
టెలివిజన్ జర్నలిస్టుగా లైవ్ రిపోర్టింగ్ చేయడం అంటే అంత ఆషామాషీ వ్యవహారంకాదు. ఒక్కోసారి భయంకరమైన అనుభవాలు, మరి కొన్నిసార్లు అనూహ్యమైన ఘటనలు చోటు చేసుకుంటాయి. ఈ కోవలోనే లైవ్ రిపోర్టింగ్‌లో పాకిస్థానీ మహిళా రిపోర్టర్ పాకిస్థానీ మహిళా రిపోర్టర్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. రిపోర్ట్ చేస్తుండగా ఎద్దు దాడి చేసిన అనూహ్య ఘటన నెట్టంట వైరల్‌గా మారింది.
‘‘పాకిస్తాన్‌లో ప్రత్యక్ష ప్రసార టీవీ కవరేజీ సమయంలో బుల్ హిట్స్ రిపోర్టర్” అనే క్యాప్షన్‌తో ఎక్స్‌లో ఒక వీడియో షేర్ అయింది. 10 లక్షలకు పైగా వ్యూస్ సొంతం చేసుకుందీ వీడియో.
Bull Hits Reporter during Live tv Coverage in Pakistan
pic.twitter.com/eP23iFXykv— Ghar Ke Kalesh (@gharkekalesh) July 2, 2024
మార్కెట్లో ఎద్దుల ధరలపై స్థానిక వ్యాపారులతో మాట్లాడుతూ లైవ్ రిపోర్టింగ్ చేస్తోంది. ఎద్దుల జంట రూ. 5 లక్షల ధర పలుకు తోందనీ, అంతకంటే తక్కువకు విక్రయించేందుకు అక్కడి వ్యాపారాలు సిద్ధంగా లేరు అని చెబుతుండగానే , అకస్మాత్తుగా ఒక ఎద్దు ఆమెపై దాడిచేసింది. దీంతో ఆమె కేకలు వేస్తూ అల్లంత దూరాన ఎగిరి పడింది. ఆమెచేతిలోని మైక్ కూడా అల్లంత దూరాన పడింది. దీంతో పక్కనే ఉన్న వ్యాపారి స్పందించి చెల్లాచెదురుగా పడి పోయిన ఆమె మైక్రోఫోన్, మౌత్‌ను ఆమెకు అందించాడు. కొంతమంది రిపోర్టర్ యోగ క్షేమాలపై ఆందోళన వ్యక్తం చేయగా, మరికొందరు యూజర్లు రకరకాల కామెంట్లు చేశారు. లైవ్ రిపోర్టింగ్‌లోఇదో హఠాత్తు పరిణామమనికొందరు, ఫీల్డ్ రిపోర్టింగ్ సమయంలో జాగ్రత్త తీసుకోవాలని మరికొందరు వ్యాఖ్యానించారు.