
లండన్: పాకిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో లూయిస్ గ్రెగరీ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. బ్యాటింగ్‌లో (47 బంతుల్లో 40; 4 ఫోర్లు)... బౌలింగ్ (3/44)లో ఆకట్టుకున్నాడు. దాంతో ఆతిథ్య ఇంగ్లండ్ 52 పరుగులతో నెగ్గింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 47 ఓవర్లకు కుదించారు.
కాగా తొలుత ఇంగ్లండ్ 45.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ సాల్ట్ (60; 10 ఫోర్లు), జేమ్స్ విన్స్ (56; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలతో రాణించారు. హసన్ అలీ 5 వికెట్లు తీశాడు. అనంతరం పాకిస్తాన్ 41 ఓవర్లలో 195 పరుగులకు ఆలౌటైంది.