
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘సెబాస్టియన్ పిసి 524’. బాలాజీ సయ్యపురెడ్డి దర్శకుడు. కోమలీ ప్రసాద్, నువేక్ష (నమ్రతా దరేకర్) హీరోయిన్లు. ఎలైట్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి బి, జయచంద్రా రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని మార్చిలో విడుదల చేస్తోంది.
ఈ సినిమాలోని ‘హేలి... నీ మాట వింటే రాదా మైమరపే... ’ అనే పాటను విడుదల చేశారు. జిబ్రాన్ స్వరపరచిన ఈ పాటను సనపాటి భరద్వాజ పాత్రుడు రాయగా, కపిల్ కపిలాన్ పాడారు. రేచీకటి ఉన్న కానిస్టేబుల్ పాత్రలో కిరణ్ అబ్బవరం నటించిన ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: కె.ఎల్. మదన్.
Comments
Please login to add a commentAdd a comment