S Somanath
-
అంతరిక్ష రంగం అభివృద్ధికి ఇవే కీలకం: ఇస్రో చైర్మన్
అంతర్జాతీయ మార్కెట్లో ఎక్కువ వాటాను కైవసం చేసుకునేందుకు.. భారత్ తన అంతరిక్ష కార్యకలాపాలను పెంచుకోవాలని చూస్తోంది. అయితే దీనికి ప్రైవేట్ రంగాలు.. స్టార్టప్‌లు కీలక పాత్ర పోషించాలని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చైర్మన్ ఎస్ సోమనాథ్ అన్నారు. కేరళ స్టార్టప్ మిషన్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా భారత్ అవతరించినప్పటికీ.. గ్లోబల్ మార్కెట్లో ఇండియా వాటా కేవలం 2 శాతం (386 బిలియన్ డాలర్లు) వద్దనే ఉంది. దీనిని 2030నాటికి 500 బిలియన్ డాలర్లకు.. 2047 నాటికి 1.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడమే లక్ష్యమని సోమనాథ్ అన్నారు.భారతదేశంలో ప్రస్తుతం నిర్వహణలో ఉన్న స్పేస్ శాటిలైట్స్ కేవలం 15 మాత్రమే. ఈ సంఖ్య చాలా తక్కువ. దీనిని పెంచడానికి కృషి చేయాలి. అంతరిక్ష సాంకేతికతలో దేశం నైపుణ్యం.. పెరుగుతున్న ఉపగ్రహాల తయారీ కంపెనీల దృష్ట్యా.. భారతదేశం కనీసం 500 ఉపగ్రహాలను అంతరిక్షంలో మోహరించే సామర్థ్యాన్ని కలిగి ఉందని సోమనాథ్ ఉద్ఘాటించారు.ప్రస్తుతం భారతదేశంలో చాలా ప్రైవేట్ సంస్థలు.. కక్ష్యలో శాటిలైట్లను తయారు చేసి ఉంచే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. రాబోయే రోజుల్లో ప్రైవేట్ లాంచ్ప్యాడ్లు కూడా వస్తాయి. 2014లో అంతరిక్ష సంబంధిత స్టార్టప్ కేవలం ఒక్కటి మాత్రమే ఉండేది. 2024కు ఈ సంఖ్య 250కి చేరింది. 2023లోనే స్పేస్ స్టార్టప్‌లు రూ.1,000 కోట్ల విలువైన పెట్టుబడులను ఆకర్షించాయి. 450కి పైగా MSMEలు.. 50కి పైగా పెద్ద కంపెనీలు ఇప్పుడు అంతరిక్ష రంగానికి చురుకుగా సహకరిస్తున్నాయని ఇస్రో చైర్మన్ వెల్లడించారు.మన దేశంలో మానవ అంతరిక్ష యాత్ర కార్యక్రమం గగన్‌యాన్, ఇండియన్ స్పేస్ స్టేటన్ వంటి భవిష్యత్ ప్రాజెక్టులు కూడా ఇస్రో.. ప్రైవేట్ రంగాల మధ్య సహకార ప్రయత్నాలే. అంతరిక్ష యాత్రల కోసం చేసిన పరిశోధనల నుంచి ప్రయోజనం పొందే వందలాది విభిన్న రంగాలను ఇస్రో గుర్తించింది. సాంకేతికత బదిలీ కోసం ఎంపిక చేసిన పరిశ్రమలతో ఇప్పటికే చర్చలు ప్రారంభమయ్యాయి.ఇదీ చదవండి: బ్లాక్ ఫ్రైడే అంటే ఏమిటి?.. ఎప్పుడు, ఎలా మొదలైందంటే..వివిధ ప్రాజెక్టుల అభివృద్ధిలో భాగంగా ఇస్రో సుమారు 61 దేశాలకు సహకరిస్తోంది. భారత్ ఇప్పటి వరకు 431 విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించిందని సోమనాథ్ తెలిపారు. ప్రస్తుత ఉమ్మడి మిషన్లలో NASAతో NISAR, CNES (ఫ్రాన్స్)తో TRISHNA, G20 శాటిలైట్, JAXA (జపాన్)తో లూనార్ పోలార్ ఎక్స్‌ప్లోరేషన్ మిషన్ వంటివి ఉన్నాయని స్పష్టం చేశారు. -
ఎలక్ట్రికల్ థ్రస్టర్లతో ఉపగ్రహ ప్రయోగం
న్యూఢిల్లీ: నిర్దేశిత కక్ష్యలోకి ఉపగ్రహాలను ప్రవేశపెట్టడానికి ఎలక్ట్రికల్ థ్రస్టర్లను వాడనున్నట్లు ఇస్రో ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. భారత్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రికల్ ప్రొపెల్లర్లను డిసెంబరులో చేపట్టనున్న టీడీఎస్–01 ఉపగ్రహ ప్రయోగంలో వాడతామని వెల్లడించారు. నాలుగు టన్నుల బరువున్న సంప్రదాయ రాకెట్లో 2 నుంచి 2.5 టన్నుల ఇంధనం ఉంటుందని, అదే ఎలక్ట్రికల్ ప్రొపల్షన్‌ను వాడితే 200 కేజీల ఇంధనం సరిపోతుందని తెలిపారు. ఇంధన ట్యాంకు పరిమాణం తగ్గిపోతే.. దానికి అనుగుణంగా అన్నీ తగ్గుతాయని, ఉపగ్రహం రెండు టన్నుల్లోపే ఉంటుందని చెప్పారు. అయితే నాలుగు టన్నుల రాకెట్‌కు సరిపడా శక్తి ఉంటుందని వివరించారు. సాధారణంగా కెమికల్ థ్రస్టర్ల ద్వారా రాకెట్ మండించి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తే.. వారం రోజుల్లో నిర్దేశిత కక్ష్యలోకి చేరుకుంటుందని, అయితే ఎలక్ట్రికల్ ప్రొపెల్షన్‌ను వాడితే మూడునెలల సమయం పడుతుందని తెలిపారు. -
తుది‘దశ’లో ఆదిత్య ఎల్1
తిరువనంతపురం: సూర్యుడి సంబంధ అంశాలపై మరింత లోతైన అధ్యయనం కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య ఎల్–1 వ్యోమనౌక త్వరలోనే దాని ఎల్–1 పాయింట్లోకి చేరుకోనుందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ వెల్లడించారు. తొలి సౌండింగ్ రాకెట్‌ను ప్రయోగించి 60 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్(వీఎస్ఎస్సీ)లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా సోమనాథ్ మాట్లాడారు. ‘ ఆదిత్య తన దిశలో దూసుకుపోతోంది. ఇది దాదాపు తన తుదిదశకు చేరుకుంది. ఎల్–1 పాయింట్లోకి దానిని చేర్చేందుకు సన్నాహక కార్యక్రమాలు చేపడుతున్నాం. వచ్చే ఏడాది జనవరి ఏడో తేదీకల్లా ఎల్–1లోకి ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు సిద్ధంచేశాం’’ అని చెప్పారు. -
ఆత్మకథపై ఇస్రో చైర్మన్ సంచలన నిర్ణయం.. ఆ వివాదమే కారణమా?
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ISRO) చైర్మన్ 'ఎస్ సోమనాథ్' (S.Somanath) ‘నిలవు కుడిచ సింహగల్' (వెన్నెల తాగిన సింహాలు) పేరుతో మలయాళంలో తన ఆత్మకథను రాసారు. తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో సమస్యలను యువతరానికి అందించి వారిలో స్ఫూర్తి నింపడానికి ఈ పుస్తకం రాసారు. ప్రచురణకు సిద్దమైన ఈ పుస్తకం ఇప్పుడు నిలిచిపోయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. సోమనాథ్ ఆత్మకథలో ఇస్రో మాజీ చీఫ్ కె.శివన్‌పై కొన్ని విమర్శలు చేశారంటూ ప్రచారం జరుగుతోంది. తాను ఇస్రో చైర్మన్ పదవిని చేపట్టకుండా అడ్డుకునేందుకు శివన్ ప్రయత్నించారని సోమనాథ్ తన పుస్తకంలో ఆరోపించినట్టు తెరపైకి రావడంతో సోమనాథ్ స్పందించారు. పుస్తకంలో పేర్కొన్న అంశాలను తప్పుగా అర్థం చేసుకున్నారని, శివన్ తన ఎదుగుదలను అడ్డుకున్నట్లు ఎక్కడా ప్రస్తావించలేదని వెల్లడించారు. స్పేస్ కమిషన్ సభ్యుడిగా ఎంపికైతే ఇస్రో చైర్మన్ పదవి వస్తుందని అందరూ అనుకుంటారు. కానీ ఆ సమయంలో మరో డైరెక్టర్‌ను నియమిస్తే అలాంటి అవకాశాలు తగ్గుతాయని మాత్రమే పుస్తకంలో పేర్కొన్నట్లు సమాచారం. ఇదీ చదవండి: ఏడుసార్లు రిజెక్ట్.. విరక్తితో ఆత్మహత్యాయత్నం.. ఇప్పుడు లక్ష కోట్ల కంపెనీకి బాస్ పుస్తకం ఇంకా అధికారికంగా విడుదల కాలేదు. నా పబ్లిషర్ కొన్ని కాపీలను విడుదల చేసి ఉండవచ్చు.. కానీ ఈ వివాదం తర్వాత, ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. తాను రాసిన పుస్తకం విమర్శనాస్త్రం కాదని, జీవితంలో సమస్యలను అధిగమించి తమ కలలను సాధించాలనుకునే వ్యక్తులకు స్ఫూర్తిదాయకమైన కథ అని ఇస్రో చైర్మన్ వెల్లడించారు. -
ఇండిగో విమానంలో ‘నేషనల్ హీరో’: ఎయిర్ హోస్టెస్ చేసిన పనికి...
ISRO Chief S Somanath: చంద్రయాన్ -3 సక్స్‌స్‌తో ప్రపంచవ్యాప్తంగా ఇస్రో ఇంజనీర్లను ప్రశంసలను దక్కించుకుంటున్నారు. చందమామ దక్షిణ ధృవంపై కాలిడిన తొలి దేశంగా భారత్న తన ప్రత్యేకతను చాటుకుంది. ఆగష్టు 23, చంద్రయాన్-3 ల్యాండర్ విక్రమ్ చంద్రుడి పరితలంపై ల్యాండ్ అయ్యి కొత్త చరితను లిఖించింది. చంద్రయాన్ -3 లైవ్ స్ట్రీమింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ వ్యూయడ్ రికార్డు దక్కించుకుందనే ఈ ప్రాజెక్ట్‌పై గ్లోబల్‌గా ఉన్న ఆసక్తిని అర్థం చేసుకోవచ్చు. ఈ క్రమంలోనే దేశీయ విమానంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది. వివరాలను పరిశీలిస్తే ఇస్రో చైర్మన్ సోమనాథ్ ఇండిగో విమానంలో పయనించారు. ఆయన విమానం ఎక్కగానే ఇండిగో సిబ్బంది,ప్రయాణీకుల నుండి అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా సోమనాథ్‌ను గుర్తుపట్టిన ఎయిర్ హోస్టెస్ నేషనల్ హీరోకి వెల్కం.. అందరూ ఆయనను ఆహ్వానించండి అంటూ గర్వంగా ప్రకటించింది. దీంతో ప్రయాణికులందరూ ఉత్సాహంతో చప్పట్లు కొట్టారు. ఇంతలో మరో ఫ్లైట్ ఎటెండెంట్ గూడీస్‌తో ఆయనను సత్కరించింది. ఈ విషయాన్ని పూజా షా తన సోషల్ మీడియాలో పోస్ట్‌చేశారు. ఇస్రో బృందాన్ని స్వాగతించే అవకాశం లభించినందుకు గర్విస్తున్నామంటూ ఆమె ఇన్‌స్టాలో పేర్కొన్నారు. దీంతో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈసందర్భంగా ఇస్రో టీంకు అభినందనలు తెలిపారు నెటిజన్లు. అలాగే అంతటి గొప్ప వ్యక్తి ఎంత నిరాడంబరంగా ఉన్నారుఅంటూ కొందరు కమెంట్ చేశారు. View this post on Instagram A post shared by Pooja Shah (@freebird_pooja) -
Chandrayaan-3: 'శివ్ శక్తి' అని పేరు పెడితే తప్పేంటి?: ఇస్రో చైర్మన్
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 విజయవంతమైన వేళ ఇస్రో చైర్మన్ ఎస్.సోమ్‌నాథ్ కేరళలోని పౌర్ణమికవు-భద్రకాళి ఆలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం విలేఖరులు చంద్రయాన్-3 చంద్రుడిపై అడుగుపెట్టిన స్థలాన్ని 'శివ్ శక్తి'గా నామకరణం చేయడంపై ప్రశ్నించగా అందులో తప్పేంటన్నారు. దక్షిణాఫ్రికా, గ్రీస్ పర్యటన ముగించుకుని భారతదేశం చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ నేరుగా బెంగుళూరు వెళ్లి చంద్రయాన్-3 విజయంపై ఇస్రో శాస్త్రవేతలకు అభినందనలు తెలిపి విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టిన స్థలానికి 'శివ్ శక్తి' అని నామకారణం చేశారు. కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఈ పేరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని ఇస్రో చైర్మన్‌ను ప్రశ్నించగా నాకైతే అందులో తప్పేమీ లేదనిపిస్తోందన్నారు. అలాగే చంద్రయాన్-2 అడుగుపెట్టిన స్థలానికి 'తిరంగా పాయింట్' అని పేరు పెట్టారు. 'శివ్ శక్తి' 'తిరంగా' రెండూ భారతీయత ఉట్టిపడే పేర్లు. మనం చేస్తున్న పనికి ప్రాముఖ్యత ఇవ్వాలి. దేశ ప్రధానిగా పేరు పెట్టేందుకు ఆయనకు ప్రత్యేక అధికారముందన్నారు. ఇక అమ్మవారిని దర్శించుకోవడంపై స్పందిస్తూ నేను ఒక అన్వేషకుడిని.. నా జీవిత గమనంలో సైన్స్, ఆధ్యాత్మికత రెండూ భాగమే. అందుకే నేను అనేక దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాను వేద గ్రంధాలను చదువుతూ ఉంటాను. విశ్వంలో ఉనికిని గుర్తించడానికి శూన్యంలో విహరిస్తూ ఉంటాను. సైన్స్ బాహ్య సంతృప్తినిస్తే ఆధ్యాత్మికత ఆత్మీయ సంతృప్తినిస్తుందని అన్నారు. #WATCH | On his visit to Pournamikavu, Bhadrakali Temple in Thiruvananthapuram, ISRO Chairman S Somanath says, "I am an explorer. I explore the Moon. I explore the inner space. So it's a part of the journey of my life to explore both science and spirituality. So I visit many… pic.twitter.com/QkZZAdDyX3 — ANI (@ANI) August 27, 2023 ఇది కూడా చదవండి: కూలీలకు దొరికిన 240 బంగారు నాణేలు.. కానీ అంతలోనే.. -
చంద్రయాన్–3 ప్రయాణం సాగిందిలా ..
గత ఏడాది ఏప్రిల్‌లో చంద్రయాన్–3 ఫస్ట్‌లుక్‌ను ఇస్రో విడుదల చేసింది. తొలుత 2020లో చంద్రయాన్‌ను ప్రయోగించాలని భావించారు కానీ కోవిడ్–19తో ఆలస్యమైంది. ఈ మిషన్ కోసం ఇస్రో రూ.615 కోట్లు ఖర్చు చేసింది. చంద్రయాన్–2 కంటే తక్కువ ఖర్చుతో ఈ మిషన్ పూర్తయింది. చంద్రయాన్–2కి రూ.978 కోట్లు ఖర్చు చేశారు. చంద్రయాన్–3 మూడు భాగాలుగా ఉంది. 1. ల్యాండర్ మాడ్యూల్ (ఎల్ఎం) 2. ప్రొపల్షన్ మాడ్యూల్ (పీఎం) 3. రోవర్ ► చంద్రయాన్ ల్యాండర్ నిర్దేశించిన చంద్రుడి ఉపరితలంపై సాప్ట్‌గా ల్యాండ్ అయ్యే సామర్థ్యం కలిగి ఉంది.చంద్రుడిపై ఈ ల్యాండర్ (విక్రమ్) దిగిన తర్వాత రోవర్ (ప్రజ్ఞాన్) బయటకి వస్తుంది. ఈ రెండూ కలిసి చంద్రుడి ఉపరితలంపై పరిశోధనల్ని చేస్తాయి. ల్యాండర్, రోవర్లు పరిశోధనలకు అనుగుణమైన సైంటిఫిక్ పే లోడ్స్‌ను కలిగి ఉన్నాయి. ► ఇక ల్యాండర్ మాడ్యూల్‌ను చివరి 100 కి.మీ. దూరం వరకు మోసుకుపోవడమే ప్రొపల్షన్ మాడ్యూల్ ప్రధాన విధి. ► చంద్రయాన్–3 మిషన్ లాంచ్‌వెహికల్ మార్క్–3 (ఎల్వీఎం–3) రాకెట్‌ని ఆంధ్రప్రదేశ్‌లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి జులై 14 మధ్యాహ్నం 2.35 గంటలకు విజయవంతంగా ప్రయోగించారు. మొత్తం 41 రోజుల పాటు ఈ వ్యోమనౌక ప్రయాణించి సూపర్ సక్సెస్ కొట్టింది. ► ఆ మర్నాడు జులై 15న మొదటి ఆర్బిట్ రైజింగ్ (కక్ష్య దూరం పెంపుదల) మొదటి విడతలో భూమికి దగ్గరగా 173 కిలోమీటర్లు ఎత్తుకు, భూమికి దూరంగా 41,762 కిలోమీటర్లు ఎత్తుకు పెంచారు. ► అలా అయిదుసార్లు కక్ష్యం పెంచాక ఆగస్టు 1న అర్థరాత్రి చంద్రయాన్–3 మిషన్‌ను పెరిజీలోకి అంటే భూమికి దగ్గరగా వుచ్చిన సమయంలో లూనార్ ట్రాన్స్ ఇంజెక్షన్ అనే అపరేషన్‌తో భూమధ్యంతర కక్ష్య నుంచి చంద్రుడి కక్ష్య వైపుకు విజయవంతంగా మళ్లించారు. ► ఆగస్టు 5న భూ మధ్యంతర కక్ష్య నుంచి 3,69,328 లక్షల కిలోమీటర్లు దూరం ప్రయాణించి లూనార్ ఆర్బిట్ (చంద్రుని కక్ష్య)లో 164‘‘18074 ఎత్తుకు చేరుకుంది. ► అప్పట్నుంచి కక్ష్యను అయిదుసార్లు తగ్గించుకుంటూ వచ్చారు. ఆగస్టు 6, 9, 14, 16 తేదీలలో కక్ష్య తగ్గిస్తూ రావడంతో చంద్రయాన్–3 చంద్రుడికి మరింత చేరువైంది. ► ఆగస్టు 18న ల్యాండర్ మాడ్యూల్లో వున్న కొద్దిపాటి ఇంధనాన్ని మండించి చంద్రుడికి చేరువగా అంటే 113‘‘157 కిలోమీటర్లు దగ్గరగా వెళ్లింది. ► చంద్రయాన్–3లో మరో కీలకఘట్టం విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్లతో కూడిన లాండర్ మాడ్యూల్ (ఎల్ఎమ్) ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ఆగస్టు 17న విజయవంతంగా విడిపోయింది. దీంతో చంద్రయాన్–3 ల్యాండర్ మాడ్యూల్ చంద్రుడి చుట్టూ ఉన్న 100 కి.మీ. వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశించింది. ► ల్యాండర్ మాడ్యూల్ చిట్టచివరి డీ బూస్టింగ్ ప్రక్రియ ఆగస్టు 20న విజయవంతంగా పూర్తయింది. అప్పట్నుంచి ఆ ల్యాండర్ చంద్రుడి చుట్టూ 25 ్ఠ134కి.మీ. కక్ష్యలో పరిభ్రమించింది. ► ఈ ప్రయోగంలో ఇస్రో మొట్టమొదటి సారిగా థొరెటల్–అబల్ అనే లిక్విడ్ ఇంజిన్లను ఉపయోగించింది ► ఆగస్టు 23 సాయంత్రం 5. 44 గంటలకు ల్యాండర్ విక్రమ్ ఈ ప్రత్యేక ఇంజిన్ల సాయంతో దశల వారీగా వేగాన్ని తగ్గించుకుంటూ వచ్చింది. సరిగ్గా 6.04 గంటలకు జాబిల్లి దక్షిణ ధ్రువంపై విజయవంతంగా దిగిన విక్రమ్ ల్యాండర్ దిగడంతో భారత్ కీర్తి పతాక చంద్రుడిపై రెపరెపలాడింది. ► రోవర్ చంద్రుడి ఉపరితలంపైకి వచ్చాక సెకెండ్‌కు ఒక సెంటీమీటర్ వేగంతో కదులుతూ ఒక లూనార్ డే (చంద్రరోజు) పనిచేస్తుంది. ఒక లూనార్ డే అంటే భూమి మీద కొలిస్తే 14 రోజులు అవుతుంది. అంటే సెప్టెంబర్ 7 దాకా 500 మీటర్లు దూరం ప్రయాణిస్తుంది. -
చంద్రయాన్-3 ల్యాండింగ్ వాయిదా..?
అహ్మదాబాద్(గుజరాత్): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్-3 ఆగస్టు 23, సాయంత్రం 6.04 గంటలకు చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కానుంది. ఇదిలా ఉండగా అహ్మదాబాద్ ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్ ఒక వేళ చంద్రుడిపై పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ల్యాండర్ మాడ్యూల్ స్థితిగతులు సరిగ్గా లేకపోయినా ఆగస్టు 27కి వాయిదా వేస్తామని తెలిపారు. ఆగస్టు 23న భారత్ కాలమానం ప్రకారం సాయంత్రం 6.04 గంటలకు ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉంది. నిర్ణీత సమయానికి రెండు గంటల ముందు ల్యాండర్ స్థితిగతులను చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను పరిశీలిస్తామని ఒకవేళ పరిస్థితులు ఏ మాత్రం ప్రతికూలంగా ఉన్నా చంద్రయాన్-3 ల్యాండింగ్ ఆగస్టు 27 కు వాయిదా వేస్తామని తెలిపారు ఇస్రో స్పేస్ అప్లికేషన్ సెంటర్ డైరెక్టర్ నీలేష్ M దేశాయ్. ప్రస్తుతానికైతే చంద్రయాన్-3లో ఎటువంటి లోపాలు తలెత్తలేదని నిర్ణీత సమయానికే ల్యాండ్ అవుతుందని అన్నారు. సోమవారం ఇస్రో చైర్మన్, స్పేస్ డిపర్ట్మెంట్ సెక్రెటరీ ఎస్.సోమ్‌నాథ్ కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ రాష్ట్ర వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్‌కు చంద్రయాన్ స్థితిగతుల గురించి వివరించారు. ఈ రెండు రోజులు కూడా చంద్రయాన్-3 స్థితిగతులను ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నామని ల్యాండర్ నిర్ణీత సమయానికే చంద్రుడిపై కాలుమోపుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కూడా చంద్రయాన్-3 విజయవంతమవుతుందని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ దేశం చరిత్ర సృష్టిస్తుందన్నారు. చివరి దశలో క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఇస్రోతో సంబంధాలు తెగిపోయిన చంద్రయాన్-2తో చంద్రయాన్-3 కక్ష్యలో సంబంధాలు పునరుద్ధరించింది. అమెరికా, రష్యా, చైనా ఇదివరకే చంద్రుడిపై అడుగుపెట్టినా దక్షిణ ధృవంపై అడుగుపెట్టిన మొదటి దేశంగా భారత దేశం చరిత్ర సృష్టించనుంది. చంద్రయాన్-1 చంద్రుడి ఉపరితలంపై నీరు ఉండటాన్ని గుర్తించి సంచలనాన్ని సృష్టించగా ఆ ప్రయోగంలోని కొన్నిఅంశాలను ఆయా అగ్రదేశాలు తమ ప్రయోగాలకు ఇన్‌పుట్స్‌గా స్వీకరించాయని గుర్తుచేశారు. చంద్రయాన్-2 క్రాష్ ల్యాండింగ్ కారణంగా విఫలమవగా చంద్రయాన్-3 2020 జనవరిలో ప్రారంభమైందని 2021లోనే దీన్ని ప్రయోగించాల్సి ఉండగా కోవిడ్-19 కారణంగా ప్రయోగం వాయిదా పడుతూ వచ్చిందని తెలిపారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా ఇందులో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని ఒకవేళ అన్ని పరిస్థితులు పూర్తిగా ప్రతికూలంగా మారినా కూడా చంద్రయాన్-3 సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యేలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని అయన అన్నారు. ఇది కూడా చదవండి: మీరు ఏ చాయ్‌వాలా గురించి అనుకున్నారో? -
చంద్రయాన్-3పై ఇస్రో చైర్మన్ కీలక ప్రకటన.. మళ్లీ అదే జరిగితే..
బెంగుళూరు: చంద్రయాన్-2 ప్రయోగం దాదాపుగా విజయవంతంగా జరిగిందనుకుంటున్న తరుణంలో విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడంతో చివరి నిముషంలో ల్యాండర్ నుండి సంకేతాలు అందడం ఆగిపోయాయి. ఈ సారి చంద్రయాన్-3లో అలా కాకుండా విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకునే విధంగా రూపొందించామని అన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్ అన్నారు. చంద్రయాన్-2 వైఫల్యాన్ని ఇస్రో సవాలుగా స్వీకరించి చంద్రయాన్-3 ప్రాజెక్టుని అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన విషయం తెలిసిందే. అనుకున్నట్టుగానే చంద్రయాన్-3 జులై 14, 2023న విజయవంతంగా ప్రయోగించారు ఇస్రో శాస్త్రవేత్తలు. నిర్ణీత సమయం ప్రకారం ఇది ఆగస్టు 23న చంద్రుడిపై అడుగుపెట్టాల్సి ఉండగా ఒకరోజు అటు ఇటుగా చంద్రయాన్-3 చంద్రుడిపై ల్యాండ్ అవ్వనుంది. ఇదిలా ఉండగా ఈ ప్రయోగం జరిగిన నాటి నుండి చంద్రయాన్-2 లా ఇందులో కూడా చివరి నిముషంలో ఏవైనా సమస్యలు తలెత్తితే పరిస్థితి ఏమిటనే అనుమానాలు కలుగుతూనే ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమిచ్చారు ఇస్రో చీఫ్ ఎస్.సోమనాథ్. దిశా భారత్ అనే సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ చంద్రయాన్-3లో విక్రమ్ ల్యాండర్ తన వైఫల్యాలను తానే సరిచేసుకోగలదని, సెన్సార్లతో సహా అందులోని అన్నీ ఫెయిల్ అయినా కూడా విక్రమ్ ల్యాండర్ చంద్రుడి మీద సాఫ్ట్ ల్యాండింగ్ కావడం ఖాయమని అన్నారు. ప్రపల్షన్ వ్యవస్థను ఆ విధంగా సిద్ధం చేశామని తెలిపారు. ఆగస్టు 9,14,16 తేదీల్లో చంద్రయాన్-3 చంద్రుడిని సమీపిస్తుండగా ఒక్కో కక్ష్య మారుతూ వెళుతుందని అనంతరం ల్యాండర్ ప్రపల్షన్ ప్రక్రియ మొదలవుతుందని ఆ సమయంలోనే క్రాఫ్ట్ వేగం తగ్గించుకుని చివరిగా ఆగష్టు 23న క్షేమంగా ల్యాండ్ అవుతుందని అన్నారు. అందులోని రెండు ఇంజిన్లు పనిచేయకపోయినా కూడా సాఫ్ట్ ల్యాండింగ్ జరుగుతుందని, ఆర్బిటర్ నుండి ల్యాండర్ వేరు కాగానే అడ్డంగా తిరిగే ప్రక్రియను క్రమపద్ధతిలో నిలువుగా కిందకు దిగేలా ల్యాండర్ డిజైన్ చేశామని, గతంలో ఇక్కడే పొరపాటు జరిగిందని ఈసారి ఆ పొరపాటు పునరావృతం కాదని ఆయన అన్నారు. చంద్రయాన్-3 ల్యాండర్లో నాలుగు పేలోడ్లు ఉన్నాయి.. మొదటిది చంద్ర సర్ఫేస్ థర్మో ఫిజికల్ ఎక్స్పెరిమెంట్ (ChaSTE) చంద్రుడి ఉపరితలంపై ఉష్ణోగ్రతను కొలుస్తుంది. రాంబా-LP చంద్రుడి ఉపరితల ప్లాస్మా సాంద్రత, మార్పులను కొలుస్తుంది. భవిష్యత్తులో ల్యాండర్ల ల్యాండింగ్ స్థానాన్ని గుర్తించి నాసాకు నిర్దేశించడానికి రెట్రోరిఫ్లక్ట్రర్, చంద్రుడి కంపించే కోలాటాన్కు లెక్కించడానికి ఒక పరికరం ఉంటాయి. ఇది కాకుండా ప్రగ్యాన్ రోవర్ లో మరో మూడు పేలోడ్లు ఉంటాయని ఇస్రో చైర్మన్ తెలిపారు. ఇది కూడా చదవండి: త్రివిధ దళాల్లో ఖాళీలను భర్తీ చేయండి -
ఇక వాణిజ్యప్రయోగాలే
సూళ్లూరుపేట: ఎల్వీఎం3–ఎం2 ప్రయోగం విజయంతో ఇస్రోకు ఒక రోజు ముందుగానే దీపావళి పండగ వచ్చిందని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ అన్నారు. ప్రయోగానంతరం ఆదివారం తెల్లవారుజామున ఆయన మీడియాతో మాట్లాడారు. న్యూ స్పేస్ ఇండియా, వన్‌వెబ్ సహకారంతో ఆదివారం ఎల్వీఎం3–ఎం2 ద్వారా ప్రయోగించిన 36 యూకేకి చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహాలు విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టగలిగామని తెలిపారు. క్రయోజనిక్ దశలో 36 ఉపగ్రహాలను ఒకేసారి కాకుండా నాలుగు దిశల్లో నాలుగేసి ఉపగ్రహాలు చొప్పున కక్ష్యలోకి విడిపోయేలా ఈ ప్రయోగంలో కొన్ని కీలకమైన సైంటిఫిక్ పరికరాలతో రూపొందించామని చెప్పారు. ఈ ప్రయోగంలో ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరడం కీలకం కావడంతో 36 ఉపగ్రహాలు విడిపోవడానికి 1.30 గంటల సమయం తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రయోగంతో ప్రపంచ దేశాల నుంచి ఎక్కువ మంది కస్టమర్లు రావడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. వన్‌వెబ్ కంపెనీతో న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, డిపార్ట్మెంట్ ఆఫ్ స్పేస్ ఒప్పందం మేరకు మరో 36 ఉపగ్రహాలను, మళ్లీ ఇంకో 36 ఉపగ్రహాలను ఇదే తరహాలోనే ప్రయోగిస్తామని తెలిపారు. ఇస్రో విజయంపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. వాణిజ్య ప్రయోగాలే లక్ష్యం ఇకపై వాణిజ్యపరంగా విదేశీ ఉపగ్రహాలను ప్రయోగించడమే లక్ష్యమని న్యూ స్పేస్ ఇండియా సీఎండీ రాధాకృష్ణన్ అన్నారు. దీన్ని చరిత్రాత్మక ప్రయోగంగా వన్‌వెబ్ చైర్మన్ సునీల్ భారతీ మిట్టల్ అభివర్ణించారు. ఇప్పటికే 648 ఉపగ్రహాలను వివి«ధ దేశాల నుంచి ప్రయోగించామని గుర్తు చేశారు. ఇది కొత్త అధ్యాయానికి శ్రీకారమని పవన్ గోయెంకా (వన్‌వెబ్ కంపెనీ) చెప్పారు. ‘‘36 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను ఒకే రాకెట్ ద్వారా పంపడం కూడా అద్భుతం. వాణిజ్యపరంగా ఇస్రో మరో అడుగు ముందుకేయడం శుభ పరిణామం’’ అని ఆయన చెప్పారు. -
ఇస్రోలో చేరి దేశానికి సేవ చేయండి
సూళ్లూరుపేట: భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దూసుకుపోతోందని, విద్యార్థులు ప్రతి ఒక్కరూ ఒక్కో మిస్సైల్లా తయారై దేశానికి సేవ చేయాలని ఇస్రో చైర్మన్ ఎస్.సోమనాథ్ సూచించారు. ఇస్రోలో చేరి.. మన దేశానికి మరింత గుర్తింపు తీసుకురావాలన్నారు. పదో తరగతిలోకి అడుగుపెడుతున్న వివిధ రాష్ట్రాలకు చెందిన 153 మంది విద్యార్థులతో శనివారం సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్లో ఇస్రో చైర్మన్ సోమనాథ్ ముచ్చటించారు. విద్యార్థులకు స్పేస్ సైన్స్‌పై ఆసక్తి కలిగించేదుకు నిర్వహిస్తున్న యువికా–2022లో భాగంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన జవాబులిచ్చారు. ఈ తరం విద్యార్థులు ఎంతో తెలివైనవారని.. వారిలో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీస్తే మంచి స్థాయికి వెళతారని చెప్పారు. రాకెట్లు, ఉపగ్రహాలు, ఆర్బిట్లు అనేవి మ్యాథమెటిక్స్‌తో ఎక్కువగా ముడిపడి ఉంటాయని.. అందులో మంచి ప్రావీణ్యం సాధిస్తే శాస్త్రవేత్తలుగా ఎదగడానికి అవకాశముంటుందన్నారు. 2023 నాటికి గగన్‌యాన్ ప్రయోగం చేయాలనే సంకల్పంతో ఉన్నామని.. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదం తెలుపుతూ రూ.10 వేల కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ ఏడాది చంద్రయాన్–2 ప్రయోగం నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం విద్యార్థులకు సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, శాస్త్రవేత్తలు అలెక్స్, ఎన్.సుధీర్‌కుమార్, సెంథిల్‌కుమార్, గోపీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ISRO: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతం
శ్రీహరికోట: పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ప్రకటించింది. ఈఓఎస్–04, ఐఎన్ఎస్-2టీడీ, ఇన్స్పైర్ శాట్-1తో పాటు మరో రెండు చిన్న ఉపగ్రహాలను పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ52 కక్ష్యలోకి మోసుకెళ్లింది. సోమవారం ఉదయం 5.59కి ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్లోని ఫస్ట్ లాంచింగ్ ప్యాడ్ నుంచి ఈ ప్రయోగం జరిగింది. 2022లో ఇస్రో తొలి ఉపగ్రహ ప్రయోగాన్ని ప్రయోగించింది. అంతరిక్ష ప్రయోగాల్లో ప్రపంచదేశాల సరసన శాస్త్రవేత్తలు భారత కీర్తిపతాకను సగర్వంగా ఎగరవేశారు. కక్ష్యలో ప్రవేశపెట్టిన ఉపగ్రహాలివే.. ►వ్యవసాయం, అటవీ, నీటి వనరుల సమాచారం కోసం ఆర్ఐశాట్-1 ఉపగ్రహం ►భారత్, భూటాన్ సంయుక్తంగా రూపొందించిన ఉపగ్రహం ఐఎన్ఎస్-2టీడీ ►భవిష్యత్తు సైన్సు, ప్రయోగాత్మక పేలోడ్స్ కోసం ఐఎన్ఎస్-2టీడీ ఉపగ్రహం ►భూమి అయానోస్పియర్ అధ్యయనం కోసం ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహం స్పందించిన ఇస్రో చైర్మన్ పీఎస్ఎల్వీ-52 రాకెట్ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో చైర్మన్ డాక్టర్ సోమనాథ్ తెలిపారు. దీంతో శాస్త్రవేత్తల కృషి ఫలించిందన్నారు. ఈ సందర్భంగా ఇస్రో శాస్త్రవేత్తలను ఆయన అభినందించారు. -
ఇస్రో చైర్మన్‌గా సోమనాథ్ నియామకం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ & రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) తదుపరి చీఫ్‌గా సీనియర్ శాస్త్రవేత్త ఎస్ సోమనాథ్‌ను కేంద్రం నియమించింది. విక్రంసారాభాయ్ అంతరిక్ష కేంద్రం డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న సోమనాథ్ జీఎస్ఎల్వీ ఎంకే-III లాంచర్ అభివృద్ధిలో కీలకపాత్ర పోషించాడు. కొల్లాంలో మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తిచేశాడు. ప్రస్తుతం ఇస్రో చైర్మన్‌గా వ్యవహరిస్తున్న కె శివన్ పదవీ కాలం పూర్తయిన తర్వాత (జనవరి 12, 2022) ప్రపంచంలోని ప్రముఖ అంతరిక్ష సంస్థల్లో ఒకటైన ఇస్రోకి సోమనాథ్ అధిపతిగా వ్యవహరించనున్నారు. చదవండి: (యూపీలో బీజేపీకి భారీ షాక్.. 24 గంటల వ్యవధిలో..)