Sebastian PC 524 Movie
-
ఈ వారం రిలీజవుతున్న సినిమాల లిస్ట్ ఇదిగో!
సినీలవర్స్‌కు మళ్లీ మంచి రోజులు వచ్చాయి. కరోనా కాలంలో థియేటర్లు మూతపడటంతో వినోదం కోసం వేచిచూసిన సగటు ప్రేక్షకుకుడికి వినోదాన్ని పంచేందుకు చిన్న, పెద్ద సినిమాలు వరుసగా బాక్సాఆఫీస్ ముందు క్యూ కడుతున్నాయి. వారానికి ఒకటి లేదా రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటే మధ్యలో చిన్నచిన్న సినిమాలు రిలీజ్ అవుతూ సందడి చేస్తున్నాయి. గత వారం థియేటర్లలో రాధేశ్యామ్, ఈటీ, ఓటీటీలో మారన్ వంటి భారీ చిత్రాలు రిలీజయ్యాయి. మరి ఈ వారం అటు థియేటర్లో ఇటు ఓటీటీలో విడుదలయ్యే సినిమాలేంటో చూద్దాం.. జేమ్స్ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ చివరగా నటించిన చిత్రం 'జేమ్స్'. చేతన్‌కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను కిశోర్ పత్తికొండ నిర్మించారు. ఇందులో పునీత్ ఆర్మీ అధికారిగా కనిపిస్తారు. తెలుగు నటుడు శ్రీకాంత్ విలన్‌గా నటించాడు. పునీత్ రాజ్‌కుమార్ జయంతిని పురస్కరించుకుని ఈ మూవీ మార్చి 17న విడుదల చేస్తున్నారు. స్టాండప్ రాహుల్ రాజ్ తరుణ్, వర్ష బొల్లమ్మ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'స్టాండప్ రాహుల్'. కూర్చుంది చాలు అనేది ఉపశీర్షిక. శాంటో మోహన్ వీరంకి దర్శకత్వం వమించిన ఈ సినిమాను నందకుమార్ అబ్బినేని, భరత్ మాగలూరి నిర్మించారు. ప్రేమ, స్టాండప్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 18న విడుదల కానుంది. నల్లమల అమిత్ తివారి, భానుశ్రీ జంటగా నటించిన సినిమా 'నల్లమల'. రవి చరణ్ తెరకెక్కించిన ఈ సినిమాను మార్చి 18న విడుదల చేయనున్నారు. నాజర్, తనికెళ్ల భరణి, కాలకేయ ప్రభాకర్, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఏమున్నవే పిల్ల ఏమున్నవే సహా ఇతర పాటలకు మంచి ఆదరణ లభించిన విషయం తెలిసిందే. బచ్చన్ పాండే అక్షయ్‌కుమార్ హీరోగా, కృతి సనన్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బచ్చన్ పాండే'. ఇది తమిళంలో ఘన విజయం సాధించిన జిగర్తాండ మూవీకి రీమేక్. ఇక ఇదే సినిమా తెలుగులో గద్దలకొండ గణేశ్‌గా వచ్చి మంచి విజయం సాధించింది. మరి బాలీవుడ్లో ఏ రేంజ్లో హిట్టవుతుందో చూడాలి! ఓటీటీలో రిలీజవుతున్న సినిమాలు.. ఆహా ► సెబాస్టియన్ పీసీ 524 - మార్చి 18 ► జూన్ - మార్చి 18 అమెజాన్ ప్రైమ్ ► ఔటర్ రేంజ్ (వెబ్ సిరీస్) - మార్చి 15 ► జల్సా - మార్చి 18 ► డీప్ వాటర్ - మార్చి 18 సోనీలివ్ ► సెల్యూట్ - మార్చి 18 జీ5 ► బ్లడీ బ్రదర్స్ - మార్చి 18 నెట్‌ఫ్లిక్స్ ► బ్యాడ్ వెగాన్ (వెబ్ సిరీస్)- మార్చి 16 ► రెస్క్యూడ్ బై రూబీ - మార్చి 17 ► క్రాకౌ మాన్స్టర్స్ (వెబ్ సిరీస్) - మార్చి 18 ► టాప్ బాయ్ - మార్చి 18 ► విండ్ ఫాల్ - మార్చి 18 హాట్‌స్టార్ ► లలితం సుందరం - మార్చి 18 చదవండి: పెళ్లి, ప్రెగ్నెన్సీపై యంగ్ హీరోయిన్ క్లారిటీ -
సెబాస్టియన్ పీసీ 524.. రిలీజైన 15 రోజులకే ఓటీటీలో! ఎక్కడంటే?
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటించిన సినిమా సెబాస్టియన్ పిసి 524. నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన ఈ మూవీకి బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సిద్ధారెడ్డి నిర్మించారు. రేచీకటి వల్ల సెబాస్టియన్ అనే పోలీస్ కానిస్టేబుల్ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనేది ప్రధాన కథ. మార్చి 4న రిలీజైన ఈ సినిమా అప్పుడే ఓటీటీలోకి వచ్చేస్తోంది. విడుదలై నెల రోజులైనా కాకముందే ఆహాలో అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. మార్చి 18 నుంచి ఆహాలో సెబాస్టియన్ పీసీ 524 స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారిక ప్రటకన వెలువడింది. ఇది చూసిన నెటిజన్లు ఇదేందయ్యా, సినిమా రిలీజైన 15 రోజులకే ఓటీటీలోకి తెచ్చేశారేంటి? అంటూ విస్తుపోతున్నారు. Sebastian P.C. 524 will report on March 18, mee aha lo. Don't miss the fun cop drama this Friday! @Kiran_Abbavaram@komaleeprasad #Nuveksha #BalajiSuyyapureddy #RajKNalli #Kiran @editorviplav @GhibranOfficial pic.twitter.com/fcgfQ3NTIJ — ahavideoIN (@ahavideoIN) March 12, 2022 -
‘ఊర్లో టికెట్ కొనుక్కుని సినిమా చూసే నన్ను హీరోని చేశాడు’
‘‘చిత్తూరు, మదన పల్లి నేపథ్యంలో వచ్చిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతాయి. ఈ మధ్య వచ్చిన అల్లు అర్జున్ ‘పుష్ప’ కూడా గొప్ప విజయం సాధించింది. మదనపల్లి నేపథ్యంలో వస్తున్న ‘సెబాస్టియన్’ కూడా గొప్ప హిట్ అవుతుంది’’ అని నిర్మాత రవిశంకర్ అన్నారు. కిరణ్ అబ్బవరం హీరోగా, నువేక్ష (నమ్రతా దారేకర్), కోమలి ప్రసాద్ హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘సెబాస్టియన్ పీసీ 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వంలో ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో బి. సిద్ధారెడ్డి నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) విడుదలవుతోంది. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిలుగా దర్శకులు వెంకీ కుడుముల, వేణు శ్రీరామ్, మైత్రీ మూవీ మేకర్స్ చెర్రీ, నటుడు సాయికుమార్, హీరోలు అడివి శేష్, ఆకాష్ పూరి తదితరులు పాల్గొని, సినిమా సక్సెస్ సాధించాలని అన్నారు. బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ– ‘‘సెబాస్టియన్’ ట్రైలర్ ఎంత బాగుందో సినిమా అంతకు మించి బాగుంటుంది’’ అన్నారు. ‘‘మా సినిమాను అందరూ ఆదరించాలి’’ అన్నారు సిద్ధారెడ్డి. ‘‘ఎక్కడో ఊర్లో టికెట్ కొనుక్కుని సినిమా చూసే నన్ను హీరోని చేసి వెళ్లిపోయిన మా అన్న రామాంజనేయులు రెడ్డికి ‘సెబాస్టియన్’ని అంకితం ఇస్తున్నాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. సహనిర్మాతలు ప్రమోద్, రాజు, జయచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ‘సెబాస్టియన్ పిసి 524’ ట్రైలర్
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది మూవీ యూనిట్. చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 28) ట్రైలర్ విడుదల చేశారు మేకర్స్. సోమవారం హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా మేకర్స్ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్ చేయించింది. కాగా ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగిన హీరో పోలీసు ఆఫీసర్ ఎలా అయ్యాడు. ఈ క్రమంలో ఓ మర్డర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్ అవుతాడు. రే చికటితో బాధపడే అతడు కేసును ఎలా చేదించాడు వంటి ఆసక్తికర సన్నివేశాలతో మలిచిన ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అవుతుంది. -
సెబాస్టియన్ నుంచి సెబా లిరికల్ సాంగ్ రిలీజ్
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’.బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి రాజాధి రాజాధి రాజో రాజా అనే సాంగ్‌ను విడుదల చేశారు. భరద్వాజ్ పాత్రుడు రచించిన ఈ పాటను పద్మలత పాడారు. జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంటుంది. -
శర్వానంద్‌తో ఢీ కొట్టనున్న యంగ్ హీరో!
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పీసీ524’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. మార్చి 4న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించారు. బి.సిద్ధారెడ్డి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమాను ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ విడుదల చేస్తోంది. ‘‘రేచీకటితో ఇబ్బంది పడే ఓ పోలీస్ కానిస్టేబుల్ నైట్‌డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్ పేర్కొంది. ఇక మార్చి 4వ తేదీన శర్వానంద్ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రిలీజవుతుండటంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. -
'హేలి, నీ మాట వింటే రాదా మైమరపే' సాంగ్ విన్నారా?
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తోంది. ఈ సినిమాలోని ‘హేలి... నీ మాట వింటే రాదా మైమరపే... ’ అనే పాటను విడుదల చేశారు. జిబ్రాన్ స్వరపరచిన ఈ పాటను సనపాటి భరద్వాజ పాత్రుడు రాయగా, కపిల్ కపిలాన్ పాడారు. రేచీకటి ఉన్న కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్. -
బ్రహ్మానందం చేసిన రేచీకటి పాత్ర స్ఫూర్తితో..
సెబాస్టియన్ అనే పోలీస్ కానిస్టేబుల్ రేచీకటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘సెబాస్టియన్ పి.సి.524’. కిరణ్ అబ్బవరం, నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో సిద్ధారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది. బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ– ‘‘మదనపల్లె రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ, ఎమోషన్, థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘చంటి’ సినిమాలో బ్రహ్మానందంగారు చేసిన రేచీకటి పాత్రను ఆదర్శరంగా తీసుకుని చేశాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘సినిమా మంచి ఔట్పుట్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సిద్ధారెడ్డి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ప్రమోద్, నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేఎల్ మదన్, సంగీతం: జిబ్రాన్.