
సెబాస్టియన్ అనే పోలీస్ కానిస్టేబుల్ రేచీకటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనే నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘సెబాస్టియన్ పి.సి.524’. కిరణ్ అబ్బవరం, నమ్రతా దారేకర్, కోమలీ ప్రసాద్ హీరో హీరోయిన్లుగా బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించారు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో సిద్ధారెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 25న రిలీజ్ కానుంది.
బాలాజీ సయ్యపురెడ్డి మాట్లాడుతూ– ‘‘మదనపల్లె రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో కామెడీ, ఎమోషన్, థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమా అందరికీ నచ్చేలా ఉంటుంది’’ అన్నారు. ‘‘చంటి’ సినిమాలో బ్రహ్మానందంగారు చేసిన రేచీకటి పాత్రను ఆదర్శరంగా తీసుకుని చేశాను’’ అన్నారు కిరణ్ అబ్బవరం. ‘‘సినిమా మంచి ఔట్‌పుట్ రావడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సిద్ధారెడ్డి. ఈ చిత్రానికి సహనిర్మాతలు: ప్రమోద్, నాగరాజు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కేఎల్ మదన్, సంగీతం: జిబ్రాన్.
Comments
Please login to add a commentAdd a comment