
కన్నడ సూపర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ మరణం చిత్రపరిశ్రమకే కాదు కన్నడ ప్రజలకు సైతం తీరని లోటు. గతేడాది అక్టోబర్ 29న ఆయన గుండెపోటుతో మరణించగా ఇప్పటికీ ఆయన అభిమానులు, సెలబ్రిటీలు పునీత్‌ను తలుచుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు. అంతేకాదు, ఆయన నటించిన చివరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా నుంచి టీజర్ రిలీజైంది. శుక్రవారం ఉదయం జేమ్స్ టీజర్ రిలీజ్‌చేశారు.
'ఎమోషన్స్ అనేవి వ్యాపారం కన్నా పెద్దవి' అన్న టైటిల్‌తో టీజర్ మొదలైంది. 'గన్స్ పట్టుకుని నిలబడే వంద వేస్ట్ బాడీస్ కంటే గన్నులాంటోడిని ఒక్కడిని తీసుకురండి.. ఎదురు నిలబడి కాపాడటమూ తెలుసుండాలి, ఎదురొచ్చే గుండెలో బుల్లెటు దింపడమూ తెలుసుండాలి' అన్న డైలాగ్‌తో పునీత్ పాత్రకు హైప్ ఇచ్చారు. టీజర్ చూస్తుంటే పునీత్ సెక్యురిటీ ఏజెన్స్ ఆఫీసర్‌గా నటించినట్లు కనిపిస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియా ఆనంద్, విలన్‌గా శ్రీకాంత్ నటించారు. చేతన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మార్చి 17న విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment