
అవార్డుల కాంతి..
నింగిలో పచ్చని రంగులో మెరిసిపోతున్న ఉత్తర ధ్రువ కాంతులు.. కింద నీటిలో దాని ప్రతిబింబం.. ఐస్‌లాండ్‌లోని వత్నజోకల్ నేషనల్ పార్కు వద్ద బ్రిటన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ జేమ్స్ వుడ్‌ఎండ్ తీసిన చిత్రమిది. ఇదింత బాగుంది కాబట్టే.. తాజాగా ప్రకటించిన ఆస్ట్రోనమీ ఫొటోగ్రాఫర్ ఆఫ్ ద ఇయర్-2014 పోటీలో మొదటి బహుమతిని సొంతం చేసుకుంది. ఈ ప్రతిష్టాత్మక పురస్కారాన్ని రాయల్ అబ్జర్వేటరీ గ్రీన్‌విచ్ , బీబీసీ స్కై వాళ్లు ఏటా ప్రదానం చేస్తున్నారు.