Indian Space Research
-
2040కల్లా చంద్రుడి మీదకు భారత వ్యోమగామి
ఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (isro) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2040 నాటికి చంద్రునిపై భారత వ్యోమగాములను పంపాలనే లక్ష్యంతో భారత్ అంతరిక్ష పరిశోధనలపై (Indian Space Program) దృష్టిసారించినట్లు తెలిపారు. ఇందుకోసం, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇస్రో కోసం రికార్డు స్థాయిలో రూ. 31,000 కోట్ల నిధులను కేటాయించేందుకు ఆమోదించినట్లు తెలిపారు. తద్వారా రాబోయే 15 ఏళ్లలో చంద్రునిపై భారత వ్యోమగాములను (Indian astronauts) పంపే ప్రయత్నాలకు అడుగులు పడినట్లు వెల్లడించారు.‘అంతరిక్ష పరిశోధనల్లో మేం ఈ ఏడాది అపూర్వ విజయాల్ని సాధించామని నమ్ముతున్నాం. అంతేకాదు అంతరిక్ష పరిశోదనల్లో ప్రధాని మోదీ కృషిని ప్రస్తావించారు. చరిత్రలో తొలిసారి రాబోయే 25 సంవత్సరాల్లో చేయాల్సిన ప్రయోగాలకు సంబంధించిన రోడ్ మ్యాప్‌ను ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు’ ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథ్ (ISRO chief Dr S Somanath) జాతీయ మీడియా ఇంటర్వ్యూలో చెప్పారు.ఇందులో భాగంగా, 2035 నాటికి భారత్‌కు సొంతంగా స్పేస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. అంతకంటే ముందు 2028లో స్పేస్ స్టేషన్ మాడ్యూల్‌ను ప్రారంభించడం, 2035లో ఏర్పాటు చేయనున్న స్పేస్ స్టేషన్‌కు కార్యచరణను సిద్ధం చేయడం, 2040 నాటికి చంద్రునిపై భారతీయ వ్యోమగాముల్ని పంపే లక్ష్యాలు తమ విజన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.🚨 After successful Chandrayaan 3, ISRO plans to set up space station by 2035, and send humans to Moon by 2040. (ISRO Chairman S Somnath) pic.twitter.com/Mxfi4THMvv— Indian Tech & Infra (@IndianTechGuide) December 13, 2023 -
అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన తెలుగోడు
వాషింగ్టన్: తెలుగు బిడ్డ గోపీ తోటకూర చరిత్ర సృష్టించారు. అంతరిక్షంలోకి వెళ్లివచ్చిన తొలి భారత స్పేస్ టూరిస్టుగా ఘనత సాధించారు. అంతేకాదు, అంతరిక్ష ప్రయాణం చేసిన రెండో భారతీయుడిగా రికార్డుకెక్కారు. 1984లో భారత సైన్యానికి చెందిన వింగ్ కమాండర్ రాకేశ్ శర్మ మొట్టమొదటిసారి అంతరిక్ష ప్రయాణం చేసిన సంగతి తెలిసిందే. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ సారథ్యంలోని బ్లూ ఆరిజిన్ ప్రైవేట్ సంస్థ ఔత్సాహికులను అంతరిక్షంలోకి తీసుకెళ్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఏడో హ్యూమన్ ఫ్లైట్ ‘ఎన్–25’ఆదివారం ఉదయం అమెరికాలోని వెస్ట్ టెక్సాస్ లాంచ్ సైట్ నుంచి అంతరిక్షంలోకి బయలుదేరింది. 10 నిమిషాలకుపైగా అంతరిక్షంలో విహరించి, క్షేమంగా వెనక్కి తిరిగివచ్చింది. ఈ రాకెట్లో ప్రయాణించిన ఆరుగురిలో గోపీ తోటకూర కూడా ఉన్నారు. భూవాతావరణం, ఔటర్‌స్పేస్ సరిహద్దు రేఖ అయిన కర్మాన్ లైన్ పైభాగం వరకు వీరి ప్రయాణం సాగింది. అంతరిక్షాన్ని తాకి వచ్చారు. భూమి ఉపరితలం నుంచి 100 కిలోమీటర్లలో కర్మాన్ లైన్ ఉంటుంది. బ్లూ ఆరిజిన్ సంస్థ ద్వారా ఇప్పటిదాకా 31 మంది స్పేస్ టూరిస్టులు అంతరిక్ష ప్రయాణం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో జన్మించిన గోపీ తోటకూర ఎంబ్రీ–రిడిల్ ఏరోనాటికల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశారు. పైలట్‌గా శిక్షణ పొందారు. ప్రిజర్వ్ లైఫ్ కార్పొరేషన్ అనే సంస్థకు సహ వ్యవస్థాపకుడు. ఇంటర్నేషనల్ మెడికల్ జెట్ పైలట్‌గా పని చేస్తున్నారు. గోపీకి సాహసాలంటే ఇష్టం. ఇటీవలే టాంజానియాలోని అత్యంత ఎత్తయిన పర్వతం మౌంట్ కిలిమంజారోను అధిరోహించారు. 60 ఏళ్ల తర్వాత.. నెరవేరిన కల అమెరికాకు చెందిన మొట్టమొదటి నల్లజాతి వ్యోమగామి, ఎయిర్‌ఫోర్స్ మాజీ కెపె్టన్ ఎడ్‌డ్వైట్ కల ఎట్టకేలకు నెరవేరింది. ఆయన వయసు 90 ఏళ్లు. ఈ వయసులో అంతరిక్ష ప్రయాణం విజయవంతంగా పూర్తిచేశారు. ఆదివారం బ్లూ ఆరిజిన్ ‘ఎన్–25’మిషన్‌లో అంతరిక్షంలోకి వెళ్లొచ్చారు. 1963లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ‘నాసా’అంతరిక్ష ప్రయాణాల కోసం ఎడ్డ్వైట్ను కూడా ఎంపిక చేశారు. కానీ, ఆయనకు అంతరిక్షంలోకి వెళ్లే అవకాశం అప్పట్లో లభించలేదు. 60 ఏళ్ల తర్వాత కల నెరవేర్చుకున్నారు. -
స్పేస్ పాలసీకి ఆమోదం
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ పాలసీ–2023కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తోపాటు ఈ రంగంలోని ప్రైవేట్ సంస్థల పోషించాల్సిన పాత్ర, నెరవేర్చాల్సిన బాధ్యతలను ఈ పాలసీ కింద రూపొందించారు. సహజ వాయువు, సీఎన్జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలపై నియంత్రణకు నూతన ప్రైసింగ్ ఫార్ములానూ కేబినెట్ ఆమోదించింది. దీనిప్రకారం దేశంలో పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజ వాయువు (ఏపీఎం గ్యాస్) ధరలే ఇకపై ముడి చమురు ధరలకు సూచికగా ఉంటాయి. ఇప్పటిదాకా అమెరికా, రష్యా చమురు ధరల ఆధారంగా మన దేశంలో ధరలను నిర్ణయిస్తున్నారు. -
శతమానం భారతి: అంతరిక్షం
అంతరిక్ష రంగంలో భారత్ సామర్థ్యాలు విస్తరిస్తున్నాయి. ఇందుకు కళ్లముందరి నిదర్శనాలు అనేకం. ఒకే అంతరిక్ష వాహక నౌక నుంచి రికార్డు స్థాయిలో భారత్ 104 ఉపగ్రహాలను ప్రయోగించింది. అలాగే ఒకే అంతరిక్ష వాహక నౌక నుంచి 3 ఆర్బిట్ మిషన్లు పంపడం కూడా ఒక రికార్డే. అమిత వేగవంతమైన కమ్యూనికేషన్ సేవలు పెంచడానికి భారత్ అత్యంత ఆధునాతనమైన జిశాట్–11, జిశాట్ 29 ఉపగ్రహాలు ప్రయోగిం చింది. గత ఎనిమిదేళ్ల కాలంలోనే రికార్డు సంఖ్యలో అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి. 2014 ముందు ఏడాదికి సగటున 1.7 అంతరిక్ష యాత్రలు జరగ్గా, 2014 తర్వాత ఆ సంఖ్య ఏడాదికి 5.4 కి పెరిగింది. ఈ ఎనిమిదేళ్లలోనే భారత్ 306 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపింది. ఇదే సమయంలో భారతదేశానికి సొంత ఉపగ్రహ నావిగేషన్ వ్యవస్థ అభివృద్ధి చేసుకునే సామర్థ్యం సమకూరింది. వాణిజ్య పరమైన అంతరిక్ష ప్రయాణాల విభాగంలోనూ భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వ స్థాయికి పెంచే సంకల్పంతో ఇండియన్ స్పేస్ అసోసియేషన్ ప్రారంభం అయింది. ప్రగతి శీలమైన అంతరిక్ష సంస్కరణలు, కార్యక్రమాలు, యాత్రల ద్వారా భారతదేశం అంతరిక్ష రంగంలో ఒక సూపర్ పవర్‌గా అవతరిస్తోంది. ఇందుకు అవసరమైన చేయూతను దేశవాళీ ‘ఇన్–స్పేస్’ అందిస్తోంది. ఒక ప్రోత్సాహక, ఉత్తేజకరమైన, అధీకృత, పర్యవేక్షక బాధ్యతలు నిర్వర్తిస్తోంది. ఆకాశమే హద్దుగా అమృతోత్సవాలను జరుపుకోడానికి ఇంతకన్నా తగిన తరుణం ఏముంటుంది?. (చదవండి: మహోజ్వల భారతి: ఈస్టిండియా ఉరికి వేలాడిన తొలి భారతీయుడు) -
భారత స్పేస్ అసోసియేషన్‌ని ప్రారంభించనున్న మోదీ
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం భారత స్పేస్ అసోసియేషన్‌ని(ఐఎస్‌పీఏ) ప్రారంభించనున్నారు. దీనిలో భాగంగా భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రతినిధులతో ప్రధాని నేడు భేటి కానున్నారు. పైగా ఇది భారత అంతరిక్షరంగం ప్రాముఖ్యతను తెలియజేసే అత్యున్నత సంస్థ. ఈ మేరకు ఐఎస్‌పీఏ న్యాయపరమైన విధానాలను చేపట్టి వాటిని తన సంస్థ వాటాదారులతో పంచుకుంటుందని తెలిపింది. ఐఎస్‌పీఏ దేశంలోని అంతరిక్ష పరిశ్రమలో వివిధ సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలతో ముందుకు రానుంది. భారత అంతరిక్ష సంస్థ అసోసియేషన్ ప్రధానమంత్రి 'ఆత్మనిర్భర్ భారత్'పై దృష్టిని సారించేలా ప్రతిధ్వనిస్తోంది. (చదవండి: "మేం ఒత్తిడికి తలొగ్గుతామని భ్రమపడొద్దు") భారతదేశాన్ని స్వయంశక్తితో సాంకేతికంగా అభివృద్ధి చెందిన దేశంగానే కాక అంతరిక్ష రంగంలో ఒక కీలక పాత్ర పోషిస్తోందని ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ అధికారులు వెల్లడించారు. ఐఎస్‌పీఏ వ్యవస్థాపక సభ్యులలో లార్సన్ అండ్ టూబ్రో, నెల్కో (టాటా గ్రూప్), వన్‌వెబ్, భారతీ ఎయిర్టెల్, మ్యాప్‌మై ఇండియా, వాల్ చంద్‌నగర్ ఇండస్ట్రీస్, అనంత్ టెక్నాలజీ లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీలు ఉన్నాయి. అంతేకాదు గోద్రేజ్, హ్యూస్ ఇండియా, అజిస్టా-బిఎస్టి ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్, బిఇఎల్, సెంటమ్ ఎలక్ట్రానిక్స్, మాక్సర్ ఇండియా వంటి ఇతర ప్రధాన కంపెనీల భాగస్వామ్యం కూడా ఉంది. (చదవండి: 'పీకాబు' అంటూ తన పిల్లల్ని పలకరిస్తున్న టర్కీ చిలుక) -
భారీ ఖగోళ వింత: గుర్తించింది మనవాళ్లే!
విశ్వ పరిశోధనల్లో ఇప్పటిదాకా కనివిని ఎరుగని ఖగోళ వింతకు స్థానం దక్కింది. మూడు పాలపుంతల్లోని మూడు భారీ కృష్ణ బిలాలు(బ్లాక్‌హోల్స్) ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. మరో విశేషం ఏంటంటే.. భారత్‌కు చెందిన ముగ్గురు ఖగోళ పరిశోధకులు ఈ వింతను ఆవిష్కరించడం. పాలపుంతలో తాజాగా ఈ మూడు బ్లాక్ హోల్స్‌ను గుర్తించారు. ముందుగా జంట బిలాల గమనాన్ని పరిశీలించిన పరిశోధకులు.. మూడో దానితో వాటి విలీనానికి సంబంధించిన పరిశోధనను ‘ఆస్రోనమీ’ జర్నల్‌లో పబ్లిష్ చేశారు. ‘‘మూడో పాలపుంత(గెలాక్సీ) ఉందనే విషయాన్ని మేం నిర్ధారించాం. ఎన్జీసీ7733ఎన్.. అనేది ఎన్జీసీ7734 గ్రూప్‌లో ఒక భాగం. ఉత్తర భాగం కిందుగా ఇవి ఒకదానిని ఒకటి ఆవరించి ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. గెలాక్సీ జంట.. ఎన్జీసీ7733ఎన్-ఎన్జీసీ7734లోని పాలపుంతలు ఒకదానితో ఒకటి కలిసిపోయాయి. సాధారణంగా కృష్ణబిలాల కలయిక తీవ్రమైన ఒత్తిడి.. శక్తిని కలగజేస్తుంది. అయితే వాటి విలీనం ఒకదానితో ఒకటి కాకుండా.. పక్కనే ఉన్న మూడో భారీ బ్లాక్‌హోల్‌లోకి విలీనం కావడం ద్వారా ఆ ఎనర్జీ అంతగా ప్రభావం చూపలేకపోయిందని తెలిపారు. Indian researchers have discovered three supermassive black holes from three galaxies merging together to form a triple active galactic nucleus, a compact region at the center of a newly discovered galaxy that has a much-higher-than-normal luminosity.https://t.co/y8BDohOTg5 pic.twitter.com/1dxjJudPX1 — PIB India (@PIB_India) August 27, 2021 ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆస్రో్టఫిజిక్స్‌కు చెందిన జ్యోతి యాదవ్, మౌసుమి దాస్, సుధాన్షు బార్వే.. ఆస్రో్టసాట్ అబ్జర్వేటరీ ద్వారా అల్ట్రా వయొలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్ సాయంతో వీటిని వీకక్షించగలిగారు. ఈ అధ్యయనం కోసం సౌతాఫ్రికా ఐఆర్ఎస్ఎఫ్, చిలీ వీఎల్టీ, యూరోపియన్ యూనియన్‌కు చెందిన ఎంయూఎస్‌ఈ టెక్నాలజీల సాయం తీసుకున్నారు. అంతేకాదు కృష్ణ బిలాల విలీనానికి సంబంధించిన ప్రకాశవంతమైన యూవీ-హెచ్ ఆల్ఫా ఇమేజ్‌లను సైతం రిలీజ్ చేశారు. -
ఏటీవీ ప్రయోగం విజయవంతం
భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రయోగాత్మక ప్రయోగాలు చేయడంలో మరో మారు దిట్ట అని నిరూపించుకుంది. ఆదివారం ఉదయం 6 గంటలకు సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి ప్రయోగించిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ వెహికల్(ఏటీవీ) ప్రయోగాత్మక ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. షార్‌లోని సౌండింగ్రాకెట్లు ప్రయోగవేదిక నుంచి ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. 3277 కిలోల బరువుతో మొదటిదశ ఘన ఇంధన స్ట్రాపాన్ బూస్టర్‌తో ఈ ప్రయోగాన్ని నిర్వహించారు. పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో రూపాందించిన రోహిణి 560 సౌండింగ్ రాకెట్‌కు స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను అమర్చి పరీక్షించారు. ఈ ప్రయోగంలో శ్యాస, వాయు, చోదక వ్యవస్థ పరిజ్ఞానం కలిగిన సూపర్ సోనిక్ కంబషన్ రామ్‌జెట్ (స్క్రామ్‌జెట్) ఇంజిన్ సామర్థ్యాన్ని పరీక్షించారు. ఆర్‌హెచ్-560 రాకెట్ రెండో దశకు అమర్చిన స్ట్రామ్జెట్ ఇంజిన్‌ను 70 కిలోమీటర్లు ఎత్తుకు తీసుకెళ్లి మొదటిదశ విడిపోయి బంగాళాఖాతంలో పడిపోయింది. ఆ తరువాత స్క్రామ్‌జెట్ ఇంజిన్‌ను సుమారు 5సెకెండ్లపాటు మండించి పరీక్షించి విజయం సాధించారు. భూవాతావరణంలోని గాలిని ఉపయోగించుకుని భవిష్యత్తులో రాకెట్ వ్యయం తగ్గించేందుకు చేపట్టిన ఈ ప్రయోగాన్ని ఇస్రో పరిభాషలో ఈ ‘‘ఎయిర్ బ్రీతింగ్’’ సిస్టం అని కూడా అంటారు. దీనికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని మహేంద్రగిరి, లిక్విడ్ ప్రపొల్లెంట్ స్పేస్‌సెంటర్, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో రూపొందించగా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. ఈ ప్రయోగాత్మక ప్రయోగంలో అమ్మోనియం పర్ క్లోరేట్స్ ఆక్సిడైజర్ బదులుగా భూవాతావరణంలోని గాలిని వినియోగించుకుని భవిష్యత్తు ప్రయోగాలు చేయడానికి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. సాధారణ రాకెట్ ప్రయోగాల్లో ఇంధనాన్ని మండించేందుకు ఇంధనంతోపాటు అమ్మోనియం పర్ క్లోరేట్ ఆక్సిడైజర్‌ను నింపి ప్రయోగం చేస్తుంటారు. స్క్రామ్‌జెట్ ఇంజిన్‌లో ఆక్సిడైజర్ అవసరం లేకుండా అందులోని శ్యాస, వాయు, చోదక శక్తి పరిజ్ఞానంతో సూపర్సోనిక్ వేగంతో వీచే గాల్లోనుంచి ఆక్సిజన్‌ను తీసుకుని వినియోగించుకుంటారు. భూవాతారవరణంలోని నుంచి సేకరించిన అక్సిజన్ను ద్రవరూపంలోకి మార్చి నిల్వ చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉంటుంది. మామూలు ప్రయోగాల మాదిరిగా ఆక్సిడైజర్‌ను మోసుకెళ్లే అవసరం లేకపోవడం వల్ల రాకెట్లో ఇంధన బరువును తగ్గించడం, తద్వారా రాకెట్ వ్యయం గణనీయంగా తగ్గిపోతుంది. ఫలితంగా భవిష్యత్తులో బరువైన ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపే మార్గం సుగమం అవుతుందని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
విజయవంతంగా భూస్థిర పరీక్ష
శ్రీహరికోట(సూళ్లూరుపేట) : భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ(ఇస్రో) భవిష్యత్తులో భారీ ప్రయోగాలు చేయనున్న దృష్ట్యా ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్‌లో మరింత సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ఆదివారం ఉదయం 9.30 గంటలకు శ్రీహరికోట రాకెట్ కేంద్రంలో భూ స్థిర పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. గతేడాది డిసెంబర్ 18న జీఎస్ఎల్వీ మార్క్-3 ప్రయోగాన్ని నిర్వహించి, ఎస్-200 స్ట్రాపాన్ బూస్టర్ సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు రెండుసార్లు భూస్థిర పరీక్షలు నిర్వహించి విజయం సాధించారు. ఆ ప్రయోగంలో ఎస్-200 బూస్టర్‌లో పీడనం ఎక్కువగా ఉన్న విషయాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ప్రమాదం ఉంటుందని భావిం చిన శాస్త్రవేత్తలు, పీడనం పరిమాణం తగ్గించి ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు. 2016లో జీఎస్ఎల్వీ మార్క్3-డీ1 ప్రయోగాన్ని ఈ తరహా బూస్టర్లతో నిర్వహిస్తామని శాస్త్రవేత్తలు చెప్పారు. 200 టన్నుల ఘన ఇంధనాన్ని నింపి, దాని సామర్థ్యాన్ని తెలుసుకునేందుకు ఈ పరీక్షలను నిర్వహించారు. భవిష్యత్తులో సుమారు 3 నుంచి 5 టన్నులు బరువున్న ఉపగ్రహాలను నింగిలోకి పంపాలంటే ఎస్-200 లాంటి స్ట్రాపాన్ బూస్టర్లు అవసరమన్నారు. ఎస్-200 పరీక్షలు వరుసగా విజయవంతం అవుతున్నందున భవిష్యత్తులో భారీప్రయోగాలకు తిరుగుండదని చెప్తున్నారు. కార్యక్రమంలో షార్ డెరైక్టర్ పి.కున్హికృష్ణన్, అసోసియేట్ డెరైక్టర్ డాక్టర్ ఎస్వీ సుబ్బారావు, జీఎస్ఎల్వీ డెరైక్టర్ అయ్యప్పన్, ఎస్-200 ప్రాజెక్ట్ డెరైక్టర్ ఈశ్వరన్ పాల్గొన్నారు. -
అంతరిక్ష విజయం
భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో మైలురాయి. ఇన్నా ళ్లుగా మానవరహిత ఉపగ్రహాల ప్రయోగంలో అద్భుత విజయా లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మరో ముందంజ వేసింది. అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా తొలి అడుగులు వేశాం. గురువారం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్ఎల్వి-మార్క్ 3 రాకెట్, భారత శాస్త్రజ్ఞుల సాంకేతిక విన్నాణాన్ని నిరూపి స్తూ నింగిలోకి దూసుకెళ్లింది. 3,735 కిలోల బరు వు ఉన్న వ్యోమగామి మాడ్యూల్‌ను సురక్షితంగా భూమికి తీసుకురావడం ద్వారా భారతీయ వ్యోమ గాములు త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టగలరనే ఆశను జాతికి అందించింది. కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మరో పదేళ్ల లోనే మానవులను అంతరిక్షంలోకి పంపగలమనే తొలి సంకేతా లను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పంపించింది. మానవులను అంతరిక్షంలోకి పంపగలిగే నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందే అరుదైన అవకాశం మరెంతో దూరంలో లేదు. ఈ విజ యంతో భారీ కమ్యూనికేషన్ ఉప్రగహాలను భారత్ ప్రయోగించగలదు. ఇస్రో శాస్త్రజ్ఞులకు అభివందనలు. సృజన మాదాపూర్, హైదరాబాద్