శర్వానంద్‌తో ఢీ కొట్టనున్న యంగ్‌ హీరో! | Kiran Abbavaram Sebastian PC 524 Movie New Release Date Out Now | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: సెబాస్టియన్‌ పీసీ 524 సినిమా కొత్త రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది!

Published Mon, Feb 21 2022 9:38 AM | Last Updated on Mon, Feb 21 2022 9:38 AM

Kiran Abbavaram Sebastian PC 524 Movie New Release Date Out Now - Sakshi

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్‌ పీసీ524’ కొత్త విడుదల తేదీ ఖరారైంది. మార్చి 4న సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్, నువేక్ష హీరోయిన్లుగా నటించారు.

బి.సిద్ధారెడ్డి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మించిన ఈ సినిమాను ప్రైమ్‌ షో ఎంటర్‌టైన్మెంట్‌ సంస్థ విడుదల చేస్తోంది. ‘‘రేచీకటితో ఇబ్బంది పడే ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ నైట్‌డ్యూటీ ఎలా చేశాడు? రేచీకటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అన్నదే ఈ చిత్ర కథ’’ అని యూనిట్‌ పేర్కొంది. ఇక మార్చి 4వ తేదీన శర్వానంద్‌ 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా రిలీజవుతుండటంతో ఈ రెండు చిత్రాల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement