
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’.బాలాజీ సయ్యపురెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లుగా నటిస్తున్నారు. మార్చి 4న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి రాజాధి రాజాధి రాజో రాజా అనే సాంగ్‌ను విడుదల చేశారు. భరద్వాజ్ పాత్రుడు రచించిన ఈ పాటను పద్మలత పాడారు. జిబ్రాన్ సంగీతం ఆకట్టుకుంటుంది.