హైదరాబాద్: ఐపీఎల్–2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ బౌలింగ్ కోచ్‌గా న్యూజిలాండ్ మాజీ పేస్ బౌలర్ జేమ్స్ ఫ్రాంక్లిన్ వ్యవహరిస్తాడు. గత రెండు సీజన్లుగా బౌలింగ్ కోచ్‌గా పని చేసిన దక్షిణాఫ్రికా దిగ్గజం డేల్ స్టెయిన్ స్థానంలో ఫ్రాంక్లిన్‌ను కోచ్‌గా టీమ్ యాజమాన్యం ఎంపిక చేసింది. వ్యక్తిగత కారణాలతో స్టెయిన్ ఈ సీజన్‌నుంచి తప్పుకోవడంతో ఫ్రాంక్లిన్‌కు అవకాశం దక్కింది.
2010, 2011 సీజన్లలో ముంబై ఇండియన్స్ తరఫున ఐపీఎల్‌లో ఆడిన ఫ్రాంక్లిన్‌కు ఈ లీగ్‌లో కోచ్‌గా ఇదే మొదటి అవకాశం. సన్‌రైజర్స్ హెడ్ కోచ్ డానియెల్ వెటోరిలో ఉన్న సాన్నిహిత్యం కారణంగా ఈ మాజీ కివీ పేసర్ బౌలింగ్ కోచ్‌గా వస్తున్నాడు. వీరిద్దరు గతంలో కౌంటీ జట్టు మిడిల్‌ఎసెక్స్, హండ్రెడ్ టీమ్ బర్మింగ్‌హామ్ ఫోనిక్స్‌లకు కలిసి పని చేశారు.
డర్హమ్ కౌంటీ టీమ్‌కు హెడ్ కోచ్‌గా కూడా పని చేసిన ఫ్లాంక్లిన్ ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో ఇస్లామాబాద్ యునైటెడ్ టీమ్‌కు అసిస్టెంట్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 43 ఏళ్ల ఫ్లాంక్లిన్ న్యూజిలాండ్ తరఫున 31 టెస్టుల్లో 82, 110 వన్డేల్లో 81, 38 టి20ల్లో 20 వికెట్లు తీశాడు.
Comments
Please login to add a commentAdd a comment