2040కల్లా చంద్రుడి మీదకు భారత వ్యోమగామి | India Aims to Land Astronaut on Moon by 2040, Says ISRO Chief | Sakshi
Sakshi News home page

2040కల్లా చంద్రుడి మీదకు భారత వ్యోమగామి

Published Tue, Dec 24 2024 5:34 PM | Last Updated on Tue, Dec 24 2024 6:33 PM

India Aims to Land Astronaut on Moon by 2040, Says ISRO Chief

ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (isro)  ఛైర్మన్‌ ఎస్‌.సోమనాథ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి చంద్రునిపై భారత వ్యోమగాములను పంపాలనే లక్ష్యంతో భారత్‌ అంతరిక్ష పరిశోధనలపై (Indian Space Program) దృష్టిసారించినట్లు తెలిపారు.  

ఇందుకోసం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్రో కోసం రికార్డు స్థాయిలో రూ. 31,000 కోట్ల నిధులను కేటాయించేందుకు ఆమోదించినట్లు తెలిపారు. తద్వారా రాబోయే 15 ఏళ్లలో చంద్రునిపై భారత వ్యోమగాములను (Indian astronauts) పంపే ప్రయత్నాలకు అడుగులు పడినట్లు వెల్లడించారు.

‘అంతరిక్ష పరిశోధనల్లో మేం ఈ ఏడాది అపూర్వ విజయాల్ని సాధించామని నమ్ముతున్నాం. అంతేకాదు అంతరిక్ష పరిశోదనల్లో ప్రధాని మోదీ కృషిని ప్రస్తావించారు. చరిత్రలో తొలిసారి రాబోయే 25 సంవత్సరాల్లో చేయాల్సిన ప్రయోగాలకు సంబంధించిన రోడ్‌ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు’ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (ISRO chief Dr S Somanath) జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.

ఇందులో భాగంగా, 2035 నాటికి భారత్‌కు సొంతంగా స్పేస్‌ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. అంతకంటే ముందు 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్‌ను ప్రారంభించడం, 2035లో ఏర్పాటు చేయనున్న స్పేస్‌ స్టేషన్‌కు కార్యచరణను సిద్ధం చేయడం, 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగాముల్ని పంపే లక్ష్యాలు తమ విజన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement