భారత అంతరిక్ష పరిశోధనల చరిత్రలో మరో మైలురాయి. ఇన్నా ళ్లుగా మానవరహిత ఉపగ్రహాల ప్రయోగంలో అద్భుత విజయా లను సాధించిన భారత అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) మరో ముందంజ వేసింది. అంతరిక్షంలోకి మానవులను పంపే దిశగా తొలి అడుగులు వేశాం. గురువారం శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించిన జీఎస్‌ఎల్‌వి-మార్క్ 3 రాకెట్, భారత శాస్త్రజ్ఞుల సాంకేతిక విన్నాణాన్ని నిరూపి స్తూ నింగిలోకి దూసుకెళ్లింది. 3,735 కిలోల బరు వు ఉన్న వ్యోమగామి మాడ్యూల్‌ను సురక్షితంగా భూమికి తీసుకురావడం ద్వారా భారతీయ వ్యోమ గాములు త్వరలో అంతరిక్షంలోకి అడుగుపెట్టగలరనే ఆశను జాతికి అందించింది.
కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే మరో పదేళ్ల లోనే మానవులను అంతరిక్షంలోకి పంపగలమనే తొలి సంకేతా లను ఇస్రో ఈ ప్రయోగం ద్వారా పంపించింది. మానవులను అంతరిక్షంలోకి పంపగలిగే నాలుగో దేశంగా భారత్ గుర్తింపు పొందే అరుదైన అవకాశం మరెంతో దూరంలో లేదు. ఈ విజ యంతో భారీ కమ్యూనికేషన్ ఉప్రగహాలను భారత్ ప్రయోగించగలదు. ఇస్రో శాస్త్రజ్ఞులకు అభివందనలు.
సృజన మాదాపూర్, హైదరాబాద్
అంతరిక్ష విజయం
Published Sat, Dec 20 2014 12:48 AM | Last Updated on Sat, Sep 2 2017 6:26 PM
Advertisement
Advertisement