
డిసెంబరులో చేపడతాం: సోమనాథ్
న్యూఢిల్లీ: నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎలక్ట్రికల్ థ్రస్టర్లను వాడనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్ ప్రొపెల్లర్లను డిసెంబరులో చేపట్టనున్న టీడీఎస్–01 ఉపగ్రహ ప్రయోగంలో వాడతామని వెల్లడించారు. నాలుగు టన్నుల బరువున్న సంప్రదాయ రాకెట్‌లో 2 నుంచి 2.5 టన్నుల ఇంధనం ఉంటుందని, అదే ఎలక్ట్రికల్ ప్రొపల్షన్‌ను వాడితే 200 కేజీల ఇంధనం సరిపోతుందని తెలిపారు.
ఇంధన ట్యాంకు పరిమాణం తగ్గిపోతే.. దానికి అనుగుణంగా అన్నీ తగ్గుతాయని, ఉపగ్రహం రెండు టన్నుల్లోపే ఉంటుందని చెప్పారు. అయితే నాలుగు టన్నుల రాకెట్‌కు సరిపడా శక్తి ఉంటుందని వివరించారు. సాధారణంగా కెమికల్ థ్రస్టర్ల ద్వారా రాకెట్ మండించి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. వారం రోజుల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంటుందని, అయితే ఎలక్ట్రికల్ ప్రొపెల్షన్‌ను వాడితే మూడునెలల సమయం పడుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment