విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా ‘సెబాస్టియన్‌ పిసి 524’ ట్రైలర్‌ | Vijay Devarakonda Released Kiran Abbavaram Sebastian PC524 Movie Trailer | Sakshi
Sakshi News home page

Kiran Abbavaram: విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా ‘సెబాస్టియన్‌ పిసి 524’ ట్రైలర్‌

Published Mon, Feb 28 2022 11:23 AM | Last Updated on Mon, Feb 28 2022 1:10 PM

Vijay Devarakonda Released Kiran Abbavaram Sebastian PC524 Movie Trailer - Sakshi

కిరణ్‌ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్‌ పిసి 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్‌ నిర్మించారు.  కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్‌) హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం మార్చి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్‌ కార్యక్రమాలను శరవేగంగా జరుపుకుంటోంది మూవీ యూనిట్‌.

చదవండి: ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు కార్యాలయంలో చోరీ

ఈ నేపథ్యంలో ఈ రోజు(ఫిబ్రవరి 28) ట్రైలర్‌ విడుదల చేశారు మేకర్స్‌. సోమవారం హీరో విజయ్‌ దేవరకొండ చేతుల మీదుగా మేకర్స్‌ ఈ మూవీ ట్రైలర్‌ను రిలీజ్‌ చేయించింది. కాగా ఆర్థిక సమస్యలు, కష్టాలతో పెరిగిన హీరో పోలీసు ఆఫీసర్‌ ఎలా అయ్యాడు. ఈ ‍ క్రమంలో ఓ మర్డర్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొని సస్పెండ్‌ అవుతాడు. రే చికటితో బాధపడే అతడు కేసును ఎలా చేదించాడు వంటి ఆసక్తికర సన్నివేశాలతో మలిచిన ఈ ట్రైలర్‌ చూస్తుంటే సినిమాపై మరింత హైప్‌ క్రియేట్‌ అవుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement