సాక్షి, తిరుపతి జిల్లా: ఆపరేషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సి57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు.
భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు.
చంద్రయాన్-3కీ సంబంధించిన లాండర్ రోవర్‌లు చంద్రునిపై విజయవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని, జీఎస్ఎల్‌వీ- మార్క్-2 ద్వారా INSAT-3DS రాకెట్ ప్రయోగం చేస్తామన్నారు. తదుపరి మాసంలో ఎస్ఎస్ఎల్-వి రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు.
చదవండి: సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1
Comments
Please login to add a commentAdd a comment