సంగారెడ్డి: లిఫ్టులో ఇరుక్కొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన రామచంద్రాపురం పట్టణంలోని అశోక్‌నగర్ లో గురువారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రామచంద్రాపురం పట్టణ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో నివాసం ఉండే జేమ్స్(38) కొరియర్ బాయ్‌గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. అశోక్‌నగర్‌లోని నివాస్ టవర్స్ అపార్ట్‌మెంట్‌లో కొరియర్ రిటర్న్ ఉంటే దానిని తీసుకోవడం కోసం అపార్ట్‌మెంట్‌ని 4వ అంతస్థుకు వెళ్లాడు.
కొరియర్ తీసుకొని గ్రౌండ్ ఫ్లోర్‌కు వచ్చేందుకు లిఫ్ట్ గేటు తీసుకొని లిఫ్ట్ లేదన్న విషయాన్ని గమనించకుండా అడుగుపెట్టాడు. 4వ అంతస్థు నుంచి లిఫ్ట్ పైన పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ సమస్య ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి: ఇంటి నుంచి వెళ్లి వ్యక్తి తీవ్ర నిర్ణయం!
Comments
Please login to add a commentAdd a comment