List of Upcoming Movies and Web Series Release On OTT And Theatres in March 3rd Week - Sakshi
Sakshi News home page

Upcoming Movies: మార్చి 3వ వారంలో వస్తున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు..

Published Mon, Mar 14 2022 3:57 PM | Last Updated on Mon, Mar 14 2022 4:45 PM

List of Upcoming Movies Release On OTT And Theatres in March 3rd Week - Sakshi

సినీలవర్స్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో వినోదం కోసం వేచిచూసిన సగటు ప్రేక్షకుకుడికి వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు వరుసగా బాక్సాఆఫీస్‌ ముందు క్యూ కడుతున్నాయి. వారానికి ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు రిలీజ్‌ అవుతుంటే మధ్యలో చిన్నచిన్న సినిమాలు రిలీజ్‌ అవుతూ సందడి చేస్తున్నాయి. గత వారం థియేటర‍్లలో రాధేశ్యామ్‌, ఈటీ, ఓటీటీలో మారన్ వంటి భారీ చిత్రాలు రిలీజయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్‌లో ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం..

జేమ్స్‌
దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ చివరగా నటించిన చిత్రం 'జేమ్స్‌'. చేతన్‌కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కిశోర్‌ పత్తికొండ నిర్మించారు. ఇందులో పునీత్‌ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. తెలుగు నటుడు శ్రీకాంత్‌ విలన్‌గా నటించాడు. పునీత్‌ రాజ్‌కుమార్‌ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ మార్చి 17న విడుదల చేస్తున్నారు.

స్టాండప్‌ రాహుల్‌
రాజ్‌ తరుణ్‌, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'స్టాండప్‌ రాహుల్‌'. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్‌ వీరంకి దర్శకత్వం వమించిన ఈ సినిమాను నందకుమార్‌ అబ్బినేని, భరత్‌ మాగలూరి నిర్మించారు. ప్రేమ, స్టాండప్‌ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది.

నల్లమల
అమిత్‌ తివారి, భానుశ్రీ జంటగా నటించిన సినిమా 'నల్లమల'. రవి చరణ్‌ తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నారు. నాజర్‌, తనికెళ్ల భరణి, కాలకేయ ప్రభాకర్‌, అజయ్‌ ఘోష్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్‌, ఏమున్నవే పిల్ల ఏమున్నవే సహా ఇతర పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. 

బచ్చన్‌ పాండే
అక్షయ్‌కుమార్‌ హీరోగా, కృతి సనన్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బచ్చన్‌ పాండే'. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ మూవీకి రీమేక్‌. ఇక ఇదే సినిమా తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా వచ్చి మంచి విజయం సాధించింది. మరి బాలీవుడ్‌లో ఏ రేంజ్‌లో హిట్టవుతుందో చూడాలి!

ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు..
ఆహా
సెబాస్టియన్‌ పీసీ 524 - మార్చి 18
జూన్‌ - మార్చి 18

అమెజాన్‌ ప్రైమ్‌
ఔటర్‌ రేంజ్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 15
జల్సా - మార్చి 18
డీప్‌ వాటర్‌ - మార్చి 18

సోనీలివ్‌
సెల్యూట్‌ - మార్చి 18

జీ5
బ్లడీ బ్రదర్స్‌ - మార్చి 18

నెట్‌ఫ్లిక్స్‌
బ్యాడ్‌ వెగాన్‌ (వెబ్‌ సిరీస్‌)- మార్చి 16
రెస్క్యూడ్‌ బై రూబీ - మార్చి 17
క్రాకౌ మాన్‌స్టర్స్‌ (వెబ్‌ సిరీస్‌) - మార్చి 18
టాప్‌ బాయ్‌ - మార్చి 18
విండ్‌ ఫాల్‌ - మార్చి 18

హాట్‌స్టార్‌
లలితం సుందరం - మార్చి 18

చదవండి: పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్‌ హీరోయిన్‌ క్లారిటీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement