ISRO Chairman
-
భారీ ప్రయోగాలే లక్ష్యం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతోమంది అంతరిక్ష పితామహుల కృషి ఫలితంగా శ్రీహరికోట రాకెట్ కేంద్రాన్ని సొంతంగా నిర్మించుకొని, నేటికి వంద ప్రయోగాలు పూర్తిచేసి చరిత్రపుటల్లోకి ఎక్కిందని చైర్మన్ వి.నారాయణన్ అన్నారు. ఇకపై ఆకాశమే హద్దుగా భారీ ప్రయోగాలే లక్ష్యంగా పని చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన బుధవారం షార్‌లోని మీడియా సెంటర్లో మాట్లాడారు. ఇస్రో చేపట్టిన వంద ప్రయోగాల్లో పాలుపంచుకున్న అంతరిక్ష పరిశోధకులకు అభినందనలు తెలియజేశారు. రాకెట్ ప్రయోగాలకు సంబంధించి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకుంటున్నాని తెలిపారు. ఇకపై నెలకు రెండు ప్రయోగాలు చేపట్టాల్సి ఉంటుందని చెప్పారు. షార్ నుంచి సెంచరీ ప్రయోగాలు చేసినందుకు సంతోషంగా ఉందన్నారు. వందో ప్రయోగానికి తాను ఛైర్మన్‌గా ఉండడం తన అదృష్టమన్నారు. ఈ ఏడాది ప్రైవేట్‌గా పీఎస్ఎల్వీ–ఎన్1 పేరుతో నూతన ప్రయోగాన్ని చేపట్టనున్నామని వెల్లడించారు. జీఎస్ఎల్వీ–ఎఫ్16 రాకెట్ ద్వారా ఇస్రో, నాసా సంయుక్తంగా నిస్సార్ అనే ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నాయని తెలిఆపరు. ఎల్వీఎం–3 రాకెట్ ద్వారా వాణిజ్యపరమైన ప్రయోగం ఉంటుందన్నారు. ఈ ఏడాది జూన్ నాటికి గగన్‌యాన్–1 క్రూమాడ్యూల్ ప్రయోగాన్ని హ్యూమన్ రిలేటెడ్ లాంచింగ్ వెహికల్ (హెచ్ఆర్ఎల్వీ) ద్వారా చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టంచేశారు. షార్ కేంద్రంలో మూడో ప్రయోగ వేదికను ప్రపంచస్థాయి ప్రయోగవేదికగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించబోతున్నామని వి.నారాయణన్ ప్రకటించారు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్(ఎన్జీఎల్వీ) ద్వారా 2040 నాటికి చంద్రుడిపైకి వ్యోమగాములను పంపిస్తామని వెల్లడించారు. అలాగే ఈ ఏడాది డిసెంబర్ ఆఖరు నాటికి తమిళనాడులోని కులశేఖరపట్నం స్పేస్‌పోర్టు కూడా అందుబాటులోకి వస్తుందన్నారు. డాకింగ్ టెక్నాలజీని ఉపయోగించి అంతరిక్షంలో స్పేస్ స్టేషన్ నిర్మాణం కూడా చేయనున్నామని తెలిపారు. -
ఇస్రో తదుపరి చైర్మన్‌గా నారాయణన్
ఢిల్లీ: కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తదుపరి ఛైర్మన్‌గా వి.నారాయణన్ (Narayanan) నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.ఇస్రో తదుపరి చైర్మన్‌గా వి.నారాయణన్‌ను కేంద్రం నియమించింది. ప్రస్తుత ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ పదవీకాలం ముగుస్తుండటంతో ఈ నెల 14న నారాయణన్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక, నారాయణన్ రెండేళ్ల పాటు ఇస్రో చైర్మన్‌గా బాధ్యతల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన వలియమలాలోని లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రాకెట్ వ్యవస్థ, స్పేస్‌క్రాఫ్ట్ ప్రొపల్షన్‌కు సంబంధించి నాలుగు దశాబ్దాలుగా పలు హోదాల్లో ఆయన పనిచేస్తున్నారు.నారాయణన్ ఖరగ్‌పూర్ ఐఐటీలో క్రయోజనిక్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌తో పాటు ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో పీహెచ్డీ చేశారు. ఎంటెక్‌లో మొదటి ర్యాంక్ సాధించినందుకు అతనికి సిల్వర్ మెడల్ లభించింది. ఇక, 1984లో ఆయన ఇస్రోలో చేరారు. 2018లో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్స్ సెంటర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. నారాయణన్ సేవలను గుర్తిస్తూ ఆయనకు ఎన్నో అవార్డులు వచ్చాయి.🚨 V. Narayanan has been appointed as the New Chairman of ISRO and Secretary, Department of Space for a period of two years with effect from February 14, 2025.Currently leading ISRO's Liquid Propulsion Systems Centre(LPSC),#ISRO #Space #VNarayanan #SSomanath #ISROChairman pic.twitter.com/IkiaHzXVv7— Aman Kumar 🇮🇳 (@amankmr02) January 7, 2025ఇస్రో చైర్మన్‌గా బాధత్యలు చేపట్టనున్న నేపథ్యంలో నారాయణన్ స్పందించారు. ఈ సందర్బంగా కేరళలోని తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్ కోసం మాకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఉంది. మా వద్ద ప్రభావంతులైన శాస్త్రవేత్తలు ఉన్నారు. ప్రయోగాల్లో ఇస్రోను మరింత ముందుకు తీసుకెళ్లాలని ఆశిస్తున్నాను అంటూ కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఎల్పీఎస్సీ డైరెక్టర్‌గా నారాయణన్ జీఎస్ఎల్వీ ఎంకే 3కి సంబంధించి సీఈ20 క్రయోజెనిక్ ఇంజిన్ అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించారు. నారాయణన్ సారథ్యంలోనే పలు ఇస్రో మిషన్ల కోసం ఎల్పీఎస్సీ ఇప్పటివరకు 183 లిక్విడ్ ప్రొపల్షన్ వ్యవస్థలను, కంట్రోల్ పవర్ ప్లాంట్లను అందించింది. పలు ఇస్రో ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు. వాటిల్లో ఆదిత్య స్పేస్‌క్రాప్ట్ రూపకల్పన, జీఎస్ఎల్వీ ఎంకే 3 మిషన్ వంటి కీలకమైనవి. కాగా, ప్రస్తుత చైర్మన్ సోమనాథ్ 2022 జనవరిలో ఇస్రో చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. -
ఎలక్ట్రికల్ థ్రస్టర్లతో ఉపగ్రహ ప్రయోగం
న్యూఢిల్లీ: నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎలక్ట్రికల్ థ్రస్టర్లను వాడనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్ ప్రొపెల్లర్లను డిసెంబరులో చేపట్టనున్న టీడీఎస్–01 ఉపగ్రహ ప్రయోగంలో వాడతామని వెల్లడించారు. నాలుగు టన్నుల బరువున్న సంప్రదాయ రాకెట్లో 2 నుంచి 2.5 టన్నుల ఇంధనం ఉంటుందని, అదే ఎలక్ట్రికల్ ప్రొపల్షన్‌ను వాడితే 200 కేజీల ఇంధనం సరిపోతుందని తెలిపారు. ఇంధన ట్యాంకు పరిమాణం తగ్గిపోతే.. దానికి అనుగుణంగా అన్నీ తగ్గుతాయని, ఉపగ్రహం రెండు టన్నుల్లోపే ఉంటుందని చెప్పారు. అయితే నాలుగు టన్నుల రాకెట్‌కు సరిపడా శక్తి ఉంటుందని వివరించారు. సాధారణంగా కెమికల్ థ్రస్టర్ల ద్వారా రాకెట్ మండించి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. వారం రోజుల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంటుందని, అయితే ఎలక్ట్రికల్ ప్రొపెల్షన్‌ను వాడితే మూడునెలల సమయం పడుతుందని తెలిపారు. -
‘అదే జరిగితే మానవజాతి అంతం!’
న్యూఢిల్లీ: గ్రహశకలం. అత్యంత వేగంగా అంతరిక్షంలో పయనించే ఈ ఖగోళ అద్భుతాన్ని దూరం నుంచి చూసేందుకు అందరూ ఇష్టపడతారు. దూరం నుంచి దూసుకెళ్తుంటే ఆశ్చర్యం కల్గించే ఆస్టరాయిడ్ ఒకవేళ భూమికి దగ్గరగా వెళ్లినా, పేలినా అది సృష్టించే వినాశనం ఊహకు కూడా అందదు. అలాంటి ఘటనకు గత శతాబ్దంలో సెర్బియా సాక్షిభూతంగా నిల్చింది. 1908 జూన్ 30న ఒక భారీ గ్రహశకలం భూమి దిశగా దూసుకొచ్చి భూమిని ఢీకొట్టినంత పనిచేసింది. సెర్బియా గగనతలానికి కాస్తంత ఎత్తులో బద్దలైంది. ఈ పేలుడు ధాటికి వెలువడిన వేడి టుంగుస్కా ప్రాంతంలోని 2,200 చదరపు కిలోమీటర్ల అడవిని దహించేసింది. గాల్లో పేలితేనే ఇంతటి దారుణం జరిగితే ఇక నేరుగా భూమిని ఢీకొడితే ఎంతటి వినాశనం సంభవిస్తుందో ఊహించలేం. అయితే 2029 ఏప్రిల్ 13న అపోఫిస్ అనే గ్రహశకలం భూమిని ఢీకొట్టే ప్రమాదం పొంచి ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ఆందోళన వ్యక్తంచేశారు. 370 మీటర్ల వెడల్పున్న అపోఫిస్ ఆస్టరాయిడ్ తన కక్ష్యలో దూసుకెళ్తూ 2036లోనూ భూమి సమీపానికి రానుంది. 10 కి.మీ.ల వెడల్పాటి ఆస్టరాయిడ్ ఢీకొంటే వెలువడే ఉష్ణంధాటికి భూమి మీది కొన్ని జీవజాతులు పూర్తిగా చనిపోయే ప్రమాదముందని ఒక సిద్ధాంతం. డైనోసార్లు ఇలాగే అంతర్థానమయ్యాయని శాస్త్రవేత్తల అంచనా. భూమిని ఇలాంటి ఖగోళ ప్రమాదాల నుంచి రక్షించుకునే వ్యవస్థల అభివృద్ధికి సంపన్న దేశాలు సమాయత్తమయ్యాయి. భారత్ సైతం తన వంతు కృషిచేస్తోందని సోమ్‌నాథ్ చెప్పారు. రెండేళ్ల క్రితం డార్ట్ వ్యోమనౌక ఢీకొట్టడంతో డైమార్ఫస్ అనే గ్రహశకలం తన కక్ష్యను మార్చుకుంది. తమ ప్రయోగం కారణంగా డైమార్ఫస్ పరిభ్రమణ కక్ష్యలో దాదాపు 32 నిమిషాల మార్పు చోటుచేసుకున్నట్లు నాసా ఆనాడు ప్రకటించింది. గ్రహశకలాల రూపంలో భవిష్యత్తులో భూమికి ఎలాంటి ముప్పు ముంచుకొచ్చినా సమర్థంగా ఎదుర్కోగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంలో ఇది కీలక ముందడుగు అని ఆనాడు ప్రపంచదేశాలు కీర్తించాయి. -
ఆ రోజే క్యాన్సర్ బయటపడింది
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సూర్యుడి సంబంధ పరిశోధన కోసం భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆదిత్య ఎల్–1 మిషన్ ప్రయోగంతో ఆనందంలో మునిగిపోయిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్నాథ్నూ అశుభ వార్త ఒకటి కొద్దిరోజులపాటు కలవరపాటుకు గురిచేసింది. ఆయన కడుపులో పెరుగుతున్న క్యాన్సరే అందుకు కారణం. శస్త్రచికిత్స, కీమోథెరపీ తర్వాత ఆయన ప్రస్తుతం క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకున్నారు. గత ఏడాది సెపె్టంబర్ రెండో తేదీన జరిగిన ఘటన తాలూకు వివరాలను ఆయన ఇటీవల వెల్లడించారు. టార్కామ్ మీడియా సంస్థ వారి ‘ రైట్ టాక్’ కార్యక్రమంలో భాగంగా ఇచి్చన ఒక ఇంటర్వ్యూలో అందరితో ఆ విషయాలను పంచుకున్నారు. ‘‘ సెప్టెంబర్ రెండో తేదీన ఆదిత్య ఎల్–1 మిషన్ లాంఛ్ ప్రక్రియకు కొద్ది వారాల ముందు నుంచే కడుపు నొప్పిగా అది మొదలైంది. మొదట అదే ఏడాది జూలై 14వ తేదీన చంద్రయాన్–3 ప్రాజెక్ట్ సందర్భంగానూ అనారోగ్యం బారినపడ్డా. ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పని ఒత్తిడి కారణంగా అలా అయ్యిందేమో అనుకుని దానిని సంగతి వదిలేశా. కానీ ఆ తర్వాతా కడుపు నొప్పి నన్ను వెంటాడింది. ఇక లాభం లేదనుకుని ఆదిత్య ఎల్–1 ప్రయోగం విజయవంతంగా పూర్వవగానే అదే రోజు చెన్నైలోని ఓ ఆస్పత్రిలో స్కానింగ్‌లు, టెస్ట్‌లు చేయించుకున్నా. పెద్ద పేగులో చిన్నపాటి క్యాన్సర్ కణతి పెరుగుతోందని పరీక్షల్లో బయటపడింది. ఆ వార్త విని నా కుటుంబసభ్యులంతా షాక్‌కు గురయ్యారు. కుటుంబసభ్యులే కాదు ఇస్రోలో శాస్త్రవేత్తలు, ఉద్యోగులు, ఇంజనీర్లు హుతాశులయ్యారు. శస్త్రచికిత్స తప్పదని వైద్యులు సూచించడంతో నాలుగు రోజులు ఆస్పత్రికే పరిమితయ్యా. సర్జరీ, కీమో థెరపీ తర్వాత ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఏటా స్కానింగ్, చెకప్ చేయించుకుంటా. నాకు క్యాన్సర్ వంశపారంపర్యంగా వచి్చందని చెబుతున్నారు. దాన్ని జయించా. చిన్నపాటిది కాబట్టి మొదట్లోనే గుర్తించి శస్త్రచికిత్సతో తొలగించారు’’ అని సోమ్‌నాథ్ చెప్పుకొచ్చారు. -
Next Generation Launch Vehicle: ఇస్రో అమ్ములపొదిలో ఎన్జీఎల్వీ!
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): సమీప భవిష్యత్తులో భారీ ప్రయోగాలకు తెర తీస్తున్న ఇస్రో, అందుకు తగ్గట్టుగా అత్యాధునిక రాకెట్ తయారీ ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ రాకెట్‌కు న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ (ఎన్జీఎల్వీ)గా నామకరణం చేశారు. తొలి నాళ్లలో చేపట్టిన రోహిణి సౌండింగ్ రాకెట్ల ప్రయోగాల తరువాత 40 కిలోల నుంచి 5,000 కిలోల ఉపగ్రహాలను మోసుకెళ్లే ఎస్ఎల్వీ, ఏఏస్ఎల్వీ, పీఎస్ఎల్వీ, జీఎస్ఎల్వీ, ఎల్వీఎం03, ఎస్ఎస్ఎల్వీ... ఇలా ఆరు రకాల రాకెట్లను ఇప్పటిదాకా ఇస్రో అభివృద్ది చేసింది. గగన్‌యాన్ ప్రయోగంలో భాగంగా త్వరలో మానవసహిత అంతరిక్ష ప్రయోగంతో పాటు చంద్రుడిపై వ్యోమగాములను తీసుకెళ్లి సురక్షితంగా తీసుకొచ్చే ప్రయోగాన్నీ చేపట్టాలని భావిస్తోంది. వీటితో పాటు అత్యంత బరువుండే సమాచార ఉపగ్రహాలను జీటీఓ కక్ష్యలోకి పంపే సాంకేతిక పరిజ్ఞానాన్నీ సమకూర్చుకుంటున్నారు. ఈ క్రమంలో ఏకంగా 20 వేల కిలోల బరువున్న ఉపగ్రహాలను భూమికి సమీపంలోని లియో అర్బిట్‌లోకి, 10 వేల కిలోల ఉపగ్రహాలను జీటీఓ ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఎన్జీఎల్వీ తయారీకి ఇస్రో తెర తీసింది. రూ.1,798 కోట్ల అంచనా వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును 2008లోనే కేంద్రం ఆమోదించింది. సెమీ క్రయోజనిక్ దశను అభివృద్దితో పాటు రాకెట్ విడి భాగాలను దేశీయంగానే రూపొందించేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు. 6న ‘ఎల్పీ1’ వద్దకు ఆదిత్య ఎల్1: సౌర ప్రయోగాల నిమిత్తం గత సెపె్టంబర్ 2న ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్1 ఉపగ్రహం జనవరి 6 సాయంత్రం సూర్యుడికి సమీపంలోని లాంగ్రేజియన్ పాయింట్ 1ను చేరనుంది. భూమికి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని ఈ పాయింట్‌ను చేరాక సూర్యుని రహస్యాలను అధ్యయనం చేయనుంది. సౌర తుఫాన్ సమయంలో వెలువడే రేణువుల వల్ల భూమిపై సమాచార వ్యవస్థకు అవరోధాలు ఏర్పడుతున్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. వీటితో పాటు ఫోటోస్పియర్, క్రోమోస్పియర్, సూర్యు డి వెలుపలి వలయమైన కరోనాపై అధ్యయనాలు చేయనున్నారు. ఎన్జీఎల్వీ విశేషాలు... ► ఎన్జీఎల్వీ రాకెట్ ఎత్తు 75 మీటర్లు ► వెడల్పు 5 మీటర్లు. ► పీఎస్ఎల్వీ ఎక్స్ఎల్ తరహాలోనే దీనికీ ఆరు స్ట్రాపాన్ బూస్టర్లుంటాయి. ► ప్రయోగ సమయంలో 600 టన్నుల నుంచి 770 టన్నులు ► రాకెట్‌ను మూడు దశల్లో ప్రయోగిస్తారు. ► ఇది ఫాల్కన్, అట్లాస్–వీ, ప్రొటాన్–ఎం, లాంగ్ మార్చ్–58 రాకెట్లకు దీటుగా ఉంటుంది. ► ఇస్రో ౖచైర్మన్ సోమ నాథ్ ఇటీవలే ఎన్జీఎల్వీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ► 2030–35 నాటికి మానవ అంతరిక్ష యానం, అత్యంత బరువైన ఉపగ్రహ ప్రయోగాలకు ఇది వీలుగా ఉంటుందని వివరించారు. -
నింగిలోకి ఎక్స్‌పోశాట్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) నూతన సంవత్సరాన్ని దిగ్విజయంగా ఆరంభించింది. సోమవారం చేపట్టిన పీఎస్‌ఎల్‌ఎవీ సీ58 60వ ప్రయోగం విజయవంతమైంది. పీఎస్ఎల్వీ రాకెట్ తొలుత కృష్ణబిలాల పరిశోధనకు ఉద్దేశించిన ఎక్స్‌రే పొలారిమీటర్ శాటిలైట్ (ఎక్స్‌పోశాట్)తో పాటు కేరళ యూనివర్సిటీకి చెందిన బుల్లి ఉపగ్రహం వియ్శాట్నూ రోదసిలోకి ప్రవేశపెట్టింది. అనంతరం చివరిదైన నాలుగో దశలో ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు మొత్తం పది పరికరాలను దిగువ భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. భారత్ నిర్మించబోయే సొంత అంతరిక్ష కేంద్రానికి ఇంధన లభ్యత కోణంలో ఎఫ్‌సీపీఎస్ ఎంతో కీలకం కానుంది. ప్రయోగం దిగి్వజయం కావడంపై ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వెలిబుచ్చారు. 2024కు అద్భుత ఆరంభాన్నిచి్చనందుకు శాస్త్రవేత్తలకు అభినందనలన్నారు. నిప్పులు చిమ్ముతూ... సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ58 ప్రయోగం జరిగింది. ఆదివారం మొదలైన 25 గంటల కౌంట్‌డౌన్ ముగియగానే సోమవారం ఉదయం 9.10 గంటలకు ముగిసింది. ఆ వెంటనే 44.4 మీటర్లు పొడవున్న పీఎస్ఎల్వీ రాకెట్ 260 టన్నుల బరువుతో మంచు తెరలను చీల్చుకుంటూ, నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. మొత్తం ప్రయోగం నాలుగు దశల్లో 21.55 నిమిషాల్లో పూర్తయింది. ముందుగా ఎక్స్‌పోశాట్ ఉపగ్రహాన్ని భూమికి 650 కిలోమీటర్లు ఎత్తులోని సన్‌సింక్రనస్ ఆర్బిట్‌లోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. అనంతరం కిలో బరువున్న వియ్‌శాట్‌ను కూడా కక్ష్యలోకి నిర్దేశిత సమయంలో ప్రవేశపెట్టారు. ఏడాది తొలి రోజే చేపట్టిన కీలక ప్రయోగం విజయవంతం కావడంతో శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ శాస్త్రవేత్తలను ఆలింగనం చేసుకున్నారు. ఇస్రో ప్రయోగాల పరంపరకు శ్రీకారం చుట్టి ఈ ఏడాదితో 60 ఏళ్లు పూర్తయ్యాయి. పీఎస్ఎల్వీ రాకెట్ సిరీస్‌లోనూ ఇది 60వ ప్రయోగం కావడం విశేషం! మొత్తమ్మీద షార్ నుంచి ఇది 92వ ప్రయోగం. ఫ్యూయల్ సెల్ ప్రయోగం... ఎక్స్‌పోశాట్, వియ్శాట్లను నిరీ్ణత కక్ష్యలోకి ప్రవేశపెట్టాక ప్రయోగ చివరి దశలో పీఎస్ఎల్వీ వ్యోమ నౌకను రెండుసార్లు మండించి దాని ఎత్తును 650 కి.మీ. నుంచి 350 కి.మీకి తగ్గించారు. 10 కీలక పరికరాలను ఆ భూ దిగువ కక్ష్యలోకి విజయవతంగా చేర్చారు. ఫ్యూయల్ సెల్ పవర్ సిస్టం (ఎఫ్‌సీపీఎస్)తో పాటు బెలిఫ్శాట్, గ్రీన్ ఇంపల్స్ ట్రాన్స్మిటర్ బెలాట్రిక్స్ వంటివి వీటిలో ఉన్నాయి. పీఎస్‌ఎలవీ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్–3 (పోయెం) ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియను చేపట్టారు. 2023 ఏప్రిల్‌లో పీఎస్ఎల్వీ–సీ55 ప్రయోగం సందర్భంగా కూడా పోయెం–2 ద్వారా ఇలాంటి ప్రయోగాన్నే ఇస్రో చేపట్టింది. ► ఇస్రో నిర్మించనున్న భారత అంతరిక్ష కేంద్రానికి ఎఫ్‌సీపీఎస్ కీలకం కానుంది. ► రోదసిలో సుస్థిర శక్తి వనరును సమకూర్చుకోవడం దీని లక్ష్యం. ► ఇందులోని టెక్నాలజీ ఎలక్ట్రో కెమికల్ రియాక్షన్ సాయంతో రసాయన శక్తిని నేరుగా విద్యుచ్ఛక్తిగా మారుస్తుంది. ► తద్వారా మన అంతరిక్ష కేంద్రానికి కావాల్సిన ఇంధనాన్ని ఇది సుదీర్ఘ కాలం పాటు అందించగలదు. ఎక్స్‌పోశాట్‌తో ఉపయోగాలివీ... ► ఉపగ్రహం బరువు 469 కిలోలు. ► ఇది ఐదేళ్ల పాటు సేవలందిస్తుంది. ► గతంలో ప్రయోగించిన ఆస్ట్రోశాట్‌తో కలిసి ఖగోళ పరిశోధన చేపట్టనుంది. ► ఇవి రెండూ విశ్వంతారాల్లో పరిణామాలపై, ముఖ్యంగా కృష్ణ బిలాలపై పరిశోధనలు చేస్తాయి. ► ఎక్స్‌పోశాట్‌లోని ప్రాథమిక పేలోడ్ పోలిక్స్ (ఎక్స్–పోలారిమీటర్ పరికరం)ను 8.3 కిలోవాట్ల ఫోటాన్ల మధ్య వ్యవస్థ ఎక్స్‌రే శక్తి శ్రేణిలో ధ్రువణ పరామితులను, ప్రత్యేకంగా వాటి డిగ్రీ, ధ్రువణ కోణాలను కొలిచేందుకు రూపొందించారు. రామన్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (ఆర్ఆర్ఐ) బెంగళూరు ఇస్రో కేంద్రం దీన్ని రూపొందించింది. ► ఇందులోని మరో పేలోడ్ ఎక్స్పెక్ట్ (ఎక్స్ రే స్పెక్ట్రోస్కోపీ, టైమింగ్) 0.8–15 కిలోవాట్స్ శక్తి పరిధిలో స్పెక్ట్రోస్కోపిక్ సమాచారాన్ని అందిస్తుంది. దీన్ని ఫ్రొపెసర్ యూఆర్ రావు స్పేస్ సెంటర్ రూపొందించింది. ► ఈ రెండు పేలోడ్లు విశ్వాంతరాల్లో కృష్ణ బిలాలపై లోతుగా అధ్యయనం చేసి విలువైన సమాచారం అందిస్తాయి. ► ఇక కేరళ వర్సిటీ విద్యార్థినులు తయారు చేసిన వియ్‌శాట్ కేజీ బరువున్న సూక్ష్మ ఉపగ్రహం. ► కేరళలో మారిన వాతావరణ పరిస్థితుల అధ్యయనం దీని ముఖ్యోద్దేశం. ఈ ఏడాది 12 ప్రయోగాలు: సోమనాథ్ ఈ ఏడాది 12 ప్రయోగాలు లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ తెలిపారు. ‘‘2024ను గగన్‌యాన్ ఏడాదిగా నిర్దేశించుకున్నాం. ఆ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నాలుగు మానవరహిత ప్రయోగాలు చేయనున్నాం. అనంతరం 2025లో మానవసహిత ప్రయోగం ఉంటుంది. నాసాతో సంయుక్తంగా రూపొందించిన ఇన్శాట్–త్రీడీ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగిస్తాం. ఈ నెల 26న, లేదా ఫిబ్రవరి తొలి వారంలో నావిక్–02 ఉపగ్రహ ప్రయోగం ఉటుంది’’ అని ఆయన వివరించారు. -
Aditya-L1: జనవరి ఆరున కక్ష్యలోకి ఆదిత్యఎల్1
అహ్మదాబాద్: భగభగమండే భానుడి వాతావరణం, సూర్యుడిలో సంభవించే స్వల్ప మార్పులు భూగోళంపై ఎలాంటి ప్రతికూల ప్రభావాలు చూపుతాయనే అంశాలను అధ్యయనం చేసేందుకు ఇస్రో ప్రయోగించిన అంతరిక్షనౌక ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన తన కక్ష్యలోకి చేరుకుంటుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ అంచనావేశారు. శుక్రవారం గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఒక ఎన్జీవో ఏర్పాటుచేసిన ‘భారతీయ విజ్ఞాన్ సమ్మేళన్’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ‘‘ భూమి నుంచి సూర్యుడి వైపుగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రాంజియాన్ పాయింట్(ఎల్) కక్ష్యలోకి ఆదిత్య ఎల్–1 జనవరి ఆరో తేదీన చేరుకుంటుందని భావిస్తున్నాం. ఆరో తేదీన ఎల్1 పాయింట్లోకి చేరగానే వ్యోమనౌక మరింత ముందుకు వెళ్లకుండా వ్యతిరేకదిశలో ఇంజిన్‌ను మండిస్తాం. దాంతో అది ఆ కక్ష్యలో స్థిరంగా కుదురుకుంటుంది. ఆ కక్ష్యలోనే తిరుగుతూ సూర్య వాతావరణ విశేషాలపై అధ్యయనం మొదలుపెడుతుంది. వచ్చే ఐదేళ్లపాటు సూర్యుడిపై సంభవించే పరిణామాలను విశ్లేíÙంచనుంది. స్పేస్‌క్రాఫ్ట్ తన కక్ష్యలో కుదురుకున్నాక సౌరగాలులు, సౌర ఉపరితలంపై మార్పులు తదితరాల డేటాను ఒడిసిపట్టి భారత్‌కు మాత్రమేకాదు యావత్ ప్రపంచానికి పనికొచ్చే సమాచారాన్ని ఆదిత్య ఎల్1 అందించనుంది’’ అని సోమనాథ్ చెప్పారు. ‘‘ ప్రధాని మోదీ ఉద్భోదించినట్లు అమృతకాలంలో భారత్ ‘భారతీయ స్పేస్ స్టేషన్’ పేరిట సొంత అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటుచేసేందుకు కృషిచేస్తున్నాం’ అని వివరించారు. -
చందమామపై మన అడుగే తరువాయి!
అందరినీ ఆశ్చర్యానందాలలో ముంచెత్తిన చంద్ర యాన్–3 విజయం తర్వాత, ఏ మాత్రం ఆలస్యం చేయ కుండా 2040 నాటికి భార తీయ వ్యోమగాములు చంద్రు నిపైకి వెళ్ళే దిశగా పూర్తిగా ప్రయత్నం చేస్తున్నాం. భవి ష్యత్తుపై దృష్టితో, ‘గగన్ యాన్’ ప్రోగ్రామ్‌లో భాగంగా, ఇద్దరి నుంచి ముగ్గురు వరకూ భారతీయ వ్యోమగాములను ‘లో ఎర్త్ ఆర్బిట్’ (ఎల్ఈఓ) లోకి పంపించి, మూడు రోజుల వరకు అక్కడ ఉంచి, మన దేశంలోని ఒక నీటి వనరుపై వారిని ల్యాండ్ చేసే (దించే) కార్యక్రమంలో మరొక అడుగు ముందుకు వేయాలని ప్రయత్నిస్తోంది ఇస్రో. ఈ మిషన్ కోసం భారత వైమానిక దళానికి చెందిన నలుగురు టెస్ట్ పైలట్లను ఆస్ట్రోనాట్– డెసిగ్నేట్లుగా ఎంపిక చేశాం. ప్రస్తుతం, వారు బెంగ ళూరులోని ఆస్ట్రోనాట్ ట్రైనింగ్ ఫెసిలిటీ (ఏటీఎఫ్)లో మిషన్–నిర్దిష్ట శిక్షణ పొందుతున్నారు. హ్యూమన్– రేటెడ్ (మానవులను సురక్షితంగా రవాణా చేయగల సామర్థ్యం) లాంచ్ వెహికల్ (హెచ్ఎల్వీఎమ్3), క్రూ మాడ్యూల్ (సీఎమ్), సర్వీస్ మాడ్యూల్ (ఎస్ఎమ్) లతో కూడిన ఆర్బిటల్ మాడ్యూల్; లైఫ్ సపోర్ట్ సిస్టమ్‌లతో సహా క్లిష్టమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌లో ప్రారంభ దశలో ఉంటుంది. ఇంటి గ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లైట్లతో పాటు రెండు ఒకేలా ఉండే అన్– క్రూడ్ మిషన్లు (జీ1, జీ2) మనుషులతో కూడిన మిషన్‌కు ముందు ఉంటాయి. సీఎమ్‌ను కూడా ఏర్పాటు చేస్తాం. సీఎమ్ అనేది సిబ్బంది కోసం అంతరిక్షంలో భూమి–వంటి వాతా వరణంతో నివాసయోగ్యంగా ఉండే స్థలం. వ్యోమగా ములు సురక్షితంగా తిరిగి రావడం కోసం ఉద్దేశించింది ఇది. భద్రతా చర్యలలో అత్యవసర పరిస్థితుల కోసం క్రూ ఎస్కేప్ సిస్టమ్ (సీఈఎస్) కూడా ఉంటుంది.టెస్ట్ వెహికల్ (టీవీ–డీ1) యొక్క మొదటి డెవలప్మెంట్ ఫ్లైట్ 2023 అక్టోబరు 21న ప్రారంభించబడింది. ఇది క్రూ ఎస్కేప్ సిస్టమ్ యొక్క ఫ్లైట్ అబార్ట్‌ను విజయవంతంగా పరీక్షించగలిగింది. ఆ తర్వాత క్రూ మాడ్యూల్ వేరుపడటం, బంగాళాఖా తంలో ఇండియన్ నావికదళం దానిని సురక్షితంగా రికవర్ చేయడం కూడా జరిగాయి. మానవ రహిత మిషన్లూ, అంతిమంగా మానవ సహిత అంతరిక్ష మిషన్ 2025లో ప్రారంభించబడుతుందనీ అంచనా వేయడానికి ఈ టెస్ట్ ఫ్లైట్ విజయం కీలకమైనది. ఇస్రో మరొక ముఖ్యమైన ప్రాజెక్ట్, భారతదేశపు తొలి సౌర అన్వేషణ మిషన్ అయిన ఆదిత్య ఎల్1. ఇది ‘లాగ్రేంజ్ పాయింట్ 1’ యొక్క ప్రత్యేకమైన వాన్టేజ్ పాయింట్ నుండి సూర్యుడిని అధ్యయనం చేస్తుంది. చంద్రునిపైనా సూర్యునిపైనా చేసే పరిశోధ నల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. వివిధ ఇస్రో కేంద్రాలు, విద్యా సంస్థల సహకారంతో దేశీయంగా అభివృద్ధి చేసిన ఏడు సైంటిఫిక్ పేలోడ్లతో నిండిన ఆదిత్య ఎల్1 అంతరిక్ష నౌక çసూర్యుని రహస్యాలను ఛేదించడానికి ప్రయోగిస్తున్నాం. 2023 సెప్టెంబర్ 2న ప్రారంభించిన ఆదిత్య ఎల్1 ఐదేళ్ల పాటు పని చేస్తుందని భావిస్తున్నాం. ఇది భూమి నుండి సుమారు 1.5 మిలియన్ కి.మీ. దూరంలో ఉన్న సూర్యుడు–భూమి లాగ్రాంజ్ పాయింట్ 1 (ఎల్1) వైపు ఉద్దేశించిన మార్గంలో ఉంది. ఇక్కడే అది జనవరి 2024లో హాలో కక్ష్యలోకి చేర్చబడుతుంది. చంద్రయాన్–3 మిషన్ ఒక చరిత్రాత్మక విజయం. ఆ విజయం సిద్ధించిన ఆగస్టు 23ను ‘భారతదేశంలో జాతీయ అంతరిక్ష దినోత్సవం’గా ప్రకటించడం ముదావహం. 14 రోజుల (ఎర్త్ డేస్) మిషన్ జీవిత కాలంలో, ఇది చంద్రుని మట్టిలో అల్యూమినియం, కాల్షియం, ఐరన్, క్రోమియం, టైటానియం, సల్ఫర్, మేంగనీస్, సిలికాన్, ఆక్సి జన్లను కనుగొన్న విలువైన డేటాను అందించింది. మనం తలపెట్టిన చిన్న శాటిలైట్ లాంచ్ వెహికిల్ (ఎస్ఎస్ఎల్వీ), పునర్వినియోగ ప్రయోగ వాహనం (ఆర్ఎల్వీ) ప్రోగ్రామ్, ఎక్స్–రే ఆస్ట్రానమీ మిషన్ ‘ఎక్స్‌పోశాట్’, స్పేస్ డాకింగ్ ప్రయోగం, ఎల్‌ఓఎక్స్ –మీథేన్ ఇంజన్ వంటి పరివర్తనాత్మక కార్యక్రమాలు కలిసి, భారత్ అంతరిక్ష అన్వేషణలో కొత్త శకాన్ని నిర్వచించాయి. మూడు దశల లాంచ్ వెహికల్ అయిన ఎస్ఎస్ ఎల్వీ 500 కిలోల బరువున్న ఉపగ్రహాన్ని 500 కి.మీ. ప్లానార్ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టగలదు. బహుళ ఉప గ్రహాలను తీసుకెళ్లగలదు. ఉపగ్రహాలను ఎప్పుడు ఎక్కడ ఆర్బిట్‌లో ప్రవేశపెట్టాలనుకుంటే అప్పుడు ప్రవేశపెట్టగల (లాంచ్–ఆన్–డిమాండ్ ) సామర్థ్యం దీనికి ఉంది. దీన్ని ప్రయోగించడానికి కనీçస మౌలిక సదుపాయాలు ఉంటే చాలు. అలాగే ప్రయోగించ డానికి ఖర్చు కూడా తక్కువే! ఎక్స్‌పోశాట్ అనేది భారత్ మొట్టమొదటి నిర్దిష్ట సైన్స్ మిషన్. ఇది శాస్త్రీయ పేలోడ్లను ఉపయోగించి తీవ్ర పరిస్థితుల్లోనూ ప్రకాశవంతమైన ఖగోళ ఎక్స్–రే మూలాలను పరిశోధిస్తుంది. అటువంటి దీనిని 2023–2024లో ప్రారంభించేందుకు ప్రణాళిక సిద్ధ మయింది. స్పాడెక్స్ (స్పేస్ డాకింగ్ ఎక్స్పరిమెంట్)ను 2024 మూడవ త్రైమాసికంలో ప్రారంభించాలనేది ప్రణాళిక. ఇది మానవ అంతరిక్షయానంలో అనువర్తనాల పరిధితో డాకింగ్, ఫార్మేషన్ ఫ్లయింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించినజంట అంతరిక్ష నౌక. ఈ మిషన్‌లో రెండు చిన్న– ఉపగ్రహాలు ఉంటాయి. ఒకటి ఛేజర్గా, మరొకటి టార్గెట్‌గా, సహ–ప్రయాణికులుగా కలిపి ప్రయోగించబడతాయి. ‘భవిష్యత్తులో ‘చంద్రయాన్’ మిషన్ లలో చంద్రుని నుంచి శాంపిల్స్ తీసుకువచ్చేందుకు మార్గం సుగమం చేయడంలో డాకింగ్ ప్రయోగ విజయం గణనీయమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. రానున్న కాలంలో సాంకేతికత పరంగా అత్యంత ప్రాముఖ్యం కలిగిన ‘ఎల్‌ఓఎక్స్ మీథేన్’ (లిక్విడ్ ఆక్సి జన్ ఆక్సిడైజర్, మీథేన్ ఇంధనం) ఇంజిన్ల అభివృద్ధి కూడా ముఖ్యమైనదే. ఇది అంగారక గ్రహం వంటి ఇతర గ్రహాలపై పర్యావరణాల ఉనికి కోసం మాన వుడు చేసే అన్వేషణను సులభతరం చేస్తుంది. అంత రిక్షంలో నీరు, కార్బన్ డై ఆక్సైడ్ లను సంశ్లేషణ చేయడం ద్వారా తయారు చేయగలిగిన మీథేన్ అంత రిక్షంలో సుదూరం ప్రయాణించే నౌకలకు ఇంధనంగా ఉపయోగిస్తారని భావిస్తున్నారు. అందుకే ఎల్‌ఓఎక్స్ మిథేన్ ఇంజిన్ల అభివృద్ధి చాలా ప్రాముఖ్యం కలిగిందని చెప్పాలి. 2035 నాటికి ‘భారతీయ అంతరిక్ష స్టేషన్’ ప్రారంభించడం, వీనస్ ఆర్బిటర్ మిషన్, మార్స్ ల్యాండర్‌తో కూడిన అంతర్ గ్రహ అన్వేషణను ప్రారంభించడం వంటి ప్రతిష్ఠాత్మక లక్ష్యాలను ప్రధాన మంత్రి నిర్దేశించుకున్నారు. ఇవన్నీ ప్రపంచ అంతరిక్ష పరిశోధనా వేదికపై భారత్ ఉనికిని మరింత పటిష్టం చేస్తాయి. ‘భారత్ అంతరిక్ష కార్యక్రమం రాబోయే సంవత్సరాల్లో కొత్త శిఖరాలను చేరుకోవ డానికి సిద్ధంగా ఉంది. ప్రయోగించబడిన ప్రతి మిషన్, ప్రతి ఆవిష్కరణతో ఇస్రో ప్రపంచ వేదికపై తన స్థానాన్ని సగర్వంగా పునరుద్ఘాటిస్తుంది. (‘మలయాళ మనోరమ’కు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అందించిన కథనం ఆధారంగా) -
2040 కల్లా చందమామపై భారత వ్యోమగామి: ఇస్రో
తిరువనంతపురం: 2040 ఏడాదికల్లా చంద్రుడిపై భారతీయ వ్యోమగామి అడుగుపెట్టేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్ మంగళవారం చెప్పారు. ‘‘వ్యోమగాములుగా తీర్చిదిద్దేందుకు నలుగురు భారత వాయుసేన పైలట్లను ఎంపికచేశాం. వారికి శిక్షణలో కొనసాగుతోంది. వ్యోమగాములను ముందు లోయర్ ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ)లోకి ప్రవేశపెట్టి సురక్షితంగా హిందూ మహాసముద్ర జలాల్లో దించుతాం’’ అని వెల్లడించారు. ‘‘గగన్‌యాన్ కోసం మనుషులు ప్రయాణించే హెచ్ఎల్వీఎం3 వ్యోమనౌక, క్రూ మాడ్యుల్ ఉండే ఆర్బిటల్ మాడ్యూల్, సరీ్వస్ మాడ్యల్, ప్రాణాధార వ్యవస్థలు కావాలి. ముందు మానవరహిత ప్రయోగాలను పూర్తిచేయాలి. ఒకే పోలికలు ఉండే రెండు మానవరహిత మిషన్లు(జీ1, జీ2), ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ పరీక్ష తదితరాలను విజయవంతంగా పూర్తి చేయాల్సి ఉంటుంది. చంద్రుడిని చేరాక సురక్షితంగా తిరిగొచ్చేందుకు వ్యోమగాములు ఉండే క్రూ మాడ్యుల్(సీఎం) తయారీ, అత్యవసర పరిస్థితుల్లో సిబ్బంది తప్పించుకునే క్రూ ఎస్కేప్ సిస్టమ్(సీఈఎస్)లనూ అభివృద్ధిచేసుకోవాల్సి ఉంది’’ అని సోమనాథ్ చెప్పారు. -
తుది‘దశ’లో ఆదిత్య ఎల్1
తిరువనంతపురం: సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక త్వరలోనే దాని ఎల్–1 పాయింట్లోకి చేరుకోనుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘ ఆదిత్య తన దిశలో దూసుకుపోతోంది. ఇది దాదాపు తన తుదిదశకు చేరుకుంది. ఎల్–1 పాయింట్లోకి దానిని చేర్చేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీకల్లా ఎల్–1లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం’’ అని చెప్పారు. -
ఎల్1కు చేరువలో ఆదిత్య : ఇస్రో చైర్మన్
తిరువనంతపురం: సూర్యున్ని అధ్యయనం చేయడానికి నింగిలోకి వెళ్లిన వ్యోమనౌక ఆదిత్య ఎల్-1ప్రయాణం తుది దశకు చేరుకుందని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. వచ్చే ఏడాది జనవరి 7కల్లా ఆదిత్య వ్యోమనౌక ఎల్ 1 పాయింట్ చేరుకునేందుకు కావల్సిన తుది ఏర్పాట్లు పూర్తవుతాయని చెప్పారు. తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సోమనాథ్ ఆదిత్య ఎల్1 అప్డేట్స్ను వెల్లడించారు. ‘ఆదిత్య మిషన్ గమ్యాన్ని చేరుకునేందుకు అతి దగ్గరలో ఉంది. ఎల్ 1 పాయింట్‌కు వెళ్లేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నాం’ అని సోమనాథ్ తెలిపారు.సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ను శ్రీహరికోటలోని సతీష్‌ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత ఆదిత్య స్పేస్ క్రాఫ్ట్ సూర్యునికి అతి సమీపంలో ఉన్న లాంగ్రేజియన్ పాయింట్(ఎల్-1)ను చేరుకునే లక్ష్యంతో పంపించారు. ఎల్-1పాయింట్ చేరకున్న తర్వాత అక్కడి నుంచి ఆదిత్య సూర్యుని చిత్రాలు తీసి భూమికి పంపనుంది. ఇవి సూర్యున్ని మరింత లోతుగా అధ్యయనం చేయడంలో ఇస్రోకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. ఇదీచదవండి..తేజస్ యుద్ధ విమానంలో ప్రయాణించిన మోదీ -
ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ 'ఎస్ సోమనాథ్' (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్' (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు. పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్‌ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. -
ఇస్రో చైర్మన్ ఆత్మకథ
తిరువనంతపురం: ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ఆత్మకథ రాశారు. ‘నిలవు కుడిచ సింహగల్ (వెన్నెల గ్రోలిన సింహాలు)’ పేరిట మలయాళంలో రాసిన ఈ ఆత్మకథ త్వరలో రానుంది. యువతరానికి తన జీవితం స్ఫూర్తిగా నిలవాలనే ఈ ఆత్మకథ రాసినట్లు ఆయన వెల్లడించారు. అత్యంత నిరుపేద గ్రామీణ కుటుంబంలో పుట్టిన ఆయన ఇస్రో చైర్మన్ స్థాయికి ఎదిగిన తీరు, ఆ క్రమంలో ఎదురైన కష్టాలను ఆయన ఇందులో హృద్యంగా వివరించారు. చంద్రయాన్ మిషన్ విజయం తనను ఆత్మకథ రచనకు పురిగొల్పిందని చెప్పారాయన. ఇంజనీరింగ్ కాలేజీకి పాత డొక్కు సైకిల్ మీద వెళ్లిన వైనం తదితరాలను పుస్తకంలో పొందుపరిచారు. -
గగన్‌యాన్‌లో మహిళా పైలట్లకు ప్రాధాన్యం
తిరువనంతపురం: గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా చేపట్టే మానవసహిత అంతరిక్ష కార్యక్రమంలో మహిళా పైలట్లు, మహిళా శాస్త్రవేత్తలకే ఇస్రో ప్రాధాన్యం ఇస్తుందని, భవిష్యత్తులో మహిళా వ్యోమగాములనే అంతరిక్షంలోకి పంపుతామని సంస్థ చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. వచ్చే ఏడాది ప్రయోగించే మానవ రహిత గగన్‌యాన్ అంతరిక్ష నౌకలో మనిషిని పోలిన మహిళా హ్యూమనాయిడ్‌ను ఇస్రో పంపుతుందని తెలిపారు. 2025 నాటికి మానవ సహిత మిషన్‌ను భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని దిగువ కక్ష్యలోకి పంపుతామని, అది మూడు రోజుల తర్వాత సురక్షితంగా భూమికి తిరిగి చేరుకుంటుందని వివరించారు. ప్రస్తుతానికి మహిళా ఫైటర్ టెస్ట్ పైలట్లు దొరకనందున ఎయిర్ ఫోర్స్ ఫైటర్ టెస్ట్ పైలట్లనే అంతరిక్ష యాత్రకు ఎంపిక చేస్తున్నాం. మహిళా పైలట్లు అందుబాటులోకి వస్తే వారినే ఎంపిక చేసుకుంటాం. ఆ తర్వాత మహిళా సైంటిస్టుల వంతు. అప్పుడిక మహిళలకు ఎక్కువ అవకాశాలు అందుబాటులోకి వస్తాయి’ అని సోమనాథ్ చెప్పారు. 2035 నాటికి పూర్తి స్థాయిలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుందని వెల్లడించారు. శనివారం గగన్‌యాన్ యాత్రలో సన్నాహక పరీక్షల్లో భాగమైన క్రూ ఎస్కేప్ మాడ్యూల్‌ను ఇస్రో విజయవంతంగా ప్రయోగించిన విషయం తెలిసిందే. -
గగన్ యాన్ టెస్ట్ లాంచ్ విజయవంతం
-
డాక్టర్ అవ్వాలనుకున్న ఇస్రో ఛైర్మన్..!
సంక్లిష్టమైన చంద్రయాన్-3 ప్రయోగాన్ని సుసాధ్యం చేసిన ఇండియన్ స్పేస్ రిసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో)కు సారథ్యం వహిస్తున్న సంస్థ ఛైర్మన్ సోమనాథ్ తాను చిన్నతనంలో డాక్టర్ కావాలనుకున్నానని చెప్పారు. ఇటీవల చెన్నైలోని డాక్టర్ ఎంజీఆర్ యూనివర్శిటీలో జరిగిన వైద్యుల సదస్సులో ఆయన్ ప్రసంగించారు. ఆయనకు బయాలజీ అంటే ఇష్టమనీ, తాను చిన్ననాటి నుంచి జీవశాస్త్రంలో టాపర్‌గా ఉండేవాడినని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే ఆకాంక్ష బలంగా ఉండేదన్నారు. అయితే వైద్య వృత్తి చాలా కఠినమైందని, ఇంజినీరింగ్ లేదా గణితాన్ని ఎంచుకోవాలని ఆయన తండ్రి చెప్పినట్లు తెలిపారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాక ఎలాంటి స్పెషలైజేషన్ చేయలేదని సోమనాథ్ వెల్లడించారు. తాను మెకానికల్ ఇంజినీర్ కోర్సు చేస్తున్నపుడు ప్రొపల్షన్‌పై ఆసక్తి కలిగిందన్నారు. వైద్య నిపుణులు సాఫ్ట్వేర్, ఏఐ టూల్స్ గురించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. టెక్నాలజీ వినియోగం వల్ల ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు. -
మన టెక్నాలజీని అమెరికా కావాలంది
రామేశ్వరం: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడంతో అమెరికా నిపుణులు సైతం మన అంతరిక్ష టెక్నాలజీని కోరుతున్నారని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. సంక్లిష్టమైన రాకెట్ మిషన్లను అభివృద్ధి చేయడంలో నిమగ్నమైన అమెరికాలో నిపుణులు, చంద్రయాన్–3 మిషన్‌ను చూశాక, భారత్ తమతో అంతరిక్ష సాంకేతికతను పంచుకోవాలని కోరుకుంటున్నారన్నారు. రోజులు మారాయని, అత్యుత్తమైన పరికరాలను, రాకెట్లను నిర్మించగల సత్తా భారత్ సొంతం చేసుకుందని ఆయన చెప్పారు. అందుకే, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ పెట్టుబడులు ద్వారాలు తెరిచారని ఆయన అన్నారు. దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతిని పురస్కరించుకుని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం ఫౌండేషన్ నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులనుద్దేశించి సోమనాథ్ మాట్లాడారు. ‘మనది చాలా శక్తిమంతమైన దేశం. ప్రపంచంలోనే అత్యుత్తమమైన విజ్ఞానం, మేధస్సు కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. చంద్రయాన్–3 వాహకనౌకను మనమే డిజైన్ చేసి, అభివృద్ధి పరిచాం. ప్రయోగం చేపట్టడానికి కొన్ని రోజులు ముందు ఈ మిషన్‌ను తిలకించేందుకు నాసా నిపుణులను ఆహ్వానించాం. వారు ఇస్రో ప్రధాన కార్యాలయానికి రాగా చంద్రయాన్–3 మిషన్ గురించి వివరించాం. వారంతా చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనం చాలా తక్కువ ఖర్చుతో పరికరాలు, సామగ్రిని రూపొందించడం చూసి, ఆశ్చర్యపోయారు. తమ దేశానికి ఈ పరిజ్ఞానాన్ని విక్రయించాలని అడిగారు’అని ఆయన వివరించారు. రాకెట్లు, శాటిలైట్ల నిర్మాణంలో పాల్గొని, అంతరిక్ష రంగంలో మన దేశాన్ని మరింత శక్తివంతమైందిగా మార్చాలని కోరుతున్నాను. ఇక్కడున్న కొందరికి ఆ నైపుణ్యం ఉంది. చంద్రుణ్ని చేరుకునే రాకెట్‌ను డిజైన్ చేయగలరు’అని ఆయన పిలుపునిచ్చారు. ‘భారత మహిళా వ్యోమగామి చంద్రయాన్–10 మిషన్‌లో చంద్రుడిపై అడుగుపెడుతుంది. ఆ మిషన్‌లో మీలో ఒకరు, ముఖ్యంగా ఓ బాలిక సైతం ఉండి ఉండొచ్చు’అని ఆయన అన్నారు. -
యూజ్లెస్ ఫెలో.. గెట్ లాస్ట్ అన్నారు! అక్కడే చైర్మన్ అయ్యాను..
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) మాజీ చీఫ్ డాక్టర్ కె శివన్ తన మొదటి ప్రయత్నంలో అంతరిక్ష సంస్థలో జాబ్ పొందలేకపోయాయని 'నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ' (NIT) గోవా తొమ్మిదవ కాన్వకేషన్‌లో వెల్లడించాడు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. చదువు పూర్తయిన తరువాత నేను టీచర్ అవ్వాలనుకున్నాను, అయితే అంతరిక్ష సంస్థకు ఛైర్మన్‌గా మారాను అంటూ గుర్తు చేసుకున్నారు. మాస్టర్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత ఉద్యోగం కోసం ఇస్రో కేంద్రానికి వెళితే అక్కడ యూజ్లెస్ ఫెలో.. నీకు జాబ్ రాదు.. గెట్ లాస్ట్ అన్నారని వెల్లడించాడు. ఇలా అనిపించుకున్న తరువాత, చివరకు అదే సెంటర్‌కు చైర్మన్ అయ్యానని చెప్పుకొచ్చాడు. మొదట శాటిలైట్ సెంటర్లో ఉద్యోగం రాకపోవడంతో రాకెట్ సెంటర్లో ఉద్యోగం సంపాదించి ఆ తరువాత అప్పటికే నాలుగు సార్లు విఫలమైన జియోసింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (GSLV) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బాధ్యత తీసుకున్నప్పుడు స్నేహితులు, సన్నిహితులు నువ్వు పెద్ద మూర్ఖుడివి అంటూ విమర్శించారని వెల్లడించారు. ఎన్నెన్నో విమర్శలు ఎదుర్కొని జీఎస్ఎల్వీ ప్రాజెక్టును విజయవంతం చేసానని శివన్ చెప్పాడు. ఈ విజయం ఇస్రో కమ్యూనిటీకి కనపడేలా చేయడంతో ఇస్రో చైర్మన్ పదవి కూడా వరించిందని తెలిపాడు. నిజానికి నా జీవితంలో ఓ గొప్ప విషయం నేర్చుకున్నాను, అదేంటంటే.. మీరు ఎక్కడైనా విమర్శలకు, తిరస్కరణకు గురైతే తప్పకుండా మీ కోసం మరో గొప్ప అవకాశం మరొకటి వేచి ఉంటుందని శివన్ చెప్పారు. ఇదీ చదవండి: మామకు తగ్గ మేనల్లుడు.. అర్జున్ కొఠారి ఆస్తులు ఇన్ని కోట్లా? ఆ తరువాత చంద్రయాన్ 2 మిషన్ ప్రారంభమైంది. దీనిని 2019 జూలై 22న అంతరిక్షంలో పంపించారు, కానీ అది 2019 సెప్టెంబరు 7 విఫలమైనట్లు తెలిసింది. ఆ తరువాత చంద్రయాన్-3తో ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ నుంచి ఆమోదం లభించిందని చెప్పారు. డాక్టర్ కె శివన్ గురించి ఏప్రిల్ 1957లో కన్యాకుమారిలోని తారక్కన్‌విలై గ్రామంలో ఒక మామిడి రైతుకు జన్మించిన 'శివన్' పాఠశాల విద్యను తమిళ మాధ్యమ పాఠశాల నుంచి, ఆ తరువాత 1980లో మద్రాస్ యూనివర్శిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటికల్ డిగ్రీ పూర్తి చేసాడు.1982లో బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో మాస్టర్స్ డిగ్రీని పొంది ఇస్రోతో కలిసి పనిచేయడం ప్రారంభించాడు. 2006లో ఐఐటీ బాంబే నుంచి ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో డాక్టరల్ డిగ్రీ కూడా సొంతం చేసుకున్నాడు. ఈయన పీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి, జీఎస్ఎల్వి MkIII వంటి ప్రాజెక్టుల్లో కూడా పనిచేశాడు. ఆ తరువాత 2022 జనవరిలో ఇస్రో ఛైర్మన్‌గా ఎస్ సోమనాథ్ బాధ్యతలు స్వీకరించాడు. -
ఇస్రో శాస్త్రవేత్తల విశేష కృషి: సోమనాథ్
సూళ్లూరుపేట (తిరుపతి జిల్లా): ఆదిత్య–ఎల్1 ప్రయోగం విజయవంతం కావడం వెనుక ఇస్రో శాస్త్రవేత్తల కృషి ఎంతో ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగం సక్సెస్ అయిన వెంటనే ఆయన మిషన్ కంట్రోల్ సెంటర్ నుంచి మాట్లాడారు. ఈ ప్రయోగాన్ని ముందుగా అనుకున్న విధంగానే చేయగలిగామని చెప్పారు. జూలై 14న నిర్వహించి చంద్రయాన్–3 మిషన్‌ను ఆగస్టు 23న చంద్రుడిపై ల్యాండర్‌ను దించి సక్సెస్‌ను ఆస్వాదిస్తున్న సమయంలోనే సూర్యయాన్–1కి రెడీ అయిపోయామని చెప్పారు. రేపటి నుంచి 16 రోజుల పాటు ఆర్టిట్ రైజింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. 125 రోజుల తర్వాత ఉపగ్రహాన్ని సూర్యుని దిశగా పయనింపజేసి 15 లక్షల కిలోమీటర్ల దూరంలోని లాంగ్రేజియన్–1 బిందువు వద్ద ప్రవేశపెడతామన్నారు. భవిష్యత్తులో చంద్రయాన్–4 ప్రయోగం, ఆ తర్వాత శుక్రుడి మీదకు కూడా ప్రయోగానికి సిద్ధమవుతామని తెలిపారు. ఈ ఏడాది ఆక్టోబర్‌లో గగన్‌యాన్ ప్రయోగాత్మక ప్రయోగం, జీఎస్ఎల్వీ మార్క్–2 రాకెట్ ద్వారా త్రీడీఎస్ అనే సరికొత్త ఉపగ్రహాన్ని పంపించబోతున్నామని చెప్పారు. ఇస్రోకు ప్రధాని అభినందనలు న్యూఢిల్లీ: దేశం యొక్క మొదటి సోలార్ మిషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. మానవాళి సంక్షేమం కోసం విశ్వాంతరాళాన్ని అర్థం చేసుకునే క్రమంలో మన శాస్త్రీయ పరిశోధనలు అవిశ్రాంతంగా కొనసాగుతాయని ఎక్స్‌లో ఆయన పేర్కొన్నారు. ఆదిత్య–ఎల్1 ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసిన ఇస్రో ఇంజినీర్లు, శాస్త్రవేత్తలకు అభినందనలు అని తెలిపారు. ఇస్రో బృందానికి ఏపీ సీఎం వైఎస్ జగన్ అభినందనలు సాక్షి, అమరావతి: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో.. పరిశోధనల క్రమంలో సోలార్ మిషన్ ఆదిత్య ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి విజయవంతంగా ప్రవేశపెట్టడం పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్రో బృందాన్ని అభినందించారు. భారతీయ అంతరిక్ష సాంకేతికతను మరింత ఎత్తుకు తీసుకెళ్లే మిషన్‌ను సాధించాలని సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అభినందనలు సాక్షి, హైదరాబాద్: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శనివారం ‘ఆదిత్య ఎల్–1’ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించడం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో అంతరిక్ష పరిశోధనా రంగంలో మరో కీలక మైలురాయిని దాటిందని అన్నారు. అంతరిక్ష పరిశోధనా రంగంలో ప్రపంచానికి ఆదర్శంగా దేశ శాస్త్రవేత్తలు సాధిస్తున్న ప్రగతి, ప్రతి భారతీయుడు గర్వపడేలా చేసిందన్నారు. ఇస్రో చైర్మన్, శాస్త్రవేత్తలు, సాంకేతిక సిబ్బందిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. -
ISRO's Aditya-L1 Solar Mission: నేడే పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): సూర్యుడిపై పరిశోధనలే లక్ష్యంగా రూపుదిద్దుకున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహం ప్రయోగానికి సర్వం సిద్ధమయింది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) తిరుపతి జిల్లా సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్లోని రెండో ప్రయోగ వేదిక నుంచి పీఎస్ఎల్వీ సీ57 ఉపగ్రహ వాహకనౌక ఆదిత్య–ఎల్1ను మోసుకెళ్లనుంది. శుక్రవారం ఉదయం 12.10 గంటలకు మొదలైన కౌంట్‌డౌన్ ప్రక్రియ 23.40 గంటలు కొనసాగిన అనంతరం శనివారం ఉదయం 11.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ57 ప్రయోగాన్ని చేపడతారు. శుక్రవారం ఉదయం షార్కు విచ్చేసిన ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ ముందుగా శ్రీ చెంగాళమ్మ ఆలయం పూజలు చేసుకున్నారు. కౌంట్‌డౌన్ ప్రక్రియలో భాగంగా ముందుగా రాకెట్‌కు నాలుగో దశలో 2.5 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శుక్రవారం ఆర్థరాత్రి దాటాక రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ ప్రయోగంలో సూర్యుడిపై పరిశోధనలకు 1,480.7 కిలోల బరువు కలిగిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపుతున్నారు. షార్ నుంచి చేసిన ప్రయోగాల్లో ఇది 92వది. పీఎస్ఎల్వీ సిరీస్‌లో 59వది. పీఎస్–4 దశతో మరో సరికొత్త పరిశోధన: పీఎస్ఎల్వీ సీ57 రాకెట్‌లోని నాలుగో దశ (పీఎస్–4)తో మరో సరికొత్త పరిశోధనకు ఇస్రో శ్రీకారం చుట్టింది. నాలుగో దశతో వివిధ రకాల విన్యాసాలు చేసి 01.03.31 గంటలకు ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని వదిలిపెడుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఉపగ్రహాన్ని వదిలిపెట్టేందుకు ఇంత సమయం తీసుకున్న పరిస్థితి లేదు. ముందుగా ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టే కక్ష్య దూరం కూడా ఈసారి కొత్తగానే వుంది. అపోజి అంటే భూమికి దూరంగా 36,500 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అలాంటిది కేవలం 19,500 కిలోమీటర్ల దూరంలో మాత్రమే ఉపగ్రహాన్ని ప్రవేశపెడుతున్నారు. ఉపగ్రహాన్ని వదిలిపెట్టిన తరువాత రెండు రకాల విన్యాసాలను చేసి కక్ష్య దూరాలను పరిశోధించే పనిని చేపడుతున్నారు. ఎంఓఎన్ పాసివేషన్ పేరుతో 4042.52 సెకన్లకు ఒకసారి, ఎంఎంహెచ్ పాసివేషన్ పేరుతో 4382.52 సెకన్లకు ఒకసారి రీస్టార్ట్ చేసి సరికొత్త పరిశోధనలు చేస్తున్నారు. రోజుకు 1,440 చిత్రాలు ఆదిత్య–ఎల్1 నిర్దేశిత కక్ష్యలోకి చేరిన వెంటనే అందులో అమర్చిన విజిబుల్ లైన్ కొరోనాగ్రాఫ్(వీఈఎల్సీ) పేలోడ్ నిమిషానికి ఒకటి చొప్పున రోజుకు సుమారు 1,440 చిత్రాలను తీసి విశ్లేషణ కోసం గ్రౌండ్ స్టేషన్‌కు పంపుతుందని ప్రాజెక్టు సైంటిస్ట్ అండ్ ఆపరేషన్ మేనేజర్ డాక్టర్ ముత్తు ప్రియాల్ చెప్పారు. ఫిబ్రవరి చివరినాటికి మొదటి చిత్రం అందుతుందని భావిస్తున్నామన్నారు. రాకెట్ వివరాలు ► పీఎస్ఎల్వీ సీ57 రాకెట్ పొడవు 44.4 మీటర్లు. ► రాకెట్ ప్రయోగ సమయంలో 321 టన్నుల బరువుంటుంది. నింగికి పయనమైన 01–03–31 (3799.52) నిమిషాల్లో ప్రయోగం పూర్తవుతుంది. ► మొదటి దశలో 139 టన్నుల ఘన ఇంధనం కోర్ అలోన్ దశ, ఈ ప్రయోగానికి రాకెట్ చుట్టూరా ఆరు స్ట్రాపాన్ బూస్టర్లు ఉంటాయి. ఒక్కో బూస్టర్‌లో 12.2 టన్నుల ఘన ఇంధనం నింపుతారు. ► 212.02 టన్నుల ఘన ఇంధనంతో మొదటి దశ 109.40 సెకన్లలో పూర్తవుతుంది. ► 41 టన్నుల ద్రవ ఇంధనాన్ని వినియోగించి 262.38 సెకన్లకు రెండోదశ పూర్తవుతుంది. ► 7.65 టన్నుల ఘన ఇంధనం సాయంతో 581.42 సెకన్లకు మూడో దశను పూర్తిచేస్తారు. ► మళ్లీ నాలుగోదశ (పీఎస్–4) 3127.52 సెకన్లకు స్టార్ట్ చేసి 3599.52 సెకన్లకు కటాఫ్ చేస్తారు. ► శిఖరభాగాన అమర్చిన ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని 3799.52 సెకన్లకు (01.03.31 గంటల వ్యవధి)లో భూమికి దగ్గరగా (పెరిజి) 235 కిలోమీటర్లు, భూమికి దూరంగా (అపోజి) 19,500 కిలోమీటర్ల ఎత్తులోని ఎసింట్రక్ ఎర్త్ బౌండ్ ఆర్బిట్‌లోకి ప్రవేశపెడతారు. 175 రోజుల తరువాత సూర్యుడి సమీపంలోని లాంగ్రేజియన్ బిందువు–1 వద్ద ప్రవేశపెట్టి సూర్యుడిపై అధ్యయనం చేస్తారు. -
రేపే ఆదిత్య-ఎల్ 1 ప్రయోగం.. ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, తిరుపతి జిల్లా: ఆపరేషన్ ఆదిత్య-ఎల్ 1 ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి ఆలయంలో పీఎస్ఎల్వీ- సి57 రాకెట్ నమూనాతో ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రాకెట్ ప్రయోగానికి ముందు అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడం సాంప్రదాయమన్నారు. భూమి నుంచి సూర్యుడి దిశగా 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాంగ్రేజియన్ బిందువు–1(ఎల్–1) చుట్టూ ఉన్న కక్ష్యలోకి దాదాపు 1,470 కిలోల బరువున్న ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టనున్నామన్నారు. చంద్రయాన్-3కీ సంబంధించిన లాండర్ రోవర్లు చంద్రునిపై విజయవంతంగా పని చేస్తున్నాయని పేర్కొన్నారు. అక్టోబర్ మొదటి, రెండో వారంలో గగన్‌యాన్ రాకెట్ ప్రయోగం ఉంటుందని, జీఎస్ఎల్వీ- మార్క్-2 ద్వారా INSAT-3DS రాకెట్ ప్రయోగం చేస్తామన్నారు. తదుపరి మాసంలో ఎస్ఎస్ఎల్-వి రాకెట్ ప్రయోగం చేపడతామని ఇస్రో ఛైర్మన్ చెప్పారు. చదవండి: సూర్యుడి గుట్టు విప్పే ఆదిత్య–ఎల్1 -
Chandrayaan-3: 'శివ్ శక్తి' అని పేరు పెడితే తప్పేంటి?: ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ కేరళలోని పౌర్ణమికవు-భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులు చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన స్థలాన్ని 'శివ్ శక్తి'గా నామకరణం చేయడంపై ప్రశ్నించగా అందులో తప్పేంటన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని భారతదేశం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు వెళ్లి చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేతలకు అభినందనలు తెలిపి విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన స్థలానికి 'శివ్ శక్తి' అని నామకారణం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్‌ను ప్రశ్నించగా నాకైతే అందులో తప్పేమీ లేదనిపిస్తోందన్నారు. అలాగే చంద్రయాన్-2 అడుగుపెట్టిన స్థలానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. 'శివ్ శక్తి' 'తిరంగా' రెండూ భారతీయత ఉట్టిపడే పేర్లు. మనం చేస్తున్న పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేశ ప్రధానిగా పేరు పెట్టేందుకు ఆయనకు ప్రత్యేక అధికారముందన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడంపై స్పందిస్తూ నేను ఒక అన్వేషకుడిని.. నా జీవిత గమనంలో సైన్స్, ఆధ్యాత్మికత రెండూ భాగమే. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాను వేద గ్రంధాలను చదువుతూ ఉంటాను. విశ్వంలో ఉనికిని గుర్తించడానికి శూన్యంలో విహరిస్తూ ఉంటాను. సైన్స్ బాహ్య సంతృప్తినిస్తే ఆధ్యాత్మికత ఆత్మీయ సంతృప్తినిస్తుందని అన్నారు. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
ఇస్రో కీలక ప్రకటన.. చంద్రునిపై ఉష్ణోగ్రతల వివరాలు పంపిన విక్రమ్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ఉపగ్రహంలోని ప్రజ్ఞాన్ రోవర్ చంద్రుడి ఉపరితలం గురించి అధ్యయనం చేసి సమాచారాన్ని ఇస్రోకి చేరవేసింది. చంద్రుడి దక్షిణ ధృవం నేలకి సంబంధించి ఉష్ణోగ్రతలకు సంబంధించిన హెచ్చుతగ్గుల సమాచారం ప్రపంచానికి చేరడం ఇదే మొదటిసారి. చంద్రయాన్-3 విజయవంతంగా చందుడిపై అడుగుపెట్టడమే కాదు దాని కార్యాచరణను కూడా మొదలుపెట్టింది. శనివారం శివశక్తి పాయింట్ వద్దనున్న విక్రమ్ ల్యాండర్ నుండి ప్రజ్ఞాన్ రోవర్ జాబిల్లి ఉపరితలంపైకి జారుకుని అధ్యయనాలను కూడా ప్రారంభించింది. చంద్రుడి ఉపరితలంపై 10సెం.మీ. లోతు వరకు ఉపరితలాన్ని అధ్యయనం చేసిన ప్రజ్ఞాన్ రోవర్ తొట్టతొలిసారి చంద్రుడి దక్షిణ ధృవం వద్దనున్న నేలకి సంబంధించిన సమాచారాన్ని భూమికి చేరవేసింది. ChaSTE(చంద్రాస్ సర్ఫేస్ థర్మోఫిజికల్ ఎక్స్పెరిమెంట్) పేలోడ్ చంద్రుడి ఉపరితలం యొక్క ఉష్ణోగ్రతలను అధ్యయనం చేసింది. ఇస్రో ఈ సమాచారాన్ని తన అధికారిక ఎక్స్(ఒకప్పుడు ట్విట్టర్) ఖాతాలో షేర్ చేసింది. ఇస్రో షేర్ చేసిన ఈ గ్రాఫ్‌లో చంద్రుడి ఉపరితలం ఉష్ణోగ్రత -10 డిగ్రీల సెల్సియస్ నుండి 60 డిగ్రీల సెల్సియస్ వరకు పెరిగినట్లు తెలుస్తోంది. 'ఈ గ్రాఫ్ చంద్రుని ఉపరితలంపై లోతు వ్యత్యాసాన్ని బట్టి ఉష్ణోగ్రతల్లోని హెచ్చుతగ్గులను సూచిస్తోంది. చంద్రుని దక్షిణ ధృవానికి సంబంధించి ఇదే మొట్టమొదటి అధ్యయనం. ఇంకా లోతైన పరిశీలనలు జరుగుతున్నాయి' అని ఇస్రో ట్వీట్ చేసింది. చంద్రయాన్-3లో మొతం ఏడు పేలోడ్లు ఉండగా అందులో విక్రమ్ ల్యాండర్ నాలుగు, ప్రజ్ఞాన్ రోవర్ రెండు నిర్వహించనుండగా ఒకటి మాత్రం ప్రపల్షన్ మాడ్యూల్ నిర్వహించనుంది. ఈఏడు పేలోడ్లు ఒక్కొక్కటీ కొన్ని శాస్త్రీయ పరిశోధనలు నిర్వహిస్తాయి. చంద్రుడి నేలపై అధ్యయనం చేస్తున్న ChaSTE కాకుండా విక్రమ్‌లోని RAMBHA (అయాన్లు మరియు ఎలక్ట్రాన్లను అధ్యయనం చేయడానికి), ILSA (భూకంపాన్ని అధ్యయనం చేయడానికి), LRA (చంద్రుని వ్యవస్థ యొక్క గతిశీలతను అర్థం చేసుకోవడానికి) నిర్దేశించబడ్డాయి. Chandrayaan-3 Mission: Here are the first observations from the ChaSTE payload onboard Vikram Lander. ChaSTE (Chandra's Surface Thermophysical Experiment) measures the temperature profile of the lunar topsoil around the pole, to understand the thermal behaviour of the moon's… pic.twitter.com/VZ1cjWHTnd — ISRO (@isro) August 27, 2023 ఇది కూడా చదవండి: ఢిల్లీలో హై అలర్ట్.. మెట్రో స్టేషన్ గోడలపై ఖలిస్థాన్ నినాదాల కలకలం -
Chandrayaan-3: జాబిల్లిపై భారత్ నడక
బెంగళూరు/న్యూఢిల్లీ: చంద్రయాన్–3 మిషన్ విజయవంతం కావడం పట్ల భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది. ల్యాండర్ విక్రమ్ నుంచి రోవర్ ప్రజ్ఞాన్ బయటకు వచి్చ, తన కార్యాచరణ ప్రారంభించింది. చందమామ ఉపరితలంపై పరిశోధనలు చేస్తూ భూమిపైకి విలువైన సమాచారాన్ని చేరవేస్తోంది. రోవర్ ప్రజ్ఞాన్ చంద్రుడిపై నిరి్వఘ్నంగా అడుగుపెట్టడాన్ని ప్రస్తావిస్తూ ‘చందమామపై భారత్ నడుస్తోంది’’ అని ఇస్రో పేర్కొంది. ఈ మేరకు ‘ఎక్స్’లో పోస్టు చేసింది. చంద్రుడి కోసం భారత్‌లో తయారు చేసిన ఈ రోవర్ ల్యాండర్ నుంచి బయటకు అడుగుపెట్టి, చంద్రుడి ఉపరితలంపై విజయవంతంగా నడక ప్రారంభించిందని వెల్లడించింది. ప్రజ్ఞాన్ రోవర్ ప్రయాణం పట్ల ద్రౌపది ముర్ము హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను అభినందించారు. చంద్రుడి గురించి మన పరిజ్ఞానం మరింత పెరగడానికి ప్రజ్ఞాన్ దోహదపడుతుందని రాష్ట్రపతి ఆశాభావం వ్యక్తం చేశారు. ల్యాండర్, రోవర్ జీవిత కాలం పెరుగుతుందా? చంద్రయాన్–3 ప్రయోగంలో భాగంగా ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువం ఉపరితలంపై అడుగుపెట్టింది. అందులో నుంచి రోవర్ బయటకు వచి్చంది. వాస్తవానికి రోవర్ జీవితకాలం ఒక లూనార్ డే. అంటే 14 రోజులు. 14 రోజులపాటు రోవర్ ప్రజ్ఞాన్ ల్యాండింగ్ సైట్ నుంచి అటూఇటూ సంచరిస్తూ పరిశోధనలు చేయనుంది. అయితే, రోవర్ జీవితకాలం 14 రోజులు మాత్రమే కాదని, మరింత పెరిగే అవకాశం ఉందని ఇస్రో సైంటిస్టులు చెబుతున్నారు. దక్షిణ ధ్రువంపై 14 రోజులు చీకటి, 14 రోజులు వెలుగు ఉంటుంది. సూర్యోదయం అయినప్పుడు సూర్యుడి నుంచి రోవర్ సౌరశక్తిని గ్రహించి, దాన్ని విద్యుత్‌గా మార్చుకొని పరిశోధనలు కొనసాగించేందుకు ఆస్కారం ఉందంటున్నారు. ల్యాండర్, రోవర్ల మొత్తం బరువు 1,752 కిలోలు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై 14 రోజులపాటు పనిచేసేలా వీటిని రూపొందించారు. లూనార్ డే ముగిసిన తర్వాత కూడా వాటిలో జీవం నిండే అవకాశాలు లేకపోలేదని పేర్కొంటున్నారు. సూర్యకాంతి ఉన్నంతవరకు ల్యాండర్, రోవర్ చక్కగా పనిచేస్తాయి. చీకటి పడగానే ఉష్ణోగ్రత మైనస్ 180 డిగ్రీలకు పడిపోతుంది. అవి పనిచేయడం ఆగిపోతుంది. గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3 చంద్రయాన్–3 మిషన్ విజయం పట్ల సెర్చ్ ఇంజన్ గూగుల్ తన సంతోషాన్ని నెటిజన్లతో పంచుకుంది. గురువారం గూగుల్ డూడుల్‌గా చంద్రయాన్–3కు సంబంధించిన ప్రత్యేక యానిమేటెడ్ చిత్రం ప్రత్యక్షమయ్యింది. ఇందులో గూగుల్ అనే ఇంగ్లిష్ అక్షరాలు అంతరిక్షంలో నక్షత్రల్లాగా తేలుతూ కనిపించాయి. రెండో అక్షరం చంద్రుడిలా దర్శనమిచి్చంది. 26న ఇస్రో ప్రధాన కార్యాలయానికి ప్రధాని మోదీ చంద్రయాన్–3 ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో సైంటిస్టులను స్వయంగా కలిసి అభినందించడానికి ప్రధాని మోదీ ఈ నెల 26న బెంగళూరుకు రానున్నారు. బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయంలో సైంటిస్టులతో సమావేశమవుతారు. మనిషి మనుగడకు అవకాశం శివాజీనగర: చంద్రుని దక్షిణ ధ్రువం భవిష్యత్‌లో మానవాళి మనుగడకు వీలుగా ఉంటుందని విశ్వసిస్తున్నట్లు ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ చెప్పారు. అందుకే చంద్రయాన్–3 ల్యాండర్ దిగటానికి ఆ ప్రాంతాన్ని ఎంచుకున్నామని తెలిపారు. ‘మనం దాదాపు 70 డిగ్రీల దక్షిణ ధ్రువానికి దగ్గరగా వెళ్లాం, అక్కడ సూర్యరశ్మి తక్కువగా ఉండటానికి ఒక నిర్దిష్ట ప్రయోజనం ఉంది. రోవర్ ద్వారా ఆ ప్రాంతం గురించి శాస్త్రీయంగా మరింత సమాచారం లభించే అవకాశముంది. చంద్రునిపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలు దక్షిణ ధ్రువంపై చాలా ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఎందుకంటే మానవులు వెళ్లి అక్కడ నివాసాలను సృష్టించి ఆపై దాటి ప్రయాణించాలని అనుకుంటున్నారు. కాబట్టి మనం వెతుకుతున్నది ఉత్తమమైన ప్రదేశం. దక్షిణ ధ్రువం అలా ఉండేందుకు అవకాశముంది’అని ఆయన చెప్పారు. గురువారం ఆయన బెంగళూరులోని ఇస్రో కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఇస్రో శాస్త్రవేత్తల నాలుగేళ్ల శ్రమకు తగ్గ ఫలితం లభించిందని అన్నారు. చంద్రునిపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ సాఫీగా బయటకు వచి్చందని తెలిపారు. ‘నిర్దేశిత ప్రయోజనం కోసం దక్షిణ ధ్రువంపైన గుర్తించిన 4.5 కి.మీ. గీ 2.5 కి.మీ. ప్రాంతానికి సరిగ్గా 300 మీటర్ల దూరంలోపు దూరంలోనే ల్యాండర్ దిగింది. రోవర్‌లోని రెండు పరికరాలు, ల్యాండర్‌లోని మూడు పరికరాలు నిర్దేశించిన విధంగా పనిచేస్తున్నాయి’అని పేర్కొన్నారు. రోవర్ బయట తిరుగాడుతూ పరిశోధనల ప్రారంభించిందని చెప్పారు. రోవర్లో అమర్చిన రెండు పరికరాలు చంద్రుని మట్టిలో మూలకాలు, రసాయనాలను పరిశీలిస్తాయని చెప్పారు. రోబోటిక్ పాత్ ప్లానింగ్ కూడా చేయిస్తాయని తెలిపారు. -
చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది. 1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) 2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) 3. రోవర్ ► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ► ఇక ల్యాండర్ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. ► చంద్రయాన్–3 మిషన్ లాంచ్‌వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది. ► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు. ► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది. ► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది. ► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది ► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది. ► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. -
Chandrayaan-3: ఇక అంగారకుడిపైకి అడుగు!
బెంగళూరు: దేశం కోసం స్ఫూర్తిదాయక కార్యం సాధించినందుకు ఎంతో గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తంచేశారు. భారత శాస్త్రవేత్తల కృషి ఫలించిందని, ఇందులో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ‘చంద్రయాన్–3 విజయంతో అంగారకుడిపైకి వెళ్తాం. భవిష్యత్తులో శుక్రుడితోపాటు ఇతర గ్రహాలపైకి వెళ్తాం’ అని చెప్పారు. ఇది ఏ దేశానికైనా కష్టం ‘ఈ రోజు టెక్నాలజీ ఇంతగా అభివృద్ధి చెందినా చంద్రుడిపైకి ప్రయాణం చేయడం ఏ దేశానికైనా అంత సులువు కాదు. అదీగాక సాఫ్ట్ లాండింగ్ మరింత సంక్లిష్టమైన విషయం. అయితే, కేవలం రెండు మిషన్లతోనే భారత్ సుసాధ్యం చేసి చూపింది. మానవరహిత వ్యోమనౌకను చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు మాత్రమే చంద్రయాన్–1ను చేపట్టాం.’ అని సోమనాథ్ చెప్పారు. మేడిన్ ఇండియా మిషన్ ‘ చంద్రయాన్–2 నుంచి నేర్చుకున్న పాఠాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రతి ఒక్కరూ చంద్రయాన్ విజయం కోసం ప్రార్థించారు. చంద్రయాన్–2 మిషన్‌లో పాలుపంచుకున్న చాలామంది కీలక శాస్త్రవేత్తలు చంద్రయాన్–3 మిషన్ బృందంలో పనిచేశారు. చంద్రయాన్–3లో వినియోగించిన సాంకేతిక పరిజ్ఞానం ఏ టెక్నాలజీ కంటే కూడా తక్కువ కాదు. ప్రపంచంలోని అత్యుత్తమ సెన్సర్లు మన వద్ద ఉన్నాయి. ఇది పూర్తిగా ప్రపంచస్థాయి పరికరాలతో దేశీయంగా రూపొందించిన మేడిన్ ఇండియా మిషన్’ అని సోమనాథ్ చెప్పారు. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో? -
Chandrayaan-3: చంద్రయాన్-3పై మాజీ ఇస్రో చీఫ్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 ప్రయోగం కీలక దశకు చేరుకున్న నేపథ్యంలో మాజీ ఇస్రో చీఫ్ కె.శివన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-2 తరహాలో కాకుండా ఇందులోని విక్రమ్ ల్యాండర్ పూర్తిగా ఆటోమేటెడ్ టెక్నాలజీతో తయారుచేసిందని.. ఎటువంటి గ్రౌండ్ సహాయం లేకుండానే ఇది దానంతటదే ల్యాండ్ అవుతుందన్నారు. మాజీ ఇస్రో చీఫ్ కైలాసవడివూ శివన్ మాట్లాడుతూ చంద్రయాన్-3 ప్రయోగంలో ప్రపల్షన్ మాడ్యూల్ నుండి విక్రమ్ ల్యాండర్ విడిపోవడంతోనే ప్రయోగం కీలక దశకు చేరుకుందని అన్నారు. ఇక్కడి నుండి ఎటువంటి సహకారం అవసరం లేకుండానే ల్యాండర్ దానంతటదే ఆటోమేటిగ్గా ల్యాండ్ అవుతుంది. అంతర్గతంగా ఏర్పాటు చేసిన మేధస్సు ఆధారంగానే అది పనిచేస్తుందని.. దాని వేగాన్ని నియంత్రించుకుని ల్యాండర్ నిర్ణీత సమయానికి నిలువుగా చంద్రుడిపై అడుగుపెడుతుంది. ల్యాండర్ స్థిరపడిన తర్వాత రెండు గంటలకు ప్రజ్ఞాన్ రోవర్ బయటకు వస్తుంది. చంద్రయాన్-2 ప్రయోగం విఫలమైన తర్వాత అందులో జరిగిన తప్పిదాలను ఒక్కొక్కటిగా సవరించి ఈసారి బలమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. అందులోని ప్రపల్షన్ వ్యవస్థ, మార్గదర్శక వ్యవస్థ, నియంత్రణ వ్యవస్థ అంతా అప్ గ్రేడ్ చేయబడింది. ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు సరిచేసుకునేందుకు వీలుగా అందులోని సెన్సార్ వ్యవస్థ సహాయపడుతుందని ఈసారి ల్యాండర్ ఎంత వేగంతో వెళ్లినా ప్రయోగం మాత్రం విజయవంతం కావడం ఖాయమని అన్నారు. ఇంతవరకు ఎవ్వరూ చంద్రుడి దక్షిణ భాగాన్ని చేరుకోని నేపథ్యంలో అక్కడ ఆడుగుపెట్టిన మొట్టమొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-3 అందించే సమాచారం ఆధారంగా ప్రపంచ దేశాల్లో ఎవ్వరైనా చంద్రుడి దక్షిణ ధృవంపై ప్రయోగాలు చేసుకోవచ్చని తెలిపారు మాజీ ఇస్రో చీఫ్. ఇది కూడా చదవండి: 'ఆయుష్మాన్ భారత్' అద్భుతం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ -
చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన.. మళ్లీ అదే జరిగితే..
బెంగుళూరు: చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయి. ఈ సారి చంద్రయాన్-3లో అలా కాకుండా విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకునే విధంగా రూపొందించామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 జులై 14, 2023న విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. ఇదిలా ఉండగా ఈ ప్రయోగం జరిగిన నాటి నుండి చంద్రయాన్-2 లా ఇందులో కూడా చివరి నిముషంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్. దిశా భారత్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమని అన్నారు. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు 9,14,16 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిని సమీపిస్తుండగా ఒక్కో కక్ష్య మారుతూ వెళుతుందని అనంతరం ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ మొదలవుతుందని ఆ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని చివరిగా ఆగష్టు 23న క్షేమంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని, ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేశామని, గతంలో ఇక్కడే పొరపాటు జరిగిందని ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదని ఆయన అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి.. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE) చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుంది. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయి. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇది కూడా చదవండి: త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి -
నేడే పీఎస్ఎల్వీ సీ–56 ప్రయోగం
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): పీఎస్ఎల్వీ సీ–56 ఉపగ్రహ వాహకనౌకకు శనివారం ఉదయం 5.01 గంటలకు కౌంట్‌డౌన్ ప్రక్రియ మొదలైంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో), న్యూస్పేస్ ఇండియా తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి ఆదివారం ఉదయం 6.31 గంటలకు దీనిని ప్రయోగించనున్నారు. 25.30 గంటలపాటు కౌంట్‌డౌన్ సాగుతుంది. శుక్రవారం సాయంత్రం ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ షార్కు చేరుకున్నారు. శాస్త్రవేత్తలతో సమీక్ష నిర్వహించి కౌంట్‌డౌన్ ప్రక్రియను ప్రారంభించారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఇందులో భాగంగా రాకెట్‌కు నాలుగో దశలో 0.8 టన్నుల ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను చేపట్టారు. శనివారం రాత్రికి రాకెట్‌కు రెండో దశలో 41 టన్నుల ద్రవ ఇం«ధనాన్ని నింõపుతారు. ఈ ప్రయోగంలో సింగపూర్‌కు చెందిన 7 ఉపగ్రహాలను నియో ఆర్బిట్‌లోకి ప్రవేశ పెట్టనున్నారు. -
Chandrayaan-3: విజయవంతంగా చంద్రయాన్.. వాట్ నెక్ట్స్.?
జాబిల్లిపై ఇప్పటిదాకా ఎవరూ అడుగు పెట్టని దక్షిణ దిశను ముద్దాడాలన్న చిరకాల లక్ష్యాన్ని ఇస్రో సాధించింది. అసలు చంద్రయాన్–3 మిషన్ వల్ల మానవాళికి ఏం లాభం? ఈ ప్రయోగం లక్ష్యమేంటీ? చంద్రుడి గుట్టు విప్పేందుకే... ► చంద్రున్ని లోతుగా అధ్యయనం చేసి, అక్కడ దాగున్న అనేకానేక రహస్యాలను వెలికి తీయడమే చంద్రయాన్–3 ప్రయోగం ప్రధాన లక్ష్యం... చంద్రయాన్–3లో ఏమేం ఉన్నాయి? ► ప్రొపల్షన్ మాడ్యూల్ 2,145 కిలోలు, ల్యాండర్ 1,749 కిలోలు, రోవర్ 26 కిలోలు. ► చంద్రయాన్–2 లో 14 పేలోడ్స్ పంపగా చంద్రయాన్–3లో 5 ఇస్రో పేలోడ్స్, 1 నాసా పేలోడ్‌ను మాత్రమే అమర్చారు. ► చంద్రయాన్–3 ప్రపొల్షన్ మాడ్యూల్, ల్యాండర్, రోవర్లలో అత్యాధునిక సాంకేతిక పరికరాలను అమర్చారు. దక్షిణ ధ్రువంపై దిగాలని... ఇప్పటి దాకా ఎన్నో దేశాలు చంద్రునికి ముందు వైపు, అంటే ఉత్తర ధ్రువంపై పరిశోధనలు చేశాయి. భారత్ మాత్రం చంద్రయాన్–1 నుంచి తాజా చంద్రయాన్–3 దాకా చంద్రుని వెనుక వైపు, అంటే దక్షిణ ధ్రువాన్ని పరిశోధించేందుకే ప్రయత్నిస్తూ వస్తోంది. అందులో భాగంగా చంద్రయాన్–3 ల్యాండర్‌ను సూర్యరశ్మి పడని చంద్రుని దక్షిణ ధ్రువపు చీకటి ప్రాంతంలో దించారు. ► ప్రొపల్షన్ మాడ్యూల్లో ఒకటి, ల్యాండర్లో మూడు, రోవర్లో రెండు పేలోడ్ల చొప్పున చంద్రయాన్–3లో అమర్చారు. ► 2,145 కిలోల బరువున్న ప్రొపల్షన్ మాడ్యూల్లో 1,696 కేజీల అపోజి ఇంధనం నింపారు. దీని సాయంతోనే ల్యాండర్, రోవర్లను మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలోకి తీసుకెళ్లింది. ► చంద్రుని కక్ష్య నుంచి భూమిని, చంద్రున్ని అధ్యయనం చేయడానికి ప్రొపల్షన్ మాడ్యూల్లో ఓ పరికరాన్ని అమర్చారు. ► చంద్రుని ఉపరితలం వాసయోగ్యమో, కాదో తేల్చడంతో పాటు చంద్రునిపై జరిగే మార్పుచేర్పులకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఇది భూమికి చేరవేస్తుంది. ► రోవర్లో మూడు పేలోడ్లను పంపుతున్నారు. ఇందులో లాంగ్మ్యూయిన్ ప్రోబ్ చంద్రుడి ఉపరితలంపై ప్లాస్మా, అయాన్లు, ఎలక్ట్రాన్ల సాంద్రత కాలంతో పాటు మారుతుందా అనే అంశాన్ని పరిశోధిస్తుంది. ► చంద్రాస్ సర్వేస్ థర్మో ఫిజకల్ ఎక్స్పెరమెంట్ పేలోడ్ చంద్రుడి ఉపరితలంపై ఉష్ణ లక్షణాలను కొలవడానికి, చంద్రుడిపై మ్యాప్ తయారు చేయడానికి దోహదపడుతుంది. ► ఇన్స్ట్రుమెంట్ ఫర్ ల్యూనార్ సెస్మిక్ యాక్టివిటీ, రేడియో అనాటమీ ఆఫ్ మూన్ బౌండ్ హైపర్ సెన్సిటివ్ అయానోస్పియర్, అటా్మస్పియర్ పేలోడ్లు చంద్రుడి లాండింగ్ సైట్ చుట్టూ భూ కంపతను కొలుస్తాయి. ► అల్ఫా ప్రాక్టికల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్ పేలోడ్‌తో చంద్రునిపై ఖనిజ సంపద, శిలాజాలను శోధించడంతో పాటు చంద్రుడిపై రసాయనాలున్నట్టు తేలితే వాటి జాబితా తయారీకి ఉపయోగిస్తారు. ► లేజర్ ప్రేరేపిత బ్రేక్ డౌన్ స్పెక్ట్రోస్కోప్ పేలోడ్ చంద్రుడిపై రాళ్ల వంటివున్నాయా, చంద్రుని ఉపరితలం ఎలా ఉంటుంది, చుట్టూతా ఏముంది వంటివి శోధిస్తుంది. చంద్రయాన్–2 ల్యాండర్, రోవర్ క్రాషై పని చేయకపోయినా వాటిని తీసుకెళ్లిన ఆర్బిటార్ ఇప్పటికీ చంద్రుని కక్ష్యలో తిరుగుతూ అత్యంత విలువైన సమాచారం అందిస్తోంది. చంద్రుడిపై నీళ్లున్నట్టు చంద్రయాన్–2 కూడా ధ్రువీకరించింది. చంద్రయాన్–3 ముగియగానే సూర్యుడిపై పరిశోధనలకు ఆగస్టులో ఆదిత్య–ఎల్1 ఉపగ్రహాన్ని ప్రయోగిస్తారు. తద్వారా మిషన్ సూర్య, చంద్ర దిగ్విజయంగా పూర్తవుతాయి. -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
ISRO: జూన్‌లో చంద్రయాన్ 3
న్యూఢిల్లీ: చందమామపై శోధనకు ఉద్దేశించిన చంద్రయాన్–3 ప్రయోగం వచ్చే ఏడాది జూన్‌లో ఉంటుందని భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ ప్రకటించారు. గురువారం ఢిల్లీలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో సోమ్‌నాథ్ మాట్లాడారు. ‘ గగన్‌యాన్ ప్రాజెక్ట్ కోసం తొలి రోదసీనౌక పరీక్షను వచ్చే ఏడాది తొలినాళ్లలో చేపడతాం. లాంచ్ వెహికల్ మార్క్–3 ద్వారా చంద్రయాన్–3ను ప్రయోగిస్తాం. పలుమార్లు మానవరహిత వాహకనౌక పరీక్షల తర్వాత 2024 చివరికల్లా భారతీయ వ్యోమగాములు విజయవంతంగా కక్ష్యలో అడుగుపెట్టేలా చేస్తాం. 2019 సెప్టెంబర్‌లో విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై దింపేందుకు చేసిన చంద్రయాన్–2 ప్రయోగం విఫలమైంది. ఈసారి అలా జరగబోదు. ఇది భిన్నమైన ఇంజనీరింగ్. ఉపరితలంపై ల్యాండర్ దిగేటపుడు పాడవకుండా ఉండేందుకు శక్తివంతమైన కాళ్లు సిద్ధంచేస్తున్నాం. ఈ ప్రక్రియలో ఏవైనా పొరపాట్లు జరిగితే, ప్రయోగం సజావుగా సాగేందుకు ‘మరో పరిష్కారం’ రంగంలోకి దిగుతుంది. ‘చంద్రుడిని చేరే క్రమంలో ఎంత ఎత్తులో ప్రయాణించాల్సి రావచ్చు? చంద్రుడి ఉపరితలంపై సమస్యలు లేని స్థలాల గుర్తింపు వంటి అంశాల్లో మరింత స్పష్టత సాధిస్తున్నాం’ అని అన్నారు. -
నేడే నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1
సూళ్లూరుపేట(తిరుపతి): చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లనుంది. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లోని(షార్) మొదటి ప్రయోగ వేదిక నుంచి ఉదయం 9.18 గంటలకు ఈ రాకెట్‌ను ప్రయోగించనున్నారు. రాకెట్ ప్రయోగంపై శనివారం ‘షార్’లో ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ పర్యవేక్షణలో ఎంఆర్ఆర్ కమిటీ చైర్మన్ పద్మకుమార్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు లాంచ్ ఆథరైజేషన్ బోర్డు చైర్మన్ ఆర్ముగం రాజరాజన్ ఆధ్వర్యంలో మరో సమావేశం నిర్వహించి.. ప్రయోగ సమయాన్ని అధికారికంగా ఖరారు చేశారు. షార్ నుంచి ఇది 83వ ప్రయోగం కాగా.. ఎస్ఎస్ఎల్వీ డీ1 సిరీస్‌లో ఇదే మొదటిది కావడం గమనార్హం. అంటే ఎస్ఎస్ఎల్వీ ప్రయోగాల్లో ఇస్రో నూతన చరిత్రకు శ్రీకారం చుడుతున్నట్లు స్పష్టమవుతోంది. పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ), జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ) ప్రయోగాల్లో ఇస్రో ఇప్పటికే అంతర్జాతీయ ఖ్యాతి గడించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఎస్ఎస్ఎల్వీ వంతు వచ్చింది. 7 గంటల కౌంట్‌డౌన్ 34 మీటర్ల పొడువు, 2 మీటర్ల వెడల్పు, 120 టన్నుల బరువున్న ఎస్ఎస్ఎల్వీ డీ1ను నాలుగు దశల్లో ప్రయోగించనున్నారు. కేవలం 13.2 నిమిషాల్లోనే ప్రయోగం పూర్తవుతుంది. మొదటి దశను 87 టన్నుల ఘన ఇంధనంతో 127.5 సెకన్లలో పూర్తి చేస్తారు. రెండో దశను 7.7 టన్నుల ఘన ఇంధనంతో 336.9 సెకన్లలో, మూడో దశను 4.5 టన్నుల ఘన ఇంధనంతో 633.3 సెకన్లలో పూర్తి చేయనున్నారు. నాలుగో దశలో మాత్రం 0.05 టన్నుల ద్రవ ఇంధనాన్ని మండించి, 742 సెకన్లలో 135 కిలోల బరువు కలిగిన మైక్రోశాట్–2ఏ(ఈఓఎస్శాట్)ను ముందుగా రోదసీలోకి ప్రవేశపెడతారు. తర్వాత విద్యార్థినులు తయారు చేసిన ఆజాదీశాట్‌ను భూమికి అతి దగ్గరగా.. 350 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లోకి 792 సెకన్లలో ప్రవేశపెట్టేలా శాస్త్రవేత్తలు ప్రయోగాన్ని డిజైన్ చేశారు. ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియతో పాటు రాకెట్‌లోని అన్ని వ్యవస్థలను ఉత్తేజితం చేయడానికి కౌంట్‌డౌన్‌ను 7 గంటలుగా నిర్ణయించారు. -
ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్ జీఎస్ఎల్వీ ఎంకే-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత (జనవరి 12, 2022) ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు. చదవండి: (యూపీలో బీజేపీకి భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో..) -
2022లో చంద్రయాన్-3 ప్రయోగం: ఇస్రో చైర్మన్
'ఫ్యూచర్ ఆఫ్ ఏరోస్పేస్ అండ్ ఏవియానిక్స్ ఇన్ ఇండియా' అనే అంశంపై యుపీఈఎస్ విశ్వవిద్యాలయం విద్యార్థులు, అధ్యాపకులతో జరిగిన సమావేశంలో ఇస్రో చైర్మన్, కార్యదర్శి డాక్టర్ కే.శివన్ ప్రసంగించారు. ఈ సమావేశంలో డాక్టర్ కే.శివన్ రాబోయే సంవత్సరానికి సంబంధించిన ప్రాజెక్టు ప్రణాళిక గురించి మాట్లాడారు. అతను పేర్కొన్న ప్రాజెక్టులలో ఇస్రో యొక్క చంద్రయాన్-3 (మూన్ మిషన్ 3), ప్రతిష్టాత్మక హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ ప్రోగ్రాం(గగన్ యాన్) ఉన్నాయి. "తరువాతి దశాబ్దకాలంలో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ఇస్రో) హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనంతో సహా అనేక అధునాతన సామర్థ్యాలను లక్ష్యంగా పెట్టుకుంది. హెవీ-లిఫ్ట్ లాంచ్ వాహనం 16-టన్నుల పేలోడ్లను జియోస్టేషనరీ ట్రాన్స్ఫర్ కక్ష్యకు తీసుకువెళ్ళగలదు. ఇది ప్రస్తుత జీఎస్ఎల్వీ ఎంకే3 లిఫ్ట్ సామర్థ్యానికి నాలుగు రెట్లు ఎక్కువ, అలాగే పునర్వినియోగపరిచే ప్రయోగ వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు” చైర్మన్ డాక్టర్ కే.శివన్ పేర్కొన్నారు. చంద్రయాన్-2 లోపాలను గుర్తించి తదుపరి మిషన్ లో అటువంటి తప్పిదాలు జరగకుండా ఉండటానికి దిద్దుబాటు చర్యలు తీసుకున్నాము. చంద్రయాన్-3 ప్రయోగాన్ని 2022 మొదటి భాగంలో చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. గగన్‌యాన్ రూపకల్పన చివరి దశలో ఉంది అన్నారు. ఈ సంవత్సరం చివరి నాటికి మొదటి మానవరహిత మిషన్ ట్రయల్ జరుగుతుంది అని కే.శివన్ తెలిపారు. రాబోయే కాలంలో ఇస్రో ప్రణాళికలను వివరిస్తూ జియోసింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్(జీటీఓ)కు పేలోడ్ సామర్ధ్యాన్ని 5 టన్నులకు పెంచేలా ప్రయోగాలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సెమీ-క్రియో ఇంజన్లు శక్తివంతమైనవని, పర్యావరణ అనుకూలమైనవని, తక్కువ ఖర్చుతో కూడుకున్నవని తెలిపారు. మరింత శక్తివంతమైన బూస్టర్ దశల అవసరాన్ని శివన్ ప్రస్తావించారు. మరింత శక్తివంతమైన 2000 న్యూటన్ లిక్విడ్ ఆక్సిజన్, కిరోసిన్ ఇంజన్ల పనులు పురోగతిలో ఉన్నాయని వెల్లడించారు. చదవండి: దేశంలో ఫస్ట్ ఏసీ రైల్వే టర్మినల్ కొత్త ఏసీ కొనాలనుకునే వారికి షాక్! -
60 ఏళ్లు పైబడ్డ వాళ్లు టీకా తీస్కోండి
న్యూఢిల్లీ: కొత్తగా కరోనా కేసుల ఉధృతి పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలని కేంద్రం కోరింది. 60 ఏళ్లు పైబడిన పౌరులు టీకా తీసుకోవాలని వృద్ధులకు సూచించింది. 3టీ(టెస్ట్, ట్రాక్, ట్రీట్) వ్యూహాన్ని అవలంబించాలని అన్ని రాష్ట్రప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. మిషన్‌మోడ్‌లో కేసులు పెరిగే జిల్లాల్లో ప్రాధాన్యక్రమంలో ప్రజలకు వ్యాక్సిన్‌ను సత్వరమే అందించాలని తెలిపింది. ఇందుకోసం ఆయా రాష్ట్రాల్లోని ప్రైవేట్ ఆస్పత్రులతో కలిసి పనిచేయాలని, 15– 28 రోజుల వ్యవధితో వ్యాక్సినేషన్ టైమ్‌టేబుల్ తయారు చేయాలని సూచించింది. కేసులోడ్ పెరిగే ప్రాంతాల్లో ఆర్టీ పీసీఆర్ టెస్టులను పెంచాలని, నిఘా, పర్యవేక్షణ కట్టుదిట్టం చేయాలని తెలిపింది. హరియాణా, ఏపీ, ఒడిశా, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ, చండీగఢ్ హెల్త్ సెక్రటరీలు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్లతో కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రజేష్‌భూషణ్, నీతీ ఆయోగ్ సభ్యుడు వినోద్ కే పాల్ శనివారం సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలు తీసుకుంటున్న ప్రజారోగ్య విధానాలపై కేంద్రం సమీక్ష జరిపారు. హరియాణాలో 15, ఏపీ, ఒడిశాల్లో 10, హిమాచల్, ఢిల్లీల్లో 9, ఉత్తరా ఖండ్‌లో 7, గోవాలో 2, చండీగఢ్‌లోని ఒక్క జిల్లా లో కోవిడ్ కేసులు అకస్మాత్తుగా ఉధృతమవడం, టెస్టులు తగ్గించడం, కాంటాక్ట్ ట్రేసింగ్ తక్కువగా జరగడం ఆందోళనకరమని తెలిపారు. ఇలాగే పరి స్థితి ఉంటే పొరుగు జిల్లాలు, రాష్ట్రాల్లో మళ్లీ కరోనా పడగ విప్పవచ్చని హెచ్చరించారు. కేసులు గుర్తింç ³#, పేషెంట్ల ఐసోలేషన్, కాంటాక్ట్ ట్రేసింగ్, సూప ర్ స్ప్రెడ్ ఈవెంట్లపై నిఘానేత్రం వంటివి కరోనా వ్యాప్తిని తగ్గిస్తాయని వివరించారు. -
2022లో చంద్రయాన్–3
న్యూఢిల్లీ: చంద్రునిపైకి మూడో మిషన్ ప్రయోగం చంద్రయాన్–3ని 2022లో ప్రయోగించే అవకాశముందని ఇస్రో చీఫ్ కె.శివన్ వెల్లడించారు. కోవిడ్–19 లాక్డౌన్ కారణంగా ఇస్రో చేపట్టాల్సిన చంద్రయాన్–3 వంటి పలు ప్రాజెక్టులు వాయిదా పడ్డాయని తెలిపారు. వాస్తవానికి చంద్రయాన్–3ని 2020 చివర్లో ప్రయోగిం చాల్సి ఉందన్నారు. చంద్రయాన్–2లో ప్రయోగించిన ఆర్బిటర్‌నే చంద్రయాన్–3లో ఉపయోగిస్తామన్నారు. 2019లో చంద్ర యాన్–2 మిషన్‌లో ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ చంద్రుని దక్షిణ ధ్రువంపై దిగడంలో విఫలమైన విషయం తెలిసిందే. ఇస్రో భవిష్యత్తులో చేపట్టే గ్రహాంతర ప్రయోగాలకు చంద్రయాన్–3 కీలకం కానుంది. గత ఏడాది డిసెంబర్లో చేపట్టాల్సిన మొట్టమొదటి మానవ రహిత గగన్‌యాన్ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబర్లో చేపట్టేందుకు కృషి చేస్తున్నామన్నారు. దీని తర్వాత, మరో మానవ రహిత మిషన్ ప్రయోగం ఉంటుం దని, మూడో విడతలో ప్రధాన ప్రయోగం చేపడతామన్నారు. గగన్‌యాన్ ద్వారా 2022లో ముగ్గురు భారతీయులను అంతరిక్షం లోకి పంపనున్నారు. ఇందుకుగాను ఎంపికైన ముగ్గురు పైలట్లు ప్రస్తుతం రష్యాలో శిక్షణ పొందుతున్నారు. మూడో విడత ప్రయోగించే గగన్‌యాన్ మాడ్యూల్‌కు ఎంతో సాంకేతిక పరిజ్ఞానం అవసరం ఉంటుందన్నారు. సరైన సమయంలో అందుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామన్నారు. -
‘చంద్రయాన్’ రోవర్ క్షేమం!
న్యూఢిల్లీ: ‘చంద్రయాన్ 2’ ప్రయోగం చివరి దశలో చంద్రుడి ఉపరితలాన్ని ఢీ కొని నాశనమైందని భావిస్తున్న ప్రజ్ఞాన్ రోవర్.. నిజానికి ధ్వంసం కాలేదని చెన్నైకి చెందిన అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి ఉన్న టెకీ షణ్ముగ సుబ్రమణియన్ వాదిస్తున్నారు. అందుకు సాక్ష్యాలుగా కొన్ని ఫొటోలను ఆయన చూపిస్తున్నారు. ఆయన వాదన ప్రకారం.. ల్యాండర్ నుంచి విడివడిన ప్రజ్ఞాన్ కొద్ది మీటర్ల దూరం దొర్లుకుంటూ వెళ్లి నిలిచిపోయింది. ప్రస్తుతం అది చంద్రుడి ఉపరితలంపై క్షేమంగా ఉంది. గతంలో మూన్‌ల్యాండర్ ‘విక్రమ్’ శకలాలను కూడా సుబ్రమణియన్ గుర్తించారు. ఆ విషయాన్ని నాసా కూడా నిర్ధారించింది. తాజాగా, ప్రజ్ఞాన్ క్షేమంగా ఉందని పేర్కొంటూ, పలు ఫొటో ఆధారాలతో సుబ్రమణియన్ పలు ట్వీట్లు చేశారు. సుబ్రమణియన్ అందజేసిన సమాచారానికి సంబంధించిన ఆధారాలను పరీక్షిస్తున్నామని ఇస్రో చైర్మన్ కే శివన్ తెలిపారు. ‘చంద్రుడి ఉపరితలంపై కూలిపోయిన తరువాత కూడా ల్యాండర్‌కు భూమి నుంచి సందేశాలు అంది ఉండవచ్చు. అయితే, అది మళ్లీ తిరిగి సమాధానం ఇవ్వలేకపోయి ఉండవచ్చు’ అని సుబ్రమణియన్ పేర్కొన్నారు. నాసా విడుదల చేసిన ఒక ఫొటోను వివరిస్తూ.. ల్యాండర్, రోవర్ ఉన్న ప్రదేశాలను ఆయన అంచనా వేశారు. రోవర్ ఇంకా పనిచేస్తూ ఉందని కచ్చితంగా చెప్పలేనన్నారు. గత సెప్టెంబర్‌లో ల్యాండర్ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై కుప్పకూలిన విషయం తెలిసిందే. -
హలో.. నా పేరు వ్యోమమిత్ర
సాక్షి, బెంగళూరు: మానవులకంటే ముందుగా అంతరిక్షంలోకి మహిళా రోబో ‘వ్యోమమిత్ర’ను పంపేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ‘మానవసహిత అంతరిక్ష ప్రయోగాలు, పరిశోధనలు, సవాళ్లు’ అన్న అంశంపై బుధవారం బెంగళూరులో జరిగిన సదస్సులో ‘వ్యోమమిత్ర’ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ‘హలో.. నా పేరు వ్యోమమిత్ర,. నేను గగన్‌యాన్ ప్రయోగం కోసం తయారైన నమూనా హ్యూమనాయిడ్ రోబోను’ అంటూ అందరినీ పలకరించింది. గగన్‌యాన్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూ ‘మాడ్యూల్ పారామీటర్ల ద్వారా నేను పరిశీలనలు జరపగలను. మానవులను హెచ్చరించగలను. స్విచ్ ప్యానెల్ వంటి పనులు చేయగలను’ అని తెలిపింది. వ్యోమగాములకు స్నేహితురాలిగా ఉంటూ వారితో మాట్లాడగలనని ఆ రోబో తెలిపింది. వ్యోమగాముల ముఖాలను గుర్తించడంతోపాటు వారి ప్రశ్నలకు సమాధానమూ ఇవ్వగలనని చెప్పింది. ఇస్రో చైర్మన్ కె.శివన్ మాట్లాడుతూ వ్యోమమిత్ర అంతరిక్షంలో మనుషులు చేసే పనులను అనుకరించలగదని, లైఫ్ కంట్రోల్ సపోర్ట్ సిస్టమ్స్‌ను నియంత్రించగలదని తెలిపారు. చురుగ్గా సన్నాహాలు.. మానవ సహిత ప్రయోగం కోసం నాసా, ఇతర అంతరిక్ష సంస్థల సహకారం, సూచనలు కూడా తీసుకుంటున్నట్లు శివన్ తెలిపారు. గగన్‌యాన్ ప్రయోగం ఇస్రో దీర్ఘకాల లక్ష్యమైన ఇంటర్ ప్లానెటరీ మిషన్‌కు ఉపయోగపడుతుందని చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటికే గగన్‌యాన్ మిషన్‌లో భాగంగా 10 టన్నుల పేలోడ్ సామర్థ్యం ఉన్న లాంఛర్, కీలక సాంకేతిక అంశాలను, అంతరిక్షంలో మనిషి మనుగడకు సంబంధించిన అంశాలను అభివృద్ధి చేస్తున్నాం. త్వరలోనే దేశంలో వ్యోమగాములకు సాధారణ అంతరిక్ష ప్రయాణ శిక్షణ ఇస్తాం. చంద్రయాన్–3 పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం చంద్రయాన్–3 ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. చంద్రునిపైకి మానవుణ్ని పంపే ప్రాజెక్టు తప్పకుండా ఉంటుంది, కానీ అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యే పని కాదు. దీని కోసం నలుగురు వ్యోమగాములను ఎంపిక చేసి, శిక్షణ నిమిత్తం ఈ నెలాఖరుకు వారిని రష్యాకు పంపనున్నాం. 1984లో రష్యా మాడ్యూల్లో రాకేశ్ శర్మ అంతరిక్షంలోకి వెళ్లారు, కానీ ఈసారి భారత మాడ్యూల్లో భారతీయులు అంతరిక్షంలోకి వెళతారు’ అని చెప్పారు. 3 దశల్లో గగన్‌యాన్.. మానవ సహిత గగన్‌యాన్ ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. 2021 డిసెంబర్లో మానవ సహిత అంతరిక్ష ప్రయోగం గగన్‌యాన్‌ను చేపట్టబోతున్నట్లు తెలిపారు. దానికంటే ముందు రెండు సార్లు (2020 డిసెంబర్, 2021 జూన్) మానవ రహిత మిషన్లను చేపట్టబోతున్నట్లు చెప్పారు. ‘గగన్‌యాన్‌లో భాగంగా సుమారు ఏడు రోజుల పాటు వ్యోమగాములను ఆర్బిటర్ స్పేస్‌క్రాఫ్ట్ ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నాం. ఈ మిషన్ కేవలం భారత తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగమే కాదు, మానవుడు అంతరిక్షంలో నిరంతరంగా నివసించేలా కొత్త స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో సాగుతున్న ప్రాజెక్టు. ఇది భారత్ ఘనతను చాటుతుంది’ అని చెప్పారు. -
చంద్రయాన్ 3 విజయవంతానికి కృషి: శివన్
చంద్రయాన్-3 ప్రయోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిందని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చైర్మన్ కే.శివన్ తెలిపారు. శివన్ మీడియాతో మాట్లాడుతూ..చంద్రయాన్-2 ప్రయోగానికి రూ. 250కోట్లు ఖర్చు కావచ్చని తెలిపారు. చంద్రయాన్-3 కూడా విజయవంతం అవుతుందని తెలిపారు. చంద్రయాన్-3లో ల్యాండర్, ప్రొపల్షన్ మాడ్యుల్ రోవర్ ఉంటాయని అన్నారు. చంద్రయాన్-2 ప్రయోగంతో సైన్స్ డేటాను ఉత్పత్తి చేయడానికి 7 సంవత్సరాలు పనిచేస్తుందని తెలిపారు. చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్–2 చివరి నిమిషంలో విఫలం అవడం పట్ల కే. శివన్, ఇతర శాస్త్రవేత్తలు నిరాశ చెందడం, ప్రధాని నరేంద్ర మోదీ వారిని ఓదార్చిన విషయం తెలిసిందే. 2019లో ఇస్రో విజయాలను శివన్ ప్రస్తావిస్తూ.. కొత్త సంవత్సరంలో ఇస్రో ప్రణాళికలను మీడియాకు తెలియజేశారు. 2020లో చంద్రయాన్-3, గగన్‌యాన్ ప్రయోగాల విజయవంవతం అవ్వడానికి కృషి చేస్తామన్నారు. గగన్‌యాన్ ప్రయోగం దిశగా 2019లో మంచి పురోగతి సాధించాం. అంతరిక్షంలోకి మనుషులను పంపేందుకు భారత్ తొలిసారిగా చేపడుతున్న ప్రయోగం కోసం.. నలుగురు వ్యోమగాములను గుర్తించామని, వీరికి త్వరలోనే శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని శివన్ తెలిపారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ..2020లో చంద్రయాన్-3 ప్రయోగాన్ని ప్రారంభస్తారని.. చంద్రయాన్-2 కంటే చంద్రయాన్-3 చాలా తక్కువ ఖర్చవుతుందని అభిప్రాయపడ్డారు. చివరి నిమిషంలో చంద్రయాన్-2 విఫలమవ్వడం పట్ల శివన్ స్పందిస్తూ..రెండు దశలు కొనసాగిన చంద్రయాన్-2 ప్రయోగంలో మొదటి దశలో చంద్రయాన్ 3,84,400 కిలోమీటర్లు అంతరిక్షంలో విజయవంవతంగా ప్రయాణించిందని అన్నారు. రెండో దశ చాలా క్లిష్టమైందని, అందులోనే కొంచెం విఫలమయ్యామని అన్నారు ప్రపంచంలో చంద్రయాన్-2 ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై ప్రవేశించిన మొదటి దేశం భారత్ అని పేర్కొన్నారు. అగ్ర దేశాలైన అమెరికా, చైనా కూడా ఇంత వరకు ప్రయత్నించలేదని శివన్ గుర్తు చేశారు. -
ఇస్రో విజయ విహారం
సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరోసారి జయ కేతనం ఎగురవేసింది. విజయాల పరంపరను కొనసాగిస్తూ షార్ నుంచి 74వ ప్రయోగాన్ని బుధవారం విజయవంతంగా ముగించింది. నెల్లూరు జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి బుధవారం ఉదయం 9.28 గంటలకు పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ద్వారా 1625 కిలోలు బరువు కలిగిన కార్టోశాట్–3 ఉపగ్రహంతోపాటు అమెరికాకు చెందిన మరో 13 ఉపగ్రహాలను విజయవంతంగా ప్రవేశపెట్టింది. 14 ఉపగ్రహాలను భూమికి 509 కిలోమీటర్లు ఎత్తులోని వృత్తాకార సూర్యానువర్తన ధ్రువకక్ష్య (సర్క్యులర్ సన్ సింక్రోనస్ ఆర్బిట్)లో వివిధ దశల్లో ఉపగ్రహాలను ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగ విజయంతో ఈ ఏడాది అయిదు ప్రయోగాలను విజయవంతంగా నిర్వహించినట్లయింది. ప్రయోగానంతరం ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ బృందాన్ని ఆలింగనం చేసుకోగా, శాస్త్రవేత్తలు తమ సంతోషాన్ని ఒకరితో ఒకరు పంచుకున్నారు. శాస్త్రవేత్తలకు ప్రధాని మోదీ అభినందనలు చెబుతూ ట్వీట్ చేశారు. వచ్చే మార్చిలోపే 13 మిషన్ల ప్రయోగం 2020 ఏడాది మార్చి 31లోపు 13 మిషన్లను ప్రయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు. ఇందులో ఆరు లాంచింగ్ వెహికల్స్, 7 ఉపగ్రహ ప్రయోగాలు ఉంటాయని తెలిపారు. రాబోయే నాలుగు నెలలు ఇస్రో కుటుంబం తీరికలేకుండా పనిచేయాల్సి ఉంటుందన్నారు. షార్ నుంచి 74 ప్రయోగాలు చేశారు. పీఎస్ఎల్వీ రాకెట్‌ను 49సార్లు ప్రయోగించగా 47సార్లు సక్సెస్ అయ్యింది. పీఎస్ ఎల్వీ ఎక్సెల్ స్ట్రాపాన్ బూస్టర్లతో 21 ప్రయోగమిది. ఈ ఏడాది 5వ ప్రయోగం కావడం విశేషం. కార్టోశాట్ ఉపగ్రహాల సిరీస్‌లో ఈ ప్రయోగం తొమ్మిదవది. మనదేశ ఖ్యాతి మరింత పైకి: జగన్ సాక్షి, అమరావతి: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్ ప్రయోగాన్ని విజయవంతం చేసిన ఇస్రో శాస్త్రవేత్తలకు ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందనలు తెలిపారు. భూతల మ్యాపింగ్, ఛాయాచిత్రాలను మరింత అత్యాధునికంగా తీసి సమాచారాన్ని పంపే ఈ ఉపగ్రహాల ప్రయోగంతో ప్రపంచంలోనే మన దేశ ఖ్యాతిని శాస్త్రవేత్తలు అగ్రభాగాన నిలిపారని జగన్ ప్రశంసించారు. ఈ ప్రయోగాలను విజయవంతం చేయడం ద్వారా ఇస్రో మరో మైలురాయిని చేరుకుని దేశానికి గర్వకారణంగా నిలిచిందని ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ అభినందించారు. కేసీఆర్ అభినందనలు.. సాక్షి, హైదరాబాద్: పీఎస్ఎల్వీ సీ47 రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించిన భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలను తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభినందించారు. భారతీయ శాస్త్రవేత్తల నైపుణ్యం, కృషికి ప్రస్తుత విజయం తార్కాణంగా నిలుస్తుందన్నారు. దేశీయ అవసరాలకే కార్టోశాట్–3 దేశీయ బౌగోళిక అవసరాల కోసం ఇస్రో కార్టోశాట్ సిరీస్ ఉపగ్రహ ప్రయోగాలను వరుసగా నిర్వహిస్తోంది. కార్టోశాట్ సిరీస్‌లో ఇప్పటికే ఎనిమిది ఉపగ్రహాలను పంపించగా, ఇది తొమ్మిదవది. కార్టోశాట్–3 థర్డ్ జనరేషన్ ఉపగ్రహం కావడం విశేషం. గతంలో ప్రయోగించిన కార్టోశాట్ ఉపగ్రహాల కంటే ఈ ఉపగ్రహం అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించారు. ఈ ఉపగ్రహంలో అమర్చిన ప్రాంకోమాటిక్ మల్టీ స్ప్రెక్ట్రరల్ కెమెరాలు అత్యంత శక్తిమంతమైనవి. దీనిద్వారా పట్టణ, గ్రామీణాభివృద్ధి ప్రణాళికలు, సముద్ర తీరప్రాంతాల నిర్వహణ, రహదారుల పర్యవేక్షణ, నీటి పంపిణీ, భూ వినియోగంపై మ్యాప్‌లు తయారు చేయడం, విపత్తులను విస్తృతిని అంచనా వేసే పరిజ్ఞానం, వ్యవసాయ సంబంధితమైన సమాచారం అందుబాటులోకి వస్తుంది. ప్రత్యేకించి నిఘాలో సైనిక అవసరాలకు ఉపయోగపడడమే కాకుండా సైనిక సామర్థ్యాన్ని పెంచుకోవడానికి దోహదపడుతోంది. ఈ ఉపగ్రహం అయిదేళ్లుపాటు సేవలు అందిస్తుంది. -
చంద్రయాన్–2తో కథ ముగియలేదు
న్యూఢిల్లీ: చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్‌లో విఫలమైన చంద్రయాన్ –2 తో కథ ముగియలేదని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలకు సన్నద్ధం అవుతోందని ఇస్రో చీఫ్ శివన్ తెలిపారు. ఢిల్లీ ఐఐటీ స్వర్ణోత్సవాల్లో పాల్గొన్న శివన్ రాబోయే మరికొద్ది నెలల్లో మరింత అభివృద్ధి చెందిన అంతరిక్ష పరిశోధనలు చేయబోతున్నట్టు తెలిపారు. చంద్రయాన్–2 సాఫ్ట్ ల్యాండింగ్ చేయలేకపోయాం. అయితే జాబిల్లి ఉపరితలంపై 300 మీటర్ల దూరం వరకు సాంకేతికంగా అన్ని వ్యవస్థలూ సరిగ్గానే పనిచేశాయి. చంద్రయాన్–2 నుంచి గుణపాఠాలను తీసుకుని భవిష్యత్‌లో సాఫ్ట్ ల్యాండింగ్ చేస్తామని హామీ ఇస్తున్నానని శివన్ వ్యాఖ్యానించారు. చంద్రయాన్‌లాంటి భవిష్యత్ ప్రణాళికలేమైనా ఉన్నాయా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ శివన్ చంద్రయాన్–2 తో కథ అంతంకాలేదనీ, ఆదిత్య ఎల్–1 సోలార్ మిషన్, మానవ స్పేస్‌ఫ్లైట్ ప్రోగ్రామ్స్ ప్రయత్నాల్లో ఉన్నామని వివరించారు. మీకు నైపుణ్యం, ఆసక్తి ఉన్న రంగంలో ఇష్టమైన కెరీర్‌ని ఎంచుకుని ముందుకుసాగాలని విద్యార్థులకు శివన్ సూచించారు. అయితే విజయం సాధించడమన్నది కేవలం అభిరుచిపైనే ఆధారపడి ఉండదనీ, విజయానికి అభిరుచి దోహదపడగలదని మాత్రమే గుర్తించాలని అన్నారు. -
చంద్రయాన్ 98% సక్సెస్
చెన్నై/భువనేశ్వర్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్–2 ప్రయోగం 98 శాతం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు. చంద్రయాన్–2లో అమర్చిన విక్రమ్ ల్యాండర్‌తో సంబంధాలు మాత్రం పునరుద్ధరించలేకపోయినట్లు తెలిపారు. ల్యాండర్‌కి ఏం జరిగిందో తెలుసుకునేందుకు విద్యావేత్తలు, ఇస్రో నిపుణులతో కూడిన జాతీయ స్థాయి కమిటీ విశ్లేషణ చేస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ల్యాండర్ నుంచి తమకు ఎలాంటి కమ్యూనికేషన్ లేదని.. ఒకవేళ ఏదైనా సమాచారం అందితే దానికి తగినట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. చంద్రయాన్–2లో ఆర్బిటర్ మాత్రం చాలా బాగా పని చేస్తోందని పేర్కొన్నారు. ఆర్బిటర్‌లో అమర్చిన ఎనిమిది సాంకేతిక పరికరాలు బాగా పని చేస్తున్నాయని తెలిపారు. ప్రతి పరికరం తన పనిని తాను సమర్థవంతంగా చేస్తోందని చెప్పారు. ఆర్బిటర్ పంపిన కొన్ని చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని.. ఇవి పరిశోధనల్లో ఉపయోగపడతాయని ఆశిస్తున్నట్లు తెలిపారు. శనివారం ఆయన భువనేశ్వర్‌లో మీడియాతో మాట్లాడుతూ.. దాదాపు ఏడున్నర సంవత్సరాల పాటు ఆర్బిటర్ పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తమ దృష్టి అంతా 2020లో చేపట్టనున్న చంద్రుడిపై చేపట్టనున్న మరో మిషన్ మీదే అని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి ఇంకా ఏదీ ఖరారు కాలేదని చెప్పారు. గగన్‌యాన్‌పై దృష్టి.. చంద్రయాన్–2 ఫలితం ప్రభావం గగన్‌యాన్ ప్రయోగంపై ఉండబోదని శివన్ స్పష్టం చేశారు. గగన్‌యాన్ ప్రయోగం భారత్‌కు చాలా ముఖ్యమని.. ఇది దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాల సామర్థ్యాన్ని పెంచుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతానికి గగన్‌యాన్ ప్రయోగంపై దృష్టి సారించామని వెల్లడించారు. ఐఐటీ భువనేశ్వర్‌లో జరిగిన ఎనిమిదో స్నాతకోత్సవంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. 2021 డిసెంబర్ కల్లా భారత్ తన సొంత రాకెట్లో వ్యోమగామిని అంతరిక్షంలోకి పంపాలన్న లక్ష్యంతో పనిచేస్తుందని తెలిపారు. 2020 డిసెంబర్ కల్లా మానవ రహిత అంతరిక్ష విమానాన్ని అంతరిక్షంలోకి పంపుతామని పేర్కొన్నారు. 2021 డిసెంబర్లో రెండో విమానాన్ని పంపుతామని చెప్పారు. -
వడివడిగా మామ చుట్టూ..
అంతరిక్ష చరిత్రలో భారత్.. తన కోసం మరికొన్ని పుటలను లిఖించుకుంది. చంద్రయాన్–2 ప్రయోగంలో మంగళవారం కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ‘బాహుబలి’ప్రవేశించింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మంగళవారం చేపట్టిన ఆపరేషన్ విజయం సాధించింది. లిక్విడ్ ఇంజిన్‌ను మండించడం ద్వారా చంద్రుడి కక్ష్యలోకి శాస్త్రవేత్తలు ప్రవేశపెట్టారు. అర్ధగంట పాటు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ ఆపరేషన్ విజయవంతమైందని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. ఇప్పటిదాకా జరిగింది ఇదీ.. ► ఈ ఏడాది జూలై 22న చంద్రయాన్–2ను ఇస్రో విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. ► ఆగస్టు 14న చంద్రుడి కక్ష్యగతి మార్గంలోకి మళ్లించారు. ► ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. జరగబోయేది ఇదీ.. ► సెప్టెంబర్ 7న ఉదయం 1.55 గంటలకు ప్రజ్ఞాన్ రోవర్‌తో కూడిన విక్రమ్ ల్యాండర్ (1,471 కేజీల బరువు) చంద్రుడి ఉపరితలంపై అడుగుపెడుతుంది. ► ఆ తర్వాత ల్యాండర్ నుంచి ప్రజ్ఞాన్ రోవర్ విడిపోయి, చంద్రుడిపై అన్వేషణ ప్రారంభిస్తుంది. ► చంద్రయాన్ ఆర్బిటర్ చంద్రుడి కక్ష్యలో తిరుగుతూ.. అక్కడి విశేషాలను భూమిపైకి పంపుతూ ఉంటుంది. వడివడిగా.. చంద్రుడి దిశగా.. సాక్షి, బెంగళూరు/సూళ్లూరుపేట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మానసపుత్రిక చంద్రయాన్–2 అంతరిక్ష నౌక చంద్రుడి ఒడిని చేరేందుకు వడివడిగా ఒక్కో మైలురాయిని దాటుకుంటూ ముందుకెళ్తోంది. తాజాగా ఈ ప్రయోగంలో అత్యంత కీలక ఘట్టం మంగళవారం విజయవంతంగా ముగిసింది. ఇప్పటివరకు లూనార్ ట్రాన్స్ఫర్ ట్రాజెక్టరీలో చక్కర్లు కొడుతున్న చంద్రయాన్–2 నౌక కీలకమైన చంద్రుడి కక్ష్యలోకి దిగ్విజయంగా ప్రవేశించింది. మంగళవారం ఉదయం 9.02 గంటల ప్రాంతంలో ఆర్బిటర్‌లోని ద్రవ ఇంజిన్‌ను 1,738 సెకన్లపాటు మండించి లూనార్ ఆర్బిట్‌లో అంటే చంద్రుడికి దగ్గరగా 114 కిలోమీటర్లు, చంద్రుడికి దూరంగా 18,072 కిలోమీటర్ల ఎత్తులో దీర్ఘ చతురస్రాకారంలో ప్రవేశపెట్టి భారత ఘనతను ప్రపంచానికి చాటి చెప్పారు. బెంగళూరు సమీపంలో బైలాలులోని భూనియంత్రిత కేంద్రం (మిషన్ ఆపరేటర్ కంట్రోల్ సెంటర్) నుంచి ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఆధ్వర్యంలో కక్ష్య దూరాన్ని పెంచే ప్రక్రియను శాస్త్రవేత్తలు చేపట్టారు. తదుపరి ప్రక్రియలకు సన్నాహాలు.. ఇక ప్రయోగంలో తదుపరి 18,072 కిలోమీటర్ల దూరాన్ని 4 విడతలుగా తగ్గించుకుంటూ వచ్చి చంద్రుడికి చతురస్రాకారంలో 100 కిలోమీటర్లుకు తీసుకొచ్చే ప్రక్రియను చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. తర్వాత 100 కిలోమీటర్ల నుంచి 30 కిలోమీటర్లకు తగ్గించుకుంటూ వచ్చి సెప్టెంబర్ 2వ తేదీన ఆర్బిటర్ నుంచి ల్యాండర్ (విక్రమ్)ను విడిచిపెట్టే ప్రక్రియను చేపట్టేందుకు సన్నద్దమవుతున్నారు. ఇక ప్రయోగంలో చివరిగా సెప్టెంబర్ 7వ తేదీ ఉదయం 9 నుంచి 10 గంటల్లోపు ల్యాండర్ నుంచి రోవర్ (ప్రజ్ఞాన్) బయటకు వచ్చి చంద్రుడి దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టి తన పరిశోధనలను ప్రారంభిస్తుంది. దశల వారీగా పరిశీలిస్తే.. జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహక నౌక ద్వారా జూలై 22వ తేదీన చంద్రయాన్–2 మిషన్‌ను భూమికి దగ్గరగా 170 కిలోమీటర్లు, భూమికి దూరంగా 45,475 కిలోమీటర్లు ఎత్తులో భూమధ్యంతర కక్ష్యలోకి ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అనంతరం కక్ష్య దూరాన్ని పెంచడంలో భాగంగా గత నెల 24వ తేదీ తొలి విడత, 26వ తేదీన రెండోసారి, 29వ తేదీన మూడోసారి, ఈ నెల 2వ తేదీన నాలుగోసారి, 6వ తేదీన ఐదోసారి ఆర్బిటర్‌లోని ఇంధనాన్ని మండించి భూమికి దగ్గరగా 276 కిలోమీటర్లు, భూమికి దూరంగా 1,42,975 కిలోమీటర్లను విజయవంతంగా పెంపుదల చేశారు. ఈ నెల 14వ తేదీన ఆరోసారి లూనార్ ఆర్బిట్ ట్రాజెక్టరీలోకి చంద్రయాన్ నౌకను ప్రవేశపెట్టారు. ఇప్పటివరకు మొత్తం 6 సార్లు కక్ష్య దూరం పెంచే ఆపరేషన్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు ఎలాంటి సాంకేతికపరమైన లోపం లేకుండా విజయవంతంగా నిర్వహించారు. ఆ అర్ధగంట.. అత్యంత ఉత్కంఠ.. చంద్రయాన్–2 మిషన్‌ను చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు మా శాస్త్రవేత్తలు ద్రవ ఇంథనాన్ని మండిస్తున్న సమయంలో నా గుండె కాసేపు ఆగినంత పనైంది. సుమారు ఈ ప్రక్రియ చేపడుతున్న అర్ధగంట సమయం అత్యంత ఉత్కంఠను ఎదుర్కొన్నా’అని మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ల్యాండర్ చంద్రుడిపై దిగే సెప్టెంబర్ 7వ తేదీన ఇంతకంటే అత్యంత ఉత్కంఠ క్షణాలు ఎదుర్కోవాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రధాని మోదీ అభినందనలు.. చంద్రయాన్–2 వ్యోమనౌకను విజయవంతంగా చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో శాస్త్రవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ప్రతిష్టాత్మక చంద్రయాన్–2 ప్రయాణంలో మరో మైలురాయిని ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ముగించారని మోదీ కొనియాడారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. -
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోనే
శ్రీహరికోట: చంద్రయాన్–2 ప్రయోగాన్ని విజయవంతంగా చేపట్టినందుకు గర్వంగా ఉందని ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ తెలిపారు. ఇందులో ప్రయోగించిన అన్ని సాంకేతిక పరికరాలను భారత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిందని వెల్లడించారు. ‘సాంకేతిక కారణాలతో ప్రయోగం నిలిచినా మేం మళ్లీ పుంజుకున్నాం. ప్రయోగానికి కొద్దిసేపటి ముందు సమస్యను గుర్తించగానే మా బృందం రంగంలోకి దిగింది. అప్పట్నుంచి 24 గంటల్లోనే సమస్యను పరిష్కరించి చంద్రయాన్–2 ప్రయోగానికి సర్వం సిద్ధం చేశాం. జీఎస్ఎల్వీ మార్క్–3 చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి విజయవంతంగా ప్రయోగించడం ఎంతో సంతోషంగా ఉంది. మేం అనుకున్న దానికంటే 6,000 కి.మీ ఎత్తులో చంద్రయాన్–2ను వాహకనౌక విజయవంతంగా ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో భారత్ చారిత్రాత్మక ప్రయాణం మొదలైంది. కేవలం భారత్ ఒక్కటే కాదు. ప్రపంచమంతా చంద్రయాన్–2 ప్రయోగం విజయవంతం కావాలని ఎదురుచూసింది. మేం దాన్ని సాధించాం. చంద్రయాన్–2 ప్రాజెక్టులో 30 శాతం మంది మహిళా సిబ్బందే ఉన్నారు. వీరిలో శాస్త్రవేత్తలు రీతూ కరిథల్, ఎం వనితలు కీలక పాత్ర పోషించారు. చంద్రయాన్–2 ప్రయోగం ఇంకా పూర్తికాలేదు. చంద్రుడిపై ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ దశను ల్యాండర్ దాటితే ప్రయోగం విజయవంతం అయినట్లే. ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న శాస్త్రవేత్తలందరికీ సెల్యూట్ చేస్తున్నా’ అని పేర్కొన్నారు. -
‘పద్మావతి’ సన్నిధితో గవర్నర్ దంపతులు
సాక్షి, తిరుచానూరు: తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎల్ఎన్ నరసింహన్ దంపతులు శనివారం ఉదయం తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. టీటీడీ తిరుపతి జేఈవో బసంత్ కుమార్, డిప్యూటీ ఈవో ఝాన్సీ తదితరులు గవర్నర్ దంపతులకు స్వాగతం పలికారు. అలాగే ఆలయ అర్చకులు సాంప్రదాయబద్దంగా ఇస్తికాపాల్ స్వాగతం పలికారు. గవర్నర్ దంపతులు అమ్మవారి దర్శనం అనంతరం శేష వస్త్రాన్ని, తీర్థ ప్రసాదాలను బహూకరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్ శివన్ తిరుమల: చంద్రయాన్-2 ప్రయోగం సందర్భంగా ఇస్రో చైర్మన్ శివన్ శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-2 వాహక నౌక నమూనాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శివన్ మాట్లాడుతూ.. చంద్రయాన్-2ను సోమవారం తెల్లవారుజామున 2.51 గంటలకు ప్రయోగిస్తామన్నారు. రెండు నెలల అనంతరం ల్యాండర్ చంద్రుడి దక్షిణ ధృవానికి చేరుకుంటుందన్నారు. వర్షం వల్ల చంద్రయాన్-2 ప్రయోగానికి ఎలాంటి అంతరాయం కలగదని శివన్ తెలిపారు. -
వెన్నెల రాజు చెంతకు..!
సాక్షి, శ్రీహరికోట(సూళ్లూరుపేట): చందమామ ఉపరితలంలో కలియదిరుగుతూ పరిశోధనలు చేసేందుకు ఇస్రో చేస్తున్న ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్–2 ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. ఇప్పటికే జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ అనుసంధానం కార్యక్రమాలు ముగిశాయి. ప్రస్తుతం తనిఖీలు చేస్తున్నారు. మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశానికి ఈ ప్రయోగం తలమానికం కావడంతో ప్రపంచమంతా ఇస్రో వైపు చూస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు చంద్రయాన్–2ను నింగిలోకి పంపనుంది. ఇందుకు సంబంధించి సతీష్ ధవన్‌స్పేస్ సెంటర్ షార్ కేంద్రంలో రెండో ప్రయోగవేదికకు సంబంధించిన వెహికల్ అసెంబ్లింగ్ షార్‌లోని రెండో ప్రయోగవేదికపై ప్రయోగానికి సిద్ధంగా ఉన్న జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 ఉపగ్రహ వాహకనౌక బిల్డింగ్(వ్యాబ్) జీఎస్ఎల్వీ మార్క్3–ఎం1 రాకెట్ అనుసంధానం పూర్తయింది. అక్కడి నుంచి రాకెట్‌ను ఉంబ్లికల్ టవర్‌కు అనుసంధానం చేసిన తరువాత పలు పరీక్షలు చేస్తున్నారు. ఈ పరీక్షలు చేయడంలో భాగంగా మంగళవారం ఫుల్ డ్రెస్ రిహార్సల్స్(ఎఫ్డీఆర్–1) కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ ప్రయోగానికి సంబంధించిన పనులను పూర్తిచేయడంలో ఇస్రొ శాస్త్రవేత్తలు బిజీబిజీగా ఉన్నారు. ఈ నెల 13వ తేదీ మిషన్ సంసిద్ధతా సమావేశం (ఎంఆర్ఆర్) నిర్వహించిన అనంతరం ప్రయోగతేదీని అధికారికంగా ప్రకటించనున్నారు. చంద్రుని మీద ఇప్పటివరకు రష్యా, అమెరికా, చైనా దేశాలు మాత్రమే పరిశోధనలు చేశాయి. 2008లో భారత్ చంద్రయాన్–1 ద్వారా మొదటి ప్రయత్నంలో చంద్రుడి చుట్టూ ఉపగ్రహాన్ని పంపి పలు పరిశోధనలు చేసిన విషయం తెలిసిందే. చంద్రయాన్–2 మిషన్‌లో భాగంగా ఈ సారి చంద్రుడిపైకి ల్యాండర్‌ను దింపి అందులో ఉన్న రోవర్ ద్వారా చంద్రుడిపై పరిశోధనలు చేస్తారు. చంద్రుడి మీద పరిశోధనలు చేసే నాలుగో దేశంగా భారత్ ఆవిర్భవించనుంది. ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.శివన్ ఈ నెల 13న రాత్రి షార్కు చేరుకోనున్నారు. -
మనకూ ఓ అంతరిక్ష కేంద్రం
న్యూఢిల్లీ: అంతరిక్ష ప్రయోగాల్లో అంతర్జాతీయంగా తనదైన ముద్ర వేసిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మరో మెగా ప్రాజెక్టుకు సిద్ధమవుతోంది! ఆంక్షల చట్రాలు ఎన్ని ఉన్నా.. ప్రపంచంలోనే అత్యంత చవకగా ఉపగ్రహ ప్రయోగాలు నిర్వహించగల సత్తా సాధించుకున్న ఇస్రో... ఇప్పుడు సొంతంగా ఓ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకునే దిశగా అడుగులువేస్తోంది. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇస్రో చైర్మన్ డా.కె.శివన్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘చంద్రయాన్–2 ప్రయోగం పూర్తయ్యాక సూర్యుడిపై ఆదిత్య–ఎల్1 వాహకనౌక 2020 తొలి అర్ధభాగంలో పంపిస్తాం. అనంతరం 2–3 సంవత్సరాల వ్యవధిలో ఫ్రాన్స్‌తో కలిసి శుక్రుడిని అధ్యయనం చేసేందుకు మరో ప్రయోగం చేపడతాం’ అని తెలిపారు. ఆదిత్య ఎల్1 వాహకనౌక సూర్యుడిలో అత్యంత వేడి ప్రదేశమైన కరోనాను విశ్లేషిస్తుందనీ, దీనివల్ల వాతావరణ మార్పులను అర్థం చేసుకోవచ్చని వెల్లడించారు. ఇస్రో అంతరిక్ష పర్యాటకంపై దృష్టి సారించడంలేదని డా.శివన్ స్పష్టం చేశారు. 2030 నాటికి పూర్తి భారతీయుల్ని సొంతంగా అంతరిక్షంలోకి పంపేందుకు రూ.10,000 కోట్లతో ఇస్రో చేపట్టిన ‘గగన్‌యాన్’ ప్రాజెక్టుకు కొనసాగింపుగా అంతరిక్ష కేంద్ర నిర్మాణం ఉంటుందని డా.శివన్ తెలిపారు. ‘అమెరికా, జపాన్, కెనడా, రష్యా, ఈయూ దేశాలు కలిసి ఏర్పాటుచేసిన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) బరువు 420 టన్నులు ఉండగా, ఇస్రో ఏర్పాటుచేయనున్న అంతరిక్ష కేంద్రం బరువు 20 టన్నులు మాత్రమే ఉంటుంది. ఈ కేంద్రంలో తొలుత వ్యోమగాములు 15–20 రోజులు గడిపేలా ఏర్పాట్లు చేస్తాం. దాన్ని క్రమంగా విస్తరిస్తాం. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనల దశలోనే ఉంది. ఓసారి ప్రభుత్వ ఆమోదం లభిస్తే 2030 నాటికి మనకు సొంత అంతరిక్ష కేంద్రం ఏర్పాటవుతుంది. దీనికోసం ఐఎస్ఎస్తో కానీ, మరేదేశంతో కానీ పనిచేయబోం’ అని పేర్కొన్నారు. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉండే పరిస్థితుల్లో మానవశరీరంతో పాటు మొక్కలు, ఇతర జీవులు, బ్యాక్టీరియాలు ఎలా ప్రతిస్పందిస్తాయన్న విషయమై ఈ కేంద్రంలో పరిశోధనలు చేపడతామని చెప్పారు. ఇతర దేశాలతో కలిసి చంద్రుడిపై మానవసహిత యాత్రలు చేపడతామని, గ్రహశకలాలను విశ్లేషిస్తామని కె.శివన్ తెలిపారు. అంతరిక్ష కేంద్రం అంటే? భూమికి సుమారు 400 కిలోమీటర్ల దూరంలో కొన్ని రోజులపాటు వ్యోమగాములు ఉండేందుకు ఏర్పాటు చేసిన నిర్మాణాన్ని అంతరిక్ష కేంద్రం అని పిలవొచ్చు. దీనిని భూస్థిర కక్ష్యలో తిరుగుతూ ఉండే ఓ భారీ ఉపగ్రహంగానూ అనొచ్చు. అగ్రరాజ్యాల ఆధ్వర్యంలో నడుస్తున్న ఐఎస్ఎస్ను 1998 నుంచి దశలవారీగా విస్తరిస్తూ వచ్చారు. దీంతో ప్రస్తుతం ఐఎస్ఎస్ బరువు దాదాపు 420 టన్నులకు చేరుకుంది. 2000లో తొలిసారిగా ఇందులో ఓ వ్యోమగామి అడుగుపెట్టారు. 2011లో ఐఎస్ఎస్కు చివరి మాడ్యూల్‌ను జోడించారు. ఐదేళ్ల తర్వాత ఐఎస్ఎస్లో వ్యోమగాములు నివాసం ఉండేందుకు వీలుగా ప్రత్యేకమైన గాలిబుడగలాంటి నిర్మాణాన్ని ఏర్పాటుచేశారు. 2030 వరకూ పనిచేసే ఈ ఐఎస్ఎస్లో గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో మొక్కలు ఎలా పెరుగుతాయి? పదార్థాల భౌతిక ధర్మాలు మారతాయా? బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులపై ప్రభావం ఎలా ఉంటుంది? వంటి అంశాలపై అనేక ప్రయోగాలు జరుగుతున్నాయి. గగన్‌యాన్ తర్వాతే.. జూలై 15న చంద్రయాన్ –2 ప్రయోగం పూర్తయ్యాక గగన్‌యాన్‌పై దృష్టి సారిస్తామని శివన్ తెలిపారు. ‘వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపే ముందు రెండుసార్లు వారు ప్రయాణించే మాడ్యూల్‌ను పరీక్షిస్తాం. 2022లో తొలి మానవసహిత అంతరిక్ష ప్రయోగాన్ని చేపడతాం. అంతరిక్షంలోకి వెళ్లే వ్యోమగాములను రాబోయే 6 నెలల్లో ఎంపిక చేస్తాం. ఆ తరువాత వీరికి ఏడాది పాటు శిక్షణ ఇస్తాం. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.10 వేల కోట్ల నిధులను కేటాయించింది’ అని శివన్ చెప్పారు. గగన్‌యాన్ ప్రయోగం పూర్తయ్యాక దానికి కొనసాగింపుగా అంతరిక్ష కేంద్రం నిర్మాణంపై దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. -
జూలై 15న చంద్రయాన్2
బొమ్మనహళ్లి(బెంగళూరు)/సూళ్లూరుపేట: చంద్రుడిపైకి రెండో మిషన్‌లో భాగంగా చంద్రయాన్–2ని జూలై 15న ప్రయోగిస్తామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ వెల్లడించారు. సెప్టెంబర్ 6 లేదా 7వ తేదీల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై రోవర్ దిగుతుందని బుధవారం ఆయన వెల్లడించారు. భారత అంతరిక్ష ప్రయోగాలలో ఈ ప్రయోగం అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నామని ఆయన వెల్లడించారు. జూలై 15వ తేదీ తెల్లవారుజామున 2.51 గంటలకు జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ సాయంతో ఈ మిషన్‌ను ప్రారంభిస్తామని, ఈ ప్రయోగం ద్వారా మీటరు పొడవైన 25 కేజీల బరువున్న రోవర్, ఆర్బిటర్, లాండర్లను చంద్రుడిపైకి పంపనున్నట్లు తెలిపారు. చంద్రయాన్–2 మొత్తం బరువు 3.8 టన్నులని, ఇస్రో ప్రయోగిస్తున్న లాండర్, రోవర్ దిగే దక్షిణ ధ్రువ ప్రదేశానికి ఇంతవరకు ఏ దేశానికి చెందిన ఉపగ్రహాలు చేరలేదని ఆయన వెల్లడించారు. ఈ ప్రాజెక్టుకోసం ఇస్రో వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్‌ను వాడుతున్నారు. ఆర్బిటర్ ప్రొపెలైజేషన్ విధానంలో ఈ మూడు పరికరాలు చంద్రుడి కక్ష్యలోకి చేరతాయి. అక్కడ ఆర్బిటర్ నుంచి లాండర్ విడిపోయి చంద్రుడివైపు దూసుకెళుతుంది. ఆర్బిటర్ నుంచి లాండర్ విడిపోవడం ఈ ప్రాజెక్టులో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. విడిపోయిన అనంతరం ఆర్బిటర్ నిర్దేశిత కక్ష్యలో తిరుగుతుంది. మరోపక్క లాండర్ చంద్రుడి దక్షిణ ధ్రువంపై నిర్దేశిత ప్రాంతంలో దిగుతుంది. లాండర్ క్షేమంగా లక్ష్యాన్ని చేరుకున్నాక దానిలోంచి రోవర్ బయటకు వచ్చి చంద్రుడిపై పరిశోధనలు చేస్తుంది. ఈ రోవర్ ప్రయోగాలు చేయడానికి అవసరమైన పరికరాలను కూడా లాండర్ పైభాగంలో అమర్చారు. రోవర్ సాయంతో చంద్రుడి ఉపరితలం, ఖనిజాలు వంటి వాటిని అన్వేషిస్తారు. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు రూ.1,000 కోట్లుకాగా, చంద్రయాన్ –2 కోసం రూ. 603 కోట్లు ఖర్చుకానుంది. ఇందులో జీఎస్ఎల్వీ ఎంకే–3 కోసం రూ.375 కోట్లు వెచ్చించనున్నారు. అంతా అనుకున్నట్టు జరిగితే సెప్టెంబర్ నుంచి ఇది ఇస్రోకు సంకేతాలను పంపుతుందని శివన్ వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో మాట్లాడుతున్న శివన్ -
చంద్రుని దక్షిణ ధ్రువంపైకి రోవర్
సాక్షి ప్రతినిధి, చెన్నై/శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న చంద్రయాన్–2 ప్రాజెక్టును ఈ ఏడాది జూలై 9వ తేదీ నుంచి 16వ తేదీల మధ్యలో ప్రయోగించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చంద్రుని దక్షిణ ధ్రువంపైకి ఇస్రో ల్యాండర్, రోవర్లను పంపనుంది. ‘ఇప్పటి వరకు ఎవరూ కూడా చీకటిగా ఉండే ఈ ప్రాంతంలోకి రోవర్‌ను దించలేదు. చంద్రుని ఈక్వేటర్‌కు సమీపంలోకి ఇది వెళ్తుంది’ అని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. జీఎస్ఎల్వీ మార్క్–3 రాకెట్ ద్వారా ప్రయోగించే ఉపగ్రహంలో ల్యాండర్ విక్రమ్, రోవర్ ప్రజ్ఞాన్ ఉంటాయి. ఇవి సెప్టెంబర్ నాటికి అక్కడికి చేరుకుంటాయని ఆయన వివరించారు. వీటి ద్వారా తాము సేకరించే సమాచారంపై ప్రపంచ నలుమూలలా ఉన్న శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని అన్నారు. ప్రయోగాలన్నిటినీ పూర్తి చేసి 2022లోగా చంద్రునిపైకి మానవుడిని పంపుతామని ఇస్రో చైర్మన్ తెలిపారు. దీంతోపాటు వచ్చే ఏడాది తొలి అర్ధ భాగంలో సూర్యుడిపై ప్రయోగాల కోసం ఆదిత్య–ఎల్1 సూర్యుని కక్ష్యలోకి ప్రయోగిస్తామని తెలిపారు. ఈ ప్రయోగం వల్ల సూర్యుని గురించి ఇంతవరకు తెలియని అనేక విషయాలను తెలుసుకుంటామని చెప్పారు. ఇతర గ్రహాలపైనా పరిశోధనలు చేపట్టేందుకు ఇస్రో సమాయత్తం అవుతోందని తెలిపారు. -
2021 డిసెంబర్లో గగన్‌యాన్
సాక్షి బెంగళూరు: భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపే ‘గగన్‌యాన్’ ప్రయోగాన్ని 2021, డిసెంబర్లో నిర్వహిస్తామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగాన్ని చేపట్టేముందు పలు పరీక్షలను నిర్వహించాల్సి ఉంటుందని వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా 2020లో ఓసారి, 2021లో మరోసారి మానవరహిత పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అలాగే క్రూ సపోర్ట్ సిస్టమ్స్, సర్వీస్ మాడ్యూల్, ఆర్బిటాల్ మాడ్యూల్ వంటి పలు సాంకేతికతలను ఇంకా అభివృద్ధి చేయాల్సిఉందని శివన్ పేర్కొన్నారు. 2022 నాటికి భారతీయులను సొంత సాంకేతిక పరిజ్ఞానంతో అంతరిక్షంలోకి పంపుతామని ప్రధాని మోదీ ఈఏడాది స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శివన్ మాట్లాడుతూ.. అంతరిక్ష యాత్రకు ఎంతమందిని పంపాలి? అక్కడ ఎన్నిరోజులు ఉండాలి? అన్న విషయాలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. గగన్‌యాన్‌లో పాల్గొనేందుకు వ్యోమగాములను ఇంకా ఎంపిక చేయలేదని వెల్లడించారు. వ్యోమగాముల ఎంపిక ప్రక్రియ భారత వాయుసేన(ఐఏఎఫ్)స్వీకరించిందనీ, ఓసారి ఎంపిక పూర్తయితే 2 నుంచి 3 సంవత్సరాల పాటు వారికి శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం ముగ్గురు వ్యోమగాములను ఏడు రోజులపాటు అంతరిక్షంలోకి పంపే సామర్ధ్యం తమకుందని శివన్ చెప్పారు. ఈ ప్రయోగం చేపట్టేందుకు మిషన్ కంట్రోల్, ట్రాకింగ్, లాంచ్‌ప్యాడ్ నిర్మాణం వంటి పనుల్లో ప్రైవేటు రంగ సహకారం అవసరమని అభిప్రాయపడ్డారు. మానవసహిత యాత్రలో పాల్గొనే వ్యోమగాములకు శిక్షణ కోసం ఇతర దేశాల సాయం కూడా తీసుకుంటామని మరో ప్రశ్నకు శివన్ సమాధానమిచ్చారు. -
‘గగన్‌యాన్’ సాధ్యమే!
చెన్నై: 2022 నాటికి అంతరిక్షంలోకి భారత వ్యోమగామిని పంపించేందుకు ప్రణాళికలు రచిస్తున్నామని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) చైర్మన్ కె. శివన్ వెల్లడించారు. జీఎస్ఎల్వీ మార్క్–3 వాహకనౌక ద్వారా చేపట్టబోయే ఈ ప్రయోగం ద్వారా వారం రోజుల పాటు మానవుడిని అంతరిక్షంలో ఉంచుతామని చెప్పారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందిస్తున్న ఈ ప్రాజెక్టుకు రూ.10వేల కోట్లకంటే తక్కువ వ్యయమే అవుతుందని తెలిపారు. ఎర్రకోట ప్రసంగంలో ప్రధాని మోదీ మానవ సహిత యాత్ర ‘గగన్‌యాన్’ గురించి ప్రకటన చేసిన నేపథ్యంలో శివన్ మీడియాతో మాట్లాడారు. ‘‘జీఎస్ఎల్వి మార్క్–3 రాకెట్ ద్వారా అంతరిక్షంలోకి వ్యోమగామిని పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. భూమి నుంచి 300– 400 కిలోమీటర్ల ఎత్తు వరకు రాకెట్ ప్రయాణిస్తుంది. ఈ ప్రయోగానికి ముందు రెండు మానవ రహిత స్పేస్ క్రాప్ట్‌లను పంపుతాం. రూ.10వేల కోట్ల కన్నా తక్కువ వ్యయంతోనే ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తాం. ప్రమాద సమయంలో వ్యోమగాములను సురక్షితంగా నేలకు దించే క్రూ మోడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్‌లను ఇది వరకే పరీక్షించాం. వ్యోమగామికి లైఫ్ సపోర్ట్ సిస్టమ్, స్పేస్ సూట్ లాంటి వాటిని తయారుచేసే దశలో ఉన్నాం. అంతరిక్షంలోకి పంపే వ్యోమగామిని వాయుసేన ఎంపిక చేస్తుంది’ అని అన్నారు. -
జనవరి 3న చంద్రయాన్– 2
సాక్షి బెంగళూరు: వచ్చే ఏడాది జనవరి 3న చంద్రయాన్–2 మిషన్ చేపడతామని ఇస్రో చైర్మన్ కె.శివన్ తెలిపారు. ఈ ప్రయోగానికి రూ. 800 కోట్లు వెచ్చిస్తున్నట్లు వెల్లడించారు. భారత అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ శత జయంతి ఉత్సవాలను ఆదివారం బెంగళూరులోని ఇస్రో కార్యాలయంలో ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇస్రో మాజీ చైర్మన్లు కస్తూరి రంగన్, కిరణ్‌కుమార్ కూడా పాల్గొన్నారు. అనంతరం శివన్ మీడియాతో మాట్లాడుతూ 3,890 కేజీల బరువైన చంద్రయాన్–2 ఉపగ్రహాన్ని జీఎస్ఎల్వీ ఎంకే–3 రాకెట్ ద్వారా చంద్రుని మీదికి పంపిస్తామని తెలిపారు. ఈ మిషన్‌కు విక్రమ్ సారాభాయ్ మిషన్ అని నామకరణం చేస్తామని వెల్లడించారు. వచ్చే మూడేళ్లలో 50 ఉపగ్రహాలు ప్రయోగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలిపారు. ఒక్క 2019లోనే 22 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు తెలిపారు. ఇస్రో చరిత్రలో ఎక్కువ ప్రయోగాలు జరిపిన ఏడాది ఇదే కాబోతోందని అన్నారు. ఈ ఏడాది కూడా తమకు తీరికలేని షెడ్యూల్ ఉందని, ఇకపై నెలకు కనీసం రెండు ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌లో బ్రిటన్‌కు చెందిన రెండు వాణిజ్య ఉపగ్రహాల్ని నింగిలోకి పంపనున్నట్లు చెప్పారు. ఇస్రో చిన్నస్థాయి వాహకనౌకలను కూడా తయారుచేస్తోందని తెలిపారు. అవసరమైనప్పుడు ఇలాంటి వాటిని కేవలం ముగ్గురు నుంచి ఆరుగురు మనుషుల సాయంతో, మూడు రోజుల్లోనే రూపొందించొచ్చని వెల్లడించారు. మరో మూడు, నాలుగు నెలల్లో ఇస్రో టీవీ చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు శివన్ చెప్పారు. అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన వివరాలు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను సామాన్యులకు చేరవేసేందుకు ఇది దోహదపడుతుందని తెలిపారు. ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషల్లో తమ చానల్ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. -
ఘనంగా ఎస్వీయూ స్నాతకోత్సవం
యూనివర్సిటీ క్యాంపస్ : మూడేళ్ల తర్వాత నిర్వహించిన ఎస్యీయూ స్నాతకోత్సవం సంప్రదాయ బద్ధంగా సాగింది. స్నాతకోత్సవానికి ఇస్రో చైర్మన్ శివన్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఎస్వీయూ వీసీ దామోదరం, రెక్టార్ జానకి రామయ్య, రిజిస్ట్రార్ అనురాధ, పాలక మండలి సభ్యులు, ఫ్యాకల్టీ డీన్ల సమక్షంలో ఈ స్నాతకోత్సవం వేడుకగా సాగింది. స్నాతకోత్సవానికి గవర్నర్ నరసింహన్ హజరు కాకపోవడంతో ఎస్వీయూ వీసీ దామోదరం చాన్సలర్ హోదాలో ఇస్రో చైర్మన్ కే.శివన్‌కు గౌరవ డాక్టరేట్ అందజేశారు. అనంతరం పీహెచ్డీ, ఎంఫిల్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంకామ్, ఎంఎస్సీ, ఎంఏ తదితర డిగ్రీలను ప్రదానం చేశారు. తరువాత వివిధ సబ్జెక్ట్‌లలో టాపర్లుగా నిలిచిన వారికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. ఇస్రో చైర్మన్ స్నాతకోపన్యాసంతో ఈ వేడుక ముగిసింది. ఈ కార్యక్రమం పూర్తి కాగానే డిగ్రీలు పొందిన విద్యార్థులు అనందంతో గడిపారు. ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని సంబరాలు చేసుకున్నారు. ఎస్వీయూతో ఎంతో అనుబంధం ఎస్వీయూతో ఇస్రోకు ఎంతో అనుబంధం ఉందని ఇస్రో చైర్మన్ కే.శివన్ అన్నారు. ఎస్వీయూ నుంచి గౌరవ డాక్టరేట్ స్వీకరించిన అనంతరం ఆయన స్నాతకోపన్యాసం చేశారు. ఎస్వీయూ ఎంతో పురోగతి సాధించడంతో పాటు విజ్ఞానాన్ని పంచుతుందన్నారు. దక్షిణ భారతదేశంలోనే ఎస్వీయూ విశిష్టస్థానం దక్కించుకుందన్నారు. ఎస్వీయూ గొప్ప వ్యక్తులను సమాజానికి అందించిందన్నారు. స్నాతకోత్సవంలో డిగ్రీలు పొందిన విద్యార్థుల కళ్లలో కాంతులు కనిపిస్తున్నాయన్నారు. డిగ్రీలు పొందిన వారు ఉన్నత లక్ష్యాలను చేరుకుని యూనివర్సిటీ ప్రతిష్ట పెంచడంతో పాటు దేశ అభివృద్ధిలో పాలు పంచుకోవాలన్నారు. నూతన ఆలోచనలు, సృజన్మాతకత కలిగిన వారికి అనేక అవకాశాలు ఉన్నాయన్నారు. దేశ అభివృద్ధికి, వ్యక్తిగత, కుటుంబ అభివృద్ధికి అవసరమైన వేయి మార్గాలు విద్యార్థుల ఎదుట ఉన్నాయన్నారు. సరైన మార్గాన్ని ఎంచుకొని విజయం సాధించాలని పిలుపునిచ్చారు. సృజనాత్మకత, నూతన ఆలోచన ధోరణి విద్యార్థులను ఉన్నత స్థానానికి చేర్చుతుందన్నారు. దేశం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ఇంకా పేదరికం, ఆకలి, ఆనారోగ్యం, నీటి కొరత, నిరుద్యోగం తదితర సమస్యలు ఉన్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారం దిశగా పరిశోధనలు సాగాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి దిశగా ఎస్వీయూ ఎస్వీయూనివర్సిటీ మూడేళ్లుగా ఎంతో పురోగతి సాధించిందని వర్సిటీ వైస్‌చాన్స్‌లర్ దామోదరం చెప్పారు. ఎస్వీయూ నాక్‌లో ఏ ప్లస్ గ్రేడ్‌తో పాటు యూజీసీ కేటగిరి–1 అటానమస్ హోదా పొందిందన్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి ఎస్వీయూ మంచి ర్యాంకులు సాధించిందన్నారు. వర్సిటీలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు తీసుకొచ్చామన్నారు. కొత్త కోర్సులు, నూతన పరిశోధనలతో వర్సిటీని ముందుకు తీసుకెళున్నామన్నారు. 1,128 మందికి డిగ్రీలు ఎస్వీయూలో శనివారం నిర్వహించిన 55వ స్నాతకోత్సవం సందర్భంగా 1,128 మందికి డిగ్రీలు ప్రదానం చేశారు. డిగ్రీలు పొందిన వారిలో 151 మంది పీహెచ్డీ, 1 ఎంఫిల్, 976 మంది పీజీ డిగ్రీలు పొందారు. వీరు కాకుండా ఇన్ అడ్వాన్స్ రూపంలో 21,094 మంది, ఇన్ ఆబ్సెన్సియా రూపంలో 4,109 మంది డిగ్రీలు పొందారు. 65 మందికి బంగారు పతకాలు స్నాతకోత్సవంలో 65 మందికి బంగారు పతకాలు ప్రదానం చేశారు. పసిడి పతకాలు పొందిన వారిలో పూర్ణ చంద్రిక, ముకుందవల్లి, సునీత (గణితం), భాస్కర్, యామిని(రసాయన శాస్త్రం), లీలాకుమారి(బయోటెక్నాలజీ), సాయి వైష్ణవి(బాటనీ), శ్వేత, హేమలత(కంప్యూటర్ సైన్స్), చరణ్‌కుమార్ రెడ్డి(జాగ్రఫీ), వైష్ణవి, భారతి(హోంసైన్స్), నాగేంద్ర, సరిత, రాము, గురవమ్మ, (ఫిజిక్స్), రెడ్డమ్మ(సైకాలజీ), స్వప్న (స్టాటిస్టిక్స్), భార్గవి(జువాలజీ), మోహన్ కృష్ణ( ఎకనామిక్స్), అశోక పుత్ర(ఇంగ్లిషు), సుధాకర్(హిందీ), శివకేశవర్ధన్(ఫిలాసపీ), చిన్ని(పబ్లిక్ అడ్మినిస్ట్రేçషన్), సురేఖ(పొలిటికల్ సైన్స్), వీరమణి(సంస్కృతం),సురేష్(సోషియాలజీ), వెంకటేశు, సురేఖ(తెలుగు), వడివేలు(తమిళం), గుణశేఖర్, మైర్టేల్(కామర్స్), సౌజన్య(లా), రామరెడ్డి(బీఎల్ఐసీ), జెస్సీ ప్రశాంతి (సోషియాలజీ) ఉన్నారు. స్నాతకోత్సవంలో పాలకమండలి సభ్యులు గురుప్రసాద్, సిద్ధముని, హరి, ఫ్యాకల్టీ డీన్లు సవరయ్య, త్యాగరాజు, మల్లికార్జున, కుమారస్వామి, బాలాజీ ప్రసాద్ పాల్గొన్నారు. -
గౌరవ డాక్టరేట్ అందుకున్న ఇస్రో చైర్మన్
యూనివర్సిటీ క్యాంపస్ (తిరుపతి): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చైర్మన్ కె.శివన్ తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. శనివారం శ్రీనివాస ఆడిటోరియం లో నిర్వహించిన 55వ స్నాతకోత్సవంలో వీసీ ప్రొఫెసర్ ఎ.దామోదరం చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ స్నాతకోత్సవానికి రావాల్సిన వర్సిటీ చాన్స్‌లర్, గవర్నర్ నరసింహన్ హాజరుకా లేదు. 1,128 మందికి వివిధ రకాల డిగ్రీలను, 65 మంది బంగారు పతకాలను ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా వచ్చిన శివన్ స్నాతకోపన్యాసం చేస్తూ మానవాళి ప్రయోజనాల కోసం ఇస్రో అనేక ప్రయోగాలు చేస్తోందన్నారు. ప్రస్తుతం శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపటానికి లాంచ్ వెహికల్స్‌ను విజయవంతంగా ప్రయోగిస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ బరువైన లాంచ్ వెహికల్స్‌ను అంతరిక్షంలోకి పంపటానికి సిద్ధం చేస్తున్నామన్నారు. కమ్యూనికేషన్ శాటిలైట్ల వల్ల టెలికమ్యూనికేషన్, టెలి ఎడ్యుకేషన్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎంల నిర్వహణతో పాటు ప్రకృతి విపత్తులను గుర్తించే సాంకేతిక వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందన్నారు. ‘గగన్’ను దేశంలోని 50 ఎయిర్‌పోర్ట్‌లలోకి అందుబాటులోకి తెచ్చామన్నారు. దీనివల్ల విమానాలను సురక్షితంగా ల్యాండ్ చేయవచ్చన్నారు. దీన్ని రైల్వేలోకి కూడా అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. దీంతో మానవ రహిత రైల్వే క్రాసింగ్‌ల వద్ద ప్రమాదాలను నివారించవచ్చన్నారు. -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని బుధవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. హీరో నందమూరి కల్యాణ్ రామ్, తమిళనాడు గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్, ఇస్రో చైర్మన్ శివన్ స్వామి ఈరోజు ఉదయం స్వామిని దర్శించుకున్నారు. రేపు ఉదయం 4:04 గంటలకు పీఎస్ఎల్వీసీ-41 రాకెట్‌ను నింగిలోకి పంపనున్నారు. ఈ నేపథ్యంలో రాకెట్ నమూనాను శ్రీవారి పాదాల చెంతన ఉంచి ఆశీస్సులు తీసుకున్నట్టు శివన్ స్వామి తెలిపారు. అదే విధంగా కల్యాణ్ రామ్ కుటుంబంతో స్వామివారిని దర్శించుకుని మెక్కులు చెల్లించుకున్నారు. ప్రముఖులకు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. వీరికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలను ఆలయ అధికారులు అందించారు. కల్యాణ్‌రామ్ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే చిత్రం విజయం సాధించి, మంచి వసూళ్ళు రాబడుతున్న సందర్భంగా స్వామిని దర్శించుకున్నట్టు తెలిపారు. -
ఇస్రో చైర్మన్ ప్రత్యేక పూజలు
సాక్షి, నెల్లూరు : జీఎస్ఎల్వీ -ఎఫ్8 రాకెట్ ప్రయోగం విజవంతం కావాలని కోరుతూ ఇస్రో చైర్మన్ డా.శివన్ బుధవారం చెంగాల పరమేశ్వరీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ప్రయోగం కోసం 27 గంటల పాటు కౌంట్‌డౌన్ చేపట్టిన విషయం తెలిసిందే. గురువారం సాయంత్రం శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 4 గంటల 56 నిమిషాలకు జీఎల్‌ఎస్‌వీ-ఎఫ్8 రాకెట్ నింగిలోకి ఎగరనుంది. ఈ ప్రయోగ సన్నాహాల్లో భాగంగా శాస్రవేత్తలతో డా. శివన్ సమావేశమయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..ఈ ఏడాది చివర్లో చంద్రయాన్-2 ప్రయోగం చేయాబోతున్నట్లు ప్రకటించారు. వచ్చే నెలలో పీఎస్ఎల్వీ రాకెట్‌ను ప్రయోగంచనున్నట్లు తెలిపారు. కాగా ఇస్రో చైర్మన్‌గా జనవరిలో బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ కె. శివన్‌కు ఇది తొలి ప్రయోగం. -
ఇస్రో చైర్మన్‌గా శివన్
శ్రీహరికోట (సూళ్లూరుపేట): భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) చైర్మన్‌గా ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ కె.శివన్ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ నియామకాల కమిటీ శివన్‌ను ఇస్రోతో పాటు అంతరిక్ష కమిషన్ చైర్మన్‌గా, అంతరిక్ష విభాగం కార్యదర్శిగా నియమిస్తూ బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా ఉన్న ఏఎస్ కిరణ్‌కుమార్ పదవీకాలం జనవరి 18తో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19న శివన్ ఇస్రో ప్రధాన కార్యాలయంలో బాధ్య తలు స్వీకరించనున్నారు. మూడేళ్లపాటు శివన్ ఈ పదవుల్లో కొనసాగనున్నారు. ప్రస్తుతం ఆయన తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్‌సెంటర్ డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 12న ఇస్రో తన 100వ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న నేపథ్యంలో శివన్ నియామక ప్రకటన వెలువడటం గమనార్హం. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1980లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పట్టా పొందిన శివన్..బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ)లో మాస్టర్స్ చేశారు. ఇస్రో 1982లో చేపట్టిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) ప్రాజెక్టుతో శివన్ కెరీర్ ప్రారంభమైంది. భారత జాతీయ ఇంజనీరింగ్ అకాడమీతో పాటు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా, సిస్టమ్స్ సొసైటీ ఆఫ్ ఇండియాలో శివన్ సభ్యుడిగా ఉన్నారు. -
నేడే నింగిలోకి పీఎస్ఎల్వీ సీ-33
శ్రీహరికోట (సూళ్లూరుపేట): శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్)లోని రెండో ప్రయోగవేదిక నుంచి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ-33 ఉపగ్రహ వాహకనౌకను ప్రయోగించేందుకు మంగళవారం ఉదయం 9.20 గంటలకు నిర్వహించిన కౌంట్‌డౌన్ కొనసాగుతోంది. 51.30 గంటల కౌంట్‌డౌన్‌లో భాగంగా మంగళవారం నాలుగోదశలో ద్రవ ఇంధనాన్ని, బుధవారం రెండోదశలో ద్రవ ఇంధనాన్ని నింపే ప్రక్రియను పూర్తి చేశారు. గురువారం ఉదయాన్నే రాకెట్‌కు హీలియం, నైట్రోజన్ గ్యాస్‌లు నింపడంతోపాటు రాకెట్‌లోని అన్ని ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వ్యవస్థలను అప్రమత్తం చేస్తారు. అనంతరం తుది విడత తనిఖీలు నిర్వహించి గురువారం మధ్యాహ్నం 12.50 గంటలకు పీఎస్ఎల్వీ సీ-33 రాకెట్ ద్వారా ఐఆర్ఎన్ఎస్ఎస్ సిరీస్‌లో ఆఖరిది, ఏడవదైన (1,425 కిలోలు) ఐఆర్ఎన్ఎస్ఎస్-1జీ ఉపగ్రహాన్ని 20:19 నిమిషాలకు పెరిజీ (భూమికి దగ్గరగా) 286 కిలోమీటర్ల ఎత్తులో, అపోజి (భూమికి దూరంగా) 20,657 కిలోమీటర్లు ఎత్తులోని భూ బదిలీ కక్ష్యలోకి 17.82 డిగ్రీల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ఈ పనులను పర్యవేక్షించేందుకు ఇస్రో చైర్మన్ ఏఎస్ కిరణ్‌కుమార్ బుధవారం సాయంత్రం షార్కు చేరుకున్నారు. -
మేకిన్ ఇండియాకు ఏరోనాటిక్స్ సొసైటీ ఊతం
రక్షణమంత్రి శాస్త్రీయ సలహాదారు జి.సతీశ్‌రెడ్డి సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మేకిన్ ఇండియా’కు తమ వంతు సహకారం అందించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా హైదరాబాద్ విభాగం డెరైక్టర్, రక్షణ మంత్రి శాస్త్రీయ సలహాదారు డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా లుమినరీ లెక్చర్ సిరీస్ కార్యక్రమంలో భాగంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశ వైమానిక రంగంలో అందుబాటులో లేని పరికరాలు, తయారీ సౌకర్యాలను ఇప్పటికే గుర్తించామన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏరోనాటికల్ సొసైటీల సహకారంతో ఈ లోటును భర్తీ చేసి తయారీ రంగానికి ఊతమిచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. దీనిపై ఇప్పటికే అన్ని సొసైటీలకు లేఖలు రాశామన్నారు. వారి స్పందనల ఆధారంగా తదుపరి కార్యాచరణ నిర్ణయిస్తామని వివరించారు. సెన్సర్లు మొదలుకొని అనేక ఇతర వైమానిక రంగ పరికరాల తయారీకి భారత్ కేంద్రం కావచ్చని ఆశిస్తున్నట్లు తెలిపారు. వైమానిక రంగంలో కీలక పాత్ర పోషించే ఏరోనాటిక్స్ అభివృద్ధికి, విస్తృతికి హైదరాబాద్ సొసైటీ కృషి చేస్తోందన్నారు. వచ్చే నెలలో ఐఆర్ఎన్ఎస్ఎస్ తుది ఉపగ్రహం: ఇస్రో చైర్మన్ దేశీ జీపీఎస్ వ్యవస్థ సాకారమయ్యేందుకు మిగిలిన ఒకేఒక్క ఉపగ్రహాన్ని వచ్చేనెల చివరి వారంలో ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ ఎ.ఎస్.కిరణ్‌కుమార్ తెలిపారు. మొత్తం ఏడు ఉపగ్రహాలతో ఏర్పడనున్న ఈ కొత్త వ్యవస్థ ఇతర వ్యవస్థల కంటే మెరుగైన లొకేషన్ ఆధారిత సేవలు అందిస్తుందన్నారు. ఇస్రో ఇప్పటికే అభివృద్ధి చేసిన గగన్, భువన్ (గూగుల్ ఎర్త్ వంటి మ్యాప్) వ్యవస్థలతో కలిపి చూసినప్పుడు దేశీ జీపీఎస్ భారత్‌తో పాటు ఇరుగుపొరుగు దేశాలకు ఎంతో ఉపయుక్త సేవలు అందిస్తుందని వివరించారు. నేషనల్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ డెరైక్టర్ శ్యామ్ చెట్టి తదితరులు పాల్గొన్నారు. -
'సమాజాభివృద్ధికి అంతరిక్ష పరిశోధనలు'
హైదరాబాద్: మానవసహిత అంతరిక్ష ప్రయోగం ఎప్పుడు జరగాలన్నది నిర్ణయించాల్సింది తాము కాదని, దేశ ప్రజలు, ప్రభుత్వమేనని భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం (ఇస్రో) ఛైర్మన్ డాక్టర్ ఏఎస్ కిరణ్‌కుమార్ స్పష్టం చేశారు. ప్రస్తుతానికి అంతరిక్ష ప్రయోగాలను మానవ సమాజాభివృద్ధికి మరింత మెరుగ్గా ఉపయోగించుకోవాలన్నదే ఇస్రో లక్ష్యమని ఆయన అన్నారు. రామకృష్ణమఠం ఆధ్వర్యంలోని వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 15వ వార్షికోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిరణ్‌కుమార్ కొందరు ఇంజినీరింగ్ విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. మానవసహిత అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన కీలక సాంకేతిక పరిజ్ఞానాలను అభివద్ది చేసుకుంటున్నా.. అసలు ప్రయోగం ఎప్పుడన్నది మాత్రం ప్రభుత్వం నిర్ణయించాలన్నారు. అందుబాటులోని వనరులను సమర్థంగా, సృజనాత్మకంగా వాడుకోవడం ద్వారా, సమష్టి కృషితో మంగళ్యాన్ ప్రయోగం విజయవంతమైందని అన్నారు. శాస్త్రవేత్తలైనా, ఆధ్యాత్మికవేత్తలైనా ఇద్దరి లక్ష్యం సత్యాన్ని శోధించడమేనని తెలిపారు శాస్త్రవేత్తలు భౌతిక ప్రపంచంలోని వస్తువులపై ప్రయోగాలు చేస్తూ అంతిమ సత్యాన్ని అన్వేషిస్తే... ఆధ్యాత్మిక వేత్తలు ఇదే పనిని మెదడు, చేతనావస్థల సాయంతో చేపడతారని వివరించారు. దాదాపు వందేళ్ల క్రితమే వివేకానందుడి ఆలోచనల ఫలితంగా బెంగళూరులో దేశం గర్వించదగ్గ సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సైస్ ఏర్పడిందని అక్కడ విద్యనభ్యసించిన విక్రమ్ సారాభాయ్, సతీశ్‌ధవన్ వంటి మహామహులు ఇస్రోకు ప్రాణం పోశారని అన్నారు. ఈ క్రమంలో సుస్థిర అభివృద్ధికి ప్రాధాన్యమివ్వడం ద్వారా ప్రకతి సమతౌల్యాన్ని కాపాడాల్సిన అవసరమెంతైనా ఉందన్నారు. కార్యక్రమంలో రామకృష్ణమఠం హైదరాబాద్ విభాగం అధ్యక్షులు జ్ఞానానంద మహారాజ్, నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ డెరైక్టర్ వి.కె.గాడ్గిల్ తదితరులు పాల్గొన్నారు. -
'మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలు'
నెల్లూరు: వచ్చే ఏడాది మార్చిలోగా నావిగేషన్ ఉపగ్రహాలను ప్రయోగిస్తామని ఇస్రో చైర్మన్ కిరణ్ కుమార్ శనివారం తెలిపారు. మానవహిత ప్రయోగాల కోసం కేంద్రం నుంచి అనుమతి వస్తే ఆ దిశగా అడుగులు వేస్తామని ఆయన అన్నారు. సమాచార రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహాలను మరిన్ని పంపుతామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. షార్ లో త్వరలో మూడో లాంచ్ నిర్మాణం చేపడుతున్నట్టు కిరణ్ కుమార్ తెలిపారు. -
పీఎస్ఎల్వీ-సీ27 ప్రయోగం విజయవంతం:ఇస్రో చైర్మన్
-
ముక్కంటి సేవలో ఇస్రో చైర్మన్
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి దేవస్థానానికి మంగళవారం రాత్రి ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ విచ్చేశారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామి,అమ్మవార్లను ప్రత్యేకంగా దర్శనం చేసుకున్నారు. గురుదక్షిణామూర్తి వద్ద వేదపండితుల ఆశీర్వచనం పొందారు. అధికారులు దుశ్శాలువాతో సత్కరించి, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు. తిరుమలలో.. తిరుమల : శ్రీవారి దర్శనార్థం మంగళవారం తిరుమలకు వచ్చిన ఇస్రో చైర్మన్ డాక్టర్ రాధాకృష్ణన్‌కు సాదర స్వాగతం లభించింది. సాయంత్రం 5 గంటలకు ఆయన కుటుంబ సమేతంగా తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు టీటీడీ జేఈవో శ్రీనివాసరాజు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. కాగా ఇటీవల మార్స్ మిషన్ (మామ్) ప్రయోగం విజయవంతం కావడంతో జేఈవో శ్రీనివాసరాజు ఆయనకు అభినందనలు తెలిపారు. అలాగే శ్రీవారి ఆలయం ముందు, వెలుపల చేసిన మార్పులు చేర్పులపై ఇస్రో చైర్మన్‌కు జేఈవో శ్రీనివాసరాజు వివరించి చెప్పారు. స్వామి దర్శనం తరువాత తిరుగు ప్రయాణమైన రాధాకృష్ణన్‌కు వీడ్కోలు పలికారు. -
వెంకన్న సేవలో ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్
తిరుపతి : 'మార్స్ ఆర్బిటర్ మిషన్’ ప్రయోగంలో తొలి దశ విజయవంతం కావటంతో ఇస్రో చైర్మన్ డాక్టర్ కె.రాధాకృష్ణన్ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో రాధాకృష్ణన్ దంపతులు పాల్గొని స్వామివారి దర్శనం చేసుకున్నారు. అనంతరం వేద పండితులు...వారికి రంగనాయకుల మండపంలో ఆశీర్వచనం పలికి తీర్థ ప్రసాదాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు. మార్స్ ఆర్బిటర్ మిషన్ ప్రయోగం సందర్భంగా రాధాకృష్ణన్ నిన్న కూడా వెంకన్న దర్శనం చేసుకున్న విషయం తెలిసిందే.