
ఏమైనా అంటే, ‘ఇప్పుడంతా కంప్యూటర్‌మయం’ అంటుంటాం. నిజానికి రెండు వేల ఏళ్ల క్రితమే ప్రాచీన గ్రీకు శాస్త్రవేత్తలు ఖగోళ సంబంధ విషయాల శోధనకు ఉపకరించే శక్తిమంతమైన కంప్యూటర్‌ను తయారుచేశారు. దీని గురించి ఎలా తెలిసింది అంటే... 1901లో అంటికితెర తీరం(దక్షిణ గ్రీకు దీవులు)లో ఓడ శిథిలాల్లో ఒక ఆసక్తికరమైన వస్తువు అవశేషాలను కనుగొన్నారు. ఆ వస్తువుపై వందసంవత్సరాలకు పైగా పరిశోధనలు సాగాయి. ఎట్టకేలకు యూనివర్శిటీ కాలేజ్ లండన్ (యుసీఎల్) శాస్త్రవేత్తలు దీని మిస్టరీని ఛేదించినట్లు ప్రకటించారు.
‘విశ్వానికి కేంద్రం భూమి’ అనే భూకేంద్ర సిద్ధాంతంతో పాటు ఆ కాలంలో ఉనికిలో ఉన్న రకరకాల నమ్మకాల ఆధారంగా గ్రీకు శాస్త్రవేత్తలు ఈ కంప్యూటర్‌ను రూపొందించారు. వర్కింగ్ గేర్ సిస్టంతో అలనాటి కంప్యూటర్ డిజిటల్ నమూనాను తయారుచేసి, ఒకప్పటి ఎక్స్–రే డేటా, ప్రాచీన గ్రీకు గణితశాస్త్ర పద్ధతుల ఆధారం గా ఈ పరికరం పనీచేసే తీరు (యాంటిక్ తెర మెకానిజం), ఖగోళ విషయాలను ఎలా అంచనా వేసేవారు.... మొదలైన వాటి గురించి యుసీఎల్ శాస్త్రవేత్తలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment