
న్యూఢిల్లీ: ఇండియన్ స్పేస్ పాలసీ–2023కు కేంద్ర మంత్రివర్గం గురువారం ఆమోదం తెలిపింది. ఇస్రో, న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్‌తోపాటు ఈ రంగంలోని ప్రైవేట్ సంస్థల పోషించాల్సిన పాత్ర, నెరవేర్చాల్సిన బాధ్యతలను ఈ పాలసీ కింద రూపొందించారు.
సహజ వాయువు, సీఎన్‌జీ, పైప్డ్ కుకింగ్ గ్యాస్ ధరలపై నియంత్రణకు నూతన ప్రైసింగ్ ఫార్ములానూ కేబినెట్ ఆమోదించింది. దీనిప్రకారం దేశంలో పాత క్షేత్రాల నుంచి వెలికితీసే సహజ వాయువు (ఏపీఎం గ్యాస్) ధరలే ఇకపై ముడి చమురు ధరలకు సూచికగా ఉంటాయి. ఇప్పటిదాకా అమెరికా, రష్యా చమురు ధరల ఆధారంగా మన దేశంలో ధరలను నిర్ణయిస్తున్నారు.