కొన్ని కార్యక్రమాలకు విరాళాలు సేకరించడం మనకు తెలిసిన విషయమే. ఇలాంటివి సాధారణంగా రోడ్లపైనో లేదా బస్సుల్లో సేకరిస్తూ ఉంటారు. కానీ ఓ వ్యక్తి మాత్రం వీటికి భిన్నంగా ఏకంగా విమానంలో విరాళాలు అడుగడం ప్రారంభించాడు. అయితే అతను నెట్టింట ఫేమ్ కోసం ఇలా చేశాడా లేదా నిజంగానే విరాళాల కోసం ఇలా చేశాడో తెలియదు గానీ.. ఈ వీడియో మాత్రం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారి చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన పాకిస్తాన్లో చోటు చేసుకుంది.
పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఎంతగా క్షీణించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ దేశ పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే అక్కడి ప్రజలకు రెండు పూటలా భోజనం తినడం కూడా కష్టంగా మారిందనే చెప్పాలి. ఇదిలా ఉండగా.. ఓ పాకిస్తాన్ వ్యక్తి విమానంలో ప్రయాణిస్తుండగా.. సడన్‌గా లేచి విరాళాల కోసం ప్రసంగాన్ని ప్రారంభించాడు. ‘మేము మదర్సా కట్టడం కోసం విరాళాలు సేకరిస్తున్నాం. మీరు డబ్బు ఇవ్వదలచుకుంటే నా వద్దకు వచ్చి ఇవ్వనవసరం లేదు. నేనే మీరు కూర్చున్న చోటుకు వస్తాను. నేనేమీ భిక్షాటన చేయడం లేదు. నాకు సాయం చేయండి’ అంటూ అభ్యర్థించడం మొదలు పెట్టాడు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. మరో వైపు.. పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేందుకు అటు ఐఎంఎఫ్‌తో పాటు స్నేహపూర్వక దేశాల నుంచి రుణాలు పొందేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇటువంటి సమయంలో ఈ వీడియో వైరల్ అవడంతో దీనిపై పెద్ద ఎత్తున కామెంట్లు వస్తున్నాయి.
Viral video whereby a Pakistani can be seen begging in a flight; Says I am not a beggar but need money to make a madrasas in Pakistan. pic.twitter.com/hUB3ZzVJGn
— Megh Updates 🚨™ (@MeghUpdates) July 13, 2023
చదవండి ఇలా అయ్యిందేంటి.. ముఖానికి సర్జరీ.. అక్కడ వెంట్రుకలు మొలుస్తున్నాయ్!
Comments
Please login to add a commentAdd a comment