాని నిర్మించిన చిత్రం పోర్కళత్తిల్ ఒరు పూ. నాగినీడు, ప్రియ, సుభాష్ చంద్రబోస్, కృపావిశ్వనాథన్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి కే గణేశన్ దర్శకుడు. సెన్సార్ సర్టిఫికెట్ నిరాకణ గురించి దర్శకుడు వివరిస్తూ.. చిత్రం చూసిన సెన్సార్ బృందం సర్టిఫికెట్ ఇవ్వలేదన్నారు. వారు అడిగిన అన్ని ప్రశ్నలకు బదులిచ్చామన్నారు. అయినా సర్టిఫికెట్ ఇవ్వకపోవడంతో చిత్రాన్ని విడుదల చేయలేని పరిస్థితి నెలకొందన్నారు.