
లండన్: ఏసుక్రీస్తు తన సోదరుడు జేమ్స్‌కు చేసిన రహస్య బోధనలకు సంబంధించి అసలైన గ్రీకు ప్రతుల్ని పరిశోధకులు కనుగొన్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఆర్కైవ్స్‌లో వీటిని గుర్తించారు. ఈ పురాతన రాత ప్రతుల్లో పరలోక రాజ్యము, భవిష్యత్తు సంఘటనలు, జేమ్స్ అనివార్య మరణం గురించి ఏసుక్రీస్తు బోధనలున్నాయి.
అయితే బైబిల్ కొత్త నిబంధన కూర్పు సమయంలో అందులోని 27 అధ్యాయాల సరసన వీటిని చేర్చలేదు. 1945లో ఎగువ ఈజిప్టులో తవ్వకాల్లో కాప్టిక్(ఈజిప్టు) భాషలో ఇలాంటి ప్రతులే దొరికినా... ప్రస్తుతం గ్రీకు భాషలో అసలైన ప్రతులు లభ్యమైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఐదు, ఆరు శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్న వీటిని ఈ ఏడాది ప్రారంభంలోనే గుర్తించారు.