యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. తాజాగా ఆయన నటిస్తున్న చిత్రం ‘వినరో భాగ్యము విష్ణుకథ’. మురళి కిషోర్ అబ్బురు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తిరుమల తిరుపతి నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ సాంగ్‌ను రెడీ చేస్తుంది చిత్ర బృందం.
"వాసవసుహాస" అనే పాటను డిసంబర్ 24 న సాయంత్రం 6:19 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు.కిరణ్ అబ్బవరం సరసన కశ్మీర పర్ధేశీ నటిస్తోంది. జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment