James
-
సన్‌రైజర్స్ బౌలింగ్ కోచ్‌గా ఫ్రాంక్లిన్
హైదరాబాద్: ఐపీఎల్–2024 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వ్యవహరిస్తాడు. గత రెండు సీజన్లుగా బౌలింగ్ కోచ్‌గా పని చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ స్థానంలో ఫ్రాంక్లిన్‌ను కోచ్‌గా టీమ్ యాజమాన్యం ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో స్టెయిన్ ఈ సీజన్‌నుంచి తప్పుకోవడంతో ఫ్రాంక్లిన్‌కు అవకాశం దక్కింది. 2010, 2011 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్లో ఆడిన ఫ్రాంక్లిన్‌కు ఈ లీగ్‌లో కోచ్‌గా ఇదే మొదటి అవకాశం. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డానియెల్ వెటోరిలో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ మాజీ కివీ పేసర్ బౌలింగ్ కోచ్‌గా వస్తున్నాడు. వీరిద్దరు గతంలో కౌంటీ జట్టు మిడిల్‌ఎసెక్స్, హండ్రెడ్ టీమ్ బర్మింగ్‌హామ్ ఫోనిక్స్లకు కలిసి పని చేశారు. డర్హమ్ కౌంటీ టీమ్‌కు హెడ్ కోచ్‌గా కూడా పని చేసిన ఫ్లాంక్లిన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 43 ఏళ్ల ఫ్లాంక్లిన్ న్యూజిలాండ్ తరఫున 31 టెస్టుల్లో 82, 110 వన్డేల్లో 81, 38 టి20ల్లో 20 వికెట్లు తీశాడు. -
జస్ట్ సూపర్ మేన్.. అంతే!
‘‘కథ రాయడం మొదలుపెట్టి, తొలి డ్రాఫ్ట్ పూర్తి చేసేవరకూ నా సినిమాకు ‘సూపర్‌మేన్: లెగసీ’ అనే టైటిల్‌నే అనుకున్నాను. కానీ ఫైనల్ డ్రాఫ్ట్ పూర్తి చేశాక ‘లెగసీ’ని వదిలేద్దామని నిర్ణయించుకున్నాను. ఇప్పుడు నా సినిమా టైటిల్ జస్ట్ ‘సూపర్‌మేన్’... అంతే. మా ఈ సూపర్‌మేన్ వచ్చే ఏడాది జూలై 11న మీ ముందుకు వస్తాడు’’ అని సామాజిక మాధ్యమాల ద్వారా దర్శకుడు జేమ్స్ గన్ పేర్కొన్నారు. సూపర్‌మేన్ క్యారెక్టర్‌తో ఇప్పటివరకూ ‘సూపర్‌మేన్’ ఫ్రాంచైజీలను నిర్మించిన డీసీ స్టూడియోస్ తాజా సూపర్‌మేన్ చిత్రాన్ని నిర్మించనుంది. అయితే సూపర్మేన్ని కొత్త రకంగా చూపించనున్నారు జేమ్స్ గన్. ఇప్పటివరకూ వచ్చిన చిత్రాల్లో సూపర్‌మేన్ ధరించిన సూట్‌కి భిన్నంగా తాజా చిత్రంలోని సూపర్‌మేన్ సూట్ ఉంటుందట. కాగా ఈ మధ్యకాలంలో సూపర్‌మేన్ అంటే నటుడు హెన్రీ కవిల్ గుర్తొస్తారు. 2013 నుంచి 2021 వరకూ డీసీ స్టూడియోస్ నిర్మించిన సూపర్‌మేన్ చిత్రాల్లో టైటిల్ రోల్లో అద్భుతంగా ఒదిగిపోయారు హెన్రీ. కానీ, తాజా చిత్రంలో ఈ పాత్రను డేవిడ్ కోరెన్స్వెట్ చేయనున్నారు. ‘‘సూపర్‌మేన్ జీవితంలోని పూర్వ భాగంపై ఈ చిత్రం ఉంటుంది. ఈ పాత్రను హెన్రీ కవిల్ చేయలేడు. అందుకే డేవిడ్ కోరెన్స్వెట్ని తీసుకున్నాం’’ అని జేమ్స్ గన్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే... ఇప్పటివరకూ మూడు నాలుగు చిత్రాల్లో మాత్రమే నటించిన 30 ఏళ్ల డేవిడ్ కోరెన్స్వెట్కి ‘సూపర్‌మేన్’ చాన్స్ రావడం అనేది గొప్ప విషయం అని హాలీవుడ్ అంటోంది. -
లిఫ్ట్ లేదన్నది గమనించకుండా అడుగుపెట్టడంతో.. తీవ్ర విషాదం!
సంగారెడ్డి: లిఫ్టులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని అశోక్‌నగర్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నివాసం ఉండే జేమ్స్(38) కొరియర్ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్ అపార్ట్మెంట్లో కొరియర్ రిటర్న్ ఉంటే దానిని తీసుకోవడం కోసం అపార్ట్‌మెంట్‌ని 4వ అంతస్థుకు వెళ్లాడు. కొరియర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్ గేటు తీసుకొని లిఫ్ట్ లేదన్న విషయాన్ని గమనించకుండా అడుగుపెట్టాడు. 4వ అంతస్థు నుంచి లిఫ్ట్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ సమస్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇవి కూడా చదవండి: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం! -
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ తో హాలీవుడ్ డైరెక్టర్ సినిమా
-
ఇదిరా ఎన్టీఆర్ సత్తా అంటే...
-
భీమ్ హాలీవుడ్ మూవీ చేస్తున్నాడా..?
-
ఈ వారం రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో!
సినీలవర్స్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో వినోదం కోసం వేచిచూసిన సగటు ప్రేక్షకుకుడికి వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు వరుసగా బాక్సాఆఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. వారానికి ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే మధ్యలో చిన్నచిన్న సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. గత వారం థియేటర్లలో రాధేశ్యామ్, ఈటీ, ఓటీటీలో మారన్ వంటి భారీ చిత్రాలు రిలీజయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం.. జేమ్స్ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరగా నటించిన చిత్రం 'జేమ్స్'. చేతన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కిశోర్ పత్తికొండ నిర్మించారు. ఇందులో పునీత్ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. తెలుగు నటుడు శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ మార్చి 17న విడుదల చేస్తున్నారు. స్టాండప్ రాహుల్ రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వమించిన ఈ సినిమాను నందకుమార్ అబ్బినేని, భరత్ మాగలూరి నిర్మించారు. ప్రేమ, స్టాండప్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది. నల్లమల అమిత్ తివారి, భానుశ్రీ జంటగా నటించిన సినిమా 'నల్లమల'. రవి చరణ్ తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఏమున్నవే పిల్ల ఏమున్నవే సహా ఇతర పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. బచ్చన్ పాండే అక్షయ్‌కుమార్ హీరోగా, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బచ్చన్ పాండే'. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ మూవీకి రీమేక్. ఇక ఇదే సినిమా తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా వచ్చి మంచి విజయం సాధించింది. మరి బాలీవుడ్లో ఏ రేంజ్లో హిట్టవుతుందో చూడాలి! ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు.. ఆహా ► సెబాస్టియన్ పీసీ 524 - మార్చి 18 ► జూన్ - మార్చి 18 అమెజాన్ ప్రైమ్ ► ఔటర్ రేంజ్ (వెబ్ సిరీస్) - మార్చి 15 ► జల్సా - మార్చి 18 ► డీప్ వాటర్ - మార్చి 18 సోనీలివ్ ► సెల్యూట్ - మార్చి 18 జీ5 ► బ్లడీ బ్రదర్స్ - మార్చి 18 నెట్‌ఫ్లిక్స్ ► బ్యాడ్ వెగాన్ (వెబ్ సిరీస్)- మార్చి 16 ► రెస్క్యూడ్ బై రూబీ - మార్చి 17 ► క్రాకౌ మాన్స్టర్స్ (వెబ్ సిరీస్) - మార్చి 18 ► టాప్ బాయ్ - మార్చి 18 ► విండ్ ఫాల్ - మార్చి 18 హాట్‌స్టార్ ► లలితం సుందరం - మార్చి 18 చదవండి: పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్ హీరోయిన్ క్లారిటీ -
పునీత్ చివరి సినిమా జేమ్స్ టీజర్ చూసేయండి!
కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్రపరిశ్రమకే కాదు కన్నడ ప్రజలకు సైతం తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించగా ఇప్పటికీ ఆయన అభిమానులు, సెలబ్రిటీలు పునీత్‌ను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాదు, ఆయన నటించిన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. శుక్రవారం ఉదయం జేమ్స్ టీజర్ రిలీజ్చేశారు. 'ఎమోషన్స్ అనేవి వ్యాపారం కన్నా పెద్దవి' అన్న టైటిల్‌తో టీజర్ మొదలైంది. 'గన్స్ పట్టుకుని నిలబడే వంద వేస్ట్ బాడీస్ కంటే గన్నులాంటోడిని ఒక్కడిని తీసుకురండి.. ఎదురు నిలబడి కాపాడటమూ తెలుసుండాలి, ఎదురొచ్చే గుండెలో బుల్లెటు దింపడమూ తెలుసుండాలి' అన్న డైలాగ్‌తో పునీత్ పాత్రకు హైప్ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే పునీత్ సెక్యురిటీ ఏజెన్స్ ఆఫీసర్‌గా నటించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రియా ఆనంద్, విలన్‌గా శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. -
పునీత్ రాజ్‌కుమార్ చివరి చిత్రం.. స్పెషల్ పోస్టర్ రిలీజ్
Puneeth Rajkumar James Movie Army Officer Look Released: కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ ఆకస్మిక మరణం కన్నడ చిత్ర పరిశ్రమకు తీరని లోటు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన గుండెపోటుతో గతేడాది అక్టోబర్ 29న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఇక పునీత్ నటించిన చివరి చిత్రం జేమ్స్ ఈ ఏడాది మార్చి17న విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు(జనవరి26)న స్పెషల్ పోస్టర్ని విడుదల చేశారు. ఇందులో ఆయన సైనికుడిలా కనిపించారు. చేతన్ కుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రియా ఆనంద్ హీరోయిన్గా నటించింది.హీరో శ్రీకాంత్ విలన్‌గా నటించగా, అను ప్రభాకర్ ముఖర్జీ కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా మార్చి 17న పునీత్ జయంతి సందర్భంగా అదే రోజున ఈ సినిమా విడుదల చేయనున్నారు. దీంతో మార్చి 17-23 మధ్యలో ఎలాంటి సినిమాలు విడుదల చేయకూడదని కన్నడ డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమానుకన్నడలో మాత్రమే కాకుండా తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. -
పాకిస్తాన్‌పై ఘన విజయం.. ఇంగ్లండ్‌దే వన్డే సిరీస్
లండన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో లూయిస్ గ్రెగరీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో (47 బంతుల్లో 40; 4 ఫోర్లు)... బౌలింగ్ (3/44)లో ఆకట్టుకున్నాడు. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ 52 పరుగులతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు. కాగా తొలుత ఇంగ్లండ్ 45.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాల్ట్ (60; 10 ఫోర్లు), జేమ్స్ విన్స్ (56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. హసన్ అలీ 5 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 41 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది. -
జీసస్ బోధనల పురాతన ప్రతి లభ్యం
లండన్: ఏసుక్రీస్తు తన సోదరుడు జేమ్స్‌కు చేసిన రహస్య బోధనలకు సంబంధించి అసలైన గ్రీకు ప్రతుల్ని పరిశోధకులు కనుగొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆర్కైవ్స్‌లో వీటిని గుర్తించారు. ఈ పురాతన రాత ప్రతుల్లో పరలోక రాజ్యము, భవిష్యత్తు సంఘటనలు, జేమ్స్ అనివార్య మరణం గురించి ఏసుక్రీస్తు బోధనలున్నాయి. అయితే బైబిల్ కొత్త నిబంధన కూర్పు సమయంలో అందులోని 27 అధ్యాయాల సరసన వీటిని చేర్చలేదు. 1945లో ఎగువ ఈజిప్టులో తవ్వకాల్లో కాప్టిక్(ఈజిప్టు) భాషలో ఇలాంటి ప్రతులే దొరికినా... ప్రస్తుతం గ్రీకు భాషలో అసలైన ప్రతులు లభ్యమైనట్లు పరిశోధకులు పేర్కొన్నారు. ఐదు, ఆరు శతాబ్దాలకు చెందినవిగా భావిస్తున్న వీటిని ఈ ఏడాది ప్రారంభంలోనే గుర్తించారు. -
మనమడిగింది కాదు...దేవుడిచ్చేదే ఆశీర్వాదం!
యేసుక్రీస్తు శిష్యుల్లోని యాకోబు, యోహానుల తల్లి ఒకసారి ప్రభువును కలుసుకొని నా కుమారులిద్దరినీ నీ రాజ్యంలో నీ కుడి ఎడమ పక్కన కూర్చోబెట్టుకోమని అర్థించింది. తాను పొందిన శ్రమలన్నీ వాళ్లు కూడా పొందాలనడానికి సాదృశ్యంగా, నేను తాగిన గిన్నెలోది వారు తాగగలరా? అని ప్రభువు ప్రశ్నించి, ఆమె అభ్యర్థన తన తండ్రి వశంలోనిది తప్ప తన వశంలోనిది కాదని జవాబిచ్చాడు. ప్రతి విశ్వాసి పట్లా దేవునికి అత్యంత నిర్దిష్టమైన సంకల్పాలున్నాయి. దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసే పరిణామాలే విశ్వాసి జీవితంలో సంభవిస్తుంటాయి. తన రాజ్యంలో యాకోబు, యోహానుల స్థానమేమిటో దేవుడు నిశ్చయించాడు. అందువల్ల ఆ విషయంలో దేవుని సంకల్పమే నెరవేరుతుంది తప్ప, వారి తల్లి ప్రార్థన ఫలించదు. యేసుకు కుడి ఎడమల స్థానాల్లో కూర్చోవడం గొప్ప విషయమనుకుంటుంది వారి తల్లి. కాని అంతకన్నా ఫలభరితమైన, ఆశీర్వాదకరమైన స్థానాలను దేవుడు వారికివ్వదలచుకున్నాడు (మత్త 21–24). ఎంతో లోతైన, మర్మయుక్తమైన భావాలున్న సంఘటన ఇది. అదే మత్తయి సువార్తలో ‘అడగండి మీకిస్తాను’ అన్నాడు యేసు (మత్తయి 7:7). ఇప్పుడేమో నీవడిగింది నేనివ్వలేనంటున్నాడు ఆ శిష్యుల తల్లితో యేసు. దేవుడు ఏదడిగినా ఇస్తాడు. ఆయన్నడగటం మన హక్కు, మనం పిల్లలం గనక మనమేదడిగితే అదివ్వవలసిన బాధ్యత దేవునిది అన్న ధోరణిలో సాగుతున్న కొందరి ప్రసంగాలు ఈనాడు చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. సువార్త సంపదలు సాధించి పెట్టే సాధనమన్నది వారి సిద్ధాంతం (ప్రాస్పరిటీ గాస్పెల్). బైబిలులోని కొన్ని వాక్యాలను వాటి నేపథ్యం నుండి విడదీసి వాటికి చెప్పే వక్రభాష్యం వల్ల వచ్చే చిక్కు ఇది. విశ్వాసి ప్రార్థనలు దేవుని సంకల్పాల నెరవేర్పునకు దోహదం చేసేవిగా ఉంటే ఆయన అవి తప్పక ఆలకిస్తాడు. ఎందుకంటే, విశ్వాసికి అత్యంత శ్రేష్టమైన, పర సంబంధమైన వరాలనివ్వాలని ఆశిస్తాడు (యాకోబు 1:17). తాను అత్యుత్తమమైనవి ఇవ్వాలనుకుంటున్నప్పుడు, విశ్వాసి అంతకన్నా తక్కువది ఆశించి ప్రార్థిస్తున్నప్పుడు ఆ ప్రార్థన తప్పక విఫలమవుతుంది. మనం దుర్బుద్ధితో అడిగినా, అజ్ఞానం వల్ల శ్రేష్టమైనవి కానివి అడిగినా దేవుడివ్వడానికి ఇష్టపడడు. మన జీవితాల్లో చాలా ప్రార్థనలు ఫలించకపోవడానికి కారణం అదే. జాగ్రత్తగా ఆలోచిస్తే, ఫలించని ఆ ప్రార్థనల వల్ల కురిసిన ఆశీర్వాదాలూ అర్థమవుతాయి. మనమడిగింది ఇవ్వాలా వద్దా అన్న దేవుని ‘విచక్షణ’ వెనుక మన క్షేమం, దేవుని ఆశీర్వాదం ఉంటాయి. – రెవ.డా.టి.ఎ. ప్రభుకిరణ్ -
నయీమ్ అలియాస్ జేమ్స్
భువనగిరి: గ్యాంగ్‌స్టర్ నయీమ్‌కు మరో పేరు కూడా ఉందా..? ఛత్తీస్‌గఢ్‌లో జేమ్స్ అనే పేరుతో నయీమ్ చలామణి అయ్యాడా? దీనికి అవుననే సమాధానం చెబుతున్నా రు సిట్ అధికారులు. ఆడవేషాలు, బుర్ఖాలు, ముసుగులతో ఎప్పుడూ సంచరించే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు భావిస్తున్నారు. ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసి బెదిరింపులు, భూ ఆక్రమణలు, బలవంతపు వసూళ్లకు పాల్పడిన నయీమ్ ఈ నెల 8న ఎన్కౌంటర్లో హతమైన సంగతి తెలిసిందే. నయీమ్ ఎన్కౌంటర్ అనంతరం కేసు విచారణ జరుపుతున్న సిట్ అధికారులు నయీమ్‌కు జేమ్స్ అనే మరో పేరు కూడా ఉన్నట్టు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నక్సలైట్ల ఉద్యమాన్ని అణిచివేయడానికి పోలీస్ ఇన్ఫార్మర్గా ఉపయోగపడ్డ నయీమ్.. ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పోలీసులకు దగ్గరయ్యాడు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులను ఎదుర్కోవడానికి నయీమ్‌ను ఉపయోగించుకోవాలని అక్కడి పోలీసులు భావించారు. శత్రువులకు చిక్కకుండా ఉండటానికి అప్పుడే నయీమ్ తన పేరును జేమ్స్‌గా మార్చుకున్నట్లు తెలిసింది. భువనగిరిలో సిట్ విచారణ నయీమ్ అతని ముఠా సభ్యులు సాగించిన అరాచకాలపై బాధితుల నుంచి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో నయీమ్ అనుచరులు, సన్నిహితులపై సిట్ నిఘా పెట్టింది. సిట్ అధికారులు గురువారం భువనగిరి, రాయగిరి, యాదగిరిగుట్టలో పలువురిని విచారించారు. భువనగిరిలో నయీమ్‌కు ముఖ్య అనుచరుడు పాశం శ్రీనుతో సాన్నిహిత్యం ఉన్న సుమారు 20 మందికి సంబంధించిన వివరాలను సేకరించారు. వీరిలో పలువురు పాశం శ్రీనుకు దగ్గరగా ఉండే వాళ్లు, భూముల కొనుగోళ్లలో బినామీలు, దందాలో మధ్యవర్తులు, అతనికి సహకరించిన రిజిస్ట్రేషన్, రెవెన్యూ శాఖల అధికారులు, డాక్యుమెంట్ రైటర్ల వివరాలు, వారికి సంబంధించిన నివాస గృహాలు, ఇతర ఆస్తుల వివరాలను సేకరించారు. భువనగిరి గంజ్‌లోని ఓ ప్రముఖ యువ వ్యాపారి, వాహనాల కాంట్రాక్టర్‌ను సిట్ అధికారులు విచారించారు. కొందరిని అదుపులోకి తీసుకుని డీఎస్పీ కార్యాలయానికి తరలించి విచారిస్తున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ అధికారిపై నిఘా భూములు, భవనాలను నయీమ్ గ్యాంగ్ బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసుకున్న కేసుల్లో రిజిస్ట్రేషన్ శాఖకు చెందిన ఓ అధికారిపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది. నయీమ్‌కు సంబంధించిన పలు రిజిస్ట్రేషన్లు ఈ అధికారి ద్వారా ఎక్కువగా జరిగినట్లు సిట్ విచారణలో వెల్లడైంది. భువనగిరి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఉద్యోగిగా ఉన్న ఇతను ప్రస్తుతం అధికారి హోదాలో ఈ ప్రాంతంలోనే పనిచేస్తున్నారు. వివాదాలెన్ని ఉన్నా నిబంధనలను తుంగలో తొక్కి నయీమ్, అతని అనుచరులకు భూములను రిజిస్ట్రేషన్లు చేయించడంలో ఇతను కీలకపాత్ర పోషించాడని సిట్ గుర్తించింది. -
ఐటీ కారిడార్..హైటెక్ బెగ్గింగ్..!
- అనాధాశ్రమం ముసుగులో బిక్షాటన - 19 మంది పిల్లలకు విముక్తి , నిర్వాహకుడి అరెస్టు గచ్చిబౌలి పిల్లలకు విద్యా బుద్దులు నేర్పిస్తాని తెచ్చి బిక్షగాళ్లుగా మార్చిన ఘటన ఐటీకారిడార్ గచ్చిబౌలిలో వెలుగు చూసింది. ఐటీ కారిడార్‌లోని ప్రధాన కూడళ్లలో భిక్షాటన చేయిస్తున్న అనాధాశ్రమం నిర్వాహకుడిని గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ జూపల్లి రమేశ్ కుమార్ తెలిపిన ప్రకారం..కొమ్మవరం గ్రామం, ఇల్లెందు మండలం ఖమ్మం జిల్లాకు చెందిన మాలిపెద్ది జేమ్స్(36) ఆర్సీపురం మండల పరిధిలోని అమీన్పూర్లో 2012లో బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నెలకొల్పాడు. నల్గొండ, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలోని పేద కుటుంబాలకు చెందిన పిల్లలను మంచి చదువులు చదివిస్తానని చెప్పి అనాధాశ్రమానికి తీసుకొచ్చాడు. స్థానికంగా జడ్పీహెచ్ఎస్, అర్నాల్డ్ హైస్కూల్లో విద్యార్థులను చేర్పించాడు. ఈ క్రమంలో ఈ నెల 16న కొండాపూర్, కొత్తగూడ జంక్షన్లో మోహన్ , శివ, కార్తీక్, అఖిల, వెంకటేశ్‌లచే భిక్షాటన చేయించాడు. బుధవారం ట్రిపుల్ ఐటీ జంక్షన్, టీసీఎస్ కంపెనీ ముందు జెర్కిన్ ధరించి, డొనేషన్ బాక్స్‌లతో అడుక్కుంటున్నఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలను బీట్ కానిస్టేబుల్ గమనించాడు. వారిలో ఇద్దరి దగ్గరకు పిలిచి డొనేషన్ ఎందుకు అని ఆరా తీశారు. దీంతో పిల్లలు తాము అనాధాశ్రమం నుంచి వచ్చామని.. జేమ్స్ చెప్పడంతో డబ్బులు అడుగున్నామని చెప్పారు. పోలీసులు జేమ్స్ ఎక్కడ అని అడగగా... రోడ్డు కు అవతలి వైపు ఉన్నాడని చెప్పారు. అప్పటికే జేమ్స్ అక్కడి నుంచి జారుకోవడంతో.. పోలీసులు చైల్డ్ హెల్ప్ లైన్ కు ఫోన్ చేశారు. బుధవారం రాత్రి 8 గంటల సమయంలో ఆర్సీపురం పోలీసుల సహకారంతో గచ్చిబౌలి పోలీసులు, చైల్డ్ వెల్ఫేర్ డైరెక్టర్ చందు బ్రహ్మపుత్ర ఆశ్రమంపై దాడి చేశారు. 19 మందికి విముక్తి అమీన్‌పూర్‌లోని బ్రహ్మపుత్ర అనాధాశ్రమంపై దాడి చేసి 19 మంది బాలబాలికలకు విముక్తి కల్గించారు. వీరిలో 5గురు అమ్మాయిలు కాగా 14 మంది అబ్బాయిలున్నారు. ఒక విద్యార్థికి ఆరోగ్యం బాగాలేక పోవడంతో జేమ్స్ ఇటీవల ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. వీరందరికీ.. అమీన్‌పూర్‌లోని మహిమ ఫౌండేషన్‌లో ఆశ్రయం కల్పించారు. జేమ్స్ పై జువెనైల్ యాక్ట్ 76(1), బెగ్గింగ్ యాక్ట్ 27, ఐపీసీ 420 కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఖర్చు భరించలేకే భిక్షాటన: జేమ్స్ దాతలు సహకారంతోనే బ్రహ్మపుత్ర అనాధాశ్రమం నడిపిస్తున్నానని నిర్వాహకులు ఎం.జేమ్స్ తెలిపారు. ఆర్నాల్డ్ హైస్కూల్లో చదివించే విద్యార్థులకు ఫీజు చెల్లించలేని పరిస్థితులలో చిన్నారులచే భిక్షాటన చేయించానని ఆయన పేర్కొన్నారు. ఆలా చేయించడం తప్పేనని ఒప్పు కున్నాడు. -
క్రియలు లేని విశ్వాసం మృతం
దేవుని ప్రేమను, గొప్పదనాన్ని విశ్వాసి జీవనశైలి ద్వారానే లోకం స్పష్టంగా తెలుసుకుంటుంది. అందుకే క్రియలు లేని విశ్వాసం మృతప్రాయం అంటుంది బైబిలు (యాకోబు2:17). నీకిష్టమైతే నన్ను బాగుచేయమంటూ ఒక కుష్ఠురోగి యేసుక్రీస్తును ప్రాధేయపడ్డాడు. దానికిష్టమేనంటూ ప్రభువతన్ని బాగుచేశాడు. ఎన్నో ఏళ్ల అతని శాపగ్రస్థమైన జీవితానికి దేవుని కృపవల్ల కొన్ని క్షణాల్లో అలా తెరపడింది. అయితే ఆ వెంటనే అత్యంత ప్రాముఖ్యమైన హెచ్చరికను ప్రభువు జారీ చేశాడు. ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు. కానీ సాక్ష్యార్థమై నీ దేహాన్ని యాజకునికి కనపర్చుకొని మోషే నియమించిన కానుక చెల్లించు’ అన్నాడు యేసుప్రభువు (మత్తయి 8:1-4). దేవుని అద్భుతాన్ని చవిచూసినవాడు ఏం చేయాలో, ఏం చేయకూడదో యేసు తెలిపిన ఉదంతమిది. దేవుడు అద్భుతం చేశాడని చెప్పుకోవాలనుకోవడం సహజమే! కాని ఆ ‘కృతజ్ఞతాభావం’ విశ్వాసి మాటల్లో కాదు చేతల్లో లోకానికి వెల్లడి కావాలన్నది ప్రభువు మాటల తాత్పర్యం. కుష్ఠురోగం అంతకాలంగా అతన్ని లోకానికి, దేవునికి కూడా దూరంగా ఉంచింది. కాబట్టి అతను ముందుగా దేవాలయానికి వెళ్లి, యాజకునికి కనబర్చుకొని దేవుని ఆరాధించాలి. ఆ తర్వాతే సమాజంలోకి వెళ్లాలి. దేవుడు అద్భుతం చేసి గండం గట్టెక్కించే వరకూ దేవుని ప్రాధేయపడటం, ఉపవాస ప్రార్థనలు చేయడం షరా మామూలే! అద్భుతం జరిగి గండం గడిచాక దేవుని మాటల్లో స్తుతించడమే తప్ప దేవునికి మరింత దగ్గరై జీవితాన్ని సరిదిద్దుకోవాలన్న ఆలోచనే లేకపోవడం విషాదకరం. మార్పు లేకుండా జీవించే వాడు ఎంత మాట్లాడినా దేవునికి మహిమ కలగదు. మన పెదాలు దేవుని స్తుతిస్తుంటే, మన జీవితం నిండా దైవవ్యతిరేకత అనే దుర్గంధముంటే, అది దేవునికెంత అవమానకరం? జీవితాన్ని పూర్తిగా మార్చేదే నిజమైన కృతజ్ఞత! మాటల్లో, పాటల్లో, ప్రసంగాల్లో టన్నులకొద్దీ కుమ్మరిస్తున్నాం కానీ చేతల్లో అణుమాత్రం కూడా చూపడం లేదు. దేవుని పట్ల కృతజ్ఞతతో మనం మారితే ఆ మార్పును లోకం స్తుతిస్తుంది. ఆ పెనుమార్పుకు కారణమేమిటో, దేవుడు చేసిన అద్భుతమేంటో దేవుడెవరో అలా మనం చెప్పకుండానే లోకం తెలుసుకుంటుంది. అందుకే ‘ఎవరితోనూ ఏమీ చెప్పవద్దు’ అన్నది ప్రభువు అతనికిచ్చిన ఆజ్ఞ. మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపర్చబడతాడన్నాడొకసారి యేసుప్రభువు (యోహాను 15:8). చెట్టెప్పుడూ తన గొప్పదనాన్ని చెప్పుకోదు, ప్రసంగాలు చేయదు, పాటలు పాడదు. లోకానికి తియ్యటి తన ఫలాలనిస్తుందంతే! దేవునికోసం ఫలించడమంటే లోక కల్యాణార్థం, దీనుల సహాయార్థం మౌనంగా సత్కార్యాలు చేయడమే! తన సమస్యల్లో ఆదుకొని అద్భుతాలు చేసిన దేవుని పట్ల నిజంగానే కృతజ్ఞత కలిగిన విశ్వాసి, తోటి మానవుల సమస్యల పట్ల స్పందించకుండా ఉండలేడు. దేవునికోసం నేనేం మాట్లాడాలి? అని కాక దేవుని పేరిట దీనులకోసం నేనేం చేయాలి? అన్న ధ్యాసతో విశ్వాసి నిరంతరం రగిలిపోవాలి. అయితే దేవునికోసం ఏదైనా చేయమని హృదయం చెబుతుంటే, అది చేయకుండా ఉండేందుకు మెదడు రకరకాల సాకులు చూపెడుతుంటుంది. సాకులు తయారు చేసే మహాయంత్రమైన మన మెదడే మనకు ప్రధానమైన అవరోధమవుతుంది. మండుటెండకు కాగుతున్న వ్యక్తికి గిన్నెడు చల్లటి నీళ్లిచ్చినా అది అద్భుతమైన పరిచర్య అంటాడు ప్రభువు (మత్తయి 10:42). ఎందుకంటే ఆ పరిస్థితుల్లో మనమిచ్చే గిన్నెడు చల్లనీళ్లే, సముద్రమంత దేవుని ప్రేమను పరిచయం చేస్తాయి. - రెవ.టి.ఎ.ప్రభుకిరణ్ -
100 ఏళ్ల క్రితం చనిపోయి.. మళ్లీ పుట్టాడు
అతనికిప్పుడు నాలుగేళ్లు.. కానీ, వందేళ్ల క్రితమే అతను చనిపోయాడు.. ఇప్పుడు సెకండ్‌లైఫ్ స్టార్ట్ చేశాడు... నిజం.. యూరప్‌లోని ఒక మారుమూల ప్రాంతంలో అతను రెండోసారి జీవిస్తున్నాడు. అతని పేరు ఎడ్వర్డ్.. తల్లి కడుపులో పుట్టడానికి ముందే అతను జీవించాడు. వందేళ్ల క్రితం వీరుడిగా బతికాడు. మొదటి ప్రపంచ సంగ్రామంలో ఫ్రెంచి సైన్యాలకు బాసటగా నిలిచి వీరమరణం పొందాడు. ఇప్పుడు మళ్లీ జీవిస్తున్నాడు. ఇదేమీ కట్టుకథ కాదు.. నిజం. నాలుగేళ్ల బాలుడు తన పూర్వ జన్మ గురించి చెప్తున్న వాస్తవం.. తల్లిదండ్రులకు.. వైద్యులకు సైతం విస్మయం కలిగించే విచిత్రకథ. ఎడ్వర్డ్ ఆస్ట్రియన్ అనే ఈ నాలుగేళ్ల పిల్లాడికి గొంతులో ఏదో సమస్య రావటంతో అతని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు. డాక్టర్లు పరీక్షించి అతని గొంతులో ఒక గడ్డ ఉందని, దానిచుట్టూ టాన్సిల్స్ ఉన్నాయని తేల్చారు. ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రి నుంచి ఇంటికొచ్చాక తల్లి ప్యాట్రీషియా అతను అతి కష్టం మీద అన్న మాట.. ‘నాకు బుల్లెట్ తగిలింది’! అని.. మొదట ప్యాట్రీషియా ఈ విషయాన్ని అంతగా పట్టించుకోలేదు. డాక్టర్లు శస్త్రచికిత్స చేయడానికి తేదీ నిర్ణయించారు. మొదటి దశలో గడ్డ చుట్టూ ఉన్న టాన్సిల్స్‌ను తొలగించారు. గొంతు లోని ఇబ్బంది కొంచెం తొలగడంతో ఎడ్వర్డ్ ఒక రోజు అమ్మా నీతో మాట్లాడాలి అన్నాడు. ఈ మాటతో ప్యాట్రీషియాలో ఆనందం మొదలైంది. కానీ ఎడ్వర్డ్ మాటలు విన్నాక భయం, ఆశ్చర్యం ఆమెను వెంటాడాయి. 2015 - 1915... ‘‘మీరు అనుకుంటున్నట్టుగా నా పేరు ఎడ్వర్డ్ కాదు.. జేమ్స్! ఫ్రాన్స్‌లోని మారుమూల పల్లెటూరు మాది. మొదటి ప్రపంచ యుద్ధం మొదలవ్వడంతో కుర్రాళ్లందరిలాగే సైన్యంలో చేరాను. అప్పుడు నా వయసు 18 సంవత్సరాలు. నేను మరణించిన రోజు, ప్రదేశం నాకింకా గుర్తున్నాయి. ఆ ప్రదేశమంతా దట్టమైన చెట్లతో నిండి ఉంది. అక్కడి వాతావరణం కూడా వాన పడుతూ అసౌకర్యంగా ఉంది. నా చుట్టూ చాలా మంది సైనికులున్నారు. ఒక్కసారిగా శత్రుసైన్యం మాపై ఒక్కసారిగా విరుచుకుపడింది. ఒక బుల్లెట్ వేరే సైనికుడికి తగిలి అతని శరీరంలోంచి బయటకు వచ్చి నా గొంతులో దిగింది. నేను మరణించాను అన్నాడు ఎడ్వర్డ్. ఈ కథ విన్న ప్యాట్రీషియా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. అంతే కాదు.. రెండో దశలో టాన్సిల్స్ మధ్యలో ఉన్న గడ్డను తొలగించే ఆపరేషన్ కోసం ఆసుపత్రికి తీసుకువచ్చిన ఎడ్వర్డ్ ను పరీక్షించిన వైద్యులకు మరోషాక్. అతని గొంతులోని గడ్డ మాయమైంది. ఇది సహజంగా మాయమయ్యేది కాదని.. ఎలా జరిగిందో అర్థం కావటం లేదని వైద్యులే అవాక్కయ్యారు. పునర్జన్మ గురించి కథలు వినడమే కానీ.. ఎడ్వర్డ్ చెప్పిన కథనం మరింత ఆసక్తికరంగా మారింది. - సాక్షి, సెంట్రల్ డెస్క్ -
చెరిల్ జేమ్స్ మరణంపై మరోసారి విచారణ!
బ్రిటిష్ ఆర్మీకి చెందిన డీప్ కట్ సైన్య శిబిరాల్లో లైంగిక వేధింపుల సంస్కృతి కొనసాగుతున్నట్లు గతంలో ఎన్నో ఆధారాలు కనిపించినా పట్టించుకున్నవారే లేరు. అయితే సైన్యంలో శిక్షణ పొందుతూ 'చెరిల్ జేమ్స్' మరణించడం వెనుక దారుణ చరిత్ర ఉందని తాజా విచారణలో బయట పడుతోంది. సరైన సాక్ష్యాధారాలు సమర్పించకపోవడంతో అప్పట్లో కేసును హైకోర్టు కొట్టేసింది. కాగా చెరిల్ జేమ్స్ మరణంపై న్యాయ విచారణ చేపట్టాలని ఆమె కుటుంబం తరపున మానవ హక్కుల సంఘం ముందుకు రావడంతో తిరిగి విచారణ ప్రారంభమైంది. 1995 లో డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతున్న చెరిల్ జేమ్స్ బుల్లెట్ గాయాలతో మరణించింది. అయితే అప్పటినుంచీ విచారణ చేపట్టిన కోర్టు... 2014 లో తగిన ఆధారాలు లేకపోవడంతో కేసును కొట్టేసింది. తాజాగా 18 ఏళ్ళ.. సోల్జర్ పీటర్ జేమ్స్ కేసులో ఆమె కుటుంబం తరపున లిబర్టీ మావన హక్కుల సంఘం... కోర్టు ముందు తన వాదనను వినిపించింది. బ్రియాన్ బార్కర్ క్యూసీ అధ్యక్షతన ప్రారంభమైన న్యాయ విచారణకు ముందు.. పీటర్ జేమ్స్ తండ్రి.. దేశ్... తన కుమార్తెతోపాటు, డీప్ కట్ లో వేధింపులతో మరణించిన యువసైనికులందరికీ న్యాయం జరగాలని భావిస్తున్నట్లు తెలిపారు. డీప్ కట్ క్యాంపులో అదుపులేని మద్యం, డ్రగ్ సంస్కృతి కూడా కొనసాగుతున్నట్లు తమకు తెలిసిందని దేశ్ వెల్లడించారు. శిబిరంలో కొనసాగుతున్న ఇటువంటి దారుణ సంస్కృతే నలుగురు యువ సైనికుల మరణానికి కారణమైందన్నారు. ఐస్ బర్గ్ కు చివరి భాగంలో ఉండే డీప్ కట్ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలు ఇప్పటికైనా ప్రపంచానికి తెలియాలని, ఆ నలుగురు యువ సైనికులకు న్యాయం జరగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ళుగా డీప్ కట్ శిబిరంలో జరుగుతున్న దారుణాలు వెలుగులోకి వస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తమ కూతుర్ని కోల్పోయిన నేటి తరుణంలోనైనా అక్కడి దారుణ చరిత్ర బహిర్గతం అవుతుందని ఆశిస్తున్నామన్నారు. 1995-2002 మధ్య చెరిల్ జేమ్స్ తో పాటు... బెంటన్ జేమ్స్, కొలిన్, జియోఫ్ గ్రే కూడా డీప్ కట్ లో తుపాకీ గాయాలతోనే మరణించారు. కుడికన్నుకు, ముక్కుకు మధ్య భాగంలో తగిలిన బుల్లెట్ గాయంతో 1995 లో పీటర్ జేమ్స్ మరణించింది. ఆ సమయంలో ఆమె... బ్రిటన్ సౌత్ వేల్స్ లంగోలెన్ లోని డీప్ కట్ సైన్య శిబిరంలో శిక్షణ పొందుతోంది. 1995- 2002 కు మధ్య డీప్ కట్ లో బుల్లెట్ గాయాలతో మరణించిన యువ సైన్యం నలుగురిలో జేమ్స్ ఒకరు. అక్కడి వేధింపుల సంస్కృతి నేపథ్యంలోనే వారంతా మరణించినట్లు అంతా అనుకున్నా.. కోర్టుకు తగిన సాక్ష్యాలు మాత్రం అందించలేక పోయారు. అయితే మొదటి దర్యాప్తులో జరిగిన న్యాయ విచారణకు విరుద్ధంగా తాజా విచారణలో కనీసం 100 మంది సాక్షుల ఆధారాలను అందించాలని భావిస్తున్నారు. ప్రస్తుతం గంటపాటు జరిగిన విచారణలో ఏడుగురు సాక్షులను ప్రవేశ పెట్టి వారి సాక్ష్యాలను రికార్డు చేశారు. పీటర్ జేమ్స్ తన మరణానికి కొద్ది సమయం ముందు సీనియర్ల లైంగిక దాడికి గురైందన్న ఆరోపణ నేపథ్యంలో ఈ తాజా విచారణ ప్రారంభమైంది. -
సంద్రాన నగరం... సడి లేక మాయం!
మిస్టరీ జూన్ 7, 1692... జమైకా... మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. కరీబియన్ సముద్రపు అలలపై ఓ నౌక అల్లనల్లన సాగిపోతోంది. నౌకలో ఉన్న ముగ్గురూ ఎవరి మానాన వాళ్లు సీరియస్‌గా ఆలోచిస్తున్నారు. అంతలో ఒకతను అన్నాడు. ‘‘అలెక్స్... నువ్వన్నదే ఫైనలా?’’ అలెక్స్ ఆలోచనల్లోంచి బయట పడ్డాడు. ‘‘అవును జేమ్స్... అదే ఫైనల్. ఇంత దూరం వచ్చాక కూడా డౌటుగా అడుగుతావే’’ అన్నాడు సీరియస్‌గా. మూడో వ్యక్తి ఆ ఇద్దరి వైపూ ఓసారి చూశాడు. తర్వాత అన్నాడు.. ‘నాకెందుకో ఇది రిస్కేమో అనిపిస్తోంది ఫ్రెండ్స్. పోర్ట్ రాయల్ సిటీకి వెళ్లడమంటే మాటలా?’’ అలెక్స్‌కి నవ్వొచ్చింది. ‘‘దొంగోడికి మరో దొంగోడి దగ్గరకు వెళ్లడానికి భయమేంట్రా బిల్లీ?’’ అన్నాడు. జేమ్స్ పకపకా నవ్వాడు. బిల్లీకి మాత్రం నవ్వు రాలేదు. అతనికి భయంగా ఉంది. పోర్ట్ రాయల్ సిటీ గురించి అతను చాలా విన్నాడు. అక్కడ కరడుగట్టిన గజదొంగలుంటారు. ఏదైనా తేడా వస్తే సొమ్ములతో పాటు ప్రాణాలను సైతం దోచుకుంటారు. జాలి, దయ అనేవి వాళ్ల డిక్షనరీలోనే ఉండవు. అలాంటి వాళ్ల దగ్గరికి వెళ్లడం అతనికి ఏమాత్రం ఇష్టం లేదు. కానీ వెళ్లక తప్పని పరిస్థితి. దాదాపు పదేళ్లుగా వాళ్లు ముగ్గురూ కలిసి దొంగతనాలు చేస్తున్నారు. కానీ మొదటిసారి ఓ చోరీ కేసులో తమ గురిం చిన ఆధారాలు పోలీసులకి దొరికాయి. వాళ్లు కచ్చితంగా తమను పట్టేస్తారు. అందుకే పారిపోయి పోర్ట్ రాయల్ నగరంలో తలదాచుకుందామని అలెక్స్ ప్లాన్ వేశాడు. ఒక రకంగా అతని ఆలోచన కరెక్టే. ఎందుకంటే ఆ పట్టణం... ఓ ప్రత్యేక ప్రపంచం. నేరస్తులకి అది స్వర్గం. అక్కడి వాళ్లు ఎవరినీ లెక్క చేయరు. ఎవరికీ భయపడరు. తమ జోలికి వస్తే ఎవరినీ వదిలిపెట్టరు. వాళ్లను మంచి చేసుకుని అక్కడ సెటిలైపోతే, ఇక తమనెవరూ పట్టు కోలేరు అంటాడు అలెక్స్. కానీ బిల్లీకి సందేహం... తాము అక్కడ ఉండటానికి వాళ్లు అనుమతిస్తారా లేదా అని. అదే అంటే కొట్టి పారేశాడు అలెక్స్. తాను వాళ్లను ఒప్పిస్తానన్నాడు. అతడు ఓసారి ఫిక్సయ్యాడంటే ఇక ఎవరి మాటా వినడు. అందుకే ఇష్టం లేకపోయినా మౌనంగా ఉండిపోయాడు బిల్లీ. ‘‘జేమ్స్, బిల్లీ... పది నిమిషాల్లో అక్కడ ఉంటాం. ఇక మనల్నెవ్వరూ పట్టుకోలేరు’’... అన్నాడు అలెక్స్ ఆనందంగా. పది నిమిషాలు గడిచాయి. పదిహేను నిమిషాలు గడిచాయి. కానీ ఎంతకీ సిటీని చేరుకోవడం లేదు పడవ. ‘‘ఏది అలెక్స్... పది నిమిషాలే అన్నావ్. ఎంత దూరం పోయినా సిటీ రావడం లేదే’’ అన్నాడు జేమ్స్ అనుమానంగా. వెంటనే చుట్టూ చూశాడు అలెక్స్. దూరంగా ఓ పక్కన కింగ్స్టన్ హార్బర్ కనిపిస్తోంది. దానికి దగ్గర్లో మరో పక్కగా ఉండే దీవి, ఆ దీవి మీద ఉండాల్సిన పోర్ట్ రాయల్ నగరం మాత్రం కనిపించడం లేదు. కళ్లు నులుముకుని మళ్లీ చూశాడు. అంతా శూన్యం. భవంతులు లేవు. రేవులో కట్టేసి ఉండే పడవలు లేవు. అసలక్కడ ఏమీ లేదు. ‘‘ఏంట్రా ఇది? సిటీ ఏది?’’ అన్నాడు అయోమయంగా. ‘‘మనం తప్పు అడ్రస్‌కి వచ్చామేమో’’ అన్నాడు బిల్లీ సందేహంగా. ‘‘నీ ముఖం. నిన్న నేను వచ్చి అన్నీ పరిశీలించాను కదా. పోర్ట్ రాయల్ నగరం ఇక్కడే ఉండాలి. కానీ ఇప్పుడు కనిపించడం లేదు. నిన్న ఇక్కడే ఉన్నది ఇవాళ ఏమైపోతుంది?’’ అలెక్స్ మాటలు విని ఆశ్చర్యపోయా రిద్దరూ. నిన్న ఉందా? ఇవాళ లేదా? అంత పెద్ద నగరం ఉన్నట్టుండి ఎలా మాయమవుతుంది? రెండువేల ఇళ్లు ఎలా మాయమైపోతాయి? అందులో ఉండే మనుషులందరూ ఏమైపోతారు? తలలు బద్దలయ్యేలా ఆలోచించారు ముగ్గురూ. కానీ ఏం అర్థం కాలేదు. దాంతో మౌనంగా వెనుదిరిగారు. నిజానికి వాళ్లకే కాదు... వాళ్ల ద్వారా పోర్ట్ రాయల్ నగరం గురించి విన్న వాళ్లెవరికీ ఏమీ అర్థం కాలేదు. పోర్ట్ రాయల్ ఒక్కసారిగా అంతర్థానమై పోయింది. మొండి గోడలు కాదు కదా, ఎక్కడా చిన్న ఇటుక ముక్క కూడా కనిపించడం లేదు. అలా ఎలా జరిగింది? అసలా పట్టణానికి ఏమయ్యింది? జమైకా దేశానికి ఈశాన్య దిశలో... కరీబియన్ సముద్ర జలాల్లో ఒక దీవి ఉంది. 1494లో కొలంబస్ ఈ దీవిని కనుక్కున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు కొందరు మత్స్యకారులు ఆ దీవి మీద నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. నాటి నుంచీ మెల్లగా జనాభా పెరిగింది. అయితే 1655లో బ్రిటిష్‌వారు ఆక్రమించుకున్న తర్వాత ఈ దీవి రూపమే మారిపోయింది. ఆంగ్లేయులు ఈ ద్వీపాన్ని అందంగా మార్చాలనుకున్నారు. పెద్ద పెద్ద ఇళ్లు, చక్కని దుకాణాలతో ఓ అందమైన నగ రాన్ని నిర్మించారు. దానికి పోర్ట్ రాయల్ సిటీ అని పేరు పెట్టారు. మెల్లగా జనాభా పెరిగింది. వ్యాపారాలు వెలిశాయి. సంపద కూడా పెరిగింది. కానీ అక్కడి వారికి ప్రశాంతత మాత్రం కరువైంది. ఎందుకో తెలియదు కానీ... పోర్ట్ రాయల్‌లో తరచుగా భయంకర వ్యాధులు ప్రబలుతూ ఉండేవి. ఎంతోమంది వాటి బారిన పడి అల్లాడేవారు. అలాగే అప్పు డప్పుడూ భూకంపాలు కూడా వచ్చి ఆస్తి నష్టం సంభవిస్తూ ఉండేది. ఒక్కోసారి హరికేన్లు విరుచుకుపడి పంటల్ని నాశనం చేసేవి. ఇవన్నీ కలిసి పోర్ట్ రాయల్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసేసేవి. దాంతో మెల్లగా వారి సంపద తగ్గుతూ వచ్చింది. ఓ సమయంలో కరవు కూడా ఏర్పడింది. కానీ అప్పుడే పోర్ట్ రాయల్ నగరం మరో కొత్త రూపును సంతరించు కోవడం మొదలైంది. తమ అవసరాలను తీర్చుకోవడం కోసం అక్కడి ప్రజల్లో కొందరు సముద్రపు దొంగలుగా మారారు. సముద్ర మార్గాన వెళ్లేవారిని దోచుకోవడం మొదలుపెట్టారు. తక్కువ కష్టం, ఎక్కువ లాభం. జీవితాలు మారిపోయాయి. సంపదలో మునిగి తేల సాగారు. వారిని చూసి మిగతావారంతా కూడా అదే పనికి పూనుకున్నారు. కొన్నాళ్లు గడిచేసరికి ఒక్కొక్కరుగా అందరూ దొంగలైపోయారు. దాంతో పోర్ట్ రాయల్ సిటీ కాస్తా పైరేట్ సిటీగా మారిపోయింది. అయితే వాళ్లు దొంగతనాల దగ్గరే ఆగి పోలేదు. చేతినిండా సొమ్ము ఉండటంతో విపరీతమైన విలాసాలకు అలవాటు పడ్డారు. ఎప్పుడూ మత్తులో మునిగి తేలే వారు. వ్యభిచారులుగా తయారయ్యారు. ఓడలను అడ్డుకుని దోచుకోవడమే కాక, మహిళలను ఎత్తుకొచ్చి బంధించేవారు. అత్యాచారాలు చేసేవారు. తర్వాత వారిని చంపి సముద్రంలో పారేసేవారు. మెల్లగా వీరి అక్రమాలు బయటకు వచ్చాయి. ప్రభుత్వ అధికారులు పోర్ట్ రాయల్‌లో జరిగే దారుణాలను ఆపాలని అనుకున్నారు. కానీ వీలు కాలేదు. ఎందు కంటే అక్కడి మనుషులంతా అప్పటికే క్రూరంగా మారిపోయారు. ఎవరినీ తమ పట్టణంలో అడుగు పెట్టనిచ్చేవారు కాదు. వాళ్లు అనుకున్నదే న్యాయం, చేసిందే చట్టం. ఎవరైనా వాళ్లకు వ్యతిరేకంగా నడచుకుంటే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడేవారు కాదు. అక్కడికి వెళ్లినవాళ్లు తిరిగి వస్తారనే నమ్మకం లేకపోవడంతో వెళ్లే ధైర్యం ఎవరూ చేసేవారు కాదు. దాంతో అడ్డూ అదుపూ లేక నగరం పూర్తిగా దుర్మార్గాలతో, అక్రమాలు అన్యాయాలతో నిండిపోయింది. అలాంటి ఆ సిటీ... 1692లో ఓ రోజు కనిపించకుండా పోయింది. రెండువేలకు పైగా ఇళ్లు... మార్కెట్లు, దుకాణాలు... ఏ ఒక్కటీ అక్కడ లేదు. వేలమంది జనాభాలో ఒక్కరి జాడ కూడా అక్కడ కనిపించలేదు. చేతితో తీసేసినట్టుగా ప్రపంచపటం నుంచి దాని ఆనవాళ్లు తుడిచి పెట్టుకుపోయాయి. ప్రపంచం అవాక్కయ్యింది. ప్రజానీకం విస్తుపోయింది. పైరేట్ సిటీకి ఏమయ్యిందా అంటూ ఎంక్వయిరీ మొదలుపెట్టింది. కానీ కారణాలు మాత్రం కనిపెట్టలేకపోయింది. భూకంపం వచ్చిందన్నారు కొందరు. సునామీ వచ్చి ఉంటుందన్నారు ఇంకొందరు. రెండూ కలిసి వచ్చి ఉంటాయి, అందుకే నామ రూపాలు లేకుండా పోయింది అన్నారు మరికొందరు. వాళ్లు అలా అనడానికి కారణం ఉంది. పోర్ట్ రాయల్ నగరం నిర్మితమైంది నిజానికి దీవి మీద కాదు. అసలు అది దీవే కాదు. పొరలు పొరలుగా ఇసుక మేట వేయడం వల్ల ఏర్పడిన నేల. దానికి బలం ఉండదు. ఆ వాస్తవాన్ని గుర్తించకుండా, దాని మీద నగరాన్ని నిర్మించారు. కాబట్టి అది సముద్రంలోకి కుంగిపోయి ఉంటుందని అంచనా వేశారు. కొందరైతే ఇదంతా దేవుడి శాపం అన్నారు. పాపంతో నిండిపోయిన పైరేట్ సిటీని చూసి దేవుడు ఆగ్రహించాడని, అందుకే ఆ నగరాన్ని రాత్రికి రాత్రే నాశనం చేశాడని అభిప్రాయపడ్డారు. అయితే ఇవన్నీ అభిప్రాయాలు మాత్రమే. ఊహల ఆధారంగా వేసిన అంచనాలు మాత్రమే. నిజంగా పైరేట్ సిటీ ఎందుకు మాయమైంది అన్నది ఇప్పటికీ ఒక ముడి వీడని మిస్టరీనే! ఒకనాటి పైరేట్ సిటీ వర్ణచిత్రం రెండు సంవత్సరాల క్రితం కరీబియన్ సముద్రపు అడుగున కొన్ని భవనాల అవశేషాలు కనిపించాయి శాస్త్రవేత్తలకు. సరిగ్గా అదే ప్రాంతంలో ఒకప్పుడు పైరేట్ సిటీ ఉండేది. దాంతో సదరు భవనాలు ఆ సిటీకి సంబంధించినవేనని, సునామీ వల్లనో భూకంపం వల్లనో పైరేట్ సిటీ సముద్రంలో కలిసిపోయిందని అన్నారు వారు. అయితే దాన్ని నిర్థారించేందుకు తగిన ఆధారాలు వారికి ఇంకా లభ్యం కాలేదు. ఒకవేళ లభ్యమైతే మిస్టరీ విడిపోతుంది. లేదంటే పైరేట్ సిటీ అంతర్థానం ఎప్పటికీ రహస్యంగానే మిగిలిపోతుంది. -
అవార్డుల కాంతి..
నింగిలో పచ్చని రంగులో మెరిసిపోతున్న ఉత్తర ధ్రువ కాంతులు.. కింద నీటిలో దాని ప్రతిబింబం.. ఐస్లాండ్లోని వత్నజోకల్ నేషనల్ పార్కు వద్ద బ్రిటన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ వుడ్ఎండ్ తీసిన చిత్రమిది. ఇదింత బాగుంది కాబట్టే.. తాజాగా ప్రకటించిన ఆస్ట్రోనమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్విచ్ , బీబీసీ స్కై వాళ్లు ఏటా ప్రదానం చేస్తున్నారు. -
రెబెక్కాకు కలసి వచ్చే కాలం వచ్చింది
కలసివచ్చే కాలం వస్తే నడచి వచ్చే కొడుకు పుడతాడంటారు. అయితే న్యూజిలాండ్‌కు చెందిన రెబెక్కా ఓల్డమ్కు నడిచి వచ్చే కొడుకు పుట్టకపోయినా.. తాను షాక్‌కు గురయ్యేలా.. కొడుకు పుట్టేశాడు. విషయం ఏంటంటే.. 25 ఏళ్ల రెబెక్కా కొంతకాలంగా తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. మూడుసార్లు స్కాన్లు, రెండుసార్లు రక్త పరీక్షలు, ఆరుసార్లు ప్రెగ్నెన్సీ పరీక్షలు చేసిన తర్వాత ఆ నొప్పికి కడుపులోని ఓవరీస్ కారణమని వైద్యులు తేల్చారు. ఓవరీస్ తొలగిస్తే ఇక పిల్లలు పుట్టరని తెలిసినా నొప్పి భరించలేకపోతున్న రెబెక్కా వాటిని తొలగించాలనే నిర్ణయానికి వచ్చి ఆపరేషన్‌కు సిద్ధమైంది. శస్త్రచికిత్స మొదలుపెట్టిన వైద్యులు రెబెక్కా కడుపులో పూర్తిగా ఎదిగిన, ఆరోగ్యవంతమైన మగ బిడ్డను చూసి ఆశ్చర్యపోయారు. సిజేరియన్ ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అనుకోని పుత్రోదయంతో రెబెక్కా, ఆమె భర్త జేమ్స్ టిపేన్ పట్టలేని ఆనందం వ్యక్తం చేశారు. ఇప్పటికే వీరికి 20 నెలల హేలే ఉన్నాడు. దీనిపై ఆస్పత్రి ప్రతినిధి మాట్లాడుతూ.. ప్రతి ఆరు వందల మంది గర్భిణుల్లో ఒకరికి తాము గర్భం ధరించామనే విషయం తెలియదన్నారు. ఇది సాధారణంగా పనిచేసే మహిళల్లో, మెనోపాజ్‌కు చేరువలో ఉన్న వాళ్లలో జరుగుతుందన్నారు. కొంతమంది గర్భవతులుగా ఉన్నా బ్లీడింగ్ జరుగుతూనే ఉంటుందన్నారు. రెబెక్కా కేసు కూడా ఇలాంటి కోవలోదేనని తేల్చేసి తమ తప్పును కప్పిపుచ్చేసున్నారు.